✍ కరెంట్
అఫైర్స్ 3 అక్టోబరు 2019
Thursday ✍
జాతీయ వార్తలు
2022 నాటికి ప్లాస్టిక్ నిర్మూలన. ‘ఆరుబయట’ అలవాటు నుంచి దేశానికి విముక్తి కలిగిందని ప్రకటన : మహాత్ముడి 150వ జయంతి సభలో ప్రధాని మోదీ
i.
పర్యావరణానికి ముప్పుగా పరిణమించిన ‘వాడి పారేసే ప్లాస్టిక్’ను 2022 నాటికి నిర్మూలించడానికి అందరూ కంకణబద్ధులు కావాలని కోరారు. ఆరుబయట మల విసర్జన అలవాటు నుంచి ఇప్పుడు మన దేశం బయటపడిందని, ప్రపంచ దేశాల్లో భారత్ పరపతి పెరిగిందని చెప్పారు.
ii. మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని అహ్మదాబాద్లో సబర్మతి నదీతీరాన నిర్వహించిన ‘స్వచ్ఛ భారత్ దివస్’ కార్యక్రమంలో ప్రధాని ప్రసంగించారు.
iii. 60 కోట్ల మంది కోసం 60 నెలల్లో 11 కోట్ల మరుగుదొడ్లను నిర్మించిన తీరును యావత్ ప్రపంచం విభ్రమంగా చూస్తూ కొనియాడుతోందని చెప్పారు. గాంధీ స్మారకార్థం రూ.150 నాణేలను విడుదల చేశారు.
iv. గుజరాత్కు బయల్దేరే ముందు దిల్లీలో విజయ్గేట్ వద్ద లాల్‌బహదూర్ శాస్త్రి సమాధిని మోదీ సందర్శించి, ఆయన జయంతి సందర్భంగా నివాళులర్పించారు.
నిజాం నిధులు భారత్వే. పాక్కు ఎదురుదెబ్బ. ఇండియాకు అనుకూలంగా బ్రిటన్ హైకోర్టు రూలింగ్ :
i.
నిజాం నిధుల కేసులో పాకిస్థాన్కు బ్రిటన్ హైకోర్టులో బుధవారం ఎదురుదెబ్బ తగిలింది. లండన్లోని నాట్‌వెస్ట్ బ్యాంకులో డిపాజిట్ అయి ఉన్న ఆ నిధులు భారత్కే చెందుతాయంటూ రూలింగ్ ఇచ్చింది.
ii. నాటి హైదరాబాద్ సంస్థానాధీశుడైన 7వ నిజాంకు చెందిన సుమారు రూ.306.50 కోట్ల నిధులు(ప్రస్తుత విలువ) తమకే చెందాలన్న పాకిస్థాన్ వాదనను బ్రిటన్ హైకోర్టు తోసిపుచ్చింది.
iii. భారత్కు అనుకూలంగా తన నిర్ణయాన్ని వెలువరించింది. గత 70 సంవత్సరాలుగా నలుగుతున్న ఈ కేసులో బ్రిటన్ హైకోర్టు ఇచ్చిన రూలింగ్ను కీలక పరిణామంగా పరిగణిస్తున్నారు.
iv. 1948లో అప్పటి హైదరాబాద్ నిజాం సుమారు 1,007,940 పౌండ్ల(ప్రస్తుత విలువ ప్రకారం సుమారు రూ.8.82 కోట్ల పైచిలుకు) మొత్తాన్ని నాడు కొత్తగా ఏర్పడిన పాకిస్థాన్ తరఫున బ్రిటన్లో హైకమిషరుగా బాధ్యతలు నిర్వహిస్తున్న హబీబ్ ఇబ్రహీం రహీంతుల్లా ఖాతాలోకి బదలాయించారు.
v. అప్పటి నుంచీ ఆ మొత్తం బ్యాంకులోనే ఉండిపోయింది. నేడు దాని విలువ ఇప్పుడు సుమారు రూ.306.50 కోట్లకు చేరుకుంది. ఈ నిధులు తమకే దక్కాలంటూ 7వ నిజాం వారసులు ప్రిన్స్ ముఖర్రం జా, ఆయన సోదరుడు ముఫఖం జా, భారత సర్కారూ కలిపి కేసువేశారు. పాక్ కూడా ఆ మొత్తం తమకే చెందాలని వాదిస్తున్న విషయం గమనార్హం.
vi. పాకిస్థాన్ ఇవేవీ పట్టించుకోకుండా 2013లో నాట్వెస్ట్బ్యాంకులోని ఆ నిధులు తమవేనంటూ కేసు వేసిందన్నారు 7వ నిజాం మనవడు నవాబ్ నజఫ్ అలీ. నిజాం వారసులైన ప్రిన్స్ ముఖరం జా ప్రస్తుతం ఇస్తాన్బుల్లో ఉన్నారని, ఆయన సోదరుడు ముఫకంజా ఇప్పుడు లండన్లో ఉన్నారని నజఫ్ అలీ తెలిపారు.
