భారత్‌కు నాటోతో సమాన హోదా ఇచ్చేందుకు సంబంధించిన శాసనసభ నిబంధనకు అమెరికా సెనేట్ జూలై 2న ఆమోదం తెలిపింది. దీంతో అమెరికా నాటో మిత్రపక్ష దేశాలైన ఇజ్రాయిల్, దక్షిణ కొరియా దేశాల సరసన భారత్ నిలవనుంది.
దీనివల్ల భారత్-అమెరికా దేశాల మధ్య రక్షణ సహకారాన్ని పెంపొందించేందుకు అవకాశముంటుంది. హిందూ మహాసముద్రంలో భారత్-అమెరికాల మధ్య రక్షణ సహకారం మరింత పెరగడంతో పాటు, మానవతా సహాయం, ఉగ్రవాద నిర్మూలన, సముద్ర ప్రాంతంలో భద్రత వంటివి పెంపొందించడానికి ఈ చట్టం దోహదపడుతుంది. 2020 ఆర్థిక సంవత్సరానికి గాను జాతీయ రక్షణ అధికార చట్టం (ఎన్‌డీఏఏ) బిల్లులో భారత్‌కు నాటోతో సమాన హోదా ఇచ్చే ప్రతిపాదనను పొందుపరిచారు.
No comments:
Post a Comment