✍ కరెంట్ అఫైర్స్ 25 అక్టోబరు 2019 Friday ✍
జాతీయ వార్తలు
లోక్సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలో సమస్తీపుర్లో LJP.. సతారాలో NCP విజయం :
దేశంలో 2 లోక్సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలకు గాను బిహార్లోని సమస్తీపుర్లో లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) అభ్యర్థి ప్రిన్స్రాజ్ కాంగ్రెస్ అభ్యర్థిపై విజయం సాధించారు.
మహారాష్ట్రలోని సతారాలో ఎన్సీపీ అభ్యర్థి శ్రీనివాస్ దాదాసాహెబ్ పాటిల్ 87 వేల ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఈ రెండు లోక్సభ స్థానాలను ఇదివరకు గెలుచుకున్నపార్టీలే చేజిక్కించుకున్నాయి.
Union Cabinet approves merger of BSNL and MTNL
• The Union Cabinet chaired by Prime Minister Narendra Modi has approved the merger of loss-making telecom firms BSNL and MTNL as part of a revival package.
• The Cabinet has also given in-principle nod to the merger of BSNL and MTNL and till modalities are in place, MTNL will be a subsidiary of BSNL
• The revival package includes raising sovereign bonds, monetising assets and voluntary retirement scheme (VRS) for employees.
• The revival package for BSNL and MTNL includes raising of Rs 15,000 crore sovereign bonds and monetising Rs 38,000 crore of assets in next 4 years. Under the package, 4G spectrum worth Rs 20,000 crore will be administratively allotted to the two firms.
తెలంగాణ వార్తలు
కారుదే హుజోర్నగర్. 43,358 ఓట్ల ఆధిక్యంతో సైదిరెడ్డి విజయం :
హుజూర్నగర్ ఉప ఎన్నికలో అధికార తెరాస పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థిని నలమాద పద్మావతిపై 43,358 ఓట్ల భారీ ఆధిక్యంతో గెలుపొందారు.
దశాబ్దకాలంగా కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో గత మూడు పర్యాయాలుగా చేజారిన విజయాన్ని గులాబీ పార్టీ ఈసారి ఒడిసి పట్టుకుంది.
హుజూర్నగర్ నియోజకవర్గాన్ని 1972లో రద్దు చేసి తిరిగి 2009లో పునరుద్ధరించారు. 2009కి ముందు కోదాడ, మిర్యాలగూడ నియోజకవర్గాల్లో భాగంగా ఉండేది.
పునర్విభజన తర్వాత ఉత్తమ్ 2009, 2014, 2018 సంవత్సరాలలో హుజూర్నగర్లో తెరాసపైనే విజయం సాధించారు. 2009లో ప్రస్తుత మంత్రి జగదీశ్రెడ్డిపై 29,194 ఓట్లు, 2014లో తెలంగాణ ఉద్యమ అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మపై 23,924 ఓట్లు, గతేడాది డిసెంబరులో ప్రస్తుత విజేత సైదిరెడ్డిపై 7,466 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.
ఎట్టకేలకు నాలుగో ప్రయత్నంలో తెరాస గెలిచింది. సైదిరెడ్డికి వచ్చిన 43,358 ఓట్లే నియోజకవర్గ చరిత్రలో అత్యధికం.
ఇతర రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల వార్తలు
మహారాష్ట్రలో కాషాయం.. హరియాణాలో హంగ్ :
• మహారాష్ట్ర, హరియాణాల్లో సంపూర్ణ ఆధిక్యం సాధిస్తామన్న కమలనాథుల ఆశలకు గండిపడింది. అనూహ్యంగా విపక్షాలు బలం పెంచుకున్నాయి. ఆసక్తికరంగా సాగిన ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా ఏకైక అతిపెద్ద పార్టీగా నిలిచింది.
• మహారాష్ట్రలో మిత్రపక్షమైన శివసేనతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యా బలాన్ని భాజపా సాధించినా.. ఏ పార్టీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడనుంది.. అధికార సర్దుబాటు ఏ రీతిన ఉండబోతుందన్నది స్పష్టం కావాల్సి ఉంది.
