Tuesday, 5 November 2019

28th october 2019 current affairs

✍  కరెంట్ అఫైర్స్ 28 అక్టోబరు 2019 Monday ✍
జాతీయ వార్తలు
ప్రపంచం మెచ్చే పర్యాటక దేశంగా భారత్. ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ :

i. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో మాట్లాడారు. ప్రతి నెలా చివరి ఆదివారం ఆలిండియా రేడియో ద్వారా ఆయన భారత ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్న విషయం తెలిసిందే.
ii. ఈ పండుగ రోజున దేశంలో మహిళల ప్రాధాన్యం గురించి మాట్లాడుకుందాం. సోషల్ మీడియా వేదికగా ‘Bharat Ki Laxmi’ పేరిట మహిళల విజయగాథలను పంచుకోండి. మీమీ ఇంట్లో ఉన్న మీ కుమార్తెలతో ఆనందంగా గడిపిన క్షణాల గురించి షేర్ చేసుకోండి’ అని పిలుపునిచ్చారు.
iii. ‘గుజరాత్లో నర్మదా నది తీరాన ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం ‘స్టేట్ ఆఫ్ యూనిటీ’ని ఇప్పటివరకు 26 లక్షల మంది సందర్శించారు. ఈ ప్రదేశం అధ్యయనానికి వనరుగా మారుతోంది.  రాబోయే కాలంలో ప్రపంచం మెచ్చిన పర్యాటకంగా భారత్ తయారవ్వబోతోంది.
iv. గురునానక్ దేవ్జీ చేసిన సేవలు మరువలేనివి. అస్పృశ్యత వంటి దురాచారాలపై పోరాడిన వ్యక్తి ఆయన. ఎంతో మంది హృదయాల్లో నిలిచిపోయారు అని అన్నారు.
జవాన్లతో మోదీ దీపావళి వేడుకలు :

i. భారత ప్రధాని నరేంద్రమోదీ జవాన్లతో దీపావళి పండగ జరుపుకున్నారు. జమ్మూకశ్మీర్లోని రాజౌరీ జిల్లాలో సరిహద్దు నియంత్రణ రేఖ వద్ద బీజీ బ్రిగేడ్ ప్రధాన కార్యాలయం వద్ద జవాన్లను కలిసి ముచ్చటించారు.
ii. ఆ ప్రాంతంలో శాంతి నెలకొనేందుకు తమ నిరంతర సేవలను కొనసాగించాలని ప్రధాని వారిని కోరినట్లు తెలిపారు. జమ్మూకశ్మీర్కు ప్రత్యేకప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు తర్వాత మోదీ జమ్మూ వెళ్లడం ఇదే తొలిసారి.
ఇతర రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల వార్తలు
ఏపీ మాజీ మండలి బుద్ధ ప్రసాద్కు అరుదైన గౌరవం. అక్టోబర్ 25వ తేదీని ‘మండలి బుద్ధ ప్రసాద్ డే’ ప్రకటన :
i. ఏపీ మాజీ ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్కు అరుదైన గౌరవం దక్కింది. రాజకీయ వేత్తగా, తెలుగు భాషాభిమానిగా వివిధ రకాలుగా సమాజ సేవకు పాటుపడుతున్న ఆయనకు అమెరికా ఇల్లినాయిస్ రాష్ట్రంలోని నేపర్విల్లే నగరం ఘనంగా సన్మానించింది.

ii. నేపర్విల్లే నగరంలో అక్టోబర్ 25వ తేదీని ‘మండలి బుద్ధ ప్రసాద్ డే’ ఆ నగర మేయర్ స్టీవ్ చిరికో ప్రకటించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
iii. 1999 నుంచి 2014 వరకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడిగా, మంత్రిగా, నవ్యాంధ్రలో డిప్యూటీ స్పీకర్గా ఆయన సేవలందించారని నేపర్విల్లే మేయర్ స్టీవ్ కొనియాడారు.
iv. గాంధీ సూత్రాలను పాటిస్తూ వాటి ఆచరణకు కృషి చేస్తున్నారని ప్రశంసించారు. తెలుగు భాష, సంస్కృతి, ప్రపంచంలోని తెలుగు వారి సంక్షేమానికి కృషి చేస్తున్నారని గుర్తు చేశారు.
v. అంతేగాక పలు మ్యాగజైన్లు, పత్రికలకు తన రచనలు అందిస్తూ సమాజ సేవకు పాటుపడుతున్నారని అభినందించారు. ఆయన సేవలకు గుర్తింపుగా నేపర్విల్లే నగరంలో అక్టోబర్ 25వ తేదీని ‘డాక్టర్ మండలి బుద్ధ ప్రసాద్ డే’ ప్రకటిస్తున్నట్లు తెలిపారు.
Gandhinagar becomes first kerosene-free district of Gujarat :

i. గుజరాత్ లోని గాంధీనగర్ జిల్లా రాష్ట్రంలో మొట్టమొదటి కిరోసిన్ లేని జిల్లాగా మారింది.
ii. ONGC సహాయంతో ఉజ్జ్వాలా (Ujjwala) యోజన కింద గాంధీనగర్ జిల్లా మహిళా లబ్ధిదారులకు 1000 ఎల్‌పిజి కనెక్షన్లను హోంమంత్రి అమిత్ షా కేటాయించారు.
అంతర్జాతీయ వార్తలు
 ఐసిస్ అగ్రనాయకుడు అబు బకర్ ఆల్ బాగ్దాదీ హతం. టర్కీ అధికారిక మీడియాలో వార్తలు :

i. ఐసిస్ అగ్రనాయకుడు అబు బకర్ ఆల్ బాగ్దాదీని అమెరికా దళాలు హతమార్చినట్లు టర్కీకి చెందిన అధికారిక వార్తా సంస్థలు ధ్రువీకరించాయి. ‘చారిత్రక ఆపరేషన్ విజయవంతమైంది. ఇది అమెరికా, ఎస్డీఎఫ్(కుర్దు) దళాల సమాచార సమన్వయంతోనే ఇది సాధ్యమైంది’ అని పేర్కొన్నారు.
ii. ఐసిస్ను లక్ష్యంగా చేసుకుని చేపట్టిన సీక్రెట్ ఆపరేషన్లో యూఎస్ ఆర్మీ..అబు బకర్ను హతమార్చినట్లు అమెరికా అధికారులు తెలిపారని ‘న్యూస్ వీక్’ పత్రిక కథనం ప్రచురించింది. ఈ విషయాన్ని రక్షణశాఖ అధికారులు శ్వేతసౌధానికి చేరవేసినట్లు పెంటగాన్లోని ఆర్మీ అధికారులు తెలిపినట్లు కథనంలో పేర్కొంది.
iii. ఈ ఆపరేషన్ను వారం క్రితం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఆమోదించారని తెలిపింది. అల్ బాగ్దాదీని హతమార్చిన ఆపరేషన్కు అమెరికా ఎనిమిది హెలికాప్టర్లను ఉపయోగించినట్లు టర్కీ అధికారిక వార్త సంస్థ వెల్లడించింది.
iv. ఇస్లామిక్ స్టేట్ వ్యవస్థాపకుడు అబు బకర్ అల్ బాగ్దాదీ కుక్క చావు చచ్చాడని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. శ్వేతసౌధంలో ఆయన మాట్లాడుతూ.. బాగ్దాదీ మరణాన్ని ధ్రువీకరించారు.
v. ప్రపంచంలోనే అత్యంత హింసాత్మక ఉగ్ర సంస్థ ఐసిస్. దీని వ్యవస్థాపకుడు బాగ్దాదీ కోసం యూఎస్ ఎన్నో సంవత్సరాలుగా వెతుకుతోంది.
First woman named as Belgian Prime Minister :

i. Belgian Budget Minister Sophie Wilmes has been chosen as the country's new caretaker Prime Minister, a first for a woman.
ii. Belgium has not had a fully functioning federal government since a coalition headed up by Michel collapsed in December 2018.
iii. Belgium Capital: Brussels; Currency: Euro
Intense cyclonic storm, 'Kyarr' brews over Arabian Sea, moves towards Oman :

i. Kyarr -The cyclone formed over the east-central Arabian Sea is likely to gain strength and become a severe cyclonic storm.
ii. The cyclone will continue moving west-north westwards towards Oman coast over the next five days away from the Indian coast.
ఆర్థిక అంశాలు
Fitch slashes India's FY20 GDP growth forecast to 5.5% from 6.6% :

i. Fitch Ratings has lowered India's FY20 GDP growth forecast to 5.5% from 6.6% & said a large credit squeeze emanating from NBFCs has pushed economic growth to a 6-year low.
ii. The projection is lower than 6.1 % that the RBI had forecast in early October. Moody's Investors had slashed 2019-20 GDP forecast to 5.8%.
సదస్సులు
29th BASIC Ministerial Meet on Climate Change - Beijing :

i. 29th ministerial meeting of the BASIC (Brazil, South Africa, India, China) countries on Climate Change was held at Beijing, China.
ii. India has already achieved 21% reduction in emission intensity of GDP in 2014 compared to 2005 levels.
iii. Union Environment Minister : Prakash Javadekar
  Appointments
హరియాణా సీఎంగా ఖట్టర్ ప్రమాణ స్వీకారం. ఉప ముఖ్యమంత్రిగా చౌతాలా :

i. హరియాణా ముఖ్యమంత్రిగా భాజపా నేత మనోహర్లాల్ ఖట్టర్ మరోసారి ప్రమాణస్వీకారం చేశారు. చండీగఢ్లోని రాజ్భవన్లో గవర్నర్ సత్యదేవ్ నారాయణ్ ఆర్య ఆయనతో ప్రమాణం చేయించారు.
ii. జేజేపీతో పొత్తులో భాగంగా ఆ పార్టీ అధినేత దుష్యంత్ చౌతాలా ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
iii. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో 90 నియోజకవర్గాలున్న హరియాణాలో హంగ్ ఏర్పడిన సంగతి తెలిసిందే. భాజపా 40 సీట్లు గెల్చుకోగా, కాంగ్రెస్ 31 స్థానాలు దక్కించుకుంది.
iv. దుష్యంత్ చౌతాలా నేతృత్వంలోని జన్నాయక్ జనతా పార్టీ 10 స్థానాల్లో విజయం సాధించింది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు భాజపాకు జేజేపీ మద్దతు అవసరమైంది. ఫలితంగాభాజపా కూటమి బలం అసెంబ్లీలో 57కు చేరింది.
Arvind Singh appointed chairman of AAI :

i. Senior IAS officer Arvind Singh has been appointed as the chairman of Airports Authority of India.
ii. Sukhbir Singh Sandhu will head the National Highways Authority of India as part of a major bureaucratic reshuffle effected by the Centre.
Reports/Ranks/Records
Global Health Security Index 2019 : India ranks low at 57

i. WHO యొక్క GHSI 2019 నివేదిక ప్రకారం, పెద్ద అంటు వ్యాధుల వ్యాప్తికి ప్రపంచం సిద్ధంగా లేదు, ఆసియా దేశాలు గణనీయమైన నష్టాలను ఎదుర్కొంటున్నాయి.
ii. థాయిలాండ్ మరియు దక్షిణ కొరియా ఆసియాలో ఉత్తమంగా పనిచేసే దేశాలలో ఒకటిగా ఉండగా, భారతదేశం 57 వ ర్యాంకులో ఉంది.
Art and Culture
దీపావళి... ఐదు రోజుల పండగ :

i. చిన్నాపెద్దా తేడా లేకుండా ఇంటిల్లిపాదీ ఆస్వాదించే పండుగ దీపావళి. తమ జీవితంలో అమావాస్య చీకట్లను పారదోలి వెలుగు జిలుగులు నింపుకునే సంతోషాల వేడుక ఇది. ఈ తరