Monday, 11 November 2019

11th november 2019 current affairs telugu

✍  కరెంట్ అఫైర్స్ 11 నవంబరు 2019 Monday ✍
జాతీయ వార్తలు
లాభాల తేజస్ ఎక్స్ప్రెస్ :

i. భారతీయ రైల్వే తరఫున ఐఆర్సీటీసీ నడుపుతున్న మొట్టమొదటి ప్రైవేటు రైలు- తేజస్ ఎక్స్ప్రెస్ తొలి నెలరోజుల్లోనే లాభాలు మూటగట్టుకొంది.
ii. ఎక్కడి నుంచి ఎక్కడకు ?: లఖ్నవూ నుంచి దిల్లీ
iii. ఎప్పుడు ప్రారంభమయింది ?: అక్టోబరు 5
iv. ఇతర ప్రత్యేకతలు : రైలు ఆలస్యమైతే పరిహారం. రూ.25లక్షల వరకు ప్రమాద బీమా ఉచితం.
v. ఇలా ఎన్ని రైళ్లు నడుపుతారు ?: 150
ఇతర రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల వార్తలు
తీవ్రమైన తుపాన్ ‘బుల్బుల్’ :

i. తీవ్రమైన తుపాన్ ‘బుల్బుల్’ పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్లను కుదిపేసింది. గంటకు 135 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీయడంతో జనజీవనం స్తంభించింది.
 సదస్సులు
5th edition of GES 2019 to be held in Bengaluru :

i. The 5th edition of Global Exhibition on Services, GES 2019 is being held from November 26 to 28 at Bengaluru, Karnataka.
ii. The Global Exhibition on Services is an annual event which aims to engage industry and governments across the world and to promote greater exchange of trade in services between India and the rest of the world. India is looking to attract investments and partnerships in strategic areas like aviation and space programme, infrastructure, and telecom projects.
iii. Minister of Commerce and Industry: Piyush Goyal.
అవార్డులు
Tata Literature Live! to honour Shanta Gokhale with Lifetime Achievement award :
 
i. The Tata Literature Live! Lifetime Achievement Award for 2019 was conferred on writer, translator and film critic Shanta Gokhale.
ii. She, born in 1939 in the town of Dahanu in Maharashtra, recently published her memoir One Foot on the Ground: A Life Told Through the Body.
iii. She received the Sangeet Natak Academy Award in 2015. Poet K Satchidanandan was named the Tata Literature Live! Poet Laureate for 2019.
BOOKS
CJI Ranjan Gogoi releases Assamese version of book ‘Courts of India: Past to Present’ :

i. Chief Justice of India Justice Ranjan Gogoi released the Assamese version of the book ‘Courts            of India: Past to Present’ in Guwahati, Assam. 
ii. The book has been published by the Publication division. The various chapters of the book                   narrate the historical events of the court.
మరణాలు
ఎన్నికల సంస్కర్త శేషన్ కన్నుమూత :

i. ఎన్నికల సంఘం మాజీ ప్రధాన కమిషనర్ (సీఈసీ) టి.నారాయణ శేషన్ (87) కన్నుమూశారు. శేషన్ 1932లో కేరళలోని పాలక్కడ్ జిల్లాలోని తిరునెల్లైలో జన్మించారు.
ii. 1989లో భారత కేబినెట్ కార్యదర్శి స్థాయికి చేరుకున్నారు. ఆ హోదాలో 8 నెలలు మాత్రమే ఉన్నారు. స్వతంత్ర భారత చరిత్రలో అత్యంత తక్కువ కాలం ఆ పదవిలో ఉన్న అధికారిగా ఆయన నిలిచిపోయారు.
iii. 1990 డిసెంబర్ 12 నుంచి 1996 డిసెంబర్ 11 వరకూ ఎన్నికల కమిషన్ ప్రధాన కమిషనర్గా బాధ్యతలు నిర్వహించారు. శేషన్ 1997లో రాష్ట్రపతి పదవికి కూడా పోటీ చేశారు. ఆయన చేసిన సేవలకు రామన్ మెగసెసె పురస్కారం లభించింది.
iv. విధి నిర్వహణలో చండశాసనుడిగా టి.ఎన్.శేషన్కు పేరుంది. భారతావనిలో ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేలా ఆయన అత్యంత కట్టుదిట్టంగా వ్యవహరించారు. రాజకీయ ఒత్తిళ్లకు ఏమాత్రం తలొగ్గలేదు. ఓటర్లలో అభద్రతా భావాన్ని తొలగించారు. ఎన్నికల ప్రక్రియలో చట్టాలను కఠినంగా అమలు చేశారు.
v. ప్రవర్తన నియమావళిని తొలిసారిగా తుచ తప్పకుండా అమలు చేయించిన ఘనత శేషన్దే. అభ్యర్థులు పెట్టే ఖర్చులపై ఆయన మొదటిసారిగా ఆంక్షలు అమలుచేశారు.
vi. ఓటర్లకు ఫొటో గుర్తింపు కార్డులను తెచ్చారు. మతపరమైన ప్రదేశాల్లో ప్రచారాన్ని నిషేధించారు.

