Sunday, 10 November 2019

09th november 2019 current affairs

✍  కరెంట్ అఫైర్స్ 9 నవంబరు 2019 Saturday ✍
జాతీయ వార్తలు
అయోధ్యలోని వివాదాస్పద స్థలం హిందువులదే : సుప్రీంకోర్టు తీర్పు

i. అయోధ్యలోని వివాదాస్పద స్థలం హిందువులదేనని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. 2.77 ఎకరాల వివాదాస్పద స్థలం హిందువులకు అప్పగించాలని ఆదేశించింది.
ii. ముస్లింలకు అయోధ్యలోనే 5 ఎకరాల స్థలం ఇవ్వాలని తీర్పు చెప్పింది. స్థలం స్వాధీనం చేసుకునేందుకు 3 నెలల్లో ట్రస్ట్ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది.
iii. జస్టిస్ రంజన్ గొగొయి, జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్భూషణ్, జస్టిస్ ఎస్ఏ నజీర్ బెంచ్పైకి చేరుకున్నారు. ఐదుగురు న్యాయమూర్తులు తీర్పుపై సంతకం చేశారు. అయిదుగురు న్యాయమూర్తులు కలిసి ఏకగ్రీవ తీర్పు వెలువరించారు.
అయోధ్య తీర్పు.. 134 సంవత్సరాల వివాదంపై... నిర్ణయం :

i. అయోధ్యలోని రామ జన్మభూమి-బాబ్రీ మసీదు స్థల వివాదం కేసులో సుప్రీం కోర్టు నేడు(Nov 9) తీర్పు ఇవ్వనుంది. ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ రంజన్ గొగొయి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఉదయం 10.30కు ఈ తీర్పును వెలువరించనుంది.
ii. అయోధ్యలోని 2.77 ఎకరాల భూమిపై హిందూ, ముస్లిం పక్షాల నడుమ దశాబ్దాలుగా వివాదం నెలకొంది. ఆ భూమిని సున్నీ వక్ఫ్బోర్డు, నిర్మోహీ అఖాడా, రామ్లల్లాకు సమానంగా పంచాలని 2010లో అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీన్ని సవాల్చేస్తూ సుప్రీం కోర్టులో 14 అపీళ్లు దాఖలయ్యాయి.
iii. ఈ వివాద సానుకూల పరిష్కారం కోసం మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎఫ్ఎం ఖలీఫుల్లా, ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్, సీనియర్ న్యాయవాది శ్రీరాంపంచు నేతృత్వంలో మధ్యవర్తిత్వ సంఘాన్ని కోర్టు ఏర్పాటు చేసింది. అయితే ఈ కమిటీ ప్రయత్నాలు ఫలించలేదు.

iv. దీంతో రాజకీయంగా సున్నితమైన ఈ కేసుపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి, న్యాయమూర్తులు జస్టిస్ ఎస్.ఎ.బోబ్డే, జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ అబ్దుల్ నజీర్లతో కూడిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఆగస్టు 6 నుంచి రోజువారీ విచారణ మొదలుపెట్టింది.
v. ఈనెల 17న పదవీ విరమణ చేయబోతున్న జస్టిస్ గొగొయి అసాధారణ రీతిలో న్యాయస్థానానికి సెలవు రోజైన శనివారం(Nov 9) తీర్పు ఇవ్వడానికి సిద్ధమయ్యారు.
సోనియా, రాహుల్, ప్రియాంకలకు ఎస్పీజీ భద్రత ఉపసంహరణ. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం :

i. ఇకపై వారికి  సీఆర్పీఎఫ్ ఆధ్వర్యంలోని ‘జడ్ ప్లస్’ భద్రతను కల్పిస్తామని అధికార వర్గాలు తెలిపాయి. ఇందిరాగాంధీ హత్య అనంతరం ప్రధాని రక్షణ కోసం ప్రత్యేకంగా ఎస్పీజీ (స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు) ఏర్పాటయింది.
ii. వీపీసింగ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజీవ్కు ఎస్పీజీ భద్రతను తొలగించింది. 1991 మేలో రాజీవ్ హత్యకు గురయ్యారు. పీవీ నరసింహారావు ప్రభుత్వం 1991లో ఎస్పీజీ చట్టానికి సవరణ చేసింది. మాజీ ప్రధానికి, వారి కుటుంబ సభ్యులకూ పదేళ్ల వరకూ ఎస్పీజీ భద్రత కల్పించేలా ఉత్తర్వులు జారీఅయ్యాయి.
iii. గత ఆగస్టు నెలలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు ఎస్పీజీ భద్రతను ఉపసంహరించిన కేంద్రం తాజాగా ఆ నిర్ణయాన్ని సోనియా కుటుంబ సభ్యులకు వర్తింపజేసింది.
 నేడే కర్తార్పుర్ నడవా ప్రారంభం :

i. సిక్కులు సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ‘కర్తార్పుర్ నడవా’ శనివారం నుంచి అందుబాటులోకి రానుంది. దీనికి సంబంధించి గురుదాస్పుర్లోని డేరాబాబా నానక్ వద్ద ఏకీకృత చెక్పోస్ట్ (ఐసీపీ)ను ప్రధాని నరేంద్ర మోదీ శనివారం(Nov 9) ప్రారంభించనున్నారు.
ii. పాకిస్థాన్లోనూ నడవాను ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ప్రారంభిస్తారు.
iii. నడవా పొడవు 4.5 కి.మీ. మన దేశంలోని పంజాబ్లో ఉన్న డేరాబాబా నానక్ గురుద్వారా నుంచి, పాకిస్థాన్ పంజాబ్ ప్రావిన్స్లోని నారోవాల్ జిల్లా కర్తార్పుర్లోని దర్బార్సాహిబ్ గురుద్వారా వరకు.
రాజ్యసభ భేటీలకు గుర్తుగా రూ.250 వెండి నాణెం :

i. రాజ్యసభ 250వ సమావేశాల ప్రారంభానికి గుర్తింపుగా కేంద్ర ఆర్థికశాఖ రూ.250 వెండి నాణేన్ని విడుదల చేయనుంది. 99.9% వెండితో దీన్ని రూపొందించింది. దీని బరువు 40 గ్రాములు ఉంటుంది.
ii. ఈనెల 18 నుంచి రాజ్యసభ 250వ సమావేశాలు ప్రారంభమవుతాయి. లోక్సభ ప్రతి అయిదేళ్లకోసారి ముగుస్తుంది కాబట్టి వాటికి నిరంతర సంఖ్య ఉండదు.
iii. రాజ్యసభకు అలాంటిది లేదుకాబట్టి స్వతంత్ర భారతదేశంలో తొలి సమావేశం దగ్గరి నుంచి ఆ సమావేశాలకు వరుస సంఖ్య ఇస్తూ వస్తున్నారు.
తెలంగాణ వార్తలు
Siddipet district first in Swachh Darpan :

i. The Siddipet district stood in first place in Swachh Darpan programme in the country.
ii. Member of Legislative Assembly from Siddipet and Finance Minister T. Harish Rao congratulated district Collector P. Venkatarami Reddy and others.
iii. The district received awards for successfully implementing construction of toilets, geo-tagging and community toilets and compost pits.
Defence News
Indian Navy, Indonesian Navy bilateral maritime exercise ‘Samudra Shakti :

India is jointly exercising its anti-submarine warfare corvette INS Kamorta along with Indonesian warship KRI Usman Harun, a multi-role corvette, in the Bay of Bengal as part of an ongoing bilateral exercise ”Samudra Shakti”.
The aim of the exercise is to strengthen bilateral relations, expand maritime co-operation, enhance interoperability and exchange best practices.
The joint exercises include manoeuvres, surface warfare exercises, air defence exercises, weapon firing drills, helicopter operations and boarding operations.
సదస్సులు
2nd ‘No money for terror conference 2019’ held in Australia :

The 2nd ‘No Money for Terror’ 2019 conference going on in Melbourne, Australia.
Union Minister of State for Home Affairs, G.Kishan Reddy is leading a five-member delegation to the ‘No Money For Terror’ Ministerial Conference taking place in Melbourne, Australia.
This conference is Organised by Financial Intelligence Units (FIUs) of over 100 countries.
This conference jointly called The Egmont Group, which was created to provide FIUs around the world a forum to exchange information confidentially to combat money-laundering, the financing of terrorism and other predicate offences.
The first “No Money for Terror” conference was held in France in 2018. India would host the next ‘No Money For Terror’ Conference in 2020.
Vice President inaugurates 10th Asian Conference of  Emergency Medicine :

Vice President M Venkaiah Naidu inaugurating 10th Asian Conference of Emergency Medicine in New Delhi.
The aim of the conference is to develop programs and manuals to train citizens in emergency first aid procedures such as Cardiopulmonary Resuscitation as it will help in saving a life while waiting for emergency services.
The Government of India has made it mandatory for all medical college hospitals to have full-fledged Emergency Departments by 2022 with an aim to improve trauma care.
PM Modi to visit Brazil for BRICS summit :

i. Prime Minister Narendra Modi will be on a 2-day visit to Brazil from the 13th of this month to attend the 11th BRICS Summit in Brasilia, Brazil.
ii. The theme of the Summit this year is “Economic Growth for an Innovative Future”. This will be the sixth time that Mr Modi participates in the BRICS Summit.
  Appointments
Sheikh Khalifa bin Zayed Al Nahyan re-elected as President of UAE :

The UAE’s Supreme Council of the Union has re-elected his Highness Sheikh Khalifa bin Zayed Al Nahyan as its President for a 4th five-year term, in accordance with the provisions of the UAE Constitution.
He was first elected President on November 3, 2004, following the death of his father Shaikh Zayed Bin Sultan Al Nahyan.
Arvind Singh takes over as AAI chairman :

Arvind Singh, a 1988-batch IAS officer of Maharashtra cadre, took charge as the chairman of the Airports Authority of India (AAI).
The AAI, which comes under the Ministry of Civil Aviation, owns and manages more than 100 airports across the country.
Prior to this appointment, Singh was the additional chief secretary (Energy) of Maharashtra government.
He also worked as chairman and managing director of Maharashtra State Power Generation Company Limited and Maharashtra State Electricity Transmission Company Limited.
Sanjay Gupta appoints country manager at Google India :

i. Google India has appointed Sanjay Gupta as its new country manager and vice-president of sales and operations for India.
ii. Gupta, the former Star and Disney India managing director, will contribute to Google’s efforts to expand the internet ecosystem in the country.
iii. He will take on the role early next year, working closely with the teams based in Gurugram, Hyderabad and Bengaluru.
iv. He replaces Rajan Anandan, who left Google to join Sequoia Capital India.
Reports/Ranks/Records
Maternal death rate declining: report

i. India’s Maternal Mortality Ratio (MMR) has seen a decline from 130 per 1 lakh live births in 2014-2016 to 122 per 1 lakh live births in 2015-2017.
ii. A decline of 8 points (6.2%) was observed during this period, according to the latest Sample Registration System (SRS) 2015-2017 bulletin for MMR released.
iii. Karnataka has shown the highest percentage decline in MMR, Uttar Pradesh and Madhya Pradesh have shown an increase by 15 points each in MMR.
iv. Rajasthan’s MMR has shown the highest decrease by 13 points, followed by Odisha (12 points) and Karnataka (11 points).
v. Maharashtra retained its second position with 55 (down from 61) and Tamil Nadu its third position with 63 (down from 66).
అవార్డులు
Gulab Kothari to be awarded Raja Ram Mohan Roy Award :

Rajasthan Patrika group chairman Gulab Kothari has been chosen for the prestigious Raja Ram Mohan Roy Award, presented by the Press Council of India, for his outstanding contribution towards journalism.
Sanjay Saini, Correspondent, Dainik Bhaskar, Mandi, and Raj Chengappa, Group Editorial Director, India Today, have been jointly named as winners of the award in the category of ‘Rural Journalism’.
మరణాలు
Dhrupad maestro Ramakant Gundecha no more :

i. Dhrupad maestro and Padma Shri awardee Ramakant Gundecha, 56, passed away. He was the younger one of the Gundecha brothers.
ii. The brothers performed Dhrupad, one of the oldest classical Hindustani musical forms in the world.
iii. They are also the founders of the Gurukul Dhrupad Sansthan in Bhopal.
ముఖ్యమైన రోజులు
9 November – Legal Services Day

i. Legal Services Day is observed on 9 November in India to raise awareness among the people where Legal Literacy is lacking.
ii. On this day, in 1995, the Legal Services Authorities Act was enforced.
కె.ఆర్. నారాయణన్ మరణం : 9 నవంబర్ 2005

i. కొచెరిల్ రామన్ నారాయణన్ (27 అక్టోబర్ 1920 - 9 నవంబర్ 2005) భారతదేశ 10వ రాష్ట్రపతి.
ii. పాత్రికేయుడిగా కొంతకాలం పనిచేసిన తర్వాత, ఉపకార వేతనం సహాయంతో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో రాజకీయ శాస్త్రాన్ని అధ్యయనం చేసాడు.
iii. నెహ్రూ ప్రభుత్వంలో భారత విదేశాంగ శాఖలో ఉద్యోగిగా నారాయణన్ తన వృత్తి జీవితాన్ని ప్రారంభించాడు. నారాయణన్ ప్రతిభను గుర్తించిన జవహర్ లాల్ నెహ్రూ ఆయనను రంగూన్ లోని భారత విదేశాంగ శాఖలో భారతదేశ ప్రతినిధిగా నియమించాడు. అతనిని దేశంలో అత్యుత్తమ దౌత్యవేత్తగా నెహ్రూ పేర్కొన్నాడు.
iv. ఇందిరాగాంధీ అభ్యర్థన మేరకు రాజకీయాలలోకి ప్రవేశించి, మూడు సార్లు వరుసగా లోక్సభకు ఎన్నికైనాడు. రాజీవ్ గాంధీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రివర్గంలో రాష్ట్ర మంత్రిగా పనిచేశాడు.1992 లో 9వ భారత ఉపరాష్ట్రపతిగా ఎన్నికైనాడు. 1997 న భారత రాష్ట్రపతిగా ఎన్నికయ్యాడు.
v. 1997 స్వాతంత్ర్య స్వర్ణోత్సవ సంవత్సరం. ఆ సంవత్సరం ఒక దళితుడు రాష్ట్రపతిగా పదవినలంకరించడం దేశంలో ఒక మంచి మార్పుగా పేర్కొనబడింది. నారాయణన్ స్వతంత్ర, దృఢమైన అధ్యక్షుడిగా పేరుపొందాడు. అతను కొన్ని సంప్రదాయాలకు శ్రీకారం చుట్టి, రాజ్యాంగ కార్యాలయ పరిధిని విస్తరించాడు.
vi. అతను తనకు తాను "రాజ్యాంగం నాలుగు మూలల పరిథిలో" పనిచేసే "వర్కింగ్ ప్రెసిడేంట్" గా అభివర్ణించుకున్నాడు. ప్రత్యక్ష అధికారం కలిగిన "ఎగ్జిక్యూటివ్ అధ్యక్షుడు", ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నించకుండా లేదా చర్చ లేకుండా ఆమోదించే "రబ్బర్ స్టాంపు ప్రెసిడెంట్" కు మధ్యస్థమిది.
vii. అతను అధ్యక్షుడిగా తన విచక్షణాధికారాన్ని ఉపయోగించాడు. అనేక సందర్భాల్లో సాంప్రదాయిక పద్ధతుల నుండి ప్రక్కకు జరిగి వ్యవహరించాడు. వాటిలో హంగ్ పార్లమెంట్ లో ప్రధాన మంత్రి నియామకం, రాష్ట్ర ప్రభుత్వాన్ని తొలగిస్తూ, కేంద్ర మంత్రివర్గం ప్రతిపాదనపై అక్కడ రాష్ట్రపతి పాలన విధించడం, కార్గిల్ పోరాట సమయంలో నిర్ణయాలు కూడా ఉన్నాయి.
viii. అతను భారత స్వాతంత్ర్య స్వర్ణోత్సవ వేడుకలకు అధ్యక్షత వహించాడు. 1998 లో జరిగిన దేశ సాధారణ ఎన్నికలలో, పదవిలో ఉండగా ఓటు వేసిన మొదటి భారత రాష్ట్రపతి అయ్యాడు.
క్రీడలు
భారత్లో 2023 హాకీ ప్రపంచకప్ :

i. పురుషుల హాకీ ప్రపంచకప్కు వరుసగా రెండోసారి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. 2023 జనవరి 13 నుంచి 29 వరకు భారత్లో ప్రపంచకప్ జరుగుతుందని అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ప్రకటించింది.
ii. ఎఫ్ఐహెచ్ ఎగ్జిక్యూటివ్ బోర్డు భేటీలో 2022 మహిళల ప్రపంచకప్ నిర్వహణ బాధ్యతను స్పెయిన్, నెదర్లాండ్స్లకు ఉమ్మడిగా అప్పగించింది.
iii. గతంలో భారత్ (1982 ముంబయి, 2010 దిల్లీ, 2018 భువనేశ్వర్), నెదర్లాండ్స్ మూడేసి సార్లు పురుషుల ప్రపంచకప్కు ఆతిథ్యమిచ్చాయి.
iv. 2023 టోర్నీ తర్వాత ప్రపంచకప్ను అత్యధికంగా నాలుగు సార్లు నిర్వహించిన దేశంగా భారత్ రికార్డు సృష్టిస్తుంది.
సిక్సర్ల రోహిత్ శర్మ :

వన్డేల్లో..
i. అత్యధిక సిక్సర్లు (232) బాదిన భారత ఆటగాడు.
ii. ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే అఫ్రిది (351), గేల్ (331), జయసూర్య (270) తర్వాత నాలుగో స్థానంలో ఉన్నాడు.
iii. ఒక మ్యాచ్లో అత్యధిక సిక్సర్లు (16) కొట్టిన రెండో ఆటగాడు. ఇయాన్ మోర్గాన్ (17) తొలి స్థానంలో కొనసాగుతున్నాడు.
టీ20ల్లో..
iv. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక సిక్సర్ల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. అతని ఖాతాలో ప్రస్తుతానికి 115 సిక్సర్లున్నాయి. మార్టిన్ గప్తిల్ (108) రెండో స్థానంలో ఉన్నాడు.
టెస్టుల్లో..
v. అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత బ్యాట్స్మెన్ జాబితాలో ఆరో స్థానం (51)లో ఉన్నాడు. సెహ్వాగ్ (91), ధోని (78), సచిన్ (69), కపిల్ దేవ్ (61), గంగూలీ (57) ముందున్నారు.
vi. ఓ మ్యాచ్లో అత్యధిక సిక్సర్ల (13) రికార్డు రోహిత్ ఖాతాలోనే ఉంది. ఇటీవల దక్షిణాఫ్రికాతో సిరీస్లో అతడు వసీమ్ అక్రమ్ (12)ను అధిగమించాడు.
చింకీకి టోక్యో బెర్తు @ఆసియా షూటింగ్

i. భారత యువ షూటర్ చింకీ యాదవ్ టోక్యో ఒలింపిక్స్ బెర్తు సంపాదించింది. ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్లో 25 మీటర్ల మహిళల పిస్టల్ విభాగంలో ఫైనల్కు వెళ్లిన చింకీ.. పతకం సాధించలేకపోయినా భారత్కు ఒలింపిక్ కోటా స్థానాన్ని అందించింది.
ii. ఇంతకుముందు రాహి సర్నోబత్ బెర్తు సంపాదించింది.

No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...