Monday 21 January 2019

విద్య, ఉద్యోగాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10% కోటాకు రాష్ట్రపతి ఆమోదం


జనరల్కేటగిరీలోని ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్లు కల్పిస్తూ పార్లమెంటు ఆమోదించిన బిల్లు చట్టరూపం సంతరించుకొంది. దీనిపై 2019 జనవరి 12 రాష్ట్రపతి రామ్నాథ్కోవింద్సంతకం చేయడంతో చట్టంగా మారింది.
  • 124 రాజ్యాంగ సవరణ బిల్లుగా పార్లమెంటు ఆమోదం పొందిన అంశం రాష్ట్రపతి ఆమోదముద్రతో 103 రాజ్యాంగ సవరణ చట్టంగా రూపాంతరం సంతరించుకొంది.
  • రిజర్వేషన్ల కల్పన కోసం రాజ్యాంగంలోని 15, 16 అధికరణాలను సవరించాల్సి వచ్చింది.
  • ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందన్న దానిపై కేంద్ర సామాజిక న్యాయం, సాధికార మంత్రిత్వశాఖ నోటిఫికేషన్జారీచేయాల్సి ఉంటుంది. చట్టం అమలుకు సంబంధించిన విధివిధానాలను ఖరారుచేస్తూ శాఖ నోటిఫికేషన్జారీ చేసిన తేదీ నుంచి ఇది కార్యరూపంలోకి వస్తుంది.
  • రూ.8 లక్షల వరకు వార్షికాదాయం, 5 ఎకరాల్లోపు భూమి, 1000 చదరపు అడుగు విస్తీర్ణంలోపు ఇల్లు, నోటిఫై చేసిన ప్రాంతాల్లో 100 చదరపు గజాల్లోపు, నోటిఫై చేయని ప్రాంతాల్లో 200 గజాల్లోపు స్థలం ఉన్న కుటుంబాలు మాత్రమే కోటా ఉపయోగించుకోవడానికి అర్హత పొందాయి.
విధివిధానాలను అధికారికంగా ధ్రువీకరిస్తూ నోటిఫికేషన్విడుదల చేయాల్సి ఉంది

No comments:

WRITING A RESEARCH REPORT

 రీసెర్చ్ రిపోర్ట్ రాయడం పరిశోధన నివేదిక అనేది సాంప్రదాయిక నిర్మాణం లేదా ఆకృతిని అనుసరించి కఠినంగా ఆకృతీకరించిన పత్రంలో పరిశోధన మరియు దాని ఫ...