సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మదన్.బి.లోకూర్ 2018 డిసెంబర్ 30న పదవీ విరమణ చేశారు. 2018 జనవరిలో అప్పటి సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా వ్యవహారశైలికి వ్యతిరేకంగా మీడియా సమావేశం ఏర్పాటుచేసిన నలుగురు జడ్జీల్లో జస్టిస్ లోకూర్ ఉన్నారు.
- సుప్రీంకోర్టు జడ్జీలు, న్యాయవాదుల 2018 డిసెంబర్ 14నే జస్టిస్ లోకూర్‌కు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేసినప్పటికీ 2018 డిసెంబర్ 30తో ఆయన పదవీకాలం పూర్తయింది.
- కేసు కేటాయింపు విషయంలో అప్పటి సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా తీరును వ్యతిరేకిస్తూ ప్రస్తుత సీజేఐ జస్టిస్ గొగోయ్, అప్పటి జస్టిస్ చమేశ్వర్, జస్టిస్ కురియన్ జోసెఫ్‌తో కలిసి లోకూర్ మీడియా సమావేశంలో నిర్వహించారు.
- సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పలు కీలక కేసుల్లో తీర్పును వెలువరించారు. 1953, డిసెంబర్ 31న జన్మించిన లోకూర్, 1977, జూలై 28న న్యాయవాదిగా పేరును నమోదు చేయించుకున్నారు.
- 2010-12 మధ్యకాలంలో గౌహతి, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. 2012 జాన్‌లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లోకూర్ పదోన్నతి పొందారు. భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)తో కలిసి 47 కేసుల్లో కీలక తీర్పు ఇచ్చారు.
No comments:
Post a Comment