Tuesday, 5 November 2019

3rd nov 2019 current affairs


✍  కరెంట్ అఫైర్స్ 3 నవంబరు 2019 Sunday ✍


జాతీయ వార్తలు
జమ్మూ-కశ్మీర్, లద్దాఖ్ మ్యాప్ల విడుదల. జమ్మూ-కశ్మీర్ యూటీలో పీవోకే. లద్దాఖ్లో అంతర్భాగంగా గిల్గిత్ బాల్టిస్థాన్ :
  
i. జమ్మూ-కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో నూతన మ్యాప్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. వీటి ప్రకారం.. జమ్మూ-కశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతం (యూటీ)లో పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) భాగంగా ఉంది. లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతంలో గిల్గిత్-బాల్టిస్థాన్ అంతర్భాగమైంది. 
ii. 2 కేంద్ర పాలిత ప్రాంతాలను చూపుతూ కొత్తగా రూపొందిన భారత దేశ మ్యాప్నూ కేంద్ర హోంశాఖ విడుదల చేసింది. లద్దాఖ్ కేంద్ర పాలిత ప్రాంతంలో కార్గిల్, లేహ్ జిల్లాలు ఉంటాయని పేర్కొంది. అవిభక్త రాష్ట్రంలోని మిగతా ప్రాంతమంతా జమ్మూ-కశ్మీర్లో భాగంగా ఉంటుందని వివరించింది.
iii. 1947 నాటి జమ్మూ-కశ్మీర్ రాష్ట్రంలో 14 జిల్లాలు ఉండేవి. అవిభక్త జమ్మూ-కశ్మీర్ ప్రభుత్వం ఈ ఏడాది వీటిని 28 జిల్లాలుగా మార్చింది. తాజా మ్యాప్లను భారత సర్వే జనరల్ సంస్థ సిద్ధం చేసింది.
పది రోజుల్లో కీలక తీర్పులు వెలువరించనున్న సుప్రీంకోర్టు :

i. తీర్పులు రానున్న ముఖ్య కేసులు :
1) అయోధ్య భూ వివాదం
2) రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు కేసు
3) ఆర్టీఐ చట్ట పరిధిలోకి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ను తీసుకురావాలా? వద్దా?
4) శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళల్ని అనుమతిస్తూ ఇచ్చిన తీర్పు
ii. మరో 10 పని దినాలు. భారతావని యావత్తూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్న కీలక ఘడియలు. దేశ సామాజిక, మత, రాజకీయ వర్గాలపై తీవ్ర ప్రభావం చూపబోయే అత్యంత కీలక తీర్పుల్ని ఈ 10 రోజుల్లో సుప్రీంకోర్టు వెలువరించబోతోంది. 
iii. చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయి ఈ నెల 17వ తేదీన పదవీ విరమణ చేయడానికన్నా ముందే.. ఆయన నేతృత్వంలోని ధర్మాసనాలు ఈ తీర్పుల్ని వెల్లడించనున్నాయి.

iv. అయోధ్యలోని వివాదాస్పద భూభాగంలో 2.77 ఎకరాల స్థలం హిందువులదా? ముస్లింలకు చెందుతుందా? అన్నది కేసు. వివాదాస్పద స్థలాన్ని మూడు సమాన భాగాలుగా విభజిస్తూ 2010 సెప్టెంబరు 30వ తేదీన అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ తీర్పు ఇచ్చింది. 

v. కేంద్ర ప్రభుత్వం 36 రఫేల్ యుద్ధ విమానాలు కొనుగోలు చేయడాన్ని సమర్థిస్తూ 2018 డిసెంబరు 14వ తేదీన సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై రివ్యూ పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ ఒప్పందంలో వాస్తవ విషయాల్ని కోర్టుకు చెప్పకుండా కేంద్రం తొక్కిపెట్టిందని ఆరోపిస్తూ కేంద్ర మాజీ మంత్రులు యశ్వంత్సిన్హా, అరుణ్శౌరీ, న్యాయవాది ప్రశాంత్ భూషణ్లు పిటిషన్లు దాఖలుచేశారు.
vi. ఫైనాన్స్ చట్టం 2017ను ద్రవ్య బిల్లుగా పార్లమెంటు ఆమోదించింది. ట్రైబ్యునల్ సభ్యులు, వారి కాలపరిమితి విధివిధానాలను నిర్ణయించడం కోసం ప్రభుత్వం సంబంధిత అధికారాల్ని కొల్లగొట్టేలా ఉందని ఆరోపిస్తూ.. చట్టం చెల్లుబాటును సవాలుచేస్తూ పిటిషన్ దాఖలైంది. 

vii. సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) పరిధిలోకి సుప్రీంకోర్టు ప్రధాన నాయమూర్తినీ చేర్చాలన్న కేసుపై ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఈ ఏడాది ఏప్రిల్ 4న తీర్పును రిజర్వ్ చేసింది. చీఫ్ జస్టిస్ కార్యాలయం ఆర్టీఐ చట్టం పరిధిలోకి వస్తుందంటూ 2010 జనవరిలో దిల్లీ హైకోర్టు వెలువరించిన తీరుపై సుప్రీంకోర్టు సెక్రెటరీ జనరల్ అపీలు దాఖలుచేశారు.

viii. శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళల్ని అనుమతిస్తూ 2018 సెప్టెంబరులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఈ తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై చీఫ్ జస్టిస్ రంజన్గొగొయి నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ఫిబ్రవరి 6వ తేదీన తీర్పును రిజర్వ్ చేసింది.
ix. ప్రధాని మోదీని ‘చౌకీదార్ చోర్ హై’ అని కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ అప్పట్లో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. 

x. ఈ నినాదాన్ని రఫేల్ తీర్పునకు వర్తింపచేసినందుకుగాను రాహుల్ ఇప్పటికే సుప్రీంకోర్టుకు క్షమాపణ చెప్పారు. కోర్టు తీర్పునకు ఆ నినాదాన్ని రాహుల్ తప్పుగా ఆపాదించారంటూ ఆయనపై భాజపా ఎంపీ మీనాక్షి లేఖి కోర్టు ధిక్కరణ పిటిషన్పై చీఫ్ జస్టిస్ రంజన్గొగొయి నేతృత్వంలోని బెంచ్ తీర్పు వెలువరించనుంది.
తెలంగాణ వార్తలు
శాసనసభాకమిటీ ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టిన ఆశన్నగారి జీవన్రెడ్డి :
  
i. తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థల శాసనసభాకమిటీ ఛైర్మన్ ఆశన్నగారి జీవన్రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ను ప్రగతిభవన్లో కలిశారు. 
ii. కొత్తగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆయనకు సీఎం అభినందనలు తెలిపారు.
ఉర్దూ రాని అధ్యాపకులు 40 శాతం. ‘మాను’ వీసీ సంచలన వ్యాఖ్యలు :

i. ఉర్దూ మాధ్యమంలో ఉన్నత విద్యను అందించే లక్ష్యంతో ఏర్పాటైన మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ విశ్వవిద్యాలయం (మాను)లోని అధ్యాపకుల్లో 40శాతం మందికి ఉర్దూ రాదట. 
ii. ఆశ్చర్యకరమైన ఈ విషయాన్ని స్వయంగా వర్సిటీ ఉపకులపతి డా.మహ్మద్ అస్లాం పర్వేజ్ వెల్లడించడం విశేషం. 
iii. ఉర్దూ చదవటం, రాయడం సక్రమంగా రాని వ్యక్తులు ఉర్దూ మాధ్యమంలో కాకుండా ఆంగ్లంలో బోధించడం వల్ల విద్యార్థులు ఇబ్బందిపడుతున్నారని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ వార్తలు
జీవో 2430పై వివరణ ఇవ్వండి. ఏపీ సీఎస్కు ప్రెస్కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆదేశం :
  
i. ప్రభుత్వ వ్యతిరేక వార్తలు రాసిన పత్రికలు, మీడియా, పాత్రికేయులపై కేసులు పెట్టడానికి ప్రభుత్వశాఖల కార్యదర్శులకు అధికారమిస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో 2430పై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తీవ్రంగా స్పందించింది. 
ii. అక్టోబరు 30న జారీ చేసిన ఈ జీవోపై ప్రెస్ కౌన్సిల్ ఛైర్మన్ జస్టిస్ చంద్రమౌళి కుమార్ ప్రసాద్ ఆక్షేపణ వ్యక్తం చేశారు.
ఇతర రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల వార్తలు
Punjab Cabinet passes resolution to institute Sri Guru Nanak Dev Ji Award :

No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...