విశ్రాంత ఐఏఎస్ కృష్ణన్ మృతి. మండల్ సిఫార్సుల అమలులో కీలకపాత్ర :

i. వెనకబడిన వర్గాల సంక్షేమానికి అహర్నిశలూ శ్రమించిన విశ్రాంత ఐఏఎస్ అధికారి పీఎస్ కృష్ణన్ ఇక లేరు. కేరళలోని తిరువనంతపురంలో జన్మించిన ఆయన 1956 బ్యాచ్ ఏపీ క్యాడర్ ఐఏఎస్ అధికారి.
ii. ‘సోషల్ ఎక్స్క్లూజన్ అండ్ జస్టిస్ ఇన్ ఇండియా’ అనే పుస్తకం రాశారు. వీపీ సింగ్ హయాంలో కేబినెట్ కార్యదర్శిగా పనిచేసిన సమయంలో మండల్ కమిషన్ సిఫార్సుల అమలుపై కేబినెట్ నోట్ రూపొందించారు.
iii. ఎస్సీ ఎస్టీ కమిషన్కు చట్టబద్ధత కల్పించడం, ఎస్సీ ఎస్టీలపై వేధింపుల నిరోధచట్టం అంశాల్లో కీలకపాత్ర పోషించారు. పదవీ విరమణ అనంతరం ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యుడిగా, వెనకబడిన వర్గాల జాతీయ కమిషన్ నిపుణుల కమిటీ సభ్యుడిగా పనిచేశారు.
iv. కృష్ణన్ కేబినెట్ నోట్ ఆధారంగానే మండల్కమిషన్ సిఫార్సును ప్రభుత్వం ఆమోదించిందని, వెనకబడిన తరగతులకు 27 శాతం రిజర్వేషన్లు అమలుచేశారని కేంద్ర పౌరసరఫరాలశాఖ మంత్రి రాంవిలాస్ పాస్వాన్ గుర్తుచేశారు.
ముఖ్యమైన రోజులు
National Education Day (జాతీయ విద్యా దినోత్సవం) : 11th November
 
i. జాతీయ విద్యా దినోత్సవాన్ని నవంబర్ 11 న స్వతంత్ర భారతదేశపు మొదటి విద్యా మంత్రి, స్వాతంత్ర్య సమరయోధుడు, పండితుడు మరియు ప్రముఖ విద్యావేత్త మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా జరుపుకుంటారు.
ii. అతను స్వాతంత్ర్య సమరయోధుడు, పండితుడు మరియు స్వతంత్ర భారతదేశపు మొదటి విద్యా మంత్రి. మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ (హెచ్ఆర్డి) సెప్టెంబర్ 11, 2008 న జాతీయ విద్యా దినోత్సవాన్ని ప్రకటించింది.
iii. అబుల్ కలాం గులాం ముహియుద్దీన్ 1947 నుండి 1958 వరకు స్వతంత్ర భారతదేశపు మొదటి విద్యా మంత్రిగా పనిచేశారు.
మౌలానా అబుల్ కలాం ఆజాద్ జననం – నవంబర్ 11, 1888

