Wednesday, 30 October 2019

✍ కరెంట్ అఫైర్స్ 22 అక్టోబరు 2019 Tuesday ✍


✍  కరెంట్ అఫైర్స్ 22 అక్టోబరు 2019 Tuesday ✍

రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల వార్తలు
మహారాష్ట్రలో 60.46 % పోలింగ్.. హరియాణాలో 65 % నమోదు :

i. మహారాష్ట్రలోని 288, హరియాణాలోని 90 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికతో పాటు.. 17 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని 51 శాసనసభ, రెండు లోక్సభ స్థానాలకు ఉప ఎన్నికల పోలింగ్ ముగిసింది. 
ii. 2014 శాసనసభ ఎన్నికల కంటే రెండు ప్రధాన రాష్ట్రాల్లోనూ ఈసారి పోలింగ్ శాతం గణనీయంగా తగ్గింది. కడపటి వార్తలు అందేసరికి మహారాష్ట్రలో 60.46 శాతం, హరియాణాలో 65 శాతం ఓట్లు పోలయ్యాయి.
సియాచిన్లో ఇక పర్యాటక గుబాళింపు :

i. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన యుద్ధక్షేత్రంగా గుర్తింపు పొందిన సియాచిన్లోకి పర్యాటకులను అనుమతిస్తున్నట్లు రాజ్నాథ్ చెప్పారు.
ii. సియాచిన్ బేస్క్యాంప్ నుంచి కుమార్ పోస్ట్వరకూ ఉన్న ప్రాంతం వరకూ పర్యాటకులు చూడొచ్చని తెలిపారు. దీనివల్ల లద్దాఖ్లో పర్యాటకానికి ఊతం లభించడంతోపాటు అసాధారణ వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటూ సైన్యం, ఇంజినీర్లు సాగిస్తున్న కృషిని ప్రజలు ప్రత్యక్షంగా చూడటానికి వీలు కలుగుతుందని వివరించారు. 
iii. సియాచిన్ అంటే ‘గులాబీ నేల’ అని అర్థం.
iv. వ్యూహాత్మకంగా కీలకమైన సియాచిన్ ప్రాంతం నిజానికి ఒక హిమనీనదం. అది 20వేల అడుగుల ఎత్తులో ఉంది. చలికాలంలో ఇక్కడ ఉష్ణోగ్రతలు మైనస్ 60 డిగ్రీల సెల్సియస్కు పడిపోతాయి. ఇక్కడ మంచు చరియలు విరిగిపడుతుంటాయి.
v. ఈ ప్రాంతంపై పట్టు కోసం భారత్, పాకిస్థాన్లు తీవ్రస్థాయిలో ప్రయత్నించాయి. 1984లో ‘ఆపరేషన్ మేఘ్దూత్’ పేరుతో సైనిక చర్య నిర్వహించిన భారత్ దీన్ని తన అధీనంలోకి తెచ్చుకుంది. దానికి ముందు వరకూ పర్వతారోహణ బృందాలను అక్కడ అనుమతించారు.
Defence News
India-Myanmar Naval Exercise : IMNEX-2019

i. The India-Myanmar Naval Exercise called IMNEX-2019 is being organised in Visakhapatnam, Andhra Pradesh.
ii. The opening ceremony of the second edition of Indo-Myanmar joint naval exercise was conducted onboard INS Ranvijay.
iii. Myanmar naval ships UMS Sin Phyu Shin (F-14) and UMS Tabinshweti (773) arrived at Visakhapatnam.
iv. The exercise would be conducted in two phases: Harbour phase and Sea Phase.
v. The joint exercise will encompass a variety of operations including anti-air and surface firing exercises, flying exercises using integral helicopter and seamanship evolutions at sea.
  Appointments
SBI chairman Rajnish Kumar elected as the new chairman of IBA :

i. SBI chairman Rajnish Kumar has been appointed as the new chairman of Indian Banks’ Association.
ii. He will succeed Sunil Mehta, who was the MD & CEO of Punjab National Bank.
iii. The MD & CEO of IDBI Bank Rakesh Sharma will be honorary secretary of IBA for 2019-20.
ముఖ్యమైన రోజులు
International Stuttering Awareness Day (అంతర్జాతీయ నత్తి అవగాహన రోజు) – October 22
i. Theme 2019 : Growth Through Speaking

ii. October 22 was designated International Stuttering Awareness Day (ISAD) in 1998. 
iii. The day is intended to raise public awareness of the millions of people – one percent of the world's population – who have the speech disorder of stuttering.
కొమరం భీమ్ జయంతి : 22 అక్టోబరు 1901

