Friday 5 July 2019

గోదావరి నుంచి శ్రీశైలంకు 90 కిలోమీటర్ల సొరంగ మార్గం

* గోదావరి నుంచి నేరుగా శ్రీశైలంకు నీటిని మళ్లించాలంటే ఏకంగా 90 కిలోమీటర్ల దూరం సొరంగ మార్గం.
* రెండు లేదా మూడు దశల్లో లిఫ్టుల ద్వారా 380 కిలోమీటర్ల దూరం నీటిని మళ్లించాల్సి వస్తుంది.
* సుమారు లక్ష కోట్ల రూపాయల భారీ వ్యయం అవుతుందని అంచనా
* కాళేశ్వరం ఎత్తిపోతలతో పోలిస్తే ఇదే అత్యధిక వ్యయంతో కూడుకున్న ప్రాజెక్టు కానుంది.
* తెలంగాణ నీటిపారుదలశాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ నేతృత్వంలో సంబంధిత ఇంజినీర్లు, విశ్రాంత ఇంజినీర్లు కలిసి కసరత్తు చేసి గోదావరి నుంచి శ్రీశైలంకు నీటిని మళ్లించే ప్రతిపాదనకు తుది రూపం తెచ్చారు. 
రెండు మార్గాల ప్రతిపాదన 
* గోదావరిపై కంతనపల్లి దిగువన రాంపూర్‌ వద్ద నుంచి నల్గొండ జిల్లాలో నిర్మించిన ఉదయసముద్రం వరకు నీటిని మళ్లించేలా ప్రతిపాదన తయారు చేశారు. 
* ఇక్కడి నుంచి రెండు మార్గాలను ప్రతిపాదించారు. 
* మొదటిది నాగార్జునసాగర్‌కు నేరుగా నీటిని మళ్లించడం. ఇది ఉదయసముద్రం నుంచి సుమారు వంద కిలోమీటర్లు ఉంటుంది. 
* రెండోది ఉదయసముద్రం నుంచి 15 లేదా 20 కిలోమీటర్ల తర్వాత 90 కిలోమీటర్ల దూరం సొరంగం తవ్వడం. ఇదే నిర్మిస్తే సాగునీటి ప్రాజెక్టుల్లో అతిపెద్ద సొరంగం అవుతుంది. 
* కాళేశ్వరం ఎత్తిపోతలలో 203 కిలోమీటర్ల దూరం సొరంగాలు తవ్వినా, ఒకచోట అత్యధికంగా 20 కిలోమీటర్లు మాత్రమే. శ్రీశైలం ఎడమగట్టు కాలువలో భాగంగా 43.5 కిలోమీటర్ల దూరం సొరంగం నిర్మాణంలో ఉంది. 
* దీనికి రెండింతలు గోదావరి-శ్రీశైలం అనుసంధానానికి తవ్వాల్సి ఉంటుంది. 
* పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నార్లాపూర్‌ రిజర్వాయర్‌ వెనుకభాగం నుంచి వాగు ద్వారా శ్రీశైలంలోకి మళ్లించడానికి అవకాశం ఉన్నట్లు తేల్చారు. 
* ప్రస్తుతం నీటి ప్రవాహ మార్గాన్ని దాదాపు ఖరారు చేశారు. ఈ మార్గం మొత్తం 380 కిలోమీటర్లు ఉంటుందని అంచనా. 
పోలవరం నుంచి నేరుగా పులిచింతలకు 
* ఆంధ్రప్రదేశ్‌ జలవనరులశాఖ ఇంజినీర్లు, విశ్రాంత ఇంజినీర్లు అధ్యయనం చేసి పోలవరం నుంచి నేరుగా పులిచింతలకు గోదావరి నీటిని మళ్లించే ప్రతిపాదన చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది.     
* పోలవరం కుడి కాలువను కొంత మార్పు చేయాల్సి ఉంటుందని, తర్వాత మున్నేరు ద్వారా పులిచింతలకు మళ్లించవచ్చని, పులిచింతల నుంచి నాగార్జునసాగర్‌కు తరలించవచ్చని ప్రతిపాదించారు. 
* ఈ మార్గంలో మున్నేరు నది నుంచి వచ్చే నీటిని కూడా వినియోగించుకోవచ్చు. 

No comments:

WRITING A RESEARCH REPORT

 రీసెర్చ్ రిపోర్ట్ రాయడం పరిశోధన నివేదిక అనేది సాంప్రదాయిక నిర్మాణం లేదా ఆకృతిని అనుసరించి కఠినంగా ఆకృతీకరించిన పత్రంలో పరిశోధన మరియు దాని ఫ...