Monday, 28 January 2019

పిన్న వయసులో అర్ధసెంచరీ చేసిన బ్యాట్స్‌మన్‌గా రోహిత్

అంతర్జాతీయ క్రికెట్‌లో అతిపిన్న వయసులో అర్ధసెంచరీ చేసిన బ్యాట్స్‌మన్‌గా నేపాల్‌కి చెందిన రోహిత్ పౌడెల్ రికార్డు నెలకొల్పాడు.
దుబాయ్‌లో జనవరి 26న యూఏఈ-నేపాల్ మధ్య జరిగిన వన్డే మ్యాచ్‌లో 16 ఏళ్ల 146 రోజుల వయసున్న రోహిత్ 58 బంతుల్లో 55 పరుగులు చేశాడు. దీంతో సచిన్ టెండూల్కర్ 16 ఏళ్ల 213 రోజుల వయసులో పాకిస్థాన్‌పై టెస్టు క్రికెట్‌లో చేసిన అర్ధసెంచరీ తెరమరుగైంది. అయితే ఈ రికార్డు పురుషుల క్రికెట్‌కే పరిమితం. ఎందుకంటే మహిళల క్రికెట్‌లో జొమరి లాగ్టెన్‌బర్గ్ (దక్షిణాఫ్రికా) 14 ఏళ్ల వయసులోనే టెస్టు, వన్డేల్లో అర్ధసెంచరీలు చేసిన అతిపిన్న క్రికెటర్‌గా రికార్డులకెక్కింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అతిపిన్న వయసులో అర్ధసెంచరీ చేసిన బ్యాట్స్‌మన్
ఎప్పుడు : జనవరి 26
ఎవరు : రోహిత్ పౌడెల్
ఎక్కడ : దుబాయ్, యూఏఈ

No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...