i. మౌలానా అబుల్ కలాం ఆజాద్ (నవంబర్ 11, 1888 — ఫిబ్రవరి 22, 1958) ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు, భారత ప్రభుత్వ తొలి విద్యాశాఖామంత్రి, మౌలానా అబుల్ కలాం ఆజాద్.
ii. ఆయన అసలుపేరు 'మొహియుద్దీన్ అహ్మద్', 'అబుల్ కలాం' అనేది బిరుదు, 'ఆజాద్' కలంపేరు. 1888 నవంబరు 11 న మక్కాలో జన్మించాడు.మౌలానా అబుల్ కలాం ఆజాద్ భారత స్వాతంత్ర్య సమర ముఖ్య నాయకులలో ఒకరు. అతను ప్రఖ్యాత పండితుడు మరియు కవి.
iii. అతను కాన్స్టాంటినోపుల్లో యంగ్ టర్క్స్ భావాలతో పరిచయం పెంచుకొన్నారు. ఈ పరిచయాలు అన్ని అతనిని ఒక జాతీయవాద విప్లవవాది గా రూపాంతరం చెందిoచాయి.
iv. 1912 లో మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఉర్దూ లో ‘ అల్ హిలాల్’ వార పత్రిక ముస్లింలు మధ్య విప్లవాత్మక భావాలను పెంచడానికి ప్రారంభించారు. ప్రభుత్వం దానిని 1914 లో నిషేదిoచినది.
v. ఆజాద్ భారతీయ జాతీయ వాదం మరియు హిందూ -ముస్లిం ఐక్యత ఆధారంగా విప్లవాత్మక ఆలోచనలతో మరో పత్రికను “అల్ బలఘ్” ప్రారంభించారు.1916 లో ప్రభుత్వం ఈ పత్రికను కూడా నిషేధించారు మరియు రాంచి లో ఆజాద్ ను నిర్భందించారు.
vi. విడుదల తరువాత ఆజాద్ ఖిలాఫత్ ఉద్యమం ద్వారా ముస్లిం కమ్యూనిటీ లో బ్రిటిష్ వ్యతిరేక భావాలు పెంచారు. ఖలీఫా ఉద్యమం యొక్క ప్రధాన లక్ష్యం ఖలీఫాను తిరిగి టర్కీ రాజుగా ప్రకటించడం.
vii. మౌలానా అబుల్ కలాం ఆజాద్ గాంధీజీ ప్రారంభించిన "సహాయ నిరాకరణ"ఉద్యమం ను సమర్ధించి 1920 లో భారత జాతీయ కాంగ్రెస్ లో ప్రవేశించినాడు.  ఇతడు ఢిల్లీ కాంగ్రెస్ ప్రత్యేక సెషన్ అధ్యక్షుడు గా (1923) ఎన్నికయ్యారు.
viii. మౌలానా ఆజాద్ గాంధీజీ ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని 1930 లో అరెస్టు అయినారు. అతనిని ఒక సంవత్సరంన్నర పాటు  మీరట్ జైల్లో ఉంచారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ 1940 (రాంగడ్) లో కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నికయ్యాడు మరియు 1946 వరకు ఆ పదవి లో  ఉన్నారు.
ix. అతను  విభజన కు వ్యతిరేకి . విభజన అతని కలలను నాశనం చేసింది. హిందువులు మరియు ముస్లింలు కలసి సహజీవనం చేస్తున్న ఒక ఏకీకృత దేశం బద్దలు అగుట అతని కల ను నాశనం చేసి అతనిని విపరీతంగా   బాధించింది.
x. ఖిలాఫత్ ఉద్యమం, సహాయ నిరాకరణోద్యమం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొని 10 సంవత్సరాలపాటు జైలుశిక్ష అనుభవించాడు. భారత ప్రభుత్వంలో 11 సంవత్సరాలపాటు విద్యాశాఖామంత్రిగా పనిచేసాడు. 1958 ఫిబ్రవరి 22 న మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ మరణించాడు.
గౌరవాలు, బిరుదులు :
xi. గాంధీజీ ఇతడిని భారత ప్లాటో అని, గాంధీ మరియు నెహ్రూ ఇతడిని మౌలానా, మీర్-ఎ-కారవాన్ అని పిలిచేవాడు.
xii. 1992లో భారత ప్రభుత్వం ఆయనకు భారతరత్న ఇచ్చి గౌరవించింది.
xiii. ఇతడి జన్మదినమైన నవంబరు 11 ను జాతీయ విద్యా దినోత్సవం గా జరుపుకుంటారు.
సాహిత్యం :
xiv. తర్జుమానుల్ ఖురాన్ (ఖురాన్ అనువాదం)
xv. "అల్-హిలాల్" మరియు "అల్-బలాగ్" అనే పత్రికలు స్థాపించాడు.
xvi. గుబార్-ఎ-ఖాతిర్; ఇండియా విన్స్ ఫ్రీడమ్
జె. బి. కృపలానీ జననం – 11 నవంబర్ 1888

