Monday 21 January 2019

లద్దాఖ్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద సౌర విద్యుత్‌ కర్మాగారం



పర్వతాలు, సరస్సులు, ప్రకృతి సోయగాలతో కనువిందు చేసే లద్దాఖ్లో ప్రపంచంలోనే అతిపెద్దదైన సౌర విద్యుత్కర్మాగారం ఏర్పాటు కానుంది. 25 వేల ఎకరాల్లో 5000 మెగావాట్ల సామర్థ్యంతో దీన్ని నిర్మించనున్నారు.

  • ఒకే ప్రాంతంలో ఇంత భారీ విస్తీర్ణంలో ఇప్పటివరకూ సౌర విద్యుత్కర్మాగారామూ ఏర్పాటు కాలేదు.
  • జమ్మూకశ్మీర్లోనే ఉన్న కార్గిల్లో 12.5 వేల ఎకరాల విస్తీర్ణంలో 2,500 మెగావాట్ల సామర్థ్యంతో మరొకదాన్ని నిర్మించనున్నారు. రెండు కర్మాగారాల ద్వారా ఏటా 12,750 టన్నుల మేర కర్బన ఉద్గారాలను తగ్గించుకునే అవకాశం ఉంది.
  • కేంద్ర పునరుత్పాదక ఇంధన మంత్రిత్వశాఖ నేతృత్వంలోని భారత సౌర విద్యుత్సంస్థ (SECI) కర్మాగారాలను నెలకొల్పడానికి కృషి చేస్తోంది. రూ.45 వేల కోట్ల అంచనా వ్యయంతో 2023 కల్లా వీటిని నిర్మించనున్నట్లు సంస్థ పేర్కొంది.
  • లద్దాఖ్లోని హన్లె ఖాల్డో, కార్గిల్లోని సురుల్లో ఇవి ఏర్పాటు కానున్నాయి.
  • లద్దాఖ్లో ఉత్పత్తైన విద్యుత్ను హర్యానాలోని కైథల్కు సరఫరా చేస్తారు. ఇందుకోసం లెహ్-మనాలీ మార్గం వెంబడి 900 కి.మీ. మేర లైన్వేయనున్నారు. కార్గిల్ప్రాజెక్టును శ్రీనగర్కు సమీపంలోని న్యూ వాన్పోలో ఉన్న గ్రిడ్తో అనుసంధానిస్తారు.
SECI-Solar Energy Corporation of India 

No comments:

WRITING A RESEARCH REPORT

 రీసెర్చ్ రిపోర్ట్ రాయడం పరిశోధన నివేదిక అనేది సాంప్రదాయిక నిర్మాణం లేదా ఆకృతిని అనుసరించి కఠినంగా ఆకృతీకరించిన పత్రంలో పరిశోధన మరియు దాని ఫ...