Wednesday, 30 October 2019

✍ కరెంట్ అఫైర్స్ 26 అక్టోబరు 2019 Saturday

✍  కరెంట్ అఫైర్స్ 26 అక్టోబరు 2019 Saturday ✍
జాతీయ వార్తలు
కొత్త పార్లమెంటు.. కొంగొత్త అందాలు.. 2024 నాటికి అధునాతన కేంద్ర సచివాలయం. కొత్త కళను సంతరించుకోనున్న సెంట్రల్ విస్టా :

i. పార్లమెంటు, దాని చుట్టుపక్కల ప్రాంతాలు త్వరలో సరికొత్త కళను సంతరించుకోనున్నాయి. రూ.12,450 కోట్లతో వాటిని అభివృద్ధి చేయాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది.
ii. 70 వేలమంది ఉద్యోగులు ఒకేచోట పనిచేసేందుకు వీలుగా కేంద్ర సచివాలయాన్ని నిర్మించనున్నారు. విజయ్ చౌక్ నుంచి ఇండియాగేట్ వరకు సెంట్రల్ విస్టా అభివృద్ధిని యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయనున్నారు.
iii. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కన్సల్టెన్సీ పనులను గుజరాత్కు చెందిన ‘హెచ్సీపీ డిజైన్, ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్’ సంస్థ దక్కించుకుంది. క్వాలిటీ అండ్ కాస్ట్బేస్డ్ సెలెక్షన్(క్యూసీబీఎస్) విధానం ఆధారంగా కన్సల్టెన్సీ సంస్థను ఎంపికచేసినట్లు కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి హర్దీప్సింగ్ పురీ తెలిపారు.
iv. స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ డైరెక్టర్ పీఎస్ఎన్ రావు నేతృత్వంలోని జ్యూరీ ‘హెచ్సీపీ డిజైన్’ను ఎంపిక చేసింది. వచ్చే మే నాటికి పనుల అప్పగింత పూర్తవుతుందని పేర్కొన్నారు.
v. తాజా అభివృద్ధి ప్రక్రియలో ప్రధానంగా మూడు భాగాలున్నాయి. అవి.. సెంట్రల్ విస్టా అభివృద్ధి, పార్లమెంటు నూతన భవన నిర్మాణం, కేంద్ర సచివాలయ నిర్మాణం.
గాంధీజీ, మోదీలున్న పెయింటింగ్ రూ.25 లక్షలు :

i. ప్రధాని మోదీకి వివిధ సందర్భాల్లో లభించిన జ్ఞాపికల ప్రదర్శన, ఈ-వేలం ప్రక్రియ శుక్రవారం(October 25)తో ముగిసింది.
ii. మువ్వన్నెల పతాకం నేపథ్యంగా మహాత్మాగాంధీ, మోదీల చిత్రాలున్న  అక్రిలిక్ పెయింటింగ్కు అత్యధికంగా రూ.25 లక్షలు లభించినట్లు ప్రభుత్వం తెలిపింది.
స.హ కమిషనర్ల పదవీకాలం ఇక మూడేళ్లే. జీతభత్యాలపై నిర్ణయం ప్రభుత్వానిదే. అమల్లోకి కొత్త నిబంధనలు :

