Monday, 21 January 2019

వాట్సాప్‌లో విచారణతో విడాకులు మంజూరు చేసిన నాగ్‌పుర్‌ కుటుంబ న్యాయస్థానం



వాట్సాప్వీడియో కాల్సాయంతో అమెరికాలో ఉన్న భార్య, భారత్లో ఉన్న భర్త విడాకులు పొందారు. అరుదైన సంఘటనకు మహారాష్ట్రలోని నాగ్పూర్కుటుంబ న్యాయస్థానం వేదికైంది.

  • 2013 ఆగస్టు 11 నాగ్పూర్కు చెందిన వ్యక్తి (37), హైదరాబాద్‌ (సికింద్రాబాద్‌)కు చెందిన యువతి (35) పెద్దలు కుదిర్చిన వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇంజినీరింగ్లో పట్టభద్రులైన ఇద్దరూ అమెరికాకు చెందిన ఆటో మొబైల్కంపెనీలో ఉద్యోగం చేసేవారు.
  • వీసా గడువు ముగియడంతో కొంతకాలం ఆమె నాగ్పుర్లో నివాసం ఉంది. సమయంలో ఇరువురి మధ్య మనస్పర్థలు మొదయ్యాయి. తర్వాత ఆమె విద్యార్థి వీసా మీద మిషిగన్వెల్లినా వారిమధ్య సఖ్యత కుదరకపోగా, మరింత దూరం పెరుగుతూ వచ్చింది.
  • అమెరికా నుంచి తిరిగొచ్చిన భర్త నాగ్పుర్కుటుంబ న్యాయస్థానంలో భార్య నుంచి విడాకులు కోరుతూ దరఖాస్తు చేసుకున్నాడు. నిబంధనకు అనుగుణంగా కేసును కౌన్సిల్కు అప్పగించారు. కేసు విచారణకు స్వయంగా తను హాజరుకాలేనని భార్య వెల్లడించడంతో న్యాయస్థానం సామాజిక మాధ్యమం వాట్సాప్ను సరికొత్త విధానానికి అనుసరించింది.
  • యువతి విజ్ఞప్తి మేరకు కౌన్సిల్ఆమెను వాట్సాప్వీడియో కాల్ద్వారా ప్రశ్నించి, కాల్ను రికార్డు చేశారు. తర్వాత భర్తను ప్రశ్నించగా ఇద్దరూ విడాకులకు సుముఖంగా ఉన్నట్లు వెల్లడైంది. భార్య తరఫున ఆమె సోదరుడు కోర్టుకు రాగా.. భర్త మాత్రం విచారణ సమయంలో స్వయంగా హాజరయ్యాడు.

No comments:

WRITING A RESEARCH REPORT

 రీసెర్చ్ రిపోర్ట్ రాయడం పరిశోధన నివేదిక అనేది సాంప్రదాయిక నిర్మాణం లేదా ఆకృతిని అనుసరించి కఠినంగా ఆకృతీకరించిన పత్రంలో పరిశోధన మరియు దాని ఫ...