Monday 21 January 2019

సులభతర వాణిజ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రథమ స్థానం

సులభతర వాణిజ్యంలో ఆంధ్రప్రదేశ్‌ మరోసారి దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. సింగపూర్‌ నేషనల్‌ యూనివర్సిటీకి చెందిన లిక్వాన్‌ యూ స్కూల్‌ అనుబంధ ఏషియా కాంపిటీటీవ్‌నెస్‌ ఇనిస్టిట్యూట్‌ (ఏసీఐ) సర్వేలో ఈ ఘనతను సొంతం చేసుకుంది.
  • సులభతర వాణిజ్యంపై దేశంలోని వివిధ రాష్ట్రాల్లో సర్వే నిర్వహించిన ఏసీఐ ఫలితాలను 2019 జనవరి 3న ఉండవల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విడుదల చేశారు.
  • వివిధ రంగాల్లో పెట్టుబడుదారులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అమలు చేసిన విధానాలు, పారిశ్రామిక రంగంలో సంస్కరణలు, ఇతర అనేక అంశాలు సులభతర వాణిజ్యంలో మొదటి స్థానాన్ని దక్కించుకోవడానికి దోహదం చేశాయని ఏసీఐ వెల్లడించింది.
  • కేంద్ర ప్రభుత్వం, ప్రపంచ బ్యాంకు సంయుక్తంగా ఇదివరకు నిర్వహించిన సర్వేలో కూడా ఆంధ్రప్రదేశ్‌ మొదటి స్థానంలో నిలిచింది.
  • ఏసీఐ ప్రకారం 2016 నుంచి 2018 వరకూ ఆంధ్రప్రదేశ్‌ ప్రస్థానం 
  • పెట్టుబడులను ఆకర్షించడంలో 2016లో 7వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ఇప్పుడు 3వ స్థానానికి చేరుకుంది. మహారాష్ట్ర మాత్రం వరుసగా రెండోసారి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. గుజరాత్‌ వరుసగా రెండోసారి 2వ స్థానంలోనే నిలిచింది. 
  • స్నేహ పూర్వక వ్యాపారంలో (బిజినెస్‌ ఫ్రెండ్లీనెస్‌) 2016లో 6వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ఇప్పుడు అగ్రస్థానంలో నిలిచింది. మహారాష్ట్ర 3వ స్థానానికి పరిమితమైంది

No comments:

WRITING A RESEARCH REPORT

 రీసెర్చ్ రిపోర్ట్ రాయడం పరిశోధన నివేదిక అనేది సాంప్రదాయిక నిర్మాణం లేదా ఆకృతిని అనుసరించి కఠినంగా ఆకృతీకరించిన పత్రంలో పరిశోధన మరియు దాని ఫ...