Monday, 21 January 2019

IMF ప్రధాన ఆర్థికవేత్తగా గీతా గోపీనాథ్‌



అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) ప్రధాన ఆర్థికవేత్తగా ప్రముఖ భారతీయ అమెరికన్‌ అర్థశాస్త్ర నిపుణురాలు గీతా గోపీనాథ్‌ బాధ్యతలు చేపట్టారు.
  • ఈ ప్రతిష్ఠాత్మక పదవిని చేపట్టిన తొలి మహిళగా గీతా గోపీనాథ్‌ చరిత్ర సృష్టించారు. అంతకుముందు ఈ బాధ్యతల్లో ఉన్న మరీస్‌ ఆబ్‌స్ట్‌ ఫెల్డ్‌ 2018 డిసెంబర్‌ 31న పదవీ విరమణ చేశారు.
  • ప్రధాన ఆర్థికవేత్తగా IMF పరిశోధక విభాగానికి డైరెక్టర్‌గానూ ఆమె సేవందిస్తారు. గీతా గోపీనాథ్‌ నియామకం విషయాన్ని 2018 అక్టోబర్‌ 1నే ఐఎమ్‌ఎఫ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ క్రిస్టీన్‌ గార్డ్‌ ప్రకటించారు.
  • కర్ణాటకలోని మైసూరులో గీతా గోపీనాథ్‌ జన్మించారు. అమెరికాలోని వాషింగ్టన్‌ విశ్వవిద్యాలయంలో ఎమ్‌ఏ, ప్రిన్స్‌టన్‌ విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ పూర్తి చేశారు. ప్రిన్స్‌టన్‌లో వుడ్రో వ్సిన్‌ ఫెలోషిప్‌ పురస్కారం ఆమెకు దక్కింది.
  • హార్వర్డ్‌ వర్సిటీలో ప్రతిష్ఠాత్మక ‘జాన్‌ జ్వాన్‌స్ట్రా ప్రొఫెసర్‌షిప్‌’ గౌరవాన్ని కూడా పొందారు. కేరళ సీఎంకు ఆర్థిక సలహాదారుగా ఉండటంతోపాటు పలు కీలక బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.


IMF-International Monetary Fund 

No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...