Tuesday, 5 November 2019

31th october 2019 current affairs

కరెంట్ అఫైర్స్ 31 అక్టోబరు 2019 Thu జాతీయ వార్తలు జమ్మూ-కశ్మీర్.. లద్దాఖ్.. కేంద్రపాలిత ప్రాంతాలుగా విడిపోయిన రాష్ట్రం. అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చిన చరిత్రాత్మక నిర్ణయం : ఒకే రాష్ట్రంగా ఉన్న జమ్మూ-కశ్మీర్ భౌగోళిక పటం రూపురేఖలు మారిపోయాయి. అర్ధరాత్రి (October 31st 12am) నుంచి జమ్మూ-కశ్మీర్, లద్దాఖ్ అనే రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడిపోయింది. దీర్ఘకాలంగా ఉగ్రవాద బీభత్సంతో నలిగిపోయిన జమ్మూ-కశ్మీర్లో పరిస్థితులు చక్కదిద్దే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మోదీ సర్కారు తెలిపింది. 370 అధికరణం వల్ల జమ్మూ-కశ్మీర్కు స్వీయ రాజ్యాంగం ఉండేది. ఇతర రాష్ట్రాలవారు అక్కడ భూములు, ఆస్తులు కొనకూడదు. ఈ అధికరణాన్ని రద్దు చేయడం వల్ల ఈ నిబంధనలన్నీ చెల్లుబాటు కావని ప్రభుత్వం తెలిపింది. ఒక రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చడం ఇదే మొదటిసారి. ఇప్పటివరకూ ఒక కేంద్ర పాలిత ప్రాంతాన్ని రాష్ట్రంగా మార్చడం లేదా ఒక రాష్ట్రాన్ని రెండు రాష్ట్రాలుగా విడగొట్టడం వంటివే జరిగాయి. సాధారణ పరిస్థితులు నెలకొన్నాక సరైన సమయంలో జమ్మూ-కశ్మీర్కు రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని కేంద్రం వివరించింది. అక్టోబర్ 31ని అపాయింటెండ్ రోజుగా జమ్మూ-కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2019 పేర్కొంది. దీంతో ఈ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు బుధవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయని వివరించింది. భారత్లో 560కుపైగా సంస్థానాలను విలీనం చేసిన ఘనతను దక్కించుకున్న దేశ తొలి హోం మంత్రి సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ జయంతి రోజునే ఈ కీలక నిర్ణయాలు అమల్లోకి రావడం విశేషం. నేడు ఎల్జీల ప్రమాణ స్వీకారం : జమ్మూ-కశ్మీర్కు గిరిశ్ చంద్ర ముర్మును, లద్దాఖ్కు ఆర్.కె.మాథుర్ను లెఫ్టినెంట్ గవర్నర్లు (L.G)గా కేంద్రం ఇప్పటికే నియమించింది. శ్రీనగర్, లేహ్లో వేరువేరుగా జరిగే కార్యక్రమాల్లో వీరి చేత జమ్మూ-కశ్మీర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గీతా మిత్తల్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం జమ్మూ-కశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతానికి పుదుచ్చేరి తరహాలో శాసనసభ ఉంటుంది. లద్దాఖ్కు శాసన వ్యవస్థ ఉండదు. రెండు ప్రాంతాలకూ లెఫ్టినెంట్ గవర్నర్లు నాయకత్వం వహిస్తారు. ఎల్జీ ద్వారా లద్దాఖ్ కేంద్రం ప్రత్యక్ష నియంత్రణలో ఉంటుంది. జమ్మూ-కశ్మీర్ క్యాడర్లోని ఐఏఎస్, ఐపీఎస్ వంటి అఖిలభారత సర్వీసు అధికారులు కొత్తగా ఏర్పడ్డ రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో సేవలను కొనసాగిస్తారు. కొత్త అధికారులను మాత్రం అరుణాచల్, గోవా, మిజోరాం కేంద్ర పాలిత ప్రాంత (ఏజీఎంయూటీ) క్యాడర్ నుంచి కేటాయించనున్నారు. జమ్మూ-కశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంలో అఖిలభారత సర్వీసు అధికారులతోపాటు అవినీతి నిరోధక శాఖ సిబ్బంది కూడా లెఫ్టినెంట్ గవర్నర్ అధీనంలో ఉంటారు. అక్కడ ఎన్నికైన ప్రభుత్వాలకు వీరిపై ఎలాంటి అజమాయిషీ ఉండదు. రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల వార్తలు కాంట్రాక్టు వ్యవసాయానికి కేంద్రం