Tuesday, 5 November 2019

2nd november 2019 current affairs


✍  కరెంట్ అఫైర్స్ 2 నవంబరు 2019 Saturday ✍



తెలంగాణ వార్తలు

చేప పిల్లల విత్తనోత్పత్తిలో ‘పోచంపాడు’ ప్రథమం :

    

i. నిజామాబాద్ జిల్లా పోచంపాడులోని చేప పిల్లల విత్తనోత్పత్తి కేంద్రం రాష్ట్రంలోనే అధిక ఉత్పత్తి సాధించి ఈ ఏడాది ప్రథమ స్థానంలో నిలిచింది. 

ii. 75 లక్షల చేప పిల్లల ఉత్పత్తితో పోచంపాడు కేంద్రం రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచినట్లు కేంద్ర మత్స్యశాఖ అధికారి రాజనర్సయ్య పేర్కొన్నారు. 

iii. ఖమ్మం జిల్లాలోని వైరా చేప పిల్లల ఉత్పత్తి కేంద్రం 24 లక్షల ఉత్పత్తితో రెండో స్థానంలో ఉందన్నారు.

ఇతర రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల వార్తలు

ఝార్ఖండ్లోనూ నగారా. 30 నుంచి 5 దశల్లో అసెంబ్లీ ఎన్నికలు :



i. ఝార్ఖండ్లో నగారా మోగింది. రాష్ట్రంలోని 81 అసెంబ్లీ స్థానాలకు నవంబరు 30 నుంచి డిసెంబరు 20 తేదీల మధ్య 5 దశల్లో ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల సంఘం (ఈసీ) నిర్ణయించింది. 

ii. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోడా, మరో కమిషనర్ సుశీల్చంద్ర దిల్లీలో వెల్లడించారు. ఝార్ఖండ్లో 19 జిల్లాలు నక్సల్ ప్రభావిత ప్రాంతాలు కావడంతో 5 దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 

iii. ఝార్ఖండ్ అసెంబ్లీ అయిదేళ్ల కాలపరిమితి వచ్చే జనవరి 5న ముగుస్తుంది. గత ఎన్నికల్లో ఇక్కడ ఆల్ ఝార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్తో కలిసి భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఐదేళ్లపాటు రఘుబర్దాస్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. 

iv. 1967వరకు అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు ఒకేసారి జరుగుతూ వచ్చినా, ఆ తర్వాత భిన్న రాజకీయ కారణాల వల్ల రెండింటి మధ్య సమతౌల్యం దెబ్బ తిందని అన్నారు.

జమ్మూ-కశ్మీర్లో..

v. కొత్తగా ఏర్పడిన జమ్మూ-కశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ స్థానాల పెంపునకు అవసరమైన డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటుకు కేంద్ర హోం శాఖ గానీ, న్యాయశాఖ గానీ నోటిఫికేషన్ జారీచేస్తే.. వెంటనే పని మొదలుపెట్టడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు సునీల్ అరోడా వెల్లడించారు. 

vi. ఆ రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్ 61 ప్రకారం అసెంబ్లీ సీట్లు 107 నుంచి 114కి పెరగాల్సి ఉందన్నారు. ఇందులో 24 సీట్లు పాక్ ఆక్రమిత కశ్మీర్లోనివి కాబట్టి వాటిని పక్కన పెడితే భారత్ భూభాగంలోని జమ్మూకశ్మీర్లో సీట్లు 83 నుంచి 90కి పెంచాల్సి ఉందని పేర్కొన్నారు. 

అంతర్జాతీయ వార్తలు

World’s first blockchain-based carbon trading exchange in Singapore :

  

Singapore-based AirCarbon Pte launched the worlds’ first blockchain-based carbon trading exchange.

This will allow airlines and other corporate buyers to buy as well sell tokens backed by carbon offset credits approved by the International Civil Aviation Organisation.

The company is applying to the Monetary Authority of Singapore for a recognized market operator license and targets for the exchange to be fully operational in 2020.

Defence News

Women to be inducted in Army by end-2021 :



i. Over 100 shortlisted for military police. So far, women have been inducted only as officers in the Army.

ii. The first batch of 100 women will start training for the Corps of Military Police (CMP) in December and will be inducted by end-2021, said Lt. Gen. Ashwani Kumar, who superannuated as the Adjutant General (AG).

iii. Women officers commissioned from April 2020 onwards can opt for it in six streams. It will take two years to train them. By the end of 2021, we will have the first batch of women in CMP.

iv. The Army plans to induct 1700 women MP over 17 years.

సదస్సులు

Spain to host COP25 climate summit in Dec :

  

i. Spain will host the Conference of the Parties (COP 15) climate summit in December, the UN said, after Chile abandoned plans to hold it due to deadly anti-government protests.

ii. “We are pleased to announce the COP Bureau has agreed that COP25 will take place from 2-13 December in Madrid,” United Nations climate chief Patricia Espinosa said.