i. సమాచార హక్కు (సహ) చట్టంపై కొత్త నిబంధనలను కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. దేశవ్యాప్తంగా సహ కమిషనర్ల పదవీ కాలాన్ని మూడేళ్లకు తగ్గించింది.
ii. వారి జీతభత్యాలను ఇకపై ప్రభుత్వమే నిర్ణయించనుంది. ఇది సమాచార హక్కు కమిషన్ స్వతంత్రత, స్వయంప్రతిపత్తిపై దాడిగా హక్కుల కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
iii. సమాచార హక్కు చట్టం-2005ను కేంద్రం ఈ ఏడాది జులైలో సవరించింది. సహ నిబంధనలు-2019 పేరిట రూపొందిన ఈ కొత్త అంశాలు కేంద్ర, రాష్ట్ర స్థాయిలోని సమాచార కమిషనర్లకు వర్తిస్తాయి.
iv. సర్వీసు నిబంధనలు, పదవీకాలం వంటి అంశాల్లో ముఖ్య సమాచార కమిషనర్, సమాచార కమిషనర్లకు ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్లతో ఉన్న సమానత్వానికి తెరపడింది.
v. నిర్దిష్టంగా ఈ చట్టంలో ప్రస్తావించని భత్యాలు, సర్వీసు నిబంధనలపై ప్రభుత్వం తన విచక్షణ మేరకు నిర్ణయం తీసుకోవచ్చు. ఈ నిబంధనలను సడలించే అధికారం కూడా సర్కారుకు ఇకపై ఉంటుంది.
vi. 2005 నాటి చట్టం ప్రకారం కమిషనర్లకు ఐదేళ్ల పదవీ కాలం లేదా 65 ఏళ్ల వయసు వచ్చేవరకూ ఏది ముందొస్తే అది వర్తిస్తుంది. ఇప్పటివరకూ ప్రధాన సమాచార కమిషనర్ వేతనం నెలకు రూ.2.5 లక్షలుగా, కమిషనర్ వేతనం రూ.2.25 లక్షలుగా ఉండేది. తాజా సవరణల వల్ల సహ కమిషన్లు సాధారణ ప్రభుత్వ శాఖలుగా మిగిలిపోయే ప్రమాదం ఉందని హక్కుల కార్యకర్తలు ఆందోళన వ్యక్తంచేశారు.
తెలంగాణ వార్తలు
కృత్రిమ మేధ సంవత్సరంగా 2020. ఏడాదంతా కార్యక్రమాలు. నాస్కామ్ అధ్యక్షురాలితో KTR భేటీ :

i. ఆధునిక సాంకేతిక విప్లవంగా పేరొందిన కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-ఏఐ)ను తెలంగాణ ప్రభుత్వం విస్తృతంగా వినియోగిస్తుందని, సంబంధిత అభివృద్ధి, పరిశోధన కేంద్రాల స్థాపనకు కృషిచేస్తామని పరిశ్రమలు, ఐటీశాఖల మంత్రి కేటీ రామారావు తెలిపారు.
ii. 2020ని కృత్రిమ మేధ నామసంవత్సరంగా ప్రకటించి, ఏడాదంతా కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడించారు. నాస్కామ్ అధ్యక్షురాలు దేబ్జాని ఘోష్తో హైదరాబాద్లోని తమ నివాసంలో మంత్రి సమావేశమయ్యారు.
రాష్ట్ర ఖజానాకు నిధుల గండం. తగ్గిన రాబడులు, కేంద్ర పన్నుల వాటా. ఆరు నెలల పరిస్థితిపై ఆర్థికశాఖ విశ్లేషణ :

i. ఆర్థిక మాంద్యం ప్రభావం నేపథ్యంలోనే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను రూ.1.82 లక్షల కోట్లతో ప్రవేశపెట్టినప్పటికీ..పూర్తిస్థాయి బడ్జెట్ను రూ.1.46 లక్షల కోట్లకు తగ్గించింది.
ii. ఆర్థిక శాఖ ఆరు నెలల రాష్ట్ర రాబడులు, వ్యయాన్ని తాజాగా విశ్లేషించింది. సెప్టెంబరు వరకూ గత ఏడాది కంటే పన్నుల రాబడి రూ.509 కోట్లు తగ్గినట్టు గుర్తించింది.
iii. ఎక్సైజ్ శాఖ ఆదాయం, కేంద్ర పన్నుల వాటాలో కోతపడటం ఖజానాపై ప్రభావం చూపుతోంది. అమ్మకం పన్ను, జీఎస్టీ రాబడులు గత ఏడాదికంటే మెరుగ్గా ఉన్నా లక్ష్యంలో ఇప్పటికి వసూలైంది గరిష్ఠంగా 42 శాతమే.
iv. పన్నేతర రాబడి కూడా గత ఏడాదికంటే తక్కువగా ఉంది. మొత్తంగా ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో (మార్చి-సెప్టెంబరు) ఏడాది రాబడి అంచనాల లక్ష్యంలో 41 శాతానికి మాత్రమే చేరుకోవడం గమనార్హం.

v. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం 52 శాతంగా ఉండటం, గ్రాంట్ ఇన్ ఎయిడ్ల పరిస్థితి గతంలో కంటే మెరుగ్గా ఉండటం, రుణాల లక్ష్యంలో ఇప్పటి వరకూ 61 శాతానికి చేరుకోవడం ఆశాజనక పరిణామం.
వరిసాగుకే రైతన్న మొగ్గు.. అత్యధికంగా సూర్యాపేట, నిజామాబాద్ :

i. ప్రస్తుత రబీ(యాసంగి) సీజన్లో రికార్డుస్థాయిలో పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ క్షేత్రస్థాయి అధ్యయనంలో వెల్లడైంది. సాధారణ విస్తీర్ణంకన్నా వరి సాగు 6.75 లక్షల ఎకరాలు పెరుగుతుందని తేలింది.
ii. రబీలో అధికంగా వేసే వేరుసెనగతో పాటు, ఇతర పంటలను తగ్గించి వరి సాగు చేస్తామని అత్యధిక శాతం రైతులు తెలిపారు. గ్రామాల్లో రైతు వారీగా వివరాలను వ్యవసాయ విస్తరణ అధికారులు సేకరించారు.

iii. అధ్యయనం ప్రకారం 9 జిల్లాల్లో వరి సాగు విస్తీర్ణం లక్ష ఎకరాలకు పైగా ఉంది. వీటిలో 3 జిల్లాల్లో 2 లక్షల ఎకరాలు దాటనుంది. అత్యధికంగా సూర్యాపేట జిల్లాలో 2.76 లక్షలు, నిజామాబాద్లో 2.56 లక్షల ఎకరాల్లో వరి వేయనున్నారు.
ఇతర రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల వార్తలు
హరియాణాలో కమలమే. ఖట్టర్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం. ఉప ముఖ్యమంత్రిగా JJP దుష్యంత్ చౌతాలా :

i. హంగ్ ఏర్పడిన హరియాణాలో ప్రభుత్వం ఏర్పాటు దిశగా భాజపా చకచకా అడుగులేస్తోంది. 10 స్థానాలను గెల్చుకున్న దుష్యంత్ చౌతాలా నేతృత్వంలోని జన్నాయక్ జనతా పార్టీ (జేజేపీ)తో కలిసి భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.
ii. జేజేపీకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చేలా ఒప్పందం కుదిరింది. ముఖ్యమంత్రి మనోహర్లాల్ ఖట్టర్, దుష్యంత్తో కలిసి దిల్లీలో సమావేశాన్ని నిర్వహించిన భాజపా అధ్యక్షుడు అమిత్ షా పలు అంశాలను వెల్లడించారు.
iii. హరియాణాలో మొత్తం అసెంబ్లీ స్థానాలు 90. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలం 46. తాజా ఎన్నికల్లో భాజపా 40, కాంగ్రెస్ 31, జన్నాయక్ జనతా పార్టీ (జేజేపీ) 10 స్థానాలను కైవసం చేసుకున్నాయి. ఇండియన్ నేషనల్ లోక్దళ్ (ఐఎన్ఎల్డీ), హరియాణా లోక్హిత్ పార్టీ ఒక్కోచోట విజయం సాధించగా, ఏడుగురు స్వతంత్రులు గెలుపొందారు.
iv. ఏకైక పెద్దపార్టీగా అవతరించిన భాజపా ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కనీసం మరో ఆరుగురు ఎమ్మెల్యేల మద్దతు అవసరం కాగా.. జేజేపీ కలయికతో ఇందుకు మార్గం సుగమమైంది.
Chenani-Nashri Tunnel renamed as Shyama Prasad Mukherjee Tunnel :

