Wednesday, 30 October 2019

బీటెక్‌ డిగ్రీ కాదా..? కానే కాదంటున్న దక్షిణ డిస్కం. కంప్యూటర్‌ ఆపరేటర్‌ పోస్టులకు బీఏ డిగ్రీ అర్హత :

రాష్ట్రప్రభుత్వ గుర్తింపు ప్రకారం ఏదైనా డిగ్రీ అంటే బీఏతో సమానంగా బీటెక్‌ కూడా వస్తుంది. అందుకు భిన్నంగా డిగ్రీల్లో బీఏతో సమానమైన డిగ్రీ బీటెక్‌ కాదని పక్కన పెట్టడం ఏమిటని రమేశ్‌ (ఎంటెక్‌) అనే నిరుద్యోగి ఆవేదన వ్యక్తం చేశారు. దానికి దక్షిణ డిస్కం సంచాలకుడు పర్వతం స్పందిస్తూ రాష్ట్ర విద్యుత్‌ సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి ట్రాన్స్‌కో రూపొందించిన మార్గదర్శకాలను దశాబ్దాలుగా అనుసరిస్తున్నాం. వాటి ప్రకారం బీటెక్‌ డిగ్రీ ఉన్నవారిని విద్యుత్‌ సంస్థల్లో ఇంజినీరింగ్‌ ఉద్యోగాలకు తీసుకుంటున్నాం. కంప్యూటర్‌ ఆపరేటర్‌, జేపీవో పోస్టులకు బీఏ, బీకాం, బీఎస్సీ పట్టభద్రులే అర్హులని మార్గదర్శకాల్లో ఉంది. ఇవి మూడేళ్లలో చదివే డిగ్రీలు. బీటెక్‌ నాలుగేళ్ల డిగ్రీ. డిగ్రీలన్నీ సమానమే. కానీ, మార్గదర్శకాలను సవరించకుండా మేమేం చేయలేం అని డిస్కం అధికారి పేర్కొన్నారు.

No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...