Wednesday, 27 November 2019

26th november 2019 current affairs

    కరెంట్ అఫైర్స్ 26 నవంబరు 2019 Tuesday  

 జాతీయ వార్తలు

దేశంలో 16వ సారి జనగణన :
 
i. దేశంలో 1872 నుంచి ప్రతీ పదేళ్లకోమారు జనగణన చేస్తున్నారు. ఇప్పుడు చేస్తున్నది 16వ సారి. స్వాతంత్య్రం వచ్చాక 8వ సారి. తొలిసారి డిజిటల్ విధానంలో ట్యాబ్లో జనాభా లెక్కల నమోదుకు నిర్ణయించారు.
ii. జిల్లా స్థాయిలో కలెక్టర్, మండల స్థాయిలో తహసీల్దార్ జనగణనకు ముఖ్య అధికారులుగా వ్యవహరిస్తారు. పట్టణాల్లో పురపాలక కమిషనర్లకు ఈ బాధ్యతలిచ్చారు.
iii. జాతీయ జనాభా రికార్డు   (ఎన్పీఆర్)లో కుటుంబాలు, కట్టడాల వివరాలన్నీ రికార్డు చేస్తారు. ఇంతకుముందు ఈ లెక్కలను 2010లో తీసుకున్నారు.
iv. రాష్ట్ర జనగణన సంచాలకుడిగా ఐఏఎస్ అధికారి ఇలంబర్తిని నియమించారు.
 ఆంధ్రప్రదేశ్ వార్తలు
అవినీతిపై ఫిర్యాదులకు.. 14400..  ప్రత్యేక కాల్సెంటర్ నంబరును ప్రారంభించిన ఏపీ సీఎం జగన్ :

i. అవినీతిపై ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక కాల్ సెంటర్ నంబరు 14400ను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది.
ii. ఫిర్యాదు అందిన 15 నుంచి 30 రోజుల్లో దర్యాప్తు పూర్తిచేసి తగిన చర్యలు తీసుకోవాలి. జవాబుదారీతనంతో పనిచేసి, ఫిర్యాదులకు పరిష్కారం చూపినపుడే వ్యవస్థపై నమ్మకం కలుగుతుంది. ఆ దిశగా సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలి అని ఆదేశించారు.
సైన్స్ అండ్ టెక్నాలజీ
భూకంపాలు, సునామీలను మెరుగ్గా గుర్తించే సాధనం :
 
i. భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వత విస్ఫోటాలను మెరుగ్గా గుర్తించే అద్భుత సాధనాన్ని అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇది సముద్ర గర్భంలో చిన్నపాటి కదలికలు, మార్పులను సైతం ఇట్టే పసిగట్టేస్తుంది.
ii. సముద్ర గర్భాన్ని పర్యవేక్షించేందుకు ప్రస్తుతం అనేక విధానాలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇతరత్రా ధ్వనుల జోక్యం తక్కువగా ఉండే సముద్ర లోతుల్లోనే అవి బాగా పనిచేస్తాయి.
iii. తీరానికి చేరువలో లోతు తక్కువగా ఉండే ప్రాంతాల్లో పరిస్థితులను గమనించడం చాలా సవాళ్లతో కూడుకున్న వ్యవహారం.  ఇందుకోసం శాస్త్రవేత్తలు ‘షాలో వాటర్ బోయ్’ను రూపొందించారు. సముద్రంలో చమురు, సహజవాయువు అన్వేషణకూ ఇది ఉపయోగపడుతుంది.
Reports/Ranks/Records
Greenhouse gases hit a new record in 2018 : WMO

i. Greenhouse gases in the atmosphere hit a new record in 2018, the World Meteorological Organization said.
ii. The concentration of carbon dioxide surged from 405.5 ppm in 2017 to 407.8 ppm in 2018, exceeding the average annual increase of 2.06 ppm in 2005-2015. The annual increase in methane was the highest since 1998, said the report.
BOOKS
‘హేమంత్ కర్కరే - ఏ డాటర్స్ మెమొయిర్’ – By జూయ్ నవారే

i. 26/11 దాడులు... ప్రపంచాన్నే ఉలిక్కిపడేలా చేసిన మారణహోమం. ఆ దాడుల్లో వెన్నుచూపక ముందుకెళ్లిన పోలీస్ అధికారి హేమంత్ కర్కరే అని చెప్పక్కర్లేదు.
ii. ఆ అమరుడి జీవితాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తోంది ఆయన కూతురు. తండ్రిపై పుస్తకం రాసి నేడు(26/11/2019) విడుదల చేస్తోంది.
iii. చివరి క్షణం వరకూ దేశం కోసం పోరాడిన అతని గురించి ప్రపంచానికి తెలియజేయాలనుకుంది ఆయన కూతురు 38ఏళ్ల జూయ్ నవారే. ‘హేమంత్ కర్కరే-ఏ డాటర్స్ మెమొయిర్’ పేరుతో పుస్తకం రాసింది. ఈ ఏడాది నవంబరు 26న కర్కరే 11వ వర్ధంతి సందర్భంగా ముంబయిలో ఆవిష్కరించనుంది.
సినిమా వార్తలు
అయోధ్య కేసు నేపథ్యంలో కంగన చిత్రం ‘అపరాజిత అయోధ్య’ :

i. ఎన్నో వివాదాలకు, ఉద్రిక్తతలకు కారణమైన అయోధ్య అంశం నేపథ్యంగా త్వరలో ఓ చిత్రాన్ని నిర్మించనున్నట్లు ప్రముఖ బాలీవుడ్ నాయిక కంగనా రనౌత్ ప్రకటించింది.
ii. ‘అపరాజిత అయోధ్య’ పేరుతో దీన్ని తెరకెక్కించనున్నట్లు వెల్లడించింది. ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్టును అందించబోతున్నారు.
ముఖ్యమైన రోజులు
70వ రాజ్యాంగ దినోత్సవం (Constitution Day of India) – 26 నవంబర్

  భారత రాజ్యాంగాన్ని ఆమోదించి 70 ఏళ్లు అవుతున్న సందర్భంగా... పార్లమెంటు సెంట్రల్ హాల్లో రాజ్యాంగ దినోత్సవం (సంవిధాన్ దివస్) జరుగనుంది.
  రాజ్యసభ 250వ సమావేశాలకు గుర్తుగా రూపొందించిన రూ.250 విలువైన వెండి నాణేన్ని... ఈ సందర్భంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి  వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ ఆవిష్కరిస్తారు.
  ఇప్పటివరకూ జరిగిన 103 రాజ్యాంగ సవరణలకు సంబంధించిన వివరాలతో కూడిన సంకలనాన్నీ వారు విడుదల చేస్తారు. ‘రాజ్యసభ: ద జర్నీ సిన్స్ 1952’ శీర్షికన దీన్ని సిద్ధం చేసినట్టు రాజ్యసభ సచివాలయం తెలిపింది.
  రాజ్యాంగ్యాన్ని తొలిసారిగా 1951లో ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమార్థం సవరించగా... చివరిసారిగా ఆర్థికంగా వెనుకబడిన వారికి విద్య, ఉద్యోగావకాశాల్లో 10% రిజర్వేషన్ కల్పిస్తూ 103వ సవరణ చేపట్టినట్టు వివరించింది.
  ప్రతి సంవత్సరం, నవంబర్ 26 ను జాతీయ రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటారు, ఎందుకంటే ఇది 1949 లో రాజ్యాంగ సభచే మన రాజ్యాంగాన్ని స్వీకరించినట్లు సూచిస్తుంది. ఇది రాజ్యాంగాన్ని స్వీకరించిన వార్షికోత్సవంగా పరిగణించబడుతుంది.
  మన దేశానికి లిఖితపూర్వక చట్టాలను అందించడానికి బాబాసాహెబ్ భీమ్ రావు అంబేద్కర్ నాయకత్వంలో 1946 లో రాజ్యాంగ సభ రూపొందించబడింది. కమిటీ చేతితో రాసిన మరియు కాలిగ్రాఫ్ చేసిన రాజ్యాంగాన్ని హిందీ మరియు ఇంగ్లీష్ రెండింటిలోనూ రూపొందించింది. ఇది ఎలాంటి టైపింగ్ లేదా ప్రింట్ ఉపయోగించలేదు.
  మొత్తం 284 మంది సభ్యులతో, రాజ్యాంగ అసెంబ్లీ 26 నవంబర్ 1949 న పాక్షికంగా ఆమోదించబడిన రాజ్యాంగాన్ని రూపొందించింది, ఇది భారత రిపబ్లిక్ చరిత్రలో కొత్త శకానికి నాంది పలికింది. అప్పటి నుండి, నవంబర్ 26 ను భారత రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటారు. అంతకుముందు దీనిని జాతీయ న్యాయ దినోత్సవం అని పిలిచేవారు.
  రాజ్యాంగ దినోత్సవం రాజ్యాంగంలో వ్యక్తీకరించబడిన విలువలు మరియు సూత్రాల పట్ల పౌరులను పునరుద్ఘాటించడం మరియు తిరిగి మార్చడం మరియు భారతీయ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో భారతీయులందరూ తమ సరైన పాత్ర పోషించమని ప్రోత్సహించడం. రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక విధులపై అవగాహన కల్పించడం కూడా దీని లక్ష్యం.
  భారతదేశం యొక్క రాజ్యాంగం ప్రపంచంలోనే అతి పొడవైన వ్రాతపూర్వక రాజ్యాంగం. రాజ్యాంగాన్ని పూర్తి చేయడానికి సుమారు 2 సంవత్సరాలు, 11 నెలలు, 17 రోజులు పట్టింది.
  వాస్తవానికి, రాజ్యాంగంలో ఒక ఉపోద్ఘాతం (Preamble), 395 Articles (22 భాగాలుగా) మరియు 8 షెడ్యూల్ ఉన్నాయి. ప్రస్తుతం, ఇది ఒక ఉపోద్ఘాతం (Preamble), సుమారు 465 Articles (25 భాగాలుగా విభజించబడింది) మరియు 12 షెడ్యూల్లను కలిగి ఉంది.
ముంబయిలో ఉగ్రదాడులు జరిగి నేటితో పదకొండేళ్లు : 2008 నవంబరు 26-29

