Tuesday 22 January 2019

‘సైజ్‌ ఇండియా’ పథకం

భారతీయ రెడీమేడ్‌ దుస్తుల పరిశ్రమకు ఇప్పుడిక సొంత ప్రామాణిక కొలతలు రానున్నాయి. అందులో భాగంగానే  దేశవ్యాప్తంగా వర్తించేలా ‘సైజ్‌ ఇండియా’ పథకం త్వరలోనే అమల్లోకి రాబోతోందిఃకేంద్రమంత్రి స్మృతి ఇరానీ. రెడీమేడ్‌ దుస్తుల విషయానికి వస్తే అమెరికా, బ్రిటన్‌ తదితర దేశాలకు వాటికంటూ నిర్దేశిత కొలతలు ప్రత్యేకంగా ఉన్నాయి. ఉదాహరణకు 42, 44, ఎక్స్‌ఎల్‌ వంటి సైజులనే తీసుకుంటే వాటికి మనవైన నిర్దేశిత కొలతలంటూ ప్రత్యేకించి లేవు. ఇప్పుడా కొరత తీరనుంది. త్వరలోనే భారతీయ జౌళి, రెడీమేడ్‌ దుస్తుల పరిశ్రమ కూడా ప్రామాణిక కొలతలను సొంతం చేసుకోనుంది. ‘సైజ్‌ ఇండియా’ పథకానికి సంబంధించి అధ్యయనం కూడా చేపట్టనున్నట్లు మంత్రి చెప్పారు.

No comments:

WRITING A RESEARCH REPORT

 రీసెర్చ్ రిపోర్ట్ రాయడం పరిశోధన నివేదిక అనేది సాంప్రదాయిక నిర్మాణం లేదా ఆకృతిని అనుసరించి కఠినంగా ఆకృతీకరించిన పత్రంలో పరిశోధన మరియు దాని ఫ...