Sunday, 24 November 2019

17th november 2019 current affairs


✍  కరెంట్ అఫైర్స్ 17 నవంబరు 2019 Sunday ✍

జాతీయ వార్తలు
రేపు(Nov 18) రాజ్యసభ 250వ సమావేశం ప్రారంభం. ఎన్నో కీలక ఘట్టాలకు సాక్షిగా ఎగువసభ :
  
i. శాశ్వత సభ 1952 మే 13న మొదలైంది. 67 ఏళ్ల చరిత్రలో ఎన్నో ఘట్టాలకు సాక్షిగా నిలిచింది. దేశానికి దిశా నిర్దేశం చేయడంలో కీలక భూమిక వహించింది.
ii. మేధావులు, ఆలోచనపరులు, అనుభవజ్ఞులతో ఈ సభ.. రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తూ వాటి ప్రయోజనాలను పరిరక్షిస్తుంది. ఆవేశకావేశాలకు దూరంగా ప్రశాంత వాతావరణంలో చట్టాలపై చర్చించాలనేది రాజ్యాంగ నిర్మాతల ఉద్దేశం.
iii. ప్రజల నుంచి ఎన్నికైన దిగువ సభ సభ్యులు ఎన్నికల దృష్టితో చట్టాలు చేసుకుంటూపోతే ఇబ్బందులు ఎదురుకావచ్చని భావించడం మరో కారణం. చట్టాల దీర్ఘకాలిక ప్రభావాలను, మంచిచెడ్డల్ని ఈ సభ విశ్లేషించి మార్పులు చేర్పులు చేస్తుంది.
iv. రాజ్యసభ స్వరూపం ఎలా ఉండాలో రాజ్యాంగ కమిటీ 1947 జులై 21న కొన్ని సూచనలు చేసింది.ఎగువ సభలో 250 మంది సభ్యులు ఉండాలని తెలిపింది.
v. పది లక్షల నుంచి 50 లక్షల మంది జనాభాకు ఒక సభ్యుడు చొప్పున ప్రాతినిధ్యం వహించాలి. ఒక రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించేవారి సంఖ్య 20కి మించకూడదు.
vi. ఉప రాష్ట్రపతే ఎగువ సభకు అధ్యక్షుడిగా ఉండాలని, ఆయన అప్పటికే అదే సభలో సభ్యుడిగా ఉంటే మాత్రం తన సభ్యత్వాన్ని వదులుకోవాలని షరతు విధించింది. 
కొన్ని ముఖ్య ఘట్టాలు :
vii. రాజ్యసభ ఛైర్మన్ ఇప్పటివరకూ ఒకే ఒకసారి (1991లో) తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
viii. అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సౌమిత్ర సేన్కు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానం ఆమోదం పొంది, దిగువ సభకు వెళ్లకముందే ఆయన రాజీనామా చేశారు.
ix. విభిన్న కారణాలతో ఇప్పటివరకూ సుబ్రహ్మణ్య స్వామి, ఛత్రపాల్ సింగ్ లోధా, సాక్షి మహరాజ్లను సభ బహిష్కరించింది. ఏడుగురిని తాత్కాలికంగా సస్పెండ్ చేసింది.
x. సభా మర్యాదను తగ్గించేలా మాట్లాడినందుకు కేకే తివారీ అనే మాజీ ఎంపీని 1990లో సభ పిలిపించి హెచ్చరించింది.
xi. అత్యవసర సేవల నిర్వహణ బిల్లును ఆమోదించడానికి రాజ్యసభ 1981 డిసెంబర్ 17 ఉదయం నుంచి మరుసటిరోజు తెల్లవారుజామున 4.43 గంటల వరకు కూర్చొంది. రాజ్యసభ చరిత్రలో ఇప్పటివరకూ ఇదే సుదీర్ఘ సమావేశం.
xii. రాజీవ్గాంధీకి భద్రత కల్పించడంలో ప్రభుత్వ వైఫల్యంపై 1991 జూన్ 4న 12 గంటల 4 నిమిషాల చర్చ జరిగింది. ఇప్పటివరకూ సుదీర్ఘమైన చర్చ ఇదే.
ఈ సభ శాశ్వతం :
xiii. ఒక్క ద్రవ్యబిల్లులు ప్రవేశపెట్టే విషయంలో మినహా ఉభయ సభలకు సమానాధికారాలు ఉంటాయి. ప్రతిష్టంభన ఏర్పడి ఏదైనా బిల్లు ఆమోదం పొందని పరిస్థితి తలెత్తితే సంయుక్త సమావేశం నిర్వహించి, ఆమోదముద్ర వేసే అవకాశాన్ని కల్పించారు.
xiv. ప్రతి రెండేళ్లకు మూడోవంతు మంది సభ్యులు పదవీ విరమణ చేస్తారు. మొత్తం 245 మందిలో గరిష్ఠంగా 12 మందిని రాష్ట్రపతి నామినేట్ చేసే వీలుంది.
రాజ్యసభకు ప్రత్యేకాధికారాలు :
xv. రాష్ట్రాలకు సంబంధించిన వ్యవహారాల్లో రాజ్యసభకు ప్రత్యేక అధికారాలను రాజ్యాంగం కల్పించింది. ఏదైనా జాతీయ ప్రయోజనాల విషయంలో చట్టాలు చేయాల్సి వచ్చినప్పుడు పార్లమెంటు నేరుగా రాష్ట్రాల అధికారాల్లో జోక్యం చేసుకొనే అవకాశం ఉంటుంది. ఆర్టికల్ 249 దీనికి వీలు కల్పిస్తుంది. 
xvi. మూడింట రెండొంతుల ఆధిక్యంతో రాజ్యసభ తీర్మానం చేస్తే.. రాష్ట్రాల జాబితాలోని అంశాలపైనైనా పార్లమెంటు చట్టం చేయడానికి వీలవుతుంది. 
xvii. అత్యవసర పరిస్థితి (ఆర్టికల్ 352), రాష్ట్రపతి పాలన (ఆర్టికల్ 356), ఆర్థిక అత్యవసర పరిస్థితి (ఆర్టికల్ 360) ప్రకటించినప్పుడు వాటిని నిర్దిష్ట గడువులోగా పార్లమెంటు ఉభయ సభలు ఏకకాలంలో ఆమోదించాలి. లోక్సభ రద్దయి ఉంటే రాజ్యసభ ఆమోదం సరిపోతోంది.
xviii. రాజ్యసభకు దశాబ్దం పాటు ఛైర్మన్గా సేవలందించిన వారిలో సర్వేపల్లి రాధాకృష్ణన్ (1952-62), హమీద్ అన్సారీ (2007-2017) ఉన్నారు.
తెలంగాణ వార్తలు
రైతు సమన్వయ సమితి అధ్యక్షునిగా ‘పల్లా’ :

i. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ప్రధాన కార్యదర్శి, శాసనమండలి విప్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిని రైతు సమన్వయ సమితి (రైసస) అధ్యక్షునిగా నియమిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.
ii. విత్తనాల దశ నుంచి పంట చేతికొచ్చి గిట్టుబాటు ధర పొందే వరకు రైతులకు చేదోడు వాదోడుగా ఉండేలా రైతు సమన్వయసమితిని తెచ్చామని వివరించారు. 
iii. రైతు సమన్వయసమితికి మొదటి ఛైర్మన్గా శాసనమండలి అధ్యక్షుడు గుత్తా సుఖేందర్ రెడ్డి 2018 ఫిబ్రవరిలో నియమితులయ్యారు. గత ఆగస్టులో ఆయన ఎమ్మెల్సీ అయ్యాక రైససకు రాజీనామా చేశారు.
iv. పల్లా వరంగల్ జిల్లా వేలేరు మండలం సోదేశపల్లికి చెందిన వారు. 2014 ఎన్నికల్లో నల్గొండ ఎంపీ స్థానంలో పోటీ చేసి ఓడిపోయినా ఆయనను 2015లో ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయించగా, విజయం సాధించారు. 2016 ఆగస్టు 27 నుంచి శాసనమండలిలో విప్గా ఉన్నారు.
ఇతర రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల వార్తలు
National Mission ‘NISHTHA’ launched in J&K
            