35th ASEAN Summit begins in Bangkok :



The 35th ASEAN Summit began in Bangkok, Thailand from October 31 to 4 November.

The Association of Southeast Asian Nations (ASEAN) is a group of ten member countries that encourages political, economic and social co-operation in the region.

The theme of the summit for this year is “Advancing Partnership for Sustainability”.

Apart from leaders of 10 ASEAN countries head of Eight dialogue partner countries including India, USA, China, Japan, Republic of Korea, Australia and New Zealand are also participating in the summit.

East Asia Summit (EAS) and Regional Comprehensive Economic Summit ( RCEP) will be also held on the sidelines of 35th ASEAN Summit.

అవార్డులు

Writer Anand bags Ezhuthachan Puraskaram :

  

i. Noted writer Anand has been selected for the 27th Ezhuthachan Puraskaram, the highest literary honour of the Kerala government. 

ii. Minister for Culture A.K. Balan told that right from his novel Aalkoottam, Mr. Anand had been portraying the unique crises that the nation had witnessed with a rare finesse.

మరణాలు

విశ్రాంత ఐపీఎస్ అధికారి‘పద్మభూషణ్’ఆనందరామ్ కన్నుమూత :



i. విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీనివాస ఆనందరామ్(92) హైదరాబాద్లో కన్నుమూశారు. 1950లో ఐపీఎస్ అధికారిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన ఎస్.ఆనందరామ్ ఇందిరాగాంధీ హత్య కేసు విచారణకు ఏర్పాటు చేసిన సిట్ ప్రత్యేక అధికారిగా వ్యవహరించారు. 

ii. 1982-83లో ఉమ్మడి రాష్ట్ర డీజీపీగా, అనంతరం సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్గా విధులు నిర్వహించారు. 

iii. 1987లో అప్పటి రాష్ట్రపతి జైల్సింగ్ చేతులమీదుగా పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకొన్నారు. 1994లో అసాసినేషన్ ఆఫ్ ఏ ప్రైమ్ మినిస్టర్ పుస్తకాన్ని ఆయన రచించారు. 

ముఖ్యమైన రోజులు

గూడ అంజయ్య 64వ జయంతి – 1 నవంబర్ 1955

   

i. గూడ అంజయ్య (1 నవంబర్ 1955 - జూన్ 21, 2016)తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ గేయ కవి, కథా రచయిత. 1955లో ఆదిలాబాద్ జిల్లా, దండేపల్లి మండలం, లింగాపురం గ్రామంలో అంజయ్య జన్మించాడు. 

ii. ఆయన వ్రాసిన "ఊరు మనదిరా" పాట 16 భాషలలో అనువాదమయింది. ఆయన తెలంగాణ సాంస్కృతిక సంఘ నాయకునిగా పనిచేసాడు.

iii. కేవలం ప్రజా సమస్యలే కాదు.. తెలంగాణ పోరాటంలోనూ గూడ అంజయ్య కీలక పాత్ర పోషించారు. తొలి దశ ఉద్యమంలో అనేక ఆందోళనల్లో పాల్గొన్నారు. 1975లో ఎమర్జెన్సీ టైంలో తెలంగాణ నినాదంతో ముందుకెళ్లడంతో.. జైలు జీవితం కూడా గడపాల్సి వచ్చింది. అయినా ప్రజా ఉద్యమ బాటను వీడలేదు. మలిదశ ఉద్యమంలోనూ తనవంతు పాత్ర పోషించారు అంజయ్య. 

iv. పాటలతో ఉద్యమానికి ప్రాణం పోశారు. రసమయి బాలకిషన్ తో కలిసి ధూం…ధాం.. ప్రారంభించి ఉద్యమానికి కొత్త శక్తినిచ్చారు. అయ్యోనివా.. అవ్వోనివా అంటూ వలస పాలకులను ప్రశ్నిస్తూ.. ఉస్మానియా క్యాంపస్ లో ఉదయించిన కిరణమా అంటూ యువతలో పోరాట స్పూర్తిని నింపారు.

v. అరుణోదయ సాంస్కృతిక సంస్థను స్థాపించి జనంనోట విన్న పదాలనే పాటలుగా రాసి బాణీలు కట్టి తెలుగురాష్ర్టం మెత్తం తిరుగుతూ ప్రజల నుండి నేర్చుకుంటూ, ప్రజల ఆలోచనల్లో మార్పుకోసం తన పాటల ద్వారా ప్రజల్లో చైతన్యాన్ని కలిగించాడు.

vi. ప్రజానాట్యమండలి, అరుణోదయ కళాసంస్థల ద్వారా తన గళాన్ని ప్రపంచానికి వినిపించారు. తెలంగాణ సాంస్కృతిక సంఘ నాయకుడిగాకూడా పనిచేశారు. పలు సినిమాల్లోనూ నటించారు. అవార్డుల కోసం ఏనాడు పాట రాయలేదంటారాయన. కేవలం పేదోడికోసమే తన పాటను అంకితం చేశానని ధైర్యంగా చెబుతారు.

vii. 1988 రజనీ తెలుగు సాహితీ సమితి అవార్డు, 1986లో సాహిత్య రత్న బంధు, 2000 లో గండె పెండేరా బిరుదుతో సత్కారం, 2004లో నవ్య సాహిత్య పరిషత్ నుంచి డాక్టర్ మలయశ్రీ సాహితీ అవార్డు అంజయ్యను వరించాయి. 

viii. 2015లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాహితీ పురస్కారంతో సత్కరించింది. 2015లో సుద్దాల హన్మంతు-జానకమ్మ స్మారక పురస్కారాన్ని అందుకున్నారు.

ix. కొంతకాలంగా కామెర్లు, మూత్రపిండాల వ్యాధితో బాధపడిన ఆయన జూన్ 21, 2016 రంగారెడ్డి జిల్లా రాగన్నగూడలోని స్వగృహంలో ప్రాణాలు విడిచాడు.

x. రచనలు : పొలిమేర, నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు, ఊరు మనదిరా ఈ వాడ మనదిరా, అయ్యోనివా నువ్వు అవ్వోనివా తెలంగాణోనికి తోటి పాలోనివా?, రాజిగా ఓరి రాజిగా, లచ్చులో లచ్చన్న.. ఈ లుచ్చాగాళ్ళ రాజ్యంలో బిచ్చగాళ్ల బతుకులాయే, తెలంగాణ గట్టుమీద సందమామయ్యో.

2 November 1976 : Lok Sabha passed the 42nd Amendment to the Constitution



i. నవంబర్ 2, 1976న, లోక్ సభ రాజ్యాంగం (నలభై రెండవ సవరణ) చట్టం, 1976 ను ఆమోదించింది, ఇది దేశ రాజ్యాంగంలో భారీ మార్పులు చేసింది మరియు దీనిని ‘చిన్న-రాజ్యాంగం’ అని పిలుస్తారు.

ii. 42 వ సవరణ చట్టం 1976 లో అత్యవసర సమయంలో (జూన్ 1975 - మార్చి 1977) అమలు చేయబడింది. ఆ సమయంలో పాలించిన కాంగ్రెస్ పార్టీ దీనిని అమలు చేసింది. అందువల్ల దీనికి ‘ఇందిరా రాజ్యాంగం’ అనే పేరు కూడా వచ్చింది. 42 వ సవరణ చట్టం భారత రాజ్యాంగంలో అనేక మార్పులను తీసుకువచ్చింది.

iii. ఈ సవరణ పార్లమెంటును దేశంలోని అత్యున్నత సంస్థగా మార్చింది.

iv. న్యాయవ్యవస్థ అధికారాలు తగ్గించబడ్డాయి. ఇది ఎన్నికల వివాదాలను కోర్టుల పరిధి నుండి తొలగించింది. న్యాయ సమీక్ష లేకుండా రాజ్యాంగ సవరణలు చేసే అధికారాన్ని కూడా పార్లమెంటుకు ఇచ్చింది.

v. ఈ సవరణ సుప్రీంకోర్టు పరిశీలన నుండి రాష్ట్ర పాలసీ యొక్క ఆదేశిక సూత్రాలు (DSP) ను సురక్షితంగా కొనసాగించడానికి రూపొందించబడిన చట్టాలను కూడా చేసింది. ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కారణంతో ఇటువంటి చట్టాలను కోర్టులు చెల్లవని పేర్కొంది. అందువల్ల, ఈ సవరణ ప్రాథమిక హక్కుల యొక్క ప్రాముఖ్యతను తగ్గించింది.

vi. ఈ సవరణ దేశ సమాఖ్య నిర్మాణాన్ని కూడా బలహీనపరిచింది. లోక్సభ, రాష్ట్ర శాసనసభల పదవీకాలం 5 నుంచి 6 సంవత్సరాలకు పెంచారు. ఇళ్లలోని కోరమ్లను ప్రతి ఇళ్ల నిబంధనల ప్రకారం పరిష్కరించడానికి మిగిలిపోయారు.

vii. 44వ సవరణ చట్టాన్ని ప్రభుత్వం 1978లో ప్రవేశపెట్టింది. 42వ సవరణ చట్టం 1976 చేసిన సవరణలను రద్దు చేయడానికి ఈ చట్టం తీసుకురాబడింది:

క్రీడలు

India drops to 106th in FIFA Men’s rankings :

  

The Indian football team dropped two places to 106th position in the latest FIFA rankings.

The downward slid came following the Blue Tigers’ 1-1 draw against lower-ranked Bangladesh in the FIFA World Cup qualifier earlier this month.

Bangladesh, however, benefitted from the draw, jumping three rungs to 184th spot.

Belgium has managed to hold on to the top spot, followed by France and Brazil.

England is placed fourth ahead of Uruguay, Portugal, Croatia, Spain, Argentina and Colombia.

No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...