ఐటీడీఏ పరిధిలోని గిరిజన కుటుంబాలకు పోషకాహారం అందించేందుకు ఉద్దేశించిన ‘ఆహారబుట్ట’(ఫుడ్ బాస్కెట్) పథకానికి ఆంధ్రప్రదేశ్
రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది.
- వీటిని పంపిణీ చేసే బాధ్యతలను
పౌరసరఫరాల శాఖకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది.
- పోషకాల కొనుగోలు
బాధ్యతలనూ ఆ
సంస్థకే అప్పగిస్తూ 2019 జనవరి 14న ఉత్తర్వులు జారీ చేసింది.
- పథకం అమలు, పర్యవేక్షణ
కోసం రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేసింది.
- రాష్ట్ర స్థాయి కమిటీలకి
గిరిజన సంక్షేమ శాఖ సంచాలకులు కన్వీనర్గా వ్యవహరిస్తారు.
- పౌరసరఫరా
సంస్థ ఎండీ, గిరిజన సహకార సంస్థ ఎండీ తదితరులు సభ్యులుగా ఉంటారు.
- జిల్లా కమిటీకి కలెక్టర్
ఛైర్మన్గా వ్యవహరిస్తారు.
- గిరిజనుల్లో
పోషకాహారాన్ని నివారించాన్న ఉద్దేశంతో ఈ
పథకాన్ని తీసుకొచ్చింది.
- ఏజెన్సీ పరిధిలోని
దాదాపు 2 లక్షల పైచిలుకు తెల్లకార్డులున్న గిరిజనులకు రూ.500 విలువైన ఆరు రకాల పోషకాల్ని ఉచితంగా ఇస్తారు.
- ఇందుకోసం
2018-19 బడ్జెట్లో రూ.120 కోట్లను ప్రభుత్వం కేటాయించింది.
- ఆహారబుట్టలో
ఉండే పదార్థాలు : రాగి పిండి - 2 కిలోలు, కందిపప్పు- 2 కిలోలు, పొద్దు తిరుగుడు నూనె- లీటరు, వేరుశనగ- కిలో, డబుల్ ఫోర్టిఫైడ్ ఉప్పు(అయోడిన్, ఐరన్ ఉన్నది)- కిలో, బెల్లం- కిలో
- ఐటీడీఏ పరిధిలో తెల్లరేషన్
కార్డులున్న గిరిజన కుటుంబాలు ఈ
పథకానికి అర్హులు.
- నెలకు కుటుంబానికి
ఒక ఆహారబుట్ట చొప్పున అందజేస్తారు
No comments:
Post a Comment