Tuesday 22 January 2019

పులికాట్‌లో ఫ్లెమింగోల సందడి

నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట వేదికగా మూడు రోజుల పాటు జరిగే ఫ్లెమింగో ఫెస్టివల్‌ (పక్షుల పండగ) అట్టహాసంగా మొదలైంది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఈ పక్షుల పండగను ప్రారంభించారు. జిల్లాలోని పులికాట్‌, నేలపట్టు, భీమునివారిపాళెం ప్రాంతాలకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావాలన్న లక్ష్యంతో ఏటా దీన్ని నిర్వహిస్తున్నారు. ఫ్లెమింగో ఫెస్టివల్‌ను పురస్కరించుకుని పర్యాటకుల కోసం వివిధ ప్రభుత్వ శాఖలు స్థానికంగా స్టాళ్లను ఏర్పాటు చేశాయి.
శ్రీహరికోటలోని ఇస్రో కేంద్రం ఆధ్వర్యంలో కూడా స్టాళ్లను ఏర్పాటు చేసి రాకెట్‌ ప్రయోగాలకు సంబంధించిన విషయాలను సందర్శకులకు తెలియజేస్తున్నారు

No comments:

WRITING A RESEARCH REPORT

 రీసెర్చ్ రిపోర్ట్ రాయడం పరిశోధన నివేదిక అనేది సాంప్రదాయిక నిర్మాణం లేదా ఆకృతిని అనుసరించి కఠినంగా ఆకృతీకరించిన పత్రంలో పరిశోధన మరియు దాని ఫ...