Monday, 21 January 2019

రెడ్‌ స్నోమ్యాన్‌లా అల్టిమా టూ లే



న్యూహారిజన్స్అంతరిక్షనౌక అల్టిమా టూ లేకు సంబంధించిన సమగ్ర చిత్రాలను 2019 జనవరి 3 నాసాకు పంపింది.
  • ఫ్లూటో గ్రహం సమీపంలోని క్యూపర్బెల్ట్ప్రదేశంలో అంతుపట్టకుండా ఉన్న అల్టిమా టూ లే రహస్యాలను ఛేదించడానికి నాసా 2019 జనవరి 1 అంతరిక్షంలోకి న్యూహారిజన్స్ను పంపింది. సౌరకుటుంబంలో అత్యంత దూరంలో ఉన్న అతి ప్రాచీన కాస్మిక్బాడీగా అల్టిమా టూ లేను భావిస్తున్నారు.
  • న్యూహారిజన్స్అల్టిమా టూ లే చిత్రాలను పంపిందని, ఇది చరిత్రాత్మక విజయమని ప్రయోగానికి నేతృత్వం వహించిన జాన్హాఫ్కిన్స్వర్సిటీ అప్లైడ్ఫిజిక్స్లేబొరేటరీ (ఏపీఎల్‌) ట్వీట్చేసింది.
  • తాజా చిత్రాలు అల్టిమా టూ లేకు 27 వేల కి.మీసమీపం నుంచి తీసినవి. వీటిని బట్టి రెండు మంచు గోళాలు కలిసిన రెడ్స్నోమ్యాన్ఆకారంలో ఉన్నట్లు తెలుస్తోందని, కాంతి పడటం వల్ల ఇది ఎర్రగా కనపడుతోందని నాసా తెలిపింది.
  • రెండు వేర్వేరు మంచు గోళాలు తిరుగుతూ తిరుగుతూ దగ్గరగా వచ్చి కలిసిపోయినట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. మొత్తం 31 కి.మీ. పొడవున్న కాస్మిక్బాడీలో పెద్ద గోళానికి అల్టిమా అని, చిన్న గోళానికి టూ లే అని పేరు పెట్టారు. ఇది 50 కోట్ల ఏళ్ల కిందట ఏర్పడి ఉంటుందని వారు అంచనా వేస్తున్నారు

No comments:

bio mechanics in sports

భౌతిక విద్యలో బయోమెకానిక్స్ అనేది మానవ కదలికను నియంత్రించే యాంత్రిక సూత్రాల అధ్యయనం మరియు శారీరక కార్యకలాపాల సమయంలో శరీరం శక్తులతో ఎలా సంకర్...