Monday, 21 January 2019

ప్రపంచంలోనే ఎత్తైన శివలింగంప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివలింగంగా ఉదయకుళంగర ప్రాంతంలోని లింగానికి గుర్తింపు లభించింది

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివలింగంగా ఉదయకుళంగర ప్రాంతంలోని లింగానికి గుర్తింపు లభించింది. తమిళనాడు-కేరళ సరిహద్దుల్లోని చెంగల్‌ మహేశ్వర శివపార్వతి ఆలయ ప్రాంగణంలో శివలింగం నిర్మాణాన్ని 2012లో ప్రారంభించారు. 111.2 అడుగుల ఎత్తుతో ఎనిమిది అంతస్తులుగా నిర్మిస్తున్న ఈ శివలింగం వ్యయ అంచనా రూ.10 కోట్లు.
ప్రతి అంతస్తులోనూ ధ్యానమండపాలు కలిగిన ఈ శివలింగం లోపలి భాగం గుహలను తలపిస్తోంది. అందులో పరశురాముడు, అగస్త్యుడు తదితరులు తపస్సు చేస్తున్నట్లు కొన్ని ప్రతిమలు ఏర్పాటు చేశారు. కింది అంతస్తులో భక్తులు అభిషేకం, ఆరాధనలు చేసేందుకు అనువుగా శివలింగం, ఎనిమిదో అంతస్తులో కైలాసగిరిలో శివపార్వతులు ఉన్నట్లు ప్రతిమలు కొలువుదీర్చారు.
ప్రస్తుతం 80 శాతం పనులు ముగిసిన నేపథ్యంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివలింగంగా దీనికి గుర్తింపు లభించింది. ‘ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’ ఈ మేరకు గుర్తించింది. మహాశివరాత్రి నాటికి మిగిలిన పనులను కూడా పూర్తి చేయాలని ఆలయ ప్రతినిధులు నిర్ణయించారు. 

No comments:

bio mechanics in sports

భౌతిక విద్యలో బయోమెకానిక్స్ అనేది మానవ కదలికను నియంత్రించే యాంత్రిక సూత్రాల అధ్యయనం మరియు శారీరక కార్యకలాపాల సమయంలో శరీరం శక్తులతో ఎలా సంకర్...