Saturday, 26 January 2019

ముగ్గురు ఏపీ పోలీసులకు రాష్ట్రపతి విశిష్ట అవార్డులు


ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు పోలీసు అధికారులకు రాష్ట్రపతి విశిష్ట పోలీసు పతకాలు లభించాయి.
ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయ చినరాజప్ప వద్ద ఓఎస్డీగా పనిచేస్తున్న ఎస్పీ స్థాయి అధికారి అడ్డాల వెంకటరత్నం, విశాఖపట్నం రేంజి ఏసీబీ డీఎస్పీ కింజరాపు వెంకట రామకృష్ణ ప్రసాద్‌ ఈ పతకానికి ఎంపికయ్యారు.
మరో 15 మంది ప్రతిభా సేవా పతకాలకు ఎంపికయ్యారు. కేంద్ర ప్రభుత్వ శాఖకు సంబంధించి విజయవాడలో అసిస్టెంట్‌ డైరెక్టరుగా పనిచేస్తున్న ఎన్‌.ప్రకాశ్‌రావు కూడా రాష్ట్రపతి విశిష్ట సేవా పతకానికి ఎంపికయ్యారు.
ఇంకా ముగ్గురు  ప్రతిభా సేవా పతకాలకు అర్హులయ్యారు.
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఈ పురస్కారాలను ప్రకటించింది.

No comments:

bio mechanics in sports

భౌతిక విద్యలో బయోమెకానిక్స్ అనేది మానవ కదలికను నియంత్రించే యాంత్రిక సూత్రాల అధ్యయనం మరియు శారీరక కార్యకలాపాల సమయంలో శరీరం శక్తులతో ఎలా సంకర్...