Monday, 21 January 2019

చంద్రుడికి రెండోపక్క దిగిన చైనా వ్యోమనౌక

బీజింగ్‌: అంతరిక్ష పరిశోధనల్లో చైనా అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా చంద్రుడి అవతలి భాగంలో వ్యోమనౌకను దించింది. చాంగే-4 అనే ఈ రోబోటిక్‌ యంత్రం.. ఇప్పటివరకూ పెద్దగా శోధించని ఆ ప్రదేశానికి సంబంధించిన ఫొటోలను చాలా దగ్గరి నుంచి అందించింది. ఈ విజయంతో ప్రబల అంతరిక్ష శక్తిగా ఎదగాలన్న తన కలను సాకారం చేసుకునే దిశగా చైనా పెద్ద ముందడుగు వేసింది. తాజా ఘనతపై అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) అధిపతి జిమ్‌ బ్రైండ్‌స్టైన్‌, రష్యా శాస్త్రవేత్తలు అభినందనలు తెలిపారు. 
ఇప్పటివరకూ ల్యాండింగ్‌ ఎందుకు జరగలేదు? 
అవతలి భాగంలోని వ్యోమనౌకలతో కమ్యూనికేషన్‌ సాగించడం చాలా కష్టం. రేడియో తరంగాలకు చందమామే అడ్డంకి అవుతుంది. 1960, 70లలో అమెరికా వ్యోమగాములు చంద్రుడి కక్ష్యలో తిరుగుతూ, ఆవలి భాగం వైపునకు వెళ్లినప్పుడు వారితో పూర్తిగా రేడియో సంబంధాలు తెగిపోయాయి. ప్రత్యేక ఉపగ్రహాన్ని ప్రయోగించడం ద్వారా చైనా ఈ ఇబ్బందిని అధిగమించింది. భూమికి, చంద్రుడికి మధ్యలో ఉండే సమతౌల్య కక్ష్యలో ఉంచడం వల్ల చాంగే-4కు భూమికి మధ్య నిరంతర కమ్యూనికేషన్‌ సాధ్యమైంది. 

No comments:

WRITING A RESEARCH REPORT

 రీసెర్చ్ రిపోర్ట్ రాయడం పరిశోధన నివేదిక అనేది సాంప్రదాయిక నిర్మాణం లేదా ఆకృతిని అనుసరించి కఠినంగా ఆకృతీకరించిన పత్రంలో పరిశోధన మరియు దాని ఫ...