ఆమోదముద్ర. తమిళనాడు చట్టానికి అంగీకారం : i. రైతుల ఆదాయం వృద్ధి చేసే దిశగా దేశంలోనే తొలిసారిగా తమిళనాడు ప్రభుత్వం రూపొందించిన చట్టానికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు. ii. దీంతో దేశంలోనే తొలిసారిగా కాంట్రాక్టు వ్యవసాయంపై చట్టాన్ని రూపొందించి అమలు చేస్తున్న రాష్ట్రంగా తమిళనాడు నిలిచింది. రాష్ట్ర వ్యవసాయ ఉత్పత్తులు, పశుసంవర్ధక ఒప్పంద సేవా సదుపాయాల చట్టం పేరుతో ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టింది. iii. పంట దిగుబడి అధికంగా ఉన్న సమయంలో, మార్కెట్ ధరల హెచ్చుతగ్గుల వేళ రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు ఈ చట్టం ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అలాంటి పరిణామాలు ఎదురైనపుడు ముందుగా కొనుగోలుదారులతో ఒప్పందం కుదుర్చుకున్న ప్రకారం ధర చెల్లించడానికి వీలు కలుగుతుందని పేర్కొంది. iv. ఈ ఒప్పందాలను ఉన్నతాధికారుల సమక్షంలో కుదుర్చుకొనే విధంగా, తప్పకుండా వాటి వివరాలను నమోదు చేసుకునేలా చట్టంలో పొందుపరిచారు. కాంట్రాక్టు వ్యవసాయం చట్టం సక్రమంగా అమలయ్యేందుకు, పనితీరు మెరుగ్గా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేయడానికి ప్రభుత్వం తమిళనాడు రాష్ట్ర కాంట్రాక్ట్ ఫార్మింగ్ అండ్ సర్వీసెస్ అథారిటీ పేరుతో ఆరుగురు సభ్యుల సంఘాన్ని కూడా ఏర్పాటు చేసింది. Odisha govt inks LoU for ‘drink from tap mission’ with UNICEF : i. Odisha has inked a Letter of Understanding (LoU) on “drink from tap mission” with the United Nations Children’s Fund (UNICEF). ii. The main objective of the mission is to provide piped quality drinking water supply to each household on a 24-hour basis. UNICEF will provide technical cooperation to the government of Odisha. iii. The community-based water management system will be adopted at ward-level and in the first phase 1.20 lakh people will be the beneficiaries. అంతర్జాతీయ వార్తలు బ్రిటన్లో మళ్లీ ఎన్నికలు. డిసెంబరు 12న నిర్వహణ. బ్రెగ్జిట్పై ప్రజాభిప్రాయం దిశగా దిగువ సభ రద్దుకు ఎంపీల మద్దతు : i. బ్రిటన్లో మళ్లీ ఎన్నికల వేడి పుట్టింది. డిసెంబరు 12న పార్లమెంటులోని దిగువ సభ(హౌస్ ఆఫ్ కామన్స్)కు ఎన్నికలు జరగడం దాదాపు ఖాయమైపోయింది. ii. ఎన్నికలకు వెళ్లడం ద్వారా ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్ విడిపోయే (బ్రెగ్జిట్) విషయమై ప్రజాభిప్రాయం సేకరిద్దామంటూ... ప్రధాని బోరిస్ జాన్సన్ చేసిన ప్రతిపాదనకు ప్రధాన విపక్షం లేబర్ పార్టీ అంగీకరించింది. iii. స్కాటిష్ నేషనల్ పార్టీ, లిబరల్ డెమోక్రాట్లు కూడా మద్దతు తెలపడంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. iv. నిజానికి బోరిస్ సర్కారుకు మే, 2022 వరకూ గడువుంది. కానీ... బ్రెగ్జిట్ విషయమై పార్లమెంటులో ప్రతిష్టంభన నెలకొనడంతో తీవ్ర రాజకీయ సంక్షోభం తలెత్తింది. v. దీంతో జాన్సన్ మూడోసారి దిగువ సభ రద్దుకు ప్రతిపాదించారు. దీనిపై ఆ సభలో జరిగిన ఓటింగ్లో మొత్తం 438 మంది చట్టసభ్యులు అనుకూలంగా ఓటు వేశారు. vi. డిసెంబరు 12న ఎన్నికలు నిర్వహించేందుకూ అంగీకారం తెలిపారు. దిగువ సభ చేసిన ‘ఎన్నికల రద్దు తీర్మానం’ ఎగువ సభలో ఆమోదం పొందడం ఇక లాంఛనప్రాయమే. పాక్లో గురునానక్ స్మారక నాణెం విడుదల : i. సిక్కు మత స్థాపకుడు గురునానక్ దేవ్ 550వ జయంతి (నవంబరు-12) నేపథ్యంలో పాకిస్థాన్ రూ.50 ముఖ విలువ గల స్మారక నాణేన్ని విడుదల చేసింది. ii. పంజాబ్లోని గురుదాస్పుర్ నుంచి పాకిస్థాన్లోని కర్తార్పుర్లో ఉన్న గురు ద్వారాను కలిపే కర్తార్పుర్ నడవాను నవంబర్ 9న ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. సదస్సులు Ahead of summit, Indian stand on RCEP unclear. Won’t sign just to meet deadline, says Goyal : i. India will not sign a free trade agreement (FTA) just because there is a deadline, Union Commerce Minister Piyush Goyal said. ii. The comments come just days ahead of the Regional Comprehensive Economic Partnership (RCEP) summit meeting, which is expected to conclude the 16-nation FTA. iii. Prime Minister Narendra Modi will attend the RCEP summit in Bangkok on November 4, and Mr. Goyal could also travel there on November 2 for the last RCEP ministerial round before the summit. But the government has kept all countries guessing on whether India will actually join the agreement. iv. The two conflicting statements from the Commerce Minister have enhanced the confusion over what India’s stand will be when Mr. Modi travels to Thailand on November 2 for a three-day visit, culminating in the RCEP summit. At the 2018 RCEP summit, Mr. Modi committed, along with other RCEP leaders, to conclude the agreement this year. v. According to diplomats from at least four RCEP countries, every country but India is now on board. India has been hesitant to commit to RCEP over apprehensions among local industry and trade unions and agricultural bodies that signing the FTA would lead to lowering of subsidies, and giving market access to China that will overrun local manufacturing. Chile pulls out from hosting climate and trade summits : i. President Sebastián Piñera of Chile said that his country, which has been rocked by a wave of recent protests, was not in a position to host a key UN climate change meeting and major Asia-Pacific trade summit later this year. ii. In a speech at the presidential palace, Mr. Piñera cited the “difficult circumstances that our country has experienced” to explain why Chile would not be able to host the events. iii. Cancelling the climate meeting, which had been scheduled for December, leaves organisers with a very tight window to find a new venue. Chile stepped up to host the Climate Change Conference after the initial host, Brazil, pulled out last year. Brazil’s decision came soon after the election of President Jair Bolsonaro. Appointments Birender Singh Yadav to be next Ambassador of India to the Republic of Iraq : i. రిపబ్లిక్ ఆఫ్ ఇరాక్ భారత తదుపరి రాయబారిగా బిరేందర్ సింగ్ యాదవ్ నియమితులయ్యారు. ii. 1997 బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి బిరేందర్ సింగ్, ప్రదీప్ సింగ్ రాజ్పురోహిత్ స్థానంలో రాయబారిగా