i. J&K’s Chenani-Nashri Tunnel, a 9 km-long tunnel that reduces the distance between Jammu and Srinagar by 31 km has been renamed as Shyama Prasad Mukherjee Tunnel.
ii. The ‘Chenani-Nashri Highway Tunnel’ is not only India’s longest highway tunnel but also Asia’s longest bi-directional highway tunnel.
iii. The renaming of the tunnel aims to preserve Mukherjee’s heritage and memory as well as a tribute for his sacrifice for the nation.
సైన్స్ అండ్ టెక్నాలజీ
‘ఇండిజెన్’ ప్రాజెక్టు.. 1008 మంది జన్యుక్రమాల ఆవిష్కరణ.. పాలుపంచుకున్న సీసీఎంబీ :

i. పుట్టబోయే సంతానానికి ఇబ్బందిగా పరిణమించే జన్యు లోపాలను భార్యాభర్తల్లో ముందే గుర్తించడానికి వీలు కల్పించే సరికొత్త ఆవిష్కరణకు కేంద్రం శ్రీకారం చుట్టింది.
ii. ‘ఇండిజెన్’ పేరుతో భారత్ చేపట్టిన ఈ ప్రాజెక్టులో దేశం నలుమూలల నుంచి 1008 మందిని ఎంచుకున్నారు. ఈ ప్రాజెక్టు వల్ల దేశంలో జన్యు డేటాబేస్ను నిర్మించేందుకు, వేగంగా వృద్ధి చెందుతున్న ‘ప్రిసిషన్ మెడిసిన్’లో స్వదేశీ సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి వీలు కలుగుతుందని చెప్పారు.
iii. పారిశ్రామిక, శాస్త్ర పరిశోధన మండలి(సీఎస్ఐఆర్) ఆధ్వర్యంలో సాగిన ఈ ప్రాజెక్టులో హైదరాబాద్లో ఉన్న సీసీఎంబీ, దిల్లీలోని ఐజీఐబీ సంస్థలు పాలుపంచుకున్నాయి.
iv. కేంద్ర శాస్త్ర, సాంకేతిక వ్యవహారాల శాఖ మంత్రి - హర్ష వర్ధన్
v. CSIR డైరెక్టర్ - శేఖర్ సి మండే
భూకంపాల నుంచి రక్షణ ఎలా! ఉత్తరాఖండ్లో ఎన్జీఆర్ఐ పరిశోధన :

i. ఉత్తరాఖండ్.. ప్రపంచ ప్రసిద్ధమైన యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బదరీనాథ్ పుణ్యక్షేత్రాలతోపాటు కీలకమైన రక్షణ సంస్థలకు సంబంధించిన కేంద్రాలు ఉన్న రాష్ట్రమిది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన వాటిలో ఒకటైన తెహ్రీ డ్యామ్ ఇక్కడే ఉంది.
ii. హిమాలయాల్లో ఉన్న ఉత్తరాఖండ్ భౌగోళికంగా అత్యంత సున్నితమైన ప్రాంతం కావడంతో అక్కడ తరచు భూమి కంపిస్తూనే ఉంటుంది. 1991లో ఉత్తరకాశీ జిల్లాలో 6.8 తీవ్రతతో భూకంపం వచ్చి 2,000 మంది మృతి చెందగా.. 1999లో చమోలీ జిల్లాలో 6.8 తీవ్రతతో భూకంపం వల్ల 50,000 ఇళ్లు కూలిపోగా 103 మంది మృతి చెందారు.
iii. భవిష్యత్తులో దేశంలో ఎక్కడ భూకంపం సంభవించినా కూడా ఆస్తి, ప్రాణ నష్టం తక్కువగా ఉండేలా ఈ పరిశోధన ఉపయోగపడుతుంది.
సదస్సులు
18వ అలీనోద్యమ దేశాల సదస్సులో వెంకయ్యనాయుడు ప్రసంగం @బాఖు (అజర్బైజాన్)

i. 18వ అలీనోద్యమ దేశాల సదస్సులో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ పాక్  సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందన్నారు. సమకాలీన ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లు... 1955 బాన్డుంగ్(ఇండోనేషియా) సూత్రాల అమలు నేపథ్యంపై ఆయన మాట్లాడారు.
ii. ప్రస్తుత చట్టాలను మరింత పటిష్ఠం చేయడం, నిఘా బృందాల సమన్వయంపై 1996లో భారత్ చేసిన ప్రతిపాదనలను అనుసరించాలని కోరారు.
iii. భారత జాతిపిత 150వ జయంతిని పురస్కరించుకొని అజర్బైజాన్ ప్రభుత్వం ప్రత్యేక తపాలా బిళ్లను విడుదల చేయడాన్ని ఆయన ప్రశంసించారు.