i. సరిగ్గా పదకొండేళ్ల కిందట 2008 నవంబరు 26న పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబాకు చెందిన పది మంది ఉగ్రవాదులు ముంబైలో ప్రవేశించి నాలుగు రోజుల పాటు మారణహోమానికి పాల్పడ్డారు. నాటి 26/11 ఉగ్రదాడిలో 166 మంది ప్రాణాలు కోల్పోగా, 300 మంది వరకు గాయపడ్డారు. వీరిలో ఆరుగురు అమెరికా పౌరులు సైతం ఉన్నారు.
ii. ఈ ఉగ్రదాడి జరిగి పదేళ్లు పూర్తయిన సందర్భంగా దీని సూత్రధారుల గురించి సరైన సమాచారం ఇస్తే 5 మిలియన్ డాలర్ల రివార్డు ఇస్తామని అగ్రరాజ్యం అమెరికా ప్రకటించింది. ఉగ్రదాడికి సూత్రదారులు, సహాయ పడినవారు, దాడికి ప్రేరేపించిన వారి వివరాలు ఏదైనా తెలియజేస్తే 5 మిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ.35కోట్లు నజరానాగా ఇస్తామని డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం వెల్లడించింది.
iii. దక్షిణ ముంబైలో ఛత్రపతి శివాజీ టెర్మినస్, ముంబై చాబాద్ హౌస్, ది ఒబెరాయ్ ట్రైడెంట్,  తాజ్ ప్యాలెస్ & టవర్,  లియోపోల్డ్ కేఫ్, కామా హాస్పిటల్, ది నరిమన్ హౌస్,  మెట్రో సినిమా,  మరియు టైమ్స్ ఆఫ్ ఇండియా భవనం మరియు సెయింట్ జేవియర్స్ కాలేజ్ వెనుక సందులో దాడులకు పాల్పడ్డారు.
జాతీయ పాల దినోత్సవం (వర్ఘీస్ కురియన్ జయంతి) : నవంబర్ 26

