Monday 21 January 2019

ఆచ్రేకర్‌ కన్నుమూత

సచిన్‌ తెందుల్కర్‌ కోచ్‌, దిగ్గజ గురువు రమాకాంత్‌ ఆచ్రేకర్‌ (87) కన్నుమూశాడు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆచ్రేకర్‌ బుధవారం సాయంత్రం తన స్వగృహంలో తుదిశ్వాస విడిచాడు. 2013లో గుండెపోటు తర్వాత ఆచ్రేకర్‌ ఆరోగ్యం మరింత క్షీణించింది. సరిగ్గా తన పుట్టిన రోజు నాడే ఆచ్రేకర్‌ మరణించాడు. ‘‘ఆచ్రేకర్‌ సర్‌ మనల్ని విడిచి వెళ్లిపోయాడు. సాయంత్రం కన్నుమూశాడు’’ అని ఆయన కుమార్తె రష్మి దాల్వి ప్రకటించింది.
మాస్టర్‌కే మాస్టర్‌
  • 1932 జనవరి 2న మహారాష్ట్రలో జన్మించిన ఆచ్రేకర్‌.. క్రికెట్‌ గుగ్గురువుగా పేరు తెచ్చుకున్నాడు.
  • సచిన్‌, వినోద్‌ కాంబ్లి, చంద్రకాంత్‌ పండిట్‌, ప్రవీణ్‌ ఆమ్రే, అజిత్‌ అగార్కర్‌, రమేశ్‌ పొవార్‌, సమీర్‌ దిఘే, బల్విందర్‌సింగ్‌ సంధు వంటి క్రికెటర్లను తీర్చిదిద్దాడు.
  • కోచింగ్‌ కెరీర్‌తో పోల్చుకుంటే ఆచ్రేకర్‌ గొప్ప ఆటగాడేమీ కాదు. 1943లో క్రికెట్‌ ఆడటం మొదలుపెట్టిన ఆచ్రేకర్‌ 1945లో న్యూ హింద్‌ స్పోర్ట్‌ క్లబ్‌కు ఆడాడు. యంగ్‌ మహారాష్ట్ర ఎలెవన్‌, ముంబయి పోర్ట్‌లకు ప్రాతినిధ్యం వహించాడు.
  • 1963లో హైదరాబాద్‌తో జరిగిన మొయినుద్దౌలా గోల్డ్‌కప్‌ క్రికెట్‌ టోర్నీ మ్యాచ్‌లో ఎస్‌బీఐ తరఫున బరిలో దిగాడు. ఆచ్రేకర్‌ ఆడిన ఏకైక ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ అదే. కొద్దికాలం ముంబయి సెలెక్టర్‌గా కూడా పనిచేశాడు.
  • అనంతరం శిక్షకుడిగా రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించాడు. శివాజీ పార్క్‌లో కామత్‌ మెమోరియల్‌ క్రికెట్‌ క్లబ్‌ను స్థాపించి వర్ధమాన ఆటగాళ్లకు శిక్షణ ఇచ్చాడు.
  • 11 ఏళ్ల వయసులో సచిన్‌.. ఆచ్రేకర్‌ అకాడమీలో చేరడం అతడి కెరీర్‌తో పాటు భారత క్రికెట్‌ ముఖచిత్రాన్నే మార్చేసింది. పాఠశాల స్థాయిలో ఫాస్ట్‌ బౌలర్‌గా కెరీర్‌ మొదలుపెట్టిన సచిన్‌ను బ్యాట్స్‌మన్‌గా మార్చింది ఆచ్రేకరే.
  •  ప్రపంచంలోనే సచిన్‌ను మేటి క్రికెటర్‌గా తయారు చేసిన ఆచ్రేకర్‌ను 1990లో ద్రోణాచార్య పురస్కారం వరించింది. 2010లో పద్మశ్రీ పురస్కారం లభించింది.

No comments:

WRITING A RESEARCH REPORT

 రీసెర్చ్ రిపోర్ట్ రాయడం పరిశోధన నివేదిక అనేది సాంప్రదాయిక నిర్మాణం లేదా ఆకృతిని అనుసరించి కఠినంగా ఆకృతీకరించిన పత్రంలో పరిశోధన మరియు దాని ఫ...