    Appointments

కొత్త లెఫ్టినెంట్ గవర్నర్లు.. జమ్మూ-కశ్మీర్కు గిరీశ్. లద్దాఖ్కు ఆర్.కె.మాథుర్.. సత్యపాలిక్ మాలిక్ గోవాకు బదిలీ :
i. జమ్మూ-కశ్మీర్ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పడుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఆ రెండింటికీ తొలి రాజ్యాంగ అధినేతలను నియమించింది.
ii. నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయనతో సన్నిహితంగా పనిచేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి గిరీశ్ చంద్ర ముర్ము (59)ను జమ్మూ-కశ్మీర్కు, రక్షణ శాఖ మాజీ కార్యదర్శి ఆర్.కె.మాథుర్ (65)ను లద్దాఖ్కు లెఫ్టినెంట్ గవర్నర్లు ఎంపిక చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ అయ్యాయి.
iii. ప్రస్తుతం జమ్మూ-కశ్మీర్ రాష్ట్ర గవర్నర్గా ఉన్న సత్యపాలిక్ మాలిక్ గోవాకు బదిలీ అయ్యారు. ఈ నెల 31 నుంచి జమ్మూ-కశ్మీర్, లద్దాఖ్లు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పడనున్న సంగతి తెలిసిందే.
గిరీశ్ చంద్ర ముర్ము :

iv. 1985వ బ్యాచ్ గుజరాత్ కేడర్ ఐఏఎస్ అధికారి. గతంలో మోదీ సీఎంగా ఉన్నప్పుడు ఆయనకు అదనపు ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. ప్రస్తుతం కేంద్ర ఆర్థికశాఖలో వ్యయ విభాగం కార్యదర్శిగా ఉన్నారు.
v. ఒడిశాకు చెందిన ముర్ము రాజనీతి శాస్త్రంలో ఎంఏ చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్గా ఆయన ఈ నెల 31న ప్రమాణస్వీకారం చేయనున్నారు.
రాధాకృష్ణ మాథుర్  :

vi. లద్దాఖ్ తొలి లెఫ్టినెంట్ గవర్నర్గా బాధ్యతలు చేపట్టబోతున్న రాధాకృష్ణ మాథుర్ 1977 బ్యాచ్ త్రిపుర కేడర్ ఐఏఎస్ అధికారి. రక్షణశాఖ కార్యదర్శిగా పదవీ విరమణ చేశాక ముఖ్య సమాచార కమిషనర్గా పనిచేశారు. గత ఏడాది నవంబర్లో అక్కడా పదవీ విరమణ పొందారు.
vii. ఉత్తర్ప్రదేశ్కు చెందిన ఈయన ఐఐటీ కాన్పూర్లో మెకానికల్ ఇంజినీరింగ్, దిల్లీ ఐఐటీలో ఎంటెక్ చేశారు. ఈ నెల 31న ఆయన ప్రమాణస్వీకారం చేస్తారు.
మిజోరాం గవర్నర్గా శ్రీధరన్ పిళ్లై :

i. మిజోరాం గవర్నర్గా కేరళ భాజపా అధ్యక్షుడు, న్యాయవాది పీఎస్ శ్రీధరన్ పిళ్లై నియమితులయ్యారు. ఇదివరకు ఈ రాష్ట్ర గవర్నర్గా కేరళ భాజపా నేత కుమ్మనం రాజశేఖరన్ పనిచేశారు.
ii. మొన్నటి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మార్చిలో తన పదవికి రాజీనామా చేశారు. తిరువనంతపురం నుంచి పోటీచేసి ఓడిపోయారు. మిజోరాంకు మళ్లీ కేరళ భాజపా నేతనే నియమించడం గమనార్హం.
గోవా గవర్నర్గా మృదులా సిన్హా స్థానంలో సత్యపాల్ మాలిక్ :

