మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్’ (ఎంవోఏబీ) పేరుతో అమెరికా రూపొందించిన శక్తిమంతమైన అణ్వస్త్రేతర ఆయుధానికి పోటీగా చైనా కూడా ఒక భారీ బాంబును రూపొందించింది. విమానం నుంచి ప్రయోగించే ఈ ఆయుధాన్ని ఆ దేశ రక్షణ సంస్థ ‘నారిన్‌కో’ తాజాగా ప్రదర్శించింది. విధ్వంసక శక్తి విషయంలో అణ్వస్త్రాల తర్వాతి స్థానం ఈ ఎంవోఏబీలదే. దీని అసలు పేరు ‘మ్యాసివ్ ఆర్డ్‌నెన్స్ ఎయిర్ బ్లాస్ట్’ (ఎంవోఏబీ). మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్‌గా ఇది ప్రాచుర్యం పొందింది. 2017లో అమెరికా సైన్యం అఫ్గానిస్థాన్‌లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల స్థావరాలపై ఈ బాంబును ప్రయోగించింది. పటిష్ఠ భవనాలు, రక్షణ శిబిరాలను కూడా ఇది సమూలంగా నాశనం చేయగలదు. గగనతలంలో హెలికాప్టర్ నుంచి సైనికులు తాళ్ల ద్వారా కిందకి దిగాలనుకున్న చోట అడవులు వంటి అవరోధాలు ఉంటే వాటిని నిర్మూలించడానికి కూడా ఈ బాంబును ఉపయోగించొచ్చు. చైనా రూపొందించిన ఈ తరహా ఆయుధాన్ని హెచ్-6కె శ్రేణి బాంబర్ విమానం ద్వారా జారవిడిస్తున్న వీడియోను నారిన్‌కో విడుదల చేసింది. దీనివల్ల భారీ విస్ఫోటం చోటుచేసుకుంది. చైనా బాంబు బరువు కొన్ని టన్నుల మేర ఉంటుందని చెబుతున్నారు. పొడవు 5-6 మీటర్ల మేర ఉండొచ్చని విశ్లేషిస్తున్నారు. అమెరికా ఎంవోఏబీ కన్నా కొంచెం చిన్నగా, తక్కువ బరువును కలిగి ఉంటుందంటున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
WRITING A RESEARCH REPORT
రీసెర్చ్ రిపోర్ట్ రాయడం పరిశోధన నివేదిక అనేది సాంప్రదాయిక నిర్మాణం లేదా ఆకృతిని అనుసరించి కఠినంగా ఆకృతీకరించిన పత్రంలో పరిశోధన మరియు దాని ఫ...
-
Sathavahana Dynasty founder - Sathavahana Kingdom Founder - Sri Muka Capitals - Koti Lingala (Karimnagar), Dhaanyakatakam ...
-
Vishnu Kundinas Important points Founder of the kingdom : Maharajendra Varma Capital cities : 1.Indrapalanagaram (Nalgo...
No comments:
Post a Comment