Monday, 21 January 2019

బోపన్న జంటకు టాటా ఓపెన్ టోర్నమెంట్ టైటిల్


భారత టెన్నిస్ డబుల్స్ క్రీడాకారులు రోహన్ బోపన్న-దివిజ్ శరణ్ జంటకు టాటా ఓపెన్ ఏటీపీ-250 టోర్నమెంట్ టైటిల్ లభించింది.
 పుణేలో జనవరి 5న జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో బోపన్న-దివిజ్ ద్వయం 6-3, 6-4తో ల్యూక్ బాంబ్రిడ్‌‌జ-జానీ ఒమారా (బ్రిటన్) జోడీపై విజయం సాధించింది. మరోవైపు టాటా ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను ప్రపంచ ఆరో ర్యాంకర్ కెవిన్ అండర్సన్ (దక్షిణాఫ్రికా) సాధించాడు. 100వ ర్యాంకర్ ఇవో కార్లోవిచ్ (క్రొయేషియా)తో జరిగిన ఫైనల్లో అండర్సన్ 7-6 (7/4), 6-7 (2/7), 7-6 (7/5)తో గెలుపొందాడు.

క్విక్ రివ్యూ :
ఏమిటి : టాటా ఓపెన్ ఏటీపీ-250 టోర్నమెంట్ పురుషుల డబుల్స్ టైటిల్ విజేత 
ఎప్పుడు : జనవరి 5
ఎవరు : బోపన్న-దివిజ్ శరణ్ జంట
ఎక్కడ : పుణే, మహారాష్ట్ర

No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...