i. ఆచార్య జె. బి. కృపలానీ (11 నవంబర్ 1888 - 19 మార్చి 1982) సుప్రసిద్ధ భారతీయ రాజకీయ నాయకుడు. 1947 భారతదేశానికి స్వాతంత్ర్యము వచ్చినపుడు భారత జాతీయ కాంగ్రెసు అధ్యక్షునిగా ఉన్నాడు.
ii. కృపలానీ గాంధేయవాది, సోషలిస్టు, పర్యావరణవేత్త మరియు స్వాతంత్ర్యసమరయోధుడు. మహాత్మా గాంధీకి దగ్గరగా వుంటూ అత్యంత సన్నిహితులలో ఒకనిగా పేరుగాంచాడు.
iii. 1920లలో సహాయనిరాకరణోద్యమం నుంచి 1970లలో ఇండియన్ ఎమర్జెన్సీ దాకా చురుగ్గా పాల్గొంటూ ప్రముఖునిగా ప్రసిద్ధి చెందాడు.
iv. కృపలానీ ఆపద్ధర్మ భారత ప్రభుత్వము (1946-1947)లోనూ, భారత రాజ్యాంగ సభలోనూ పనిచేశాడు. నెహ్రూ, 1950లో కాంగ్రేసు అధ్యక్ష ఎన్నికలలో కృపలానీకి మద్దతిచ్చాడు. పార్టీపై పట్టుకోసం నెహ్రూ నేతృత్వములోని వామపక్షానికి, పటేల్ నేతృత్వములోని కుడిపక్షానికి జరుగుతున్న పోరాటంలో ఈ ఎన్నికలు కీలకమని భావించారు.
v. కృపలానీకి వ్యతిరేకముగా పటేల్ అభ్యర్థిగా, హిందూ జాతీయవాది పురుషోత్తమ దాస్ టాండన్ పోటీచేశాడు. సోమనాథ్ దేవాలయం యొక్క వివాదాస్పద పునర్నిర్మాణము, జనసంఘ్ స్థాపన, నెహ్రూ-లియాఖత్ ఒప్పందములతో ఉద్రేకపూరితమైన జాతీయ వాతావరణంలో ఆర్థిక ప్రణాళికలలో విభేదాల వల్ల టాండన్ చిన్న ఆధిక్యతతో కృపలానీపై గెలిచాడు.
vi. ఓటమితో గాయపడ్డ కృపలానీ, గాంధీ ఆశయమైన గ్రామ స్వరాజ్యాన్ని నీళ్ళకొదిలేస్తున్నారన్న విభ్రమతో కాంగ్రేసు పార్టీని విడిచి, కిసాన్ మజ్దూర్ ప్రజాపార్టీ యొక్క సంస్థాపకుల్లో ఒకడైనాడు. ఈ పార్టీ ఆ తరువాత సోషలిస్టు పార్టీ ఆఫ్ ఇండియాలో విలీనమై ప్రజా సోషలిస్టు పార్టీగా అవతరించింది.
vii. 1938 నుండి ఈయన భార్య అయిన సుచేతా కృపలానీ, కాంగ్రేసు పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి కేంద్ర మంత్రివర్గములో అనేక మార్లు మంత్రిపదవులతో సహా అనేక ఉన్నత పదవులు పొందింది. ఈమె దేశములోనే మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రిగా ఉత్తర ప్రదేశ్ లో ప్రమాణస్వీకారం చేసింది. కృపలానీ దంపతులు పార్లమెంటులో తరచూ ఒకర్నొకరు ఢీకొనేవారు.
viii. కృపలానీ 1963 ఆగస్టులో భారత-చైనా యుద్ధం ముగియగానే నెహ్రూ ప్రభుత్వముపై లోక్ సభలో మొట్టమొదటి అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు.
ix. 1975లో అత్యయిక పరిస్థితిని విధించినప్పుడు పెద్ద ఎత్తున నిరసన రేపడానికి కారకుడైనందుకు, జూన్ 26, 1975 రాత్రి అరెస్టు చేయబడిన మొట్టమొదటి ప్రతిపక్ష నాయకుల్లో 80యేళ్ళు పైబడిన కృపలానీ ఒకడు. ఎమర్జెన్సీ అంతం కావడం, 1977 ఎన్నికల్లో జనతా పార్టీ గెలుపొంది స్వాతంత్ర్యము తర్వాత మొట్టమొదటిసారిగా ఒక కాంగ్రేసేతర ప్రభుత్వం నెలకొల్పటం చూడటానికి కృపలానీ జీవించే ఉన్నాడు.
x. కృపలానీ 94 యేళ్ళ వయసులో 1982, మార్చి 19న మరణించాడు. 1982లో విడుదలైన రిచర్డ్ అటెన్బరో నిర్మించిన గాంధీ చిత్రంలో కృపలానీ పాత్రను భారతీయ నటుడు అనంగ్ దేశాయి పోషించాడు.
క్రీడలు
పిన్న వయసులో అంతర్జాతీయ అర్ధసెంచరీ చేసిన భారత క్రికెటర్గా షెఫాలీవర్మ :
 