నియమితులయ్యారు. Recent appointments by President : S. No. State/UT Governor Predecessor 1. J&K Girish Chandra Murmu Satya Pal Malik 2. Ladakh Radha Krishna Mathur Satya Pal Malik 3. Mizoram P S Sreedharan Pillai Jagdish Mukhi 4. Goa Satya Pal Malik Mridula Sinha Persons in news పర్యావరణ అవార్డును తిరస్కరించిన గ్రెటా థెన్బెర్గ్ : i. వాతావరణ మార్పులపై ఉద్యమించి ప్రపంచ దృష్టిని ఆకర్షించిన 16 ఏళ్ల గ్రెటాథెన్బెర్గ్ తనకు లభించిన పర్యావరణ అవార్డును తిరస్కరించారు. ii. ప్రతిష్ఠాత్మక ‘నోర్డిక్ కౌన్సిల్’ అవార్డును సున్నితంగా నిరాకరిస్తూ...పర్యావరణ ఉద్యమానికి మరిన్ని బహుమతులేమీ అవసరం లేదన్నారు. సినిమా వార్తలు లాల్టెన్ పేరుతో తెరపైకి ‘లాలూ’ జీవితం : i. ‘లాల్టెన్(లాంతరు)’ పేరుతో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ప్రముఖ భోజ్పురి నటుడు యశ్ కుమార్.. లాలూ పాత్రలో నటించనున్నారు. లాలూ సతీమణి రబ్రీదేవిగా స్మతి సిన్హా కన్పించనున్నారు. ii. లాలూ పార్టీ ఆర్జేడీ గుర్తు కూడా లాంతరే. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందు రానుందని తెలిపారు. iii. ఇప్పటికే ప్రధాని మోదీ జీవితం ఆధారంగా ‘పీఎం నరేంద్రమోదీ’, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జీవితకథతో ‘యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’, శివసేన వ్యవస్థాకుడు బాల్ఠాక్రే జీవితం ఆధారంగా ‘ఠాక్రే’ సినిమాలు తెరకెక్కిన విషయం తెలిసిందే. మరణాలు Former SC judge and Karnataka Lokayukta dead : i. విశ్రాంత లోకాయుక్త జస్టిస్ వెంకటాచల(90) కన్నుమూశారు. కోలారు జిల్లా మిట్టూరులో జన్మించిన జస్టిస్ నంజేగౌడ వెంకటాచల మైసూరు విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రంలో పట్టభద్రులయ్యారు. ii. 1992లో కర్ణాటక ఉన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. పదోన్నతిపై సర్వోన్నత న్యాయస్థానానికి వెళ్లారు. మూడేళ్లపాటు న్యాయమూర్తిగా సేవలందించి 1995లో పదవీ విరమణ చేశారు. iii. కర్ణాటక లోకాయుక్తగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ వెంకటాచల పేరే సంచలనం. అప్పటిదాకా రోజుకు 20వరకు కేసులు నమోదయ్యే లోకాయుక్తలో ఆయన రాకతో 200-250 నమోదయ్యేవంటే..ఆ సంస్థపై ఎంతటి నమ్మకం పెంచారో అర్థం చేసుకోవచ్చు. అక్రమాలర్కులకు ఆయన సింహస్వప్నంగా మారారు. ముఖ్యమైన రోజులు జాతీయ సమైక్యతా దినం (Rashtriya Ekta Diwas or National Unity Day) - అక్టోబరు 31 i. సంస్థానాల విలీనాన్ని సమర్థంగా పూర్తి చేసిన సర్దార్ వల్లబ్భాయ్ పటేల్ జన్మదినాన్ని (అక్టోబరు 31) ‘జాతీయ సమైక్యతా దినం’గా జరుపుకొంటున్నాం! నిబ్బరంగా నిర్ణయాలు తీసుకోవటం పటేల్ ప్రజ్ఞకు తార్కాణం. ii. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 31 న రాష్ట్ర ఏక్తా దివాస్ లేదా జాతీయ ఐక్యత దినోత్సవాన్ని జరుపుకుంటారు. దేశాన్ని ఏకం చేయడంలో ఆయన ఒక ముఖ్యమైన పాత్ర పోషించారు. iii. మన దేశం యొక్క ఐక్యత, సమగ్రత మరియు భద్రతను కాపాడటానికి మరియు బలోపేతం చేయడానికి అంకితభావాన్ని పెంపొందించడానికి మరియు బలోపేతం చేయడానికి భారత ప్రభుత్వం అక్టోబర్ 31 ను ప్రత్యేక రోజుగా జరుపుకుంటుంది. iv. రాష్ట్ర ఏక్తా దివాస్ (జాతీయ ఐక్య దినోత్సవం) ను 2014 లో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టింది. v. మన దేశ ఐక్యత, సమగ్రత మరియు భద్రతకు వాస్తవమైన మరియు సంభావ్యమైన బెదిరింపులను తట్టుకోవటానికి మన దేశం యొక్క స్వాభావిక బలాన్ని మరియు స్థితిస్థాపకతను పునరుద్ఘాటించడానికి జాతీయ ఐక్యత దినోత్సవం అవకాశం కల్పిస్తుందని భారత హోం మంత్రిత్వ శాఖ రాష్ట్రీయ ఏక్తా దివాస్ యొక్క అధికారిక ప్రకటనలో పేర్కొంది. సర్దార్ వల్లభ్ భాయి పటేల్ 144 వ జయంతి : 31 అక్టోబరు 1875 i. భారతదేశపు ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభ్ భాయి 1875, అక్టోబరు 31న గుజరాత్లోని నాడియార్లో జన్మించారు. ఇతను ప్రముఖ స్వాతంత్ర్య యోధుడిగానే కాకుండా స్వాతంత్ర్యానంతరం సంస్థానాలు భారతదేశములో విలీనం కావడానికి గట్టి కృషిచేసి సఫలుడై ప్రముఖుడిగా పేరుపొందారు. ii. హైదరాబాదు, జునాగఢ్ లాంటి సంస్థానాలు భారతదేశములో విలీనం చేసిన ఘనత ఇతనికే దక్కుతుంది. ఇంగ్లాండులో బారిష్టరు పట్టా పుచ్చుకొని స్వదేశానికి తిరిగివచ్చి దేశంలో జరుగుతున్న జాతీయోద్యమానికి ఆకర్షితుడై బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా మహాత్మాగాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న స్వాతంత్ర్యోద్యమంలో పాలుపంచుకున్నాడు. iii. బార్దోలిలో జరిగిన సత్యాగ్రహానికి నాయకత్వం వహించి విజయవంతం చేయడమే కాకుండా తాను దేశప్రజల దృష్టిని ఆకర్షించాడు. బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా స్వాతంత్ర్య ఉద్యమంలోనే కాకుండా దేశప్రజల సంక్షేమం కోసం అనేక సాంఘిక ఉద్యమాలను చేపట్టాడు. iv. 1931లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ మహాసభకు అధ్యక్షత వహించాడు. భారత రాజ్యాంగం రచనలో ప్రముఖ పాత్ర వహించాడు. రాజ్యాంగ రచనలో అతిముఖ్యమైన ప్రాథమిక హక్కుల కమిటీకి చైర్మెన్గా వ్యవహరించాడు. v. స్వాతంత్ర్యానంతరం జవహార్ లాల్ నెహ్రూ నేతృత్వంలోని కేంద్రమంత్రిమండలిలో హోంశాఖ మంత్రి గానూ, ఉప ప్రధానమంత్రి గానూ బాధ్యతలను నిర్వహించాడు. దేశవిభజన అనంతరం అనేక ప్రాంతాలలో జరిగిన అల్లర్లను చాకచక్యంతో అణచివేశాడు. vi. నెహ్రూ మంత్రిమండలిలో ఉన్ననూ అనేక విషయాలలో నెహ్రూతో విభేదించాడు. నెహ్రూ శాంతికాముకతను కాదని అనేక పర్యాయాలు బలప్రయోగం చేపట్టి సఫలుడైనాడు. కేవలం 40 మాసాలు మాత్రమే పదవిలో ఉన్ననూ అనేక దేశ సమస్యలను తనదైన పద్ధతితో పరిష్కరించి 1950 డిసెంబరు 15న మరణించాడు. vii. మరణించిన 4 దశాబ్దాల అనంతరం 1991లో భారత ప్రభుత్వం భారతరత్న బిరుదాన్ని ఇచ్చి గౌరవించింది. viii. 1931 కరాచి భారత జాతీయ కాంగ్రెస్ సదస్సుకు అధ్యక్షుడిగా ఎన్నికైనాడు. ఉప్పు సత్యాగ్రహం, 1942 నాటి క్విట్ ఇండియా ఉద్యమం మొదలగు ఉద్యమాలలో కూడా ప్రముఖ పాత్ర వహించాడు. ix. భారత రాజ్యాంగ రచనకై ఏర్పడిన భారత రాజ్యాంగ సభలో సీనియర్ సభ్యుడిగా వల్లబ్ భాయి పటేల్ మంచి సహకారాన్ని అందించాడు. అంబేద్కర్ను డ్రాప్టింగ్ కమిటీ అధ్యక్షుడిగా నియమించుటలో ముఖ్య పాత్ర పోషించాడు. భారత రాజ్యాంగ సభలో ప్రాథమిక హక్కుల కమిటీకి చైర్మెన్ గా పనిచేశాడు. భారత పార్లమెంటులో రాష్ట్రపతి ఆంగ్లో ఇండియన్ లకు నామినేట్ చేయు అధికారానికి కూడా అతనే ప్రతిపాదించాడు. x. జవహర్ లాల్ నెహ్రూ మంత్రిమండలిలో హోంమంత్రిగాను మరియు ఉప ప్రధాన మంత్రిగాను 1947 నుంచి 1950 డిసెంబరు 15న మరణించేవరకు పదవులు నిర్వహించారు. xi. 1936 భారతీయ జాతీయ కాంగ్రెస్ సదస్సులో నెహ్రూ ప్రవచించిన సోషలిజాన్ని వల్లబ్ భాయి పటేల్ వ్యతిరేకించారు. కాశ్మీర్ అంశాన్ని ఐక్య