Sunday, 10 November 2019

10th november 2019 current affairs

✍  కరెంట్ అఫైర్స్ 10 నవంబరు 2019 Sunday ✍
జాతీయ వార్తలు
అయోధ్యలో వివాదాస్పద స్థలం రామ్లల్లాకే. సుప్రీం కోర్టు చరిత్రాత్మక తీర్పు :

i. అయోధ్యలోని వివాదాస్పద 2.77 ఎకరాల భూమిని రామమందిరం కోసం అప్పగించాలి.  కేంద్ర ప్రభుత్వం 3 నెలల్లోగా ట్రస్ట్ను ఏర్పాటు చేయాలి. ఆలయ నిర్మాణ బాధ్యత ఆ ట్రస్ట్కు ఇవ్వాలి.
ii. సున్నీ వక్ఫ్బోర్డుకు మసీదు నిర్మాణం కోసం అయోధ్యలోనే 5 ఎకరాల స్థలం కేటాయించాలి. మసీదు నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపట్టేందుకు సున్నీ వక్ఫ్బోర్డుకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది.
iii. 1992లో జరిగిన బాబ్రీ మసీదు కూల్చివేత చట్ట విరుద్ధం. కరసేవకులు 1992 డిసెంబరు 6న బాబ్రీ మసీదును అక్రమంగా కూల్చేశారు. అది చట్ట విరుద్ధం.  వివాదాస్పద స్థలం మొత్తం 1,500 గజాల్లో ఉంది.
iv. ఈ వివాదంపై దాఖలైన నాలుగు దావాలను విచారించిన అలహాబాద్ హైకోర్టు.. 2.77 ఎకరాల వివాదాస్పద స్థలాన్ని సున్నీ వక్ఫ్ బోర్డు, నిర్మోహి అఖాడా, రామ్ లల్లాకు సమానంగా పంచాలని 2010లో తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే.
v. సుప్రీం కోర్టు చరిత్రలో ఇది రెండో సుదీర్ఘ విచారణగా నిలిచిపోయింది. 1972లో ‘కేశవానంద భారతి వర్సెస్ కేరళ ప్రభుత్వం’ కేసు ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉంది.
vi. 1045 పేజీలున్న ఈ తీర్పు సారాంశాన్ని జస్టిస్ రంజన్ గొగొయి 45 నిమిషాల పాటు చదివి వినిపించారు.

vii. ఈ రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్ ఎస్.ఎ.బోబ్డే, జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ సభ్యులుగా ఉన్నారు.
viii. చరిత్రాత్మక అయోధ్య స్థల వివాద తీర్పులో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్ఏ నజీర్లు అనూహ్యంగా భాగస్వాములయ్యారు.
ix. వాస్తవానికి సీనియర్ న్యాయమూర్తులుగా అయోధ్య అంశంపై రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ యూయూ లలిత్లు సభ్యులుగా ఉండాలి. కానీ, వాళ్లిద్దరూ వైదొలగడంతో తదుపరి సీనియారిటీ ప్రాతిపదికన వారికి అవకాశం వచ్చింది.
x. అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో 1976-77, 2003లో రెండుసార్లు తవ్వకాలు చేపట్టారు. రెండోసారి జరిగిన తవ్వకాల నివేదికను సుప్రీం ఆధారం చేసుకుంది.

Reports/Ranks/Records
అన్నదాతల ఆత్మహత్యల్లో తెలంగాణకు 6వ స్థానం. 4వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ : ఎన్సీఆర్బీ ప్రమాద మరణాలు-ఆత్మహత్యల నివేదిక

i. వ్యవసాయ రంగంపై ఆధారపడిన వారు అత్యధికంగా ఆత్మహత్యలు చేసుకున్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ దేశంలో నాలుగో స్థానంలో ఉండగా, తెలంగాణ ఆరో స్థానంలో నిలిచింది.
ii. మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. 2016లో ప్రమాద మరణాలు-ఆత్మహత్యలకు సంబంధించి జాతీయ నేర గణాంక సంస్థ(ఎన్సీఆర్బీ) తాజాగా విడుదల చేసిన నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది.
iii. దేశవ్యాప్తంగా అత్యధికంగా ఆత్మహత్యలు జరుగుతున్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ ఆరో స్థానంలో, ఆంధ్రప్రదేశ్ తొమ్మిదో స్థానంలో ఉన్నాయి.