• ఠాక్రే కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో మహారాష్ట్ర అసెంబ్లీలో అడుగు పెట్టడం ద్వారా ఆదిత్య ఠాక్రే చరిత్ర సృష్టించారు. ఈయన శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే కుమారుడు. వయసు 29 ఏళ్లు.
హరియాణా :
• హరియాణాలో ప్రభుత్వ ఏర్పాటుకు భాజపా కేవలం 6 స్థానాల దూరంలో నిలిచిపోయింది.ఏ పార్టీకీ స్పష్టమైన సంఖ్యాబలం లేకపోవడంతో కొత్తగా ఏర్పాటైన జన్నాయక్ జనతా పార్టీ అధినేత దుష్యంత్ చౌతాలా, స్వతంత్రులు కీలకంగా మారారు.
• గత ఎన్నికల్లో భాజపా, శివసేన విడివిడిగా పోటీ చేసినా నెలరోజుల తర్వాత కలిసిపోయాయి. ఈసారి ముందే పొత్తు పెట్టుకుని విజయం సాధించాయి.
• హరియాణాలో 90 స్థానాలకు గాను 40 చోట్ల నెగ్గి భాజపా ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. 31 స్థానాలతో కాంగ్రెస్ రెండోస్థానంలో నిలిచింది. ప్రాంతీయ పార్టీల్లో జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) 10 చోట్ల నెగ్గగా.. మిగిలిన 9 స్థానాల్లో ఇతర పార్టీలు, స్వతంత్రులు గెలుపొందారు.
• జేజేపీ ఎవరికి మద్దతు ఇస్తుందనేది ఆ పార్టీ నేత దుష్యంత్ చౌతాలా స్పష్టం చేయలేదు.
• మంత్రులుగా కూడా పనిచేసిన అనుభవం లేకపోయినా దేవేంద్ర ఫడణవీస్, మనోహర్లాల్ ఖట్టర్లు సీఎంలుగా ప్రజల విశ్వాసం చూరగొన్నారు.
• హరియాణా ఎన్నికల బరిలో భాజపా తరఫున బరిలోకి దిగిన మల్లయోధులు బబితా ఫోగాట్, యోగేశ్వర్దత్తో పాటు టిక్టాక్ తార సోనాలి ఫోగాట్ కూడా మట్టికరిచారు. భారత హాకీజట్టు మాజీ సారథి సందీప్సింగ్ మాత్రం భాజపా తరఫున గెలిచారు.
రాజకీయ వార్తలు
దుష్యంత్ జేజేపీ. హరియాణాలో కీలకంగా మారిన యువనేత :
మాజీ ఉప ప్రధాని దేవీలాల్కు మునిమనవడు. తాత ఓం ప్రకాశ్ చౌతాలా హరియాణా మాజీ ముఖ్యమంత్రి. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం నుంచి వాణిజ్యశాస్త్రంలో దుష్యంత్ పట్టభద్రుడు.
2014లో యువ ఎంపీగా దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకట్టుకున్న ఆయన ఇప్పుడు హరియాణాలో ప్రభుత్వ ఏర్పాటులోనూ కీలకం కాబోతున్నారు.
31 ఏళ్ల యువనేత జననాయక్ జనతా పార్టీ (JJP)ని సొంతంగా ఏర్పాటు చేసి పట్టుమని పది నెలలే అయింది. అయినా 90 సీట్లున్న రాష్ట్రంలో 10 స్థానాల్లో గెలిచి చక్రం తిప్పబోతున్నారు.
ఓం ప్రకాశ్ చౌతాలా గత ఏడాది తన పార్టీ నుంచి దుష్యంత్ను, అజయ్సింగ్ను బహిష్కరించారు. ఇండియన్ నేషనల్ లోక్దళ్ (ఐఎన్ఎల్డీ) పార్టీ నుంచి వచ్చేసిన నలుగురు సిటింగ్ ఎమ్మెల్యేలతో జేజేపీని దుష్యంత్ నెలకొల్పారు.