ఇతర రాష్ట్రాలు / కేంద్ర పాలిత
ప్రాంతాల వార్తలు
ఏపీలో ఇంటింటికి నవరత్నాలు. గ్రామ సచివాలయాలే కేంద్ర బిందువు. జనవరి 1 నుంచి పూర్తి స్థాయిలో సేవలు అందుబాటులోకి : ఏపీ సీఎం జగన్
i.
‘మన భారతీయ ఆత్మ గ్రామాల్లోనే ఉంటుంది. మహాత్ముడు కోరుకున్నట్లు గ్రామాలకు అభివృద్ధి ఫలాలను అందించడం.. పాలన, పథకాలను ప్రతి గడపకూ చేర్చాలన్న ఆరాటంతోనే గ్రామ సచివాలయ వ్యవస్థకు అంకురార్పణ చేశాం’ అని ఏపీ సీఎం జగన్ అన్నారు.
ii.
నవరత్నాలు సహా అన్ని ప్రభుత్వ పథకాలు నేరుగా ఇంటికే చేరుస్తామని, గ్రామీణుల స్థితిగతులను పూర్తిగా మార్చే దిశగా అడుగులు వేస్తామని హామీనిచ్చారు.
iii.
గ్రామ సచివాలయాలకు అవసరమైన మౌలిక సదుపాయాలను రెండు నెలల్లో కల్పించి జనవరి1 నుంచి వ్యవస్థను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు.
iv.
కొత్తగా శ్రీకారం చుట్టిన గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థను తూర్పుగోదావరి జిల్లా కరపలో ఆయన ప్రారంభించారు.
కంటివెలుగు పథకం :
v.
కంటివెలుగు పథకం ద్వారా ఏపీలో సుమారు కోటిన్నర మందికి ఉచితంగా కళ్లజోళ్లు పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం రూ.250 కోట్ల వరకు వ్యయం చేయబోతున్నారు. మరో 8 లక్షల మందికి క్యాటరాక్ట్, ఇతర శస్త్ర చికిత్సలు జరుపుతారు.
vi.
ఈ పథకం అమలు నిమిత్తం ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మొత్తం రూ.560 కోట్లను కేటాయించింది. ఈ నెల 10 నుంచి 2022 జనవరి 31వ వరకు 6 దశల్లో ఈ కార్యక్రమం చేపడతారు.
Naveen launches new
governance initiative :
i.
గాంధీ జయంతి సందర్భంగా ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ బుధవారం తన ప్రభుత్వ కొత్త పాలన చొరవ ‘మో సర్కార్’ ను ప్రారంభించారు.
ii.
ప్రభుత్వ ఆసుపత్రులలో చికిత్స మరియు పోలీసు స్టేషన్లలో సేవ గురించి వారి అభిప్రాయాలను సేకరించడానికి పట్నాయక్ ఏడు జిల్లాల్లోని ఎనిమిది మందిని తన నివాసం నుండి ఫోన్ ద్వారా పిలిచారు.
Appointments
Jai Bhagwan Bhoria appointed as new administrator
for PMC Bank :
i.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ పంజాబ్ మరియు మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, ముంబైలను అధిగమించింది మరియు బోర్డు యొక్క అన్ని అధికారాలతో జై భగవాన్ భోరియాను బ్యాంక్ నిర్వాహకుడిగా నియమించింది. డిపాజిటర్లకు అనుమతించిన బ్యాంకు నుండి ఉపసంహరణ మొత్తాన్ని వెయ్యి నుండి పదివేల రూపాయలకు పెంచారు.
ii.
ఆర్బిఐ ఆదేశాలు ఆరు నెలల కాలానికి అమలులో ఉంటాయి.
Surjit S Bhalla appointed as Executive
Director for India at IMF :
i.
ఆర్థికవేత్త సుర్జిత్ భల్లాను అంతర్జాతీయ ద్రవ్య నిధి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా మూడేళ్ల కాలానికి ప్రభుత్వం నియమించింది. జూలైలో డాక్టర్ సుబీర్ గోకర్న్ మరణం తరువాత ఈ పదవి ఖాళీగా ఉంది.
ii.
భల్లా ఇంతకుముందు ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యునిగా పనిచేశారు, కాని ఈ సంవత్సరం ప్రారంభంలో రాజీనామా చేశారు.
Reports/Ranks/Records
హైదరాబాద్ @ 17. ‘స్వచ్ఛ రైల్-స్వచ్ఛ భారత్’లో బెజవాడకు ఏడో స్థానం. తొలి మూడు స్థానాల్లో జైపుర్, జోధ్పుర్, దుర్గాపుర. జోన్లలో నాలుగో స్థానంలో నిలిచిన దక్షిణ మధ్య రైల్వే :
i.
‘‘స్వచ్ఛ రైల్-స్వచ్ఛ భారత్’’లో విజయవాడ రైల్వే స్టేషన్కు ఏడో స్థానం నిలవగా, హైదరాబాద్కు 17వ స్థానం దక్కింది. స్వచ్ఛ భారత్ స్ఫూర్తిగా రైల్వే శాఖ స్వచ్ఛ రైల్-స్వచ్ఛ భారత్ పేరిట రైల్వే స్టేషన్లకు శుభ్రత ఆధారంగా 2016 నుంచి ర్యాంకులు ప్రకటిస్తోంది.
ii.
2016 నుంచి 2018 వరకు ఏ, ఏ1 గ్రేడ్ పరిధిలోని 407 స్టేషన్లకు ర్యాంకులు కేటాయించగా.. ఈ ఏడాది నాన్ సబ్ అర్బన్, సబ్ అర్బన్ పరిధిలోని 720 స్టేషన్లకు విస్తరించారు.
iii.
మొత్తం వెయ్యి మార్కుల ప్రాతిపదికలో ఈ ఏడాది జైపుర్ (931.75), జోధ్పుర్ (927.19), దుర్గాపుర (922.50 మార్కులు) తొలి మూడు స్థానాల్లో నిలిచాయి.
iv.
హైదరాబాద్ స్టేషన్కు (890.64) 17వ ర్యాంకు, సికింద్రాబాద్కు (858.77 మార్కులు) 42వ ర్యాంకు దక్కింది.
అవార్డులు
సచిన్కు స్వచ్ఛతా పురస్కారం :
i.
క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్‌కు ప్రత్యేక పురస్కారం లభించింది. పరిసరాల పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన పెంచడంతోపాటు స్వచ్ఛతా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నందుకుగాను అతడికి ‘అత్యంత ప్రభావశీల స్వచ్ఛతా రాయబారి’ అవార్డు దక్కింది.
ii.
మహాత్మాగాంధీ 150 జయంతిని పురస్కరించుకొని దిల్లీలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా సచిన్ పురస్కారాన్ని స్వీకరించారు.
BOOKS
‘వేయి పడగలు’ ఆంగ్ల అనువాదం ‘థౌజండ్ హుడ్స్’ ఆవిష్కరణ :
i.
హైదరాబాద్లోని మాదాపూర్లో విశ్వనాథ సాహిత్యపీఠం, శాంత, వసంత ట్రస్టు సంయుక్త ఆధ్వర్యంలో ‘‘ఒక భాష నుంచి మరో భాషలోకి అనువాదంలో సమస్యలు’’ అనే అంశంపై నిర్వహిస్తున్న రెండు రోజుల సదస్సు ముగిసింది.
ii.
ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన వెంకయ్యనాయుడు కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ రచించిన ‘వేయి పడగలు’ నవల ఆంగ్ల అనువాదం ‘‘థౌజండ్ హుడ్స్’’ పుస్తకాన్ని ఆవిష్కరించారు.
iii.
అనంతరం సాహిత్య విమర్శకురాలు డా.సి.మృణాళినికి విశ్వనాథ అవార్డు, రచయిత డా.వైదేహి శశిధర్కు వెల్చాల కేశవరావు అవార్డును అందజేశారు.
iv.
కార్యక్రమంలో విశ్వనాథ సాహిత్యపీఠం అధ్యక్షులు, ‘వేయి పడగలు’ ఆంగ్ల అనువాదకులు వెల్చాల కొండలరావు పాల్గొన్నారు.
ముఖ్యమైన రోజులు
World Nature Day (ప్రపంచ ప్రకృతి దినోత్సవం) – October 3
i.
ప్రపంచ ప్రకృతి దినోత్సవం (AND) ప్రకృతిని పరిరక్షించే దిశగా అలాంటి ఒక అడుగు. ప్రకృతి సమతుల్యతను కాపాడటానికి అవగాహన పెంచడానికి ప్రతి సంవత్సరం అక్టోబర్ 3 న జరుపుకుంటారు.
ii.
ప్రపంచ ప్రకృతి దినోత్సవాన్ని మొట్టమొదట ప్రపంచ ప్రకృతి సంస్థ (WNO-World Nature Organization) జరుపుకుంది, ఇది పర్యావరణ పరిరక్షణపై దృష్టి సారించిన ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ (IGO). ఈ సంస్థ అభివృద్ధి చెందుతున్న ఆఫ్రికన్ దేశాలు, కరేబియన్ చుట్టుపక్కల దేశాలు మరియు పసిఫిక్ మహాసముద్రం చుట్టూ ఉన్న దేశాలచే స్థాపించబడింది; వీరందరూ వాతావరణ మార్పుల వల్ల ఎక్కువగా బెదిరిస్తున్నారు.
iii.
మొదటి ప్రపంచ ప్రకృతి దినోత్సవాన్ని అక్టోబర్ 3, 2010 న సంస్థ జరుపుకుంది. అప్పటి నుండి ప్రతి సంవత్సరం అదే తేదీన జరుపుకుంటారు.
క్రీడలు
టెస్టులు, వన్డేలు, టీ20ల్లో ఓపెనర్గా సెంచరీ సాధించిన ఏకైక భారత బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ @ IND vs WI 1st Test విశాఖపట్నం :
i.
టెస్టుల్లో అనేక వైఫల్యాల తర్వాత ఓపెనర్ అవతారం ఎత్తిన భారత సీనియర్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ.. కొత్త పాత్రలో సులువుగా ఒదిగిపోయాడు. ఓపెనర్గా తొలి మ్యాచ్లోనే సెంచరీ సాధించాడు.
ii.
ఓపెనర్గా
ఆడిన తొలి
టెస్టులో శతకం
సాధించిన నాలుగో
భారత బ్యాట్స్‌మన్
రోహిత్. శిఖర్
ధావన్, కేఎల్
రాహుల్, పృథ్వీ
షా అతనికంటే
ముందు ఉన్నారు.
ధావన్, షా
ఆ ఘనతను
తమ అరంగేట్ర
టెస్టులోనే సాధించారు.
iii.
టీమ్ఇండియాతో మ్యాచ్తో దక్షిణాఫ్రికా తరపున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన ఆల్‌రౌండర్ సెనురాన్ ముత్తుస్వామి మూలాలు భారత్లోనే ఉండడం విశేషం.
iv.
అతని పూర్వీకులు చెన్నైలో నివాసం ఉండేవాళ్లు. భారత్‌పైనే అరంగేట్ర మ్యాచ్ ఆడుతుండడం విశేషం. ఆ జట్టులోని మరో స్పిన్నర్ కేశవ్ మహారాజ్ కూడా భారత్ సంతతికి చెందిన వాడనే సంగతి తెలిసిందే.
సీఏసీకి కపిల్ రాజీనామా :
i.
అంబుడ్స్‌మన్ డీకే జైన్ నుంచి విరుద్ధ ప్రయోజనాల నోటీసు వచ్చిన నేపథ్యంలో ముగ్గురు సభ్యుల క్రికెట్ సలహా సంఘానికి కపిల్ దేవ్ రాజీనామా చేశాడు.
ii.
కమిటీలో ఉన్న మరో సభ్యుడు అన్షుమన్ గైక్వాడ్ కూడా రాజీనామా చేసినట్టు సమాచారం. శాంత రంగస్వామి ఇంతకుముందే రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
iii.
అయితే సీఏసీ సభ్యులకు ఎలాంటి విరుద్ధ ప్రయోజనాలు లేవని బీసీసీఐ పరిపాలకుల కమిటీ ఛైర్మన్ వినోద్ రాయ్ ఇప్పటికే స్పష్టం చేశాడు.
ఒక పీకేఎల్ మ్యాచ్‌లో అత్యధిక రైడ్ పాయింట్లు సాధించిన ఆటగాడిగా పవన్ షెరావత్ రికార్డు :
i.
సూపర్ ఫామ్‌ను కొనసాగించిన పవన్.. ఒక పీకేఎల్ మ్యాచ్‌లో అత్యధిక రైడ్ పాయింట్లు(39 పాయింట్లు) సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
ii.
పర్దీప్ నర్వాల్ (34) పేరిట ఉన్న రికార్డును అతడు బద్దలు కొట్టాడు.
iii.
బెంగళూరు బుల్స్, యు ముంబా ప్రొ కబడ్డీ లీగ్ ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లాయి.
200 మీటర్ల పరుగులోనూ కొత్త ఛాంపియన్ నోవా లైల్స్ :
i.
ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ 100 మీటర్ల పరుగులోనే కాదు.. 200 మీటర్ల పరుగులోనూ కొత్త ఛాంపియన్ వచ్చాడు.
ii.
మూడు రోజుల కిందట 100 మీ. పరుగులో అమెరికా కుర్రాడు క్రిస్టియన్ కోల్మన్ విజేతగా నిలవగా.. తాజాగా జరిగిన 200 మీ. రేసులో అమెరికాకే చెందిన నోవా లైల్స్ ఛాంపియన్ అయ్యాడు. అతను 19.83 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకున్నాడు.
No comments:
Post a Comment