i. గోవా గవర్నర్గా ఉన్న మృదులా సిన్హా పదవీ కాలం ఈ ఏడాది ఆగస్టుతో ముగిసినప్పటికీ ఆమెను కొనసాగిస్తూ వచ్చారు. ఇప్పుడు ఆ స్థానంలో జమ్మూ-కశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ను నియమించారు.
ii. అయిదేళ్ల పదవీకాలం పూర్తిచేసుకొని కొనసాగుతున్న వారిలో కర్ణాటక గవర్నర్ వాజుభాయ్ వాలా ఒక్కరే ఉన్నారు. 2014 సెప్టెంబర్ 1న నియమితులైన ఆయన ఇప్పటికీ ఆ రాష్ట్ర గవర్నర్గానే కొనసాగుతున్నారు.
సినిమా వార్తలు
కశ్మీర్ చరిత్రతో  ‘ది కశ్మీర్ ఫైల్స్’ :

i. ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీర్ పేరు మరోమారు ప్రపంచవ్యాప్తంగా వినిపించింది. కశ్మీర్ చరిత్రలో జరిగిన కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా ‘ది కశ్మీర్ ఫైల్స్’ పేరుతో బాలీవుడ్లో ఓ చిత్రం చేయబోతున్నారు.
ii. వివేక్ అగ్నిహోత్రి దర్శకుడు. తెలుగు నిర్మాత అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
iii. ‘ది తాష్కెంట్ ఫైల్స్’తో విమర్శకుల ప్రశంసలు అందుకొన్న వివేక్ అగ్నిహోత్రి ఈ చిత్రం కోసం అల్లుకొన్న కథ ఇది. ఆగస్టు 14, 2020న చిత్రాన్ని విడుదల చేయనున్నారు.
ముఖ్యమైన రోజులు
26 October 1947 - Accession Day or Kashmir conflict : The Maharaja of Kashmir and Jammu signs the Instrument of Accession with India

i. ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ 26 అక్టోబర్ 1947న జమ్మూ కాశ్మీర్ రాచరిక పాలకుడు మహారాజా హరి సింగ్ చేత అమలు చేయబడిన చట్టపరమైన పత్రం. భారత స్వాతంత్ర్య చట్టం 1947 లోని నిబంధనల ప్రకారం ఈ పత్రాన్ని అమలు చేయడం ద్వారా, మహారాజా హరి సింగ్ భారతదేశ డొమినియన్కు అంగీకరించడానికి అంగీకరించారు.
ii. భారతదేశానికి ప్రవేశం సందర్భంగా ఏటా అక్టోబర్ 26 న 'ప్రవేశ దినం (Accession Day)' జరుగును.
iii. అప్పటి భారత గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్ బాటన్ 1947 అక్టోబర్ 27న మహారాజా హరి సింగ్ కు పంపిన ఒక లేఖలో, "జమ్మూ కాశ్మీర్లో శాంతిభద్రతలు పునరుద్ధరించబడిన వెంటనే నా ప్రభుత్వ కోరిక మరియు ఆ మట్టి ఆక్రమణదారుని క్లియర్ చేసింది, రాష్ట్ర ప్రవేశం యొక్క ప్రశ్న ప్రజలకు సూచన ద్వారా పరిష్కరించబడాలి " అని పేర్కొన్నారు.

