Monday 21 January 2019

యువత పరిశోధన వైపు రావాలి: డీఆర్‌డీవో చైర్మన్ సతీశ్‌రెడ్డి



పరిశోధించాలి.. నూతన ఆవిష్కరణకు నాంది పలకాలి.. దేశాన్ని గర్వంగా నిలపాలి అని డీఆర్డీవో చైర్మన్ సతీశ్రెడ్డి యవతకు పిలుపునిచ్చారు. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్లో ఫ్యూచరిస్టిక్ డిఫెన్స్ టెక్నాలజీస్ అనే అంశంపై నిర్వహించిన ప్లీనరీలో ఆయన మాట్లాడారు. పరిశోధనకు అవసరమయ్యే మౌలిక వసతులు, పరీక్షా కేంద్రాలు, ఆర్థిక సాయం విషయంలో ఎలాంటి కొరత లేదన్నారు. డీఆర్డీవో సైతం ప్రతి ఏటా అబ్దుల్ కలాం జయంతి సందర్బంగా డేర్ టూ డ్రీం పోటీ నిర్వహించి గొప్ప ఆలోచనతో వచ్చిన వారికి రూ. 10లక్షల బహుమతి అందించి పరిశ్రమ ఏర్పాటుకు సాయం చేస్తున్నట్లు చెప్పారు. స్పష్టమైన అంశాన్ని ఎంపిక చేసుకొని, దానిపై పరిశోధన చేసి నూతన ఉత్పత్తి చేయాలన్నారు. అగ్ని-5 క్షిపణి వల్ల భారత్ సామర్థ్యం ప్రపంచానికి తెలిసిందన్నారు. బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిస్ క్షిపణిని అభివృద్ధి చేసే సాంకేతికత ప్రపంచంలో ఒక్క భారత్కే సొంతం అన్నారు

No comments:

WRITING A RESEARCH REPORT

 రీసెర్చ్ రిపోర్ట్ రాయడం పరిశోధన నివేదిక అనేది సాంప్రదాయిక నిర్మాణం లేదా ఆకృతిని అనుసరించి కఠినంగా ఆకృతీకరించిన పత్రంలో పరిశోధన మరియు దాని ఫ...