i. వర్ఘీస్ కురియన్ (నవంబర్26, 1921 – సెప్టెంబరు 9, 2012) భారతదేశ ప్రముఖ సామాజిక వ్యాపారవేత్త మరియు శ్వేత విప్లవ పితామహుడు. భారతదేశం ప్రపంచ పాల ఉత్పత్తిలో మొదటి స్థానం లో ఉండటంలో ప్రముఖ పాత్ర పోషించాడు.
ii. 2014లో, దేశంలోని డెయిరీ మేజర్లందరూ, ఇండియన్ డెయిరీ అసోసియేషన్తో కలిసి, కురియన్ పుట్టినరోజు నవంబర్ 26 ను జాతీయ పాల దినోత్సవంగా జరుపుకోవాలని సంకల్పించారు
iii. కురియన్ కేరళ లోనికాలికట్ లో నవంబరు 26 1921 న సిరియన్ క్రిస్టియన్ కుటుంబంలో జన్మించారు. ఆయన యొక్క "బిలియన్ లీటర్ ఐడియా" (ఆపరేషన్ ప్లడ్ - ప్రపంచంలో అతి పెద్ద వ్యవసాయాభివృద్ధి కార్తక్రమంగా నిలిచింది.
iv. 1998లో పాల ఉత్పత్తిలో అమెరికా సంయుక్త రాష్ట్రాలను అధిగమించేటట్లు భారత దేశాన్ని నిలిపాడు. పాడి పరిశ్రమ భారతదేశం యొక్క అతిపెద్ద స్వీయ నిరంతర పరిశ్రమ అయ్యింది. అతను, తరువాత దేశం వంట నూనెల ఉత్పత్తిలో కూడా స్వయం ప్రతిపత్తి సాధించేందుకు ప్రయత్నించి, పాక్షికంగా విజయవంతం అయ్యారు.
v. ఆయన 30 విశిష్ట సంస్థలను (AMUL, GCMMF, IRMA, NDDB వంటివి) స్థాపించి వాటిని రైతుల ద్వారా నిర్వహింపజేస్తూ అనేక మంది నిపుణులచే నడిపాడు. ఆయన గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (GCMMF) కు వ్యవస్థాపక చైర్మన్ గా యున్నపుడు Amul(అమూల్) బ్రాండ్ ఉత్పత్తిని సృష్టించి విజయం సాధించాడు.
vi. బర్రె పాలతో అమూల్ పాలపొడి తయారీ ఆవిష్కరణ విజయంతో ఆయనకు ఆవు పాలతో పాలపొడి తయారీని అనేక పాలఉత్పత్తులు తయారుచేసే దేశాలు వ్యతిరేకించాయి. ఆయన తయారు చేసిన అమూల్ డైరీ విజయం 1965 లో భారత ప్రధాని లాల్ బహాదుర్ శాస్త్రి చే ఆయనను "నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు" కు వ్యవస్థాపక చైర్మన్ గా ఎంపిక చేయబడినది. అమూల్ యొక్క నకలు "ఆనంద్ మోడల్" ను దేశ వ్యాప్తంగా పరిచయం చేయబడినది.
vii. ఆయన 2006 నుండి 2011 వరకు అలహాబాదు విశ్వవిద్యాలయానికి మొదటి ఛాన్సలర్ గా సేవలందించారు.
అవార్డులు మరియు గౌరవాలు :
viii. 1963 రామన్ మెగసెసె అవార్డు; 1965 పద్మశ్రీ ; 1966 పద్మభూషణ్; 1993 ఇంటర్నేషనల్ పెర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ; 1999 పద్మవిభూషణ్.

క్రీడలు
స్పెయిన్దే డేవిస్కప్. ఫైనల్లో కెనడాపై విజయం :

i. స్పెయిన్ జట్టు ఆరోసారి డేవిస్కప్ టైటిల్ను చేజిక్కించుకుంది. ఫైనల్లో డబుల్స్ మ్యాచ్తో పని లేకుండానే కెనడాపై విజయం సాధించింది. రెండో సింగిల్స్లో రఫెల్ నాదల్ 6-3, 7-6 (9-7)తో షపోవలోవ్ను ఓడించడంతో స్పెయిన్ 2-0తో తిరుగులేని ఆధిక్యం సాధించి విజేతగా నిలిచింది.
ii. తొలి మ్యాచ్లో రాబర్టో బటిస్టా 7-6 (7-3), 6-3తో ఫెలిక్స్ అగర్-అలియాసిమ్పై విజయం సాధించాడు.
iii. 19 సార్లు గ్రాండ్స్లామ్ ఛాంపియన్ నాదల్కు ఇది నాలుగో డేవిస్కప్ టైటిల్. ఇంతకుముందు 2004, 2009, 2011లో డేవిస్కప్ గెలిచిన స్పెయిన్ జట్టులో ఉన్నాడు.
>>>>>>>>>>>>>>>>  End of the day  <<<<<<<<<<<<<<<<
          

No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...