i. 30 బంతుల్లోనే అర్ధసెంచరీ చేసి షెఫాలీ (15 ఏళ్ల 285 రోజులు) పిన్న వయసులో అంతర్జాతీయ అర్ధసెంచరీ చేసిన భారత క్రికెటర్గా రికార్డు సృష్టించింది. 30 ఏళ్ల క్రితం సచిన్ తెందుల్కర్ (16 ఏళ్ల 214 రోజులు) సృష్టించిన రికార్డును ఆమె బద్దలుకొట్టింది.
ii. షెఫాలీ, మంధాన తొలి వికెట్కు 143 పరుగులు జత చేసి టీ20ల్లో భారత్ తరఫున ఏ వికెట్కైనా అత్యధిక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
టీ20ల్లో హ్యాట్రిక్ తీసిన భారత ఏకైక బౌలర్గా చాహర్ :

i. బంగ్లాదేశ్ మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను టీమ్ ఇండియా 2-1తో చేజిక్కించుకుంది. చాహర్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డునూ అతడే సొంతం చేసుకున్నాడు.
ii. షఫియుల్, ముస్తాఫిజుర్, అమినుల్ ఇస్లామ్లను ఔట్ చేసి దీపక్ చాహర్ హ్యాట్రిక్ పూర్తి చేశాడు. కేవలం ఏడు పరుగులకే ఆరు వికెట్లు పడగొట్టి టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు.
iii. టీ20ల్లో దీపక్ ప్రదర్శన 6/7. అతడిదే అత్యుత్తమం. అజంతా మెండిస్ (6/8; 2012లో జింబాబ్వేపై) రికార్డును తిరగరాశాడు.
ఫ్రాన్స్దే ఫెడ్కప్. ఆస్ట్రేలియాపై విజయం :

i. సుదీర్ఘ విరామం తర్వాత ఫెడ్కప్ ఫ్రాన్స్కు చేరింది. హోరాహోరీగా సాగిన ఈ మెగా టెన్నిస్ టోర్నీ ఫైనల్లో ఫ్రాన్స్ 3-2తో ఆతిథ్య ఆస్ట్రేలియాను ఓడించింది.
ii. ఫ్రాన్స్ ఫెడ్ కప్ గెలవడం 2003 తర్వాత ఇదే తొలిసారి.

No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...