National Initiative for School Heads’ and Teachers’ Holistic Advancement (NISHTHA) has been launched in the Union Territory of Jammu and Kashmir.
NISHTHA is aimed at improving learning outcomes at Elementary level through integrated Teacher Trainings.
NISHTHA is a pioneer scheme being launched across the country, with a total of 86000 Elementary teachers of Government Schools being trained in J&K under the programme.
Kerala on track to eliminate TB by 2025 :

i. The sixth Joint Monitoring Mission (JMM 2019) of the Union government and the World Health Organization on the Revised National Tuberculosis Control Programme (RNTCP) has lauded Kerala for being right on track to achieve TB elimination by 2025.
Persons in news
అనిల్ అంబానీ ఆర్కామ్కు రాజీనామా :

i. రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్కామ్) డైరెక్టర్ బాధ్యతల నుంచి అనిల్ అంబానీ వైదొలిగారు. ఒకప్పుడు అత్యంత శ్రీమంతుల్లోని తొలి పదిమందిలో ఉండే అనిల్ .. ఇప్పుడు కంపెనీ బకాయిలు చెల్లించేందుకు కనీసం ఆస్తులు కూడా విక్రయించలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. 
ii. ధీరూభాయి అంబానీ మరణానంతరం 2005లో అన్నదమ్ములిద్దరికి (ముకేశ్, అనిల్) చేసిన వ్యాపార పంపకాల్లో భాగంగా ఆర్కామ్ పగ్గాలు అనిల్ చేతికి వచ్చాయి. రుణ సంక్షోభంలో చిక్కుకున్న ఈ కంపెనీపై స్వీడన్ సంస్థ ఎరిక్సన్ వేసిన పిటీషన్ ఆధారంగా దివాలా ప్రక్రియను ప్రారంభించేందుకు జాతీయ కంపెనీల చట్టం ట్రైబ్యునల్ ఆదేశించింది.
Reports/Ranks/Records
బిల్గేట్స్ మళ్లీ అగ్రస్థానానికి @బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ సూచీ

i. ప్రపంచ కుబేరుల్లో బిల్గేట్స్ మరో సారి తన అగ్రస్థానాన్ని చేజిక్కించుకున్నారు. దాదాపు రెండేళ్ల తర్వాత తిరిగి ఈ పీఠాన్ని అధిరోహించారు.
ii. ఐరోపాలోనే అత్యంత సంపన్నుడైన బెర్నార్డ్ ఆర్నాల్ట్ మొత్తం మీద మూడో స్థానంలో నిలిచారు. 
Delhi has the most unsafe tap water. Only Mumbai meets BIS standards :

i. If it wasn’t enough that Delhi air is among the world’s most polluted, a new study has now shown that the city’s tap water is the most unsafe among 21 State capitals.
ii. The national capital is at the very bottom of the list, in a ranking based on tap water quality released by the Bureau of Indian Standards (BIS).
iii. In fact, Mumbai is the only city where all samples of tap water met all the tested parameters under the Indian Standard 10500:2012 (specification for drinking water) so far.
iv. Under its flagship Jal Jeevan Mission, the Centre aims to provide safe piped water to all households by 2024, with Prime Minister Narendra Modi promising to spend over ₹3.5 lakh crore on the scheme in his last Independence Day speech.
అవార్డులు
సుదర్శన్ పట్నాయక్కు ఇటలీ అవార్డు :

i. ఒడిశాకు చెందిన ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్కు ప్రఖ్యాత ఇటాలియన్ గోల్డెన్ శాండ్ అవార్డ్-2019 లభించింది.
ii. ఇటలీలోని లీసీలో జరిగిన పోటీల్లో సుదర్శన పట్నాయక్ రష్యాకు చెందిన పావెల్ మినికోవ్తో కలిసి ఇసుకతో ఎనిమిది అడుగుల పొడవు ఉన్న మహాత్మా గాంధీ విగ్రహాన్ని రూపొందించారు.
Tobacco Board of India wins Golden Leaf Award :

The Tobacco Board of India, Guntur, has been awarded the Golden Leaf Award at Tab Expo 2019 event in Amsterdam, Netherlands.
Executive Director of Tobacco Board, K. Sunitha, was presented the award. The award was presented to the board for its efforts to initiate various sustainability (green) initiatives in Flue-Cured Virginia (FCV) tobacco cultivation in India.
The award was given in the most impressive public service initiative category for the year 2019.
This is the 2nd time the board has bagged the award. In the year 2014, the board bagged the award for its implementation of an electronic auction system, which has made the marketing of flue-cured tobacco in India more transparent and accountable.
Art and Culture 
National Tribal Festival Aadi Mahotsav to begin in New Delhi

Union Home Minister Amit Shah will inaugurate the National Tribal Festival “Aadi Mahotsav” in New Delhi.
The theme of the 15-day Mahotsav is celebration of the Spirit of Tribal Culture, Craft, Cuisine and Commerce. It will be held at Dilli Haat in INA, New Delhi.
The tribal textiles manufactured by master tribal craftsmen from Jammu & Kashmir in the North to Tamil Nadu in the South and from Gujarat in the West to Nagaland/Sikkim in the East will be the main attractions.
సినిమా వార్తలు
Movie “Bhonsle” Wins awards at Asian Film Festival Barcelona

The Critically acclaimed movie “Bhonsle” has won prestigious awards at the Asian Film Festival Barcelona.
The film has bagged two awards in the ‘Best Screenplay’ and ‘Best Director’ categories at the festival. The film is directed by Devashish Makhija.
Bhonsle revolves around a police constable played by Manoj Bajpayee, who tries to help in the struggles of migrants and their battles with the local politicians.
ముఖ్యమైన రోజులు
National Press Day: 16th November

India celebrates “National Press Day” on 16th November every year. The day is symbolic of a free and responsible press.
On this day the Press Council of India started functioning as a moral watchdog to ensure that the press maintains high standards and is not constrained by any influence or threats.
To celebrate the day, Vice President M. Venkaiah Naidu will confer excellence in journalism awards.
17 November - National Epilepsy Day (జాతీయ మూర్ఛ దినోత్సవం)

i. National Epilepsy Day is observed on 17 November every year to focus on the epilepsy disease, its symptoms and prevention.
ii. Let us tell you that Epilepsy is a chronic disorder of the brain which is characterised by recurrent 'seizures' or 'fits'. 
iii. It can affect people of any age and people in the different age groups have unique concerns and problems.
National Journalism Day - 17 November

i. Every Year the National Journalism Day is celebrated on 17 November in India.
ii. On this day we celebrate the freedom of speech, thoughts and virtues as well as the role of media in shaping our society.
iii. Journalism plays a role of mediator between the public and policy makers. This role was performed by the journalist. They used to listen and record the message spoken by the elites. This message was processed and conveyed it to the public in the form of information.
International Students' Day – November 17

i. International Students' Day is an international observance of the student community, held annually on November 17. 
ii. The day is celebrated to ensure education is available and accessible to all students.
iii. On November 17, 1939, the Nazi troops executed nine student leaders and sent over 1200 students to concentration camps. The Nazi troops had even closed all the Czech colleges and universities. The courage displayed by the students during this incident was unforgettable. To commemorate their legacy, since 1941, students from all parts of the world started celebrating November 17 as the International Students Day.

No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...