 Art and Culture
మిలాద్ ఉన్ నబీ పండుగ :

i. మౌలిద్ లేదా మీలాద్ అనునది మహమ్మదు ప్రవక్త జన్మదినోత్సవం. ఇది ఇస్లామీయ కేలండర్ లోని మూడవ నెల 'రబీఉల్-అవ్వల్' 12వ తేదీన వస్తుంది.
ii. మౌలిద్ అనునది సాధారణంగా జన్మదినోత్సవం కొరకు వాడుతారు. ఈజిప్టు, దక్షిణాసియాలో ఇది సర్వసాధారణపదం. ఆధ్యాత్మిక గురువులు ఔలియాల జన్మదినాన్ని గూడా 'మౌలిద్' గా జరుపుకుంటారు. భారతదేశం సాధారణంగా జరుపుకొనే ఉరుసు ఉత్సవాలు ఈ కోవకు చెందినవే.
ముఖ్యమైన రోజులు
World Science Day for Peace and Development (శాంతి మరియు అభివృద్ధి కోసం ప్రపంచ విజ్ఞాన దినోత్సవం) - 10 November

i. 2019 Theme : "Open science, leaving no one behind"
ii. శాంతి మరియు అభివృద్ధి కోసం ప్రపంచ విజ్ఞాన దినోత్సవం అనేది సమాజంలో సైన్స్ కలిగి ఉన్న ముఖ్యమైన పాత్రను ఎత్తిచూపే అంతర్జాతీయ దినం మరియు ప్రతి సంవత్సరం నవంబర్ 10 న జరుపుకుంటారు.
iii. ఇది అభివృద్ధి చెందుతున్న శాస్త్రీయ సమస్యలపై చర్చలలో విస్తృత ప్రజలను నిమగ్నం చేయవలసిన అవసరాన్ని కూడా హైలైట్ చేస్తుంది. ప్రపంచ సైన్స్ దినోత్సవాన్ని ఐక్యరాజ్యసమితి విద్యా, శాస్త్రీయ మరియు సాంస్కృతిక సంస్థ (యునెస్కో) 2001లో ప్రకటించింది మరియు 2002లో మొదటిసారి జరుపుకుంది.
సురేంద్రనాథ్ బెనర్జీ జననం – నవంబర్ 10, 1848

i. సర్ సురేంద్రనాథ్ బెనర్జీ (నవంబర్ 10, 1848 – ఆగష్టు 6, 1925) బ్రిటిష్ పరిపాలనలో తొలినాటి భారత రాజకీయ నాయకులలో ఒకరు. ఆయన తొలి భారతీయ రాజకీయ సంస్థలలో ఒకటైన ఇండియన్ నేషనల్ అసోసియేషన్ను స్థాపించారు.
ii. ఆ తరువాత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క ప్రధాన నాయకుడు అయ్యారు. ఆయన రాష్ట్రగురు (జాతి యొక్క గురువు) అనే మారుపేరుతో కూడా ప్రసిద్ధులు.
iii. సురేంద్రనాథ్ బెనర్జీ బెంగాల్ రాష్ట్రంలోని కలకత్తాలో, ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. 1879వ సంవత్సరంలో, ఆయన ది బెంగాలీ వార్తాపత్రికను స్థాపించారు.
iv. కాంగ్రెస్ మాదిరిగా కాకుండా మోంటాగు-చెల్మ్స్ ఫోర్డ్ సంస్కరణలను సురేంద్రనాథ్ స్వాగతించారు మరియు చాలా మంది ఉదార నాయకులతో ఆయన కాంగ్రెస్ను విడిచిపెట్టి 1919 లో ఇండియన్ నేషనల్ లిబరేషన్ ఫెడరేషన్ అనే కొత్త సంస్థను స్థాపించారు.
v. 1895వ సంవత్సరంలో పూనాలో మరియు 1902వ సంవత్సరంలో అహ్మదాబాదులో ఆయన కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు.
vi. 1921వ సంవత్సరంలో సంస్కరించబడిన బెంగాల్ శాసన సభకు ఆయన ఎన్నికయ్యారు, అదే సంవత్సరంలో నైట్ అనే బిరుదుతో గౌరవించబడ్డారు, మరియు 1921 నుండి 1924 వరకు స్థానిక స్వపరిపాలన మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.
vii. 1923వ సంవత్సరంలో ఆయన ఎన్నికలలో ఓడిపోయారు. ఆయన 1925వ సంవత్సరం ఆగష్టు 6న బారక్పూర్లో మరణించారు.

No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...