రాజ్య సమితికి నివేదించడంలో నెహ్రూతో విభేదించారు. పాకిస్తాన్ కు చెల్లించవలసిన రూ.55 కోట్లు ఇవ్వరాదని కూడా వల్లబ్ భాయి పటేల్ నెహ్రూతో వాదించారు. xii. తొలి రాష్ట్రపతి ఎన్నికలలో కూడా చక్రవర్తి రాజగోపాలచారి వైపు నెహ్రూ మొగ్గు చూపగా, వల్లబ్ భాయి పటేల్ రాజేంద్ర ప్రసాద్ ను ప్రతిపాదించి సఫలీకృతుడైనారు. అలాగే 1950 కాంగ్రెస్ సమావేశంలో నెహ్రూ అభ్యర్థి కృపలానీని కాదని పురుషోత్తమ దాస్ టాండన్ ను గెలిపించారు. xiii. భారత ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని అక్టోబర్ 31న ఆవిష్కరించనున్నారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన విగ్రహం ఇది. దీని ఎత్తు 182 మీటర్లు. ఈ విగ్రహాన్ని ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ (ఐక్యతా ప్రతిమ) అని పిలుస్తున్నారు. xiv. గుజరాత్లోని నర్మదా నదీ తీరంలోని సాధు బెట్ అనే చిన్న దీవిలో దీన్ని నిర్మించారు. ‘సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ ఇంటిగ్రేషన్ ట్రస్ట్’ ఈ స్టాట్యూ ఆఫ్ యూనిటీ ప్రాజెక్టును చేపట్టింది. xv. ఈ విగ్రహన్ని, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు, 31 అక్టోబరు 2018 న అత్యంత ఘనం గా ఆవిష్కరించారు. ఇందిరా గాంధీ 35వ వర్ధంతి : అక్టోబర్ 31, 1984 i. ఇందిరా ప్రియదర్శిని గాంధీ (నవంబర్ 19, 1917 – అక్టోబర్ 31, 1984) భారతదేశపు మొట్టమొదటి మరియు ఏకైక మహిళా ప్రధానమంత్రి. ఆమె 1966 నుండి 1977 వరకు వరుసగా 3 పర్యాయాలు మరియు 1980లో 4వ పర్యాయం ప్రధానమంత్రిగా పనిచేసింది. ii. ఆమె భారత తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ ఏకైక కుమార్తె. జవహర్ లాల్ నెహ్రుకి మొదటి సారి ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు ప్రధానమంత్రికి సెకట్రరీగా జీతం లేకుండా పనిచేసింది. 1964 సంవత్సరములో తండ్రి మరణం తరువాత రాజ్యసభకు ఎన్నిక అయింది. లాల్ బహదుర్ శాస్త్రి మంత్రి మండలిలో ప్రసారశాఖ మంత్రిగా పనిచేసింది. iii. ఇందిరా ప్రియదర్శిని 1917, నవంబర్ 19 తేదీన జవహర్ లాల్ నెహ్రూ, కమలా నెహ్రూ ల ఏకైక సంతానంగా అలహాబాదులోని ఆనంద్ భవన్ లో జన్మించింది. ఆమ మోతీలాల్ నెహ్రూకు మనుమరాలు. iv. స్వాతంత్ర్యం సంపాదించడంకోసం లండనులో స్థాపించబడిన ఇండియాలీగ్ లో 1930 లో చేరింది. కాంగ్రెస్ కార్యకర్తలు ఆమెను 1959 ఫిబ్రవరి 2 న భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎన్నుకున్నారు. v. ఆమె 1966 జనవరి 24న మొదటిసారిగా ప్రధానమంత్రి బాధ్యతలను స్వీకరించి దేశ మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించింది. నేటివరకు కూడా మరో మహిళ ఆ స్థానాన్నిచేపట్టలేదు. vi. ప్రధాన మంత్రి పదవికి జరిగిన పోటీలో ఇందిరా గాంధీ మొరార్జీ దేశాయ్ ను అప్పటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కుమారస్వామి కామరాజ్ మద్దతుతో సిండికేట్ సహాయంతో 355-169 ఓట్లతో ఓడించి దేశ 3వ ప్రధాన మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టింది. vii. సిక్కుల కోరిక మేరకు వారికి హర్యానా రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఏర్పాటుకు ఒప్పుకోని కొంతమంది తిరుగుబాటు చెయ్యగా దానిని ఆమె అణచివేసింది. viii. మొరార్జీ దేశాయ్ ను సంతృప్తి పర్చడానికి ఉప ప్రధానమంత్రి మరియు కీలకమైన ఆర్థిక మంత్రి పదవులను ప్రసాదించింది. అంతర్గత పోరాటాల ఫలితంగా 1967 