i. ఉమ్మడి ఆదిలాబాదు జిల్లా ఆసిఫాబాద్ మండలం జోడేఘాడ్ సంకెనపల్లి గ్రామంలో 1901లో కొమురం భీం (అక్టోబర్ 22, 1901 - అక్టోబర్ 27, 1940) జన్మించినాడు. భీంకి 15 ఏండ్లు ఉన్నప్పుడే అతని తండ్రిని అటవీ అధికారులు చంపివేశారు.
ii. భీం కుటుంబం సాగుచేస్తున్న భూమిని ‘‘సిద్దిభి’’ అనే జాగిర్దార్ తనకు వదిలి పెట్టాల్సిందిగా బెదిరించాడు. ఎక్కడికి పారిపోయి బ్రతకాలి ఎందుకు భయపడాలి. ప్రళయ ఘర్జనలో భీంలో ధిక్కారస్వరం ప్రతిధ్వనించింది. సిద్దిభి తలౖపై కట్టెతో గట్టిగా కొట్టాడు. సిద్దిభి అక్కడే చనిపోయాడు.  పోలీసులు భీంనీ వేటాడారు.
iii. దీంతో అస్సాంలో ఏళ్ల పాటు అజ్ఞాత జీవితం గడిపాడు. బాభి ఝారి చుట్టు పక్కల తన నాయకత్వంలో ఉన్న 12 గ్రామాల్లో మా గ్రామం మా స్వరాజ్యం అనే నినాదాన్ని అబ్దుల్ సత్తార్ అనే తాలుక్ దారుతో ఒప్పించడానికి చేసిన ప్రయత్నం విఫలమైంది. 
iv. అక్కడ నుంచి సుర్దాపూర్కి తిరిగి వచ్చి పెత్తందారి వ్యవస్థ కింద నలుగుతున్న తన జాతి విముక్తి కోసం ‘జల్ జంగల్ జమీన్’ తమదే అంటూ గర్జించాడు. స్వయం పాలన 12 గ్రామాలతో స్వతంత్ర గోండు రాజ్యం కావాలని ఆసిఫాబాద్ కలెక్టర్తో చర్చలు జరిపాడు.
v. పరిష్కారం దొరకలేదు. దీంతో నిజాం రాజును కలవడానికి హైదరాబాద్ వెళ్ళాడు కానీ నిజాం నుంచి అనుమతి దొరకలేదు ఇక గెరిల్లా పోరాటంతోనే నిజాం సైన్యాన్ని ఎదుర్కోవాలి అని నిర్ణయించుకున్నాడు.
vi. దట్టమైన అడవుల్లో ఉన్న ‘జోడే ఘాట్’ గుట్టల్లో గెరిల్లా అర్మీని తయారు చేశాడు. భీంతో చర్చలు జరిపినప్పటికీ ఫలించకపోవడంతో  భీంని అంతం చేస్తే తప్ప తిరుగుబాటు ఆగదని నిజాం సర్కార్ భావించింది. 
vii. భీం దగ్గర హవల్దార్గా పనిచేసే కుర్దు పటేల్ని లోబరుచుకుని భీం స్థావరాన్ని బ్రిటిష్ ఆర్మీ సహాయంతో అర్ధరాత్రి సమయంలో చుట్టుముట్టింది. 3 రోజుల సుదీర్ఘ పోరాటంలో అలసిన భీం గెరిల్లాలపై నిజాం సైన్యం ఒకసారి గుంపుగా విరుచుకపడి కొమురం భీం గుండెల్లో బుల్లెట్ దింపారు. ఆదివాసీల ఆశయాల సాధనే భీంకి ఇచ్చే ఘన నివాళి.
బక్సర్ యుద్ధం (Battle of Buxar) : 1764 అక్టోబరు 22

i. బక్సర్ యుద్ధం 1764 అక్టోబరు 22న మన్రో నాయకత్వంలోని బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ దళాలు, బెంగాల్ నవాబు మీర్ ఖాసిం, ఔధ్ నవాబు, మొఘల్ చక్రవర్తి రెండవ షా ఆలం సంయుక్త దళాలకు నడుమ జరిగింది.
ii. బెంగాల్ భూభాగంలో పాట్నాకు 130 కిలోమీటర్ల పశ్చిమంగా గంగా నదీ తీరాన ఉన్న కోటగోడల్లో నెలకొన్ని చిన్న పట్టణం బక్సర్ వద్ద జరిగింది. ఈ యుద్ధంలో బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ నిర్ణయాత్మకమైన విజయాన్ని సాధించింది.
iii. మిత్రపక్షాలైన బెంగాల్, ఔధ్, మొఘల్ సైన్యాల మధ్య మౌలికమైన సమన్వయం కూడా లేకపోవడం ఈ నిర్ణయాత్మకమైన ఓటమికి దారితీసింది.
iv. బక్సర్ వద్ద బ్రిటీష్ విజయంతో, ఎగువ భారతదేశంలో మొఘల్ అధికారానికి వారసుల్లాంటి ముగ్గురు ముఖ్యులు లేకుండా పోయారు. మీర్ ఖాసిం నిరుపేదగా అజ్ఞాతంలోకి మాయమయ్యాడు, షా ఆలం బ్రిటీష్ వారితో సంధి చేసుకున్నాడు, విజేతలు చంపడానికి వెంటపడుతూండగా షియా ఉద్దౌలా పశ్చిమానికి పారిపోయాడు.
v. మొత్తం గంగా మైదానం కంపెనీ వారి దయ మీద ఆధారపడి మిగిలింది; షుజా ఉద్దౌలా క్రమేణా లొంగిపోయాడు; దాంతో కంపెనీ దళాలు అవధ్, బీహార్ ప్రాంతాలంతటా కూడా అధికారం ఇవ్వగల దళారీలయ్యాయి

No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...