Thursday, 4 July 2019

లిబియాలో వైమానిక దాడి

లిబియా దేశ రాజధాని ట్రిపోలి నగర శివారులోని తజౌరా అనే ప్రాంతంలోని వలసదారుల పునరావాస కేంద్రంపై జూలై 2న వైమానిక బాంబు దాడి జరిగింది.ఈ దాడిలో 40 మంది మరణించగా మరో 80మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో చాలా మందిని ఆఫ్రికా వలసదారులుగా గుర్తించారు. దాడి సమయంలో కేంద్రంలో దాదాపు 120 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. దాడి తీవ్రత భారీ స్థాయిలో ఉండడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని లిబియా ఆరోగ్య శాఖ ప్రకటించింది. ట్రిపోలి తూర్పు భాగాన్ని అధీనంలోకి తీసుకొని పాలిస్తున్న లిబియన్ నేషనల్ ఆర్మీయే(ఎల్‌ఎన్‌ఏ) ఈ దాడికి పాల్పడిందని లిబియా ప్రధాని ఫయాజ్ అల్ సెర్రా ఆరోపించారు.లిబియా దేశాధినేత గడాఫీని 2011లో హతమార్చిన నాటి నుంచి ఆ దేశంలో హింసాత్మక ఘటనలు చెలరేగాయి. ఐరాస గుర్తించిన ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న వర్గం ఎల్‌ఎన్‌ఏగా ఏర్పడి తరచూ హింసకు పాల్పడుతోంది. అధికారిక ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా పోరాటం సాగిస్తోంది. 

No comments:

భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం

 భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026లో, భారతదేశపు మొట్టమొదటి న...