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ దాదాపు 60 స్థానాలను కోల్పోవాల్సివచ్చింది. ix. రాజభరణాల రద్దు, 1966లో రూపాయి మూల్య న్యూనీకరణ, 1969లో బ్యాంకుల జాతీయీకరణ లాంటి నిర్ణయాలతోపాటు దేశంలో పంటల ఉత్పత్తిని పెంచడానికి హరిత విప్లవం, పేదరిక నిర్మూలన కై గరీబీ హటావో నినాదం, 20 సూత్రాల పథకము లాంటి ప్రజాకర్షక పథకాలు చేపట్టింది. x. 1971లో అమేథీ లోక్ సభ నియోజకవర్గంలో రాజ్ నారాయణ్ పై గెల్చిన ఇందిర ఎన్నిక చెల్లదని ఇందిరాగాంధీ విజయాన్ని సవాలు చేస్తూ రాజ్నారాయణ్ దాఖలు చేసిన పిటీషన్పై ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదని, తరువాత 6 సంవత్సరాల వరకు ఇందిరాగాంధీ ఎన్నికల కార్యక్రమాల్లో పాల్గొనరాదని అలహాబాదు హైకోర్టు 1975లో తీర్పు ఇచ్చింది. దీనిపై ఇందిరాగాంధీ స్టే ఆర్డర్ తెచ్చుకున్నది. xi. దేశంలో శాంతి భద్రతలు, శాంతిని స్థాపించడం కోసం తాను ఎంతటి కఠినమైన చర్యకైనా సిద్ధమని నిరూపిస్తూ ఇందిర దేశామంతటా ఎమర్జెన్సీ ప్రకటించేందుకు రంగం సిద్ధం చేసింది. అప్పటి అధ్యక్షుడు ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ రాజ్యాంగంలోని 352 వ ఆర్టికల్ ప్రకారం 1975 జూన్ 25న ఎమర్జన్సీ ప్రకటించింది. అదే రోజు ర్యాలీ నిర్వహించాలని ప్రతిపక్ష నాయకుల వ్యూహం. xii. అత్యవసర పరిస్థితి పరిణామం 1977 ఎన్నికలలో ఓటమి రూపంలో బయటపడింది. ఇందిరా గాంధీ సొంత నియోజకవర్గమైన రాయ్ బరేలీలో కూడా జనతా పార్టీకి చెందిన రాజ్ నారాయణ్ చేతిలో ఓడిపోయింది. xiii. ఆమె స్వయంగా ఆంధ్ర ప్రదేశ్ లోని మెదక్ లోక్సభ నియోజకవర్గం నుంచి మంచి ఆధిక్యతతో గెలుపొందింది. xiv. ఇందిరాగాంధీ అక్టోబరు 31 1984 న్యూఢిల్లీ లోని సఫ్దార్జంగ్ రోడ్డు లోని తన నివాసంలో హత్య గావించబడ్డారు. ఆమె తమ అంగరక్షకులయిన సత్వంత్సింగ్ మరియు బియాత్సింగ్ లచే హత్య గావింపబడ్డారు. ఈ హత్య అమృత్సర్ లోని స్వర్ణ దేవాలయంలో భారత సైన్యం జూన్ 1984 న జరిపిన ఆపరేషన్ బ్లూస్టార్కు ప్రతీకారంగా జరిగింది. xv. 1971లో భారత ప్రభుత్వపు అత్యున్నత అవార్డు భారత రత్నను స్వీకరించి ఈ పురస్కారాన్ని పొందిన మొట్టమొదటి మహిళగా స్థానం సంపాదించింది. ఇందిరా గాంధీ జీవితంలో ప్రధాన ఘట్టాలు : 1938 : భారత జాతీయ కాంగ్రేసులో ప్రవేశం 1955 : అఖిలభారత కాంగ్రెసుకి అధ్యక్షరాలుగా ఎన్నికైనది. 1966-01-24 : భారతప్రధానిగా ఎన్నికై అతిచిన్నవయసులో తొలి మహిళా ప్రధానిగా బాధ్యతలు చేపట్టింది. 1966 : రాజ్యసభ ద్వారా ప్రధానమంత్రి పదవి చేపటిన వ్యక్తులలో ఇందిరా గాంధీ మొట్టమొదటిది. 1966-1977 1980-1984 : జవహర్ లాల్ నెహ్రూ తర్వాత అత్యధిక కాలం పాటు ప్రధానమంత్రి పదవి చేపట్టి రెండో స్థానంలో నిల్చింది. 1967-03-13 : కాంగ్రెసుపార్టీ నాయకురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికై, ప్రధానిగా 2వసారి ప్రమాణస్వీకారం చేసింది. తన పాలనలో గోల్డ్ కంట్రోల్ ను ఎత్తివేసింది. 1969 : ఇందిరా కాంగ్రెస్ పార్టీ స్థాపన 1971 : 19 బ్యాంకులను జాతీయం చేసింది. 1971-03-18 : ఎన్నికల్లో గెలిపొంది, 3వసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసింది. 1971 : పాకిస్తాన్తో యుద్ధం జరగగా, ఓడించింది. 1971 : తూర్పు పాకిస్తాన్ను పాకిస్తాన్ నుండి విడదీసి బంగ్లాదేశ్ ను ఏర్పాటు చేసింది. 1971 : భారతరత్న పురస్కారాన్ని పొందిన మొట్టమొదటి మహిళ ఇందిరా గాంధీ. 1973 మే :సముద్రంలోని తైలనిక్షేపాలను వెలికితీసే సాగర్ సామ్రాట్ ని ఏర్పాటుచేసింది. - ఈమె హయంలో రాజస్థానలోని ఫోఖ్రాన్ వద్ద భూగర్బ అణుపేలుడు ప్రయోగం జరిపింది. 1975-04-19 : తొలిసారిగా కృత్రిమ ఉపగ్రహమైన ఆర్యభట్ట ప్రయోగం ఈమె హయంలో జరిగింది. - సిక్కులను భారతదేశంలో అంతర్భాగం చేసింది. రాజభరణాల రద్దు చేసింది. 1975-06-25 : దేశంలో అత్యవసరపరిస్థితి విధించింది. 1977 : ఎన్నికలలో ఓడిపోయిన మొట్టమొదట భారత ప్రధానమంత్రి ఇందిరా గాంధీ. 1980 : కొద్ది కాలం విరామం తర్వాత మళ్ళీ భారత ప్రధానమంత్రి పదవి చేపట్టిన వారిలో మొట్టమొదటి వ్యక్తి. - ఈమె హయంలో ఆలీనోద్యమం కొత్తరూపు సంతరించుకుంది. 1983లో కామన్వెల్త్ ప్రధానుల సభను నిర్వహించింది. - సిక్కుల పవిత్రదేవాలయం స్వర్ణమందిరాన్ని నివాసం చేసుకొని మారణకాండ సాగించిన ఉగ్రవాది బిందైన్ వాలా. బిందైన్ వాలాపై దాడికోసం స్వర్ణదేవాలయంలోకి సైన్యాన్ని పంపించి, ఆ దాడిలో అతడితోపాటు అతడి అనుచరులు మరణించారు. ఈ దాడియే ఆపరేషన్ బ్లూస్టార్ గా ప్రసిద్ధిగాంచింది. - ఈమె ఆర్థిక కార్యక్రమంపై 20సూత్రాలని కూడా అమలపరిచింది. 1983 : అలీన దేశాల సదస్సును ఢిల్లీలో నిర్వహించింది. 1984 : ఆపరేషన్ బ్లూ స్టార్ చర్యకు ఆదేశం 1984-10-31 : ఉదయం 9గంటల16నిమిషాలకి ఈమెను ఈమె అంగరక్షకులే కాల్చగా, స్వంతయింటిలోనే మరణించెను. హత్యకు గురైన మొట్టమొదటి భారత ప్రధానమంత్రి కూడా ఇందిరా గాంధీ. - ఈమె సమాధి నిర్మించిన ప్రదేశానికి శక్తిస్థల్ అని పేరుపెట్టారు. ది ఇయర్స్ ఆఫ్ ఛాలెంజ్ 1966-1969, ది ఇయర్స్ ఆఫ్ ఎన్డీవర్ 1969-1972, ఇండియా 1975 మొదలగు పుస్తకాలు రచించెను. - అంతరిక్షంలో ఉన్న వ్యోమగామితో మాట్లాడిన మొట్టమొదటి భారత ప్రధానమంత్రి ఇందిరా గాంధీ క్రీడలు టీ20 ప్రపంచకప్లో స్కాట్లాండ్, నమీబియా : i. వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్కు స్కాట్లాండ్, నమీబియా అర్హత సాధించాయి. టీ20 ప్రపంచకప్ క్వాలిఫయర్లో స్కాట్లాండ్ 90 పరుగుల తేడాతో యూఏఈని చిత్తు చేసింది. ii. మరో మ్యాచ్లో నమీబియా 54 పరుగుల తేడాతో ఒమన్పై విజయం సాధించింది. iii. పపువా న్యూగినియా, ఐర్లాండ్, నెదర్లాండ్స్ ఇప్పటికే 2020 ప్రపంచకప్కు అర్హత సాధించాయి. iv. ఈ క్వాలిఫయర్ టోర్నీ నుంచి మొత్తం ఆరు జట్లు ప్రపంచకప్కు వెళ్లాల్సివుంది. ఈ ఆరు జట్లు బంగ్లాదేశ్, శ్రీలంకలతో కలిసి ప్రపంచకప్ తొలి రౌండ్ ఆడతాయి. v. ఈ ఎనిమిది జట్లను రెండు గ్రూపులుగా విభజిస్తారు. ఒక్కో గ్రూపులో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు పాకిస్థాన్, భారత్, ఆస్ట్రేలియా న్యూజిలాండ్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, అఫ్గానిస్థాన్లతో కలిసి సూపర్-12లో ఆడతాయి. ఆసియా కప్ భారత మహిళలదే : i. వర్ధమాన మహిళల ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్లో భారత్ విజేతగా నిలిచింది. డక్వర్త్/లూయిస్ పద్ధతిలో ఫలితం తేలిన మ్యాచ్లో భారత అమ్మాయిలు ఆతిథ్య శ్రీలంకపై విజయం సాధించారు. Lewis Hamilton wins Mexico Grand Prix 2019 : i. Mercedes’ driver and 5-time world champion Lewis Hamilton clinched his 10th win of the season for Mercedes at the Mexican Grand Prix 2019. ii. Ferrari’s Sebastian Vettel, a German racing driver, and Mercedes’ Valtteri Bottas, a Finnish racing driver, finished second and third respectively.
 

No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...