iv. లార్డ్ మౌంట్ బాటన్ వ్యాఖ్య మరియు కాశ్మీర్ యొక్క భవిష్యత్తు స్థితిని నిర్ణయించడానికి ప్రజాభిప్రాయ సేకరణ లేదా ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని భారత ప్రభుత్వం చేసిన ప్రతిపాదన జమ్మూ కాశ్మీర్ ను భారతదేశానికి ప్రవేశించడం యొక్క చట్టబద్ధతకు సంబంధించి భారతదేశం మరియు పాకిస్తాన్ల మధ్య వివాదానికి దారితీసింది.
v. ప్రవేశం బేషరతు మరియు తుది అని భారతదేశం పేర్కొంది, అయితే పాకిస్తాన్ మాత్రం ప్రవేశం మోసపూరితమైనదని పేర్కొంది.
SHE teams 5th anniversary : 24 October 2019

i. మహిళల భద్రత మరియు భద్రత కోసం తెలంగాణ పోలీసుల విభాగం SHE Teams. వారు తెలంగాణ రాష్ట్రంలో బాల్యవివాహాలను నిరోధించడానికి కూడా పని చేస్తారు.
ii. ఈవ్ టీజర్స్, స్టాకర్స్ మరియు వేధింపుదారులను అరెస్టు చేయడానికి జట్లు చిన్న సమూహాలలో పనిచేస్తాయి. ఇవి ప్రధానంగా హైదరాబాద్ లోని బిజీగా ఉన్న బహిరంగ ప్రదేశాలలో పనిచేస్తాయి. వాట్సాప్ ద్వారా మరియు సోషల్ మీడియా ద్వారా వచ్చిన ఫిర్యాదులపై వారు స్పందిస్తారు.
iii. SHE Teams stands for Safety, Health and Environment (షీ జట్లు అంటే భద్రత, ఆరోగ్యం మరియు పర్యావరణం).
iv. ఈ విభాగం 24 అక్టోబర్ 2014 న ప్రారంభమైంది. సింగపూర్లో ఇదే విధమైన చొరవతో ఆకట్టుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు యొక్క ఆలోచన.
v. అదనపు కమిషనర్, హైదరాబాద్, స్వాతి లక్రా డివిజన్ ప్రారంభమైనప్పటి నుండి నాయకత్వం వహిస్తుంది.
vi. ఒక బృందంలో అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్ (ASI) ఉంటారు, వారు ప్రతి మండలంలో నాలుగైదు మంది పురుష మరియు మహిళా కానిస్టేబుళ్ళతో నాయకత్వం వహిస్తారు. వీరంతా అసిస్టెంట్ DCP ర్యాంక్ మహిళా పోలీసు అధికారి క్రింద పనిచేస్తారు. వారు రహస్యంగా పనిచేస్తారు.
క్రీడలు
కర్ణాటకదే విజయ్ హజారె ట్రోఫీ. ఫైనల్లో తమిళనాడు ఓటమి :

i. విజయ్ హజారె ట్రోఫీని కర్ణాటక కైవసం చేసుకుంది. మంచి ఫామ్లో ఉన్న ఓపెనర్ కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ అర్ధశతకాలతో రాణించడంతో పాటు పేసర్ అభిమన్యు మిథున్ (5/34) ఇన్నింగ్స్ చివరి ఓవర్లో హ్యాట్రిక్ సహా ఐదు వికెట్లతో విజృంభించడంతో.. వర్షం అంతరాయం కలిగించిన ఫైనల్లో కర్ణాటక 60 పరుగుల తేడాతో తమిళనాడుపై గెలిచింది.
ii. వర్షం వల్ల మ్యాచ్ కొనసాగే పరిస్థితి లేకపోవడంతో డక్వర్త్ లూయిస్ తరహా వీజేడీ పద్ధతిలో కర్ణాటకను విజేతగా ప్రకటించారు. ఆ జట్టుకు ఇది నాలుగో విజయ్ హజారె టైటిల్.
బుమ్రా, మంధానాలకు విజ్డెన్ పురస్కారం :

i. భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా, మహిళల జట్టు స్టార్ ఓపెనర్ స్మృతి మంధానాలకు ఈ ఏడాది విజ్డెన్ ఇండియా ఉత్తమ క్రికెటర్ల అవార్డులు లభించాయి.
ii. మిథాలీరాజ్, దీప్తి శర్మ తర్వాత విజ్డెన్ ‘క్రికెటర్ ఆఫ్ ఆ ద ఇయర్’ అవార్డు అందుకున్న భారత మూడో మహిళా క్రికెటర్గా మంధాన నిలిచింది.

No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...