✍ కరెంట్ అఫైర్స్ 12 నవంబరు 2019 Tuesday ✍
రాజకీయ వార్తలు
సీఆర్‌పీఎఫ్ భద్రతలోకి సోనియా, రాహుల్, ప్రియాంక :
- కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆమె కుమారుడు రాహుల్గాంధీ, కుమార్తె ప్రియాంకగాంధీలకు భద్రత కల్పించే బాధ్యతను ‘కేంద్ర రిజర్వ్ పోలీసు దళం’ (సీఆర్పీఎఫ్) తీసుకొంది. ఈ ముగ్గురికి ఇంత కాలం ఉన్న ఎస్పీజీ భద్రతను ఉపసంహరించాలని కేంద్ర సర్కారు గత వారం నిర్ణయించిన విషయం తెలిసిందే.
- ఆ ప్రకారం దిల్లీలోని వీరు ముగ్గురి నివాసాల వద్ద కేంద్ర పారామిలిటరీ కమాండోలు బాధ్యతలు చేపట్టారు. ఈ ముగ్గురు దేశంలో ఎక్కడకు వెళ్లినా జడ్ ప్లస్ స్థాయి రక్షణ లభిస్తుంది. సీఆర్పీఎఫ్కు కొన్నాళ్లపాటు ఎస్పీజీ సహకరిస్తుంది.
ఆర్థిక అంశాలు
Banks cannot charge on NEFT transactions from January 2020 :
- As per the report titled “Furthering Digital Payments” released by the Reserve Bank of India (RBI), With a view to promoting digital transactions on the 3 anniversary of demonetisation, the Reserve Bank has moved a proposal in this regard.
- From January 2020, banks can no longer charge savings bank account holders for online transactions in the NEFT system.
- The Reserve Bank of India (RBI) has now mandated banks to do this. RBI stated that it is doing this to promote digital payments.
- RBI 25th Governor : Shaktikant Das, Headquarters : Mumbai, Founded : 1 April 1935, Kolkata.
సదస్సులు
11వ బ్రిక్స్ సదస్సు 2019 @బ్రెసీలియా (బ్రెజిల్)
- Theme 2019 - 'BRICS: Economic Growth for an Innovative Future'
- బ్రిక్స్ దేశాల 11వ శిఖరాగ్ర భేటీలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్రమోదీ బ్రెసీలియా (బ్రెజిల్)కు వెళ్లనున్నారు. ‘‘నవ్య భవితకు ఆర్థిక వృద్ధి’’ పేరిట ఈ నెల 13, 14 తేదీల్లో బ్రిక్స్ సదస్సు జరగనుంది.
- 2014 నుంచి ఇప్పటి వరకు బ్రిక్స్ సదస్సులకు ప్రధాని హాజరు కావడం ఇది ఆరోసారి.
- బ్రిక్స్ : బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా మరియు దక్షిణాఫ్రికా అనే ఐదు ప్రధాన జాతీయ ఆర్థిక వ్యవస్థల అనుబంధానికి సంక్షిప్త రూపం. వాస్తవానికి 2010లో దక్షిణాఫ్రికా ప్రవేశానికి ముందు "బ్రిక్" గా వర్గీకరించారు.
- బ్రిక్స్ సభ్యులు ప్రాంతీయ వ్యవహారాలపై గణనీయమైన ప్రభావానికి ప్రసిద్ది చెందారు; అందరూ G20 సభ్యులు. 2009 నుండి, బ్రిక్స్ దేశాలు ఏటా అధికారిక శిఖరాగ్ర సమావేశాలలో సమావేశమవుతాయి.
- "బ్రిక్" అనే పదాన్ని 2001 లో అప్పటి గోల్డ్మన్ సాచ్స్ అసెట్ మేనేజ్మెంట్ ఛైర్మన్ జిమ్ ఓ'నీల్ తన ప్రచురణ బిల్డింగ్ బెటర్ గ్లోబల్ ఎకనామిక్ బ్రిక్స్ లో రూపొందించారు.
- ప్రారంభ నాలుగు బ్రిక్ రాష్ట్రాల (బ్రెజిల్, రష్యా, ఇండియా, మరియు చైనా) విదేశాంగ మంత్రులు న్యూయార్క్ నగరంలో సెప్టెంబర్ 2006 లో యుఎన్ జనరల్ అసెంబ్లీ జనరల్ డిబేట్ లో సమావేశమయ్యారు, వరుస ఉన్నత స్థాయి సమావేశాలను ప్రారంభించారు. 16 జూన్ 2009 న రష్యాలోని యెకాటెరిన్బర్గ్లో పూర్తి స్థాయి దౌత్య సమావేశం జరిగింది.
2020 WEF వార్షిక సదస్సు @ దావోస్(స్విట్జర్లాండ్)
- భారత్లోని 100 మందికిపైగా సీఈవోలు, పలువురు రాజకీయ నాయకులు, బాలీవుడ్ స్టార్స్ ఒకే వేదికపై సందడి చేయనున్నారు. ఈ ప్రముఖుల జాబితాలో కథానాయిక దీపికా పదుకొణె కూడా ఉన్నారు.
- వచ్చే ఏడాది జనవరిలో స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ‘వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్’ వార్షికోత్సవ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ‘సమైక్య, స్థిరమైన ప్రపంచం’ ఏర్పాటుకు ఎలా ముందడుగు వేయాలనే అంశంపై చర్చించనున్నారు.
- ఇది ‘వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్’ 50వ వార్షికోత్సవం కావడంతో కార్యక్రమాల్ని మరింత ప్రత్యేకంగా జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
- జనవరి 20 నుంచి 24 వరకు జరగనున్న ఈ కార్యక్రమానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా రాబోతున్నారని సమాచారం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దాదాపు 3 వేల మంది లీడర్లు ఈ సమావేశం పాల్గొనున్నట్లు తెలిసింది.
Sanskrit Bharati Vishwa Sammelan begins in New Delhi :
- Sanskrit Bharati Vishwa Sammelan, a mega event for discussing ideas, theories and research findings in the ancient Sanskrit language, begins in New Delhi.
- Thousands of Sanskrit lovers from 17 countries are attending Sanskrit Bharati Vishwa Sammelan.
- An exhibition ‘Sanskriti Pradarshini’ has also been put up displaying manus, models and charts that establish different phases of the development of Sanskrit as a popular language, not only in India but also across the globe.
Appointments
Justice Sanjay Karol sworn in as Chief Justice of Patna High Court :
- Justice Sanjay Karol was sworn in as the Chief Justice of Patna High Court.
- Bihar Governor Phagu Chauhan administered the oath of office to Justice Karol at the Raj Bhavan.
- He was earlier posted as Chief Justice of Tripura before this appointment.
Art and Culture
గురు నానక్ జయంతి – 12 November 2019
- సిక్కుల మత గురువు గురు నానక్ పుట్టినరోజు కార్తీక పౌర్ణమి. మామూలుగానే విశిష్ట దినంగా భావించే కార్తీక పౌర్ణమి గురు నానక్ జన్మదినం కూడా కావడాన ఈరోజు పంజాబీలకి మహా పర్వదినం.
- గురు నానక్ జయంతిని పంజాబీలు ''గురుపూరబ్'' అంటారు. గురు నానక్ జయంతిని భారత ప్రభుత్వం సెలవుదినంగా ప్రకటించింది.
- 1469లో ప్రస్తుత పాకిస్తాన్ లోని లాహోర్ సమీపంలో ఉన్న నన్కానా సాహిబ్ లో గురు నానక్ జన్మించారు. ఆయన పుట్టింది ముస్లిం కుటుంబంలో. నానక్ హిందూ, ఇస్లామిక్ మత గ్రంధాలను అధ్యయనం చేశారు.
- అయితే, ఈ రెండు మతాలకు భిన్నమైన సిక్కు మతాన్ని స్థాపించి ఆరాధ్య గురువయ్యారు. మొత్తం పదిమంది సిక్కు మత గురువులలో గురు నానక్ తొలి గురువు. లాహోర్లో గురు నానక్ పుట్టిన పవిత్ర ప్రదేశం ''గురుద్వారా జనం ఆస్థాన్'' అయింది.
- గురు నానక్ ఏప్రిల్ 15న పుట్టారని చెప్పేవారూ ఉన్నారు. కానీ కార్తీక పౌర్ణమినే నానక్ జన్మదినంగా నమ్మి వేడుక చేసుకేనేవారే అత్యధికశాతం ఉన్నారు. కేవలం పంజాబీలు మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అనేకమంది గురు నానక్ ను ఆరాధిస్తూ ''గురుపూరబ్''ను పండుగ చేసుకుంటున్నారు.
- సిక్కులు ఏకేశ్వరోపాసన చేస్తారు. ఓంకారాన్ని ఏకైక దేవునిగా పూజిస్తారు. గురు నానక్ జయంతి సందర్భంగా గురుద్వారాల్లో సిక్కులు పవిత్ర మత గ్రంధంగా భావించే ''గురు గ్రంధ సాహిబ్'' ను 48 గంటల పాటు నిరంతరంగా పఠిస్తారు. ఇలా చదవడాన్ని ''అఖండ పఠనం'' అంటారు.
- ఈ గురు గ్రంధ సాహిబ్ అఖండ పఠనం నానక్ జయంతి కంటే ముందురోజు ముగుస్తుంది. ఇక జయంతి నాడు ఉదయానే ''ప్రభాత్ ఫేరిస్'' పేరుతో ఊరేగింపు జరుపుతారు. ఈ ఊరేగింపు గురుద్వారా వద్ద మొదలై వాడవాడకూ వెళ్తుంది.
- ''నిషాన్ సాహిబ్'' అనే సిక్కు జండాలను పట్టుకుని ఊరేగింపు జరుపుతారు. ''గురు గ్రంథ సాహిబ్''ను పల్కీలో చుట్టి పూలతో అలంకరిస్తారు. భక్తులు సింగ్ షాబాద్ తదితర భక్తి గీతాలు ఆలపిస్తూ నడుస్తారు. వాయిద్యకారులు అందుకు అనుగుణంగా వాయిద్యం అందిస్తారు. కథా కాలక్షేపం ముగిసిన తర్వాత భక్తులకు ప్రత్యేక భోజనం ఏర్పాటు చేస్తారు.
సినిమా వార్తలు
తానాజీ మలుసరే జీవితకథతో అజయ్ దేవగణ్ వందో చిత్రం ‘తానాజీ: ది అన్‌సంగ్ వారియర్’ :
- అజయ్ దేవగణ్ కథానాయకుడిగా నటిస్తున్న వందో చిత్రం ‘తానాజీ: ది అన్‌సంగ్ వారియర్’. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ విజయాల్లో కీలక భూమిక పోషించిన ఆయన సేనాధిపతి తానాజీ మలుసరే జీవితకథతో ఈ చిత్రం తెరకెక్కుతోంది.
- తానాజీగా అజయ్ నటిస్తున్నారు. తానాజీతో సిన్హాఘడ్ యుద్ధంలో తలపడిన ఉదయభన్ రాథోడ్‌గా సైఫ్ అలీఖాన్ ప్రతినాయక పాత్రలో కనిపిస్తారు. తానాజీ భార్య సావిత్రి మలుసరేగా అజయ్ జీవిత భాగస్వామి కాజోల్ నటిస్తోంది. ఓం రావత్ తెరకెక్కిస్తున్నారు.
‘83’ చిత్రంతో వెండితెరపై రణ్‌వీర్ సింగ్ :
- 1983లో మనదేశం క్రికెట్లో తొలిసారి ప్రపంచకప్ సాధించిన గొప్ప విజయాన్ని ‘83’ చిత్రంతో వెండితెరపై చూపిస్తున్నారు దర్శకుడు కబీర్‌ఖాన్.
- కపిల్‌దేవ్ పాత్రలో రణ్‌వీర్ సింగ్ నటిస్తున్నారు. కపిల్ భార్య రోమీ పాత్రలో దీపికా పదుకొణె నటిస్తోంది.
ముఖ్యమైన రోజులు
World Pneumonia Day (ప్రపంచ న్యుమోనియా దినం) : 12 November
- Theme 2019 : "Healthy lungs for all"
- The day established in 2009, World Pneumonia Day is marked every year on November 12th to : Raise awareness about pneumonia, the world’s leading infectious killer of children under the age of 5.
- And also to Promote interventions to protect against, prevent, and treat pneumonia and highlight proven approaches and solutions in need of additional resources and attention.
- To Generate action, including continued donor investment, to combat pneumonia and other common, yet sometimes deadly, childhood diseases.
- It is the world's leading infectious disease due to which children below 5 years are much more affected.
- This year the theme for World Pneumonia Day is "healthy lungs for all" to raise awareness, promote prevention and treatment and produce action to combat the disease.
Public Service Broadcasting Day – 12 November
- Public Service Broadcasting Day celebrated on 12th November. The day is celebrated every year to commemorate the first and last visit of the Father of the Nation, Mahatma Gandhi to the studio of All India Radio, Delhi in 1947.
- The Father of the Nation addressed the displaced people, who had temporarily settled at Kurukshetra in Haryana after partition.
- A function will also be organized at the premises of All India Radio in New Delhi to mark the occasion.
సలీం అలీ జననం : నవంబర్ 12, 1896
- సలీం మొయిజుద్దీన్ అబ్దుల్ అలీ (నవంబర్ 12, 1896 - జూన్ 20, 1987) విఖ్యాత పక్షిశాస్త్రవేత్త, పద్మవిభూషణుడు, రాజ్యసభ సభ్యుడు. సలీం అలీ "Birdman of India" అని పిలువబడ్డాడు.
- భారతదేశంలో పక్షి శాస్త్రం (ornithology) గురించిన అవగాహన, అధ్యయనం పెంపొందించడానికి సలీం ఆలీ అనితరమైన కృషి చేసి గుర్తింపు పొందాడు.
- బొంబాయి నేచురల్ హిస్టరీ సొసైటీ (Bombay Natural History Society - BNHS) సెక్రటరీ వాల్టర్ శామ్యూల్ మిల్లార్డ్ సలీం ఆలీకి పక్షుల అధ్యయనం పట్ల ఆసక్తి కలగడానికి మొదటి స్ఫూర్తి.
- జర్మనీలో బెర్లిన్ విశ్వవిద్యాలయం జూలాజికల్ మ్యూజియంలో పక్షుల అధ్యయనాన్ని గురించి మరింత నేర్చుకొన్నాడు. హైదరాబాదు, కొచ్చిన్, గ్వాలియర్, తిరువాన్కూర్, ఇండోర్, భోపాల్ వంటి స్థానిక సంస్థానాధీశుల సహాయంతో ఆయా సంస్థానాలలో ఉన్న పక్షుల గురించి, వాటి సహజసిద్ధ నివాసస్థలాల గురించి వివరంగా అధ్యయనం సాగించాడు.
- 200 సంవత్సరాల చరిత్ర గలిగిన బొంబాయి నేచురల్ హిస్టరీ సొసైటీ మూతపడకుండా కొనసాగడానికి సలీం ఆలీ ఎంతో ప్రయత్నించాడు. అప్పటి ప్రధాని నెహ్రూ కు వ్రాసి ధన సహాయం పొందగలిగాడు.
- భరత్‌పూర్ పక్షి సంరక్షణ వనం, (Bharatpur Bird Sanctuary) సైలెంట్ వాలీ నేషనల్ పార్కు (Silent Valley National Park) పరిరక్షణ కోసం ఆలీ ఎంతో కృషి చేశాడు. 1990 లో కోయంబత్తూరు వద్ద అనైకట్టిలో Salim Ali Centre for Ornithology & Natural History (SACON) ప్రారంభమైంది. ఇది భారత ప్రభుత్వం పర్యావరణ, వన విభాగాల అధ్వర్యంలో నడుస్తుంది.
- అవార్డులు : పద్మభూషణ్ పురస్కారం (1958), పద్మ విభూషణ్ పురస్కారం (1976)
- 1958లో ఇతను నేషనల్ సైన్సు అకాడమీ ఫెలోగా ఎన్నికయ్యాడు. ఇతనికి మూడు గౌరవ డాక్టరేట్లు లభించాయి. 1985లో రాజ్య సభకు నామినేట్ అయ్యాడు.1987లో, తన 91వ యేట, ప్రోస్టేట్ క్యాన్సర్ వ్యాధితో సలీం ఆలీ మరణించాడు.
- Book : The Book of Indian Birds
మదన్ మోహన్ మాలవ్యా 73వ వర్ధంతి: నవంబరు 12, 1946
- మదన్ మోహన్ మాలవ్యా (డిసెంబర్ 25, 1861 - నవంబరు 12, 1946) భారతీయ విద్యావేత్త మరియు రాజకీయవేత్త. భారతీయ స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్న సమరయోధుడు. ఆయన గౌరవంగా "పండిట్ మదన్ మోహన్ మాలవీయ"గా కూడా పిలువబడుతున్నారు.
- ఆయన "మహాత్మా"గా కూడా గౌవరింపబడ్డాడు. మాలవ్యా బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం వ్యవస్థాపకుడు. ఈయన వారణాసిలో ఈ విశ్వవిద్యాలయాన్ని 1915లో స్థాపించాడు. ఇది ఆసియాలోనే అతిపెద్ద రెసిడెన్షియల్ విశ్వవిద్యాలయం మరియు ప్రపంచంలోనే పెద్ద విశ్వవిద్యాలయం. మాలవ్యా ఆ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ గా 1919 నుండి 1938 వరకు పనిచేశారు.
- మాలవ్యా భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షునిగా నాలుగు సార్లు (1909 & 1913,1919,1932) పనిచేశారు. ఆయన 1934లో కాంగ్రెస్ ను విడిచిపెట్టారు. ఆయన హిందూ మహాసభలో ముఖ్యమైన నాయకునిగా కూడా ఉన్నారు.
- మాలవ్యా "భారతీయ స్కౌట్స్ మరియు గైడ్సు"కు ఒక వ్యవస్థాపకుడు. ఆయన 1909లో అలహాబాదు నుండి వెలువడుతున్న ఆంగ్ల పత్రిక లీడర్ పత్రికను స్థాపించారు. ఆయన 1924 నుండి 1946 వరకు హిందూస్థాన్ టైమ్స్ చైర్మన్ గా ఉన్నారు. ఆయన సేవలు 1936 లో హిందీ ఎడిషన్ ప్రారంభానికి ఉపయోగపడ్డాయి.
- మాలవ్యా భారతదేశంలోని ప్రతిష్ఠాత్మక అవార్డు అయిన భారతరత్నకు డిసెంబర్ 24,2014 న ఎంపికైనారు. ఈ అవార్డును ఆయన 125 వ జన్మదినం ముందుగా పొందారు.
- మాలవ్య 1861, డిసెంబర్ 25న అలహాబాదులో ఒక నిష్టులైన హిందూ కుటుంబములో జన్మించారు. 1931లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మహాత్మా గాంధీతో కలిసి కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం వహించాడు. 1922-23 లో హిందు మహాసభ అధ్యక్షుడుగా చేశారు
- "సత్యమేవ జయతే" అనే నినాదాన్ని వ్యాపింపచేసాడు. అతడు గొప్ప విద్యావేత్త, కర్మయోగి, భగవద్గీతను పాటించెను. సమకాలిక నాయకుల వలే కులమత భేదములను పోగొట్టడానికి ప్రయత్నించాడు.
- దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న అవార్డును కేంద్ర ప్రభుత్వం మదన్ మోహన్ మాలవ్యాకు 2014లో ప్రకటించింది. ఈయనతోపాటు భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు వాజ్‌పేయీకి భారతరత్న ప్రకటించింది.
China 1st President సన్ యత్-సేన్ జననం : 12 నవంబరు 1866
- సన్ యత్-సేన్ (12 నవంబరు 1866 – 12 మార్చి 1925) చైనీస్ వైద్యుడు, విప్లవకారుడు, చైనా తొలి అధ్యక్షుడు, రిపబ్లిక్ ఆఫ్ చైనాకు జాతినిర్మాత.
- రిపబ్లిక్ ఆఫ్ చైనాకు అందరికన్నా తొలి మార్గదర్శిగా, రిపబ్లిక్ ఆఫ్ చైనా, హాంగ్ కాంగ్, మకావులకు జాతిపితగా, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాకు ప్రజాస్వామ్య విప్లవంలో ముందు వ్యక్తిగా వ్యవహరిస్తారు.
- జిన్హాయ్ విప్లవాన్ని నడిపించి క్వింగ్ రాజవంశాన్ని కూలదోయడంలో ప్రధాన వ్యక్తిగా నిలుస్తారు. 1912లో స్థాపించబడినప్పుడు అతను రిపబ్లిక్ ఆఫ్ చైనా యొక్క తాత్కాలిక అధ్యక్షుడిగా పనిచేయడానికి నియమించబడ్డాడు. తరువాత అతను కుమింటాంగ్ (KMT) ను స్థాపించాడు, దాని మొదటి నాయకుడిగా పనిచేశాడు.
Pakistan 1st President ‘Iskander Ali’ Death : 12 November 1969
- Sahibzada Iskander Ali Mirza (13 November 1899 – 12 November 1969) was an East Pakistani bureaucrat and Pakistan army officer who served as the first President of Pakistan, elected in this capacity in 1956 until being dismissed by his appointed army commander General Ayub Khan in 1958.
- After the independence of Pakistan as result of the Partition of India, Mirza was appointed as first Defence Secretary by Prime Minister Liaquat Ali Khan, only to oversee the military efforts in first war with India in 1947, followed by failed secessionism in Balochistan in 1948.
- In 1954, he was appointed as Governor of his home province of East Bengal by Prime Minister Mohammad Ali of Bogra to control the law and order sparked as a result of the popular language movement in 1952, but later elevated as Interior Minister in Bogra administration in 1955.
క్రీడలు
సుందర్ సింగ్‌కు స్వర్ణం @ప్రపంచ పారా అథ్లెటిక్స్
- ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత అథ్లెట్ సుందర్ సింగ్ గుర్జార్ సత్తాచాటాడు. పురుషుల ఎఫ్46 జావెలిన్ త్రో టైటిల్‌ను నిలబెట్టుకున్న అతను టోక్యో 2020 పారాలింపిక్స్ బెర్త్‌నూ సాధించాడు.
- 23 ఏళ్ల సుందర్ గత ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్ (2017)లోనూ స్వర్ణం గెలిచాడు.
- దేవేంద్ర ఝజారియా (2013 స్వర్ణం, 2015 రజతం) తర్వాత ప్రపంచ పారా ఛాంపియన్షిప్స్లో రెండు పతకాలు గెలిచిన భారత అథ్లెట్‌గా సుందర్ రికార్డు సృష్టించాడు.
No comments:
Post a Comment