హరియాణాలోని హిస్సార్ నుంచి 2014లో 26 ఏళ్ల ప్రాయంలోనే ఎంపీ అయి, దేశంలో పిన్న వయస్కుడైన లోక్సభ సభ్యుడిగా దుష్యంత్ గుర్తింపు తెచ్చుకున్నారు.
Defence News
Indian Army to conduct 2019 “Sindhu Sudarshan” exercise 2019 in Rajasthan deserts
• The Indian Army (IA) is to conduct exercise codenamed “Sindhu Sudarshan” for the year 2019 in the deserts of Rajasthan from November 29 to December 4, 2019.
• The aim of this exercise is to evaluate the capability of the defence services in an integrated air-land battle.
• In the Sindhu Sudarshan exercise, operational efficiency of the Strike Corps fighting in the desert terrain will be assessed and the Indian Air Force(IAF) will provide support in terms of destruction of targets and airlifting troops.
• The exercise showcasing a high degree of synergy between the Army and Air Force will be reviewed by Lieutenant General SK Saini.
Persons in news
Deepika Padukone, PV Sindhu named as ambassadors for ‘Bharat Ki Laxmi’ initiative
• Bollywood actress Deepika Padukone and Indian badminton player PV Sindhu were named the ambassadors for Bharat Ki Laxmi. It is an initiative by Prime Minister Shri Narendra Modi.
• The aim of this initiative is to celebrate the contribution & accomplishments of women of the nation for the public good. The hashtag for the initiative is #BharatKiLaxmi.
Reports/Ranks/Records
Ease of doing business rankings : India @63. న్యూజిలాండ్ తొలి స్థానం
సులువుగా వ్యాపారం చేసుకునేలా వీలు కల్పించే దేశాల్లో భారత్ ఏకంగా 14 స్థానాలు ఎగబాకి 63వ స్థానానికి చేరింది. ‘డూయింగ్ బిజినెస్-2020’ నివేదికలో ప్రపంచ బ్యాంకు ఈ విషయాన్ని ప్రకటించింది.
వరుసగా మూడో ఏడాది మెరుగైన పనితీరు ప్రదర్శించిన దేశాల్లో భారత్ టాప్-10లో నిలవడం గమనార్హం. ప్రపంచ బ్యాంకు గత ఏడాది మొత్తం 190 దేశాలకిచ్చిన ర్యాంకింగ్లలో 77వ స్థానంలో ఉన్న భారత్ ఈసారి 63వ స్థానానికి చేరడం గమనార్హం.
మోదీ 2014లో అధికారంలోకి వచ్చే సమయంలో భారత్ 142వ స్థానంలో ఉంది. నాలుగేళ్ల సంస్కరణలతో 2018 నివేదికలో 100వ ర్యాంకుకు చేరింది.
సులభతర వాణిజ్యంలో న్యూజిలాండ్ తొలి స్థానంలో నిలిచింది. సింగపూర్(2), హాంకాంగ్(3), డెన్మార్క్(4), కొరియా(5), అమెరికా(6)ల కంటే ముందు నిలిచింది.
ఇన్నేళ్లుగా నగరాల జాబితాలో దిల్లీ, ముంబయిల వరకే నివేదిక పరిగణనలోకి తీసుకుంటోంది. వచ్చే ఏడాది కోల్కతా, బెంగళూరులను ర్యాంకింగ్ సూచీలో కలపనున్నారు.
BOOKS
“Ten Studies in Kashmir: History and Politics” – By Kashi Nath Pandit
• An Indian historian, educationist and Padma Shri recipient, Kashi Nath Pandit’s new book entitled “Ten Studies in Kashmir: History and Politics”, published by Academic Foundation.
• A new book looks at the riveting history of Jammu and Kashmir from the time of its political and geographic consolidation to the abrogation of the state’s special status.
• The book, which comes after the scrapping of Article 370 provisions in August, will shed light on the happenings from 1947 till the revocation of the special status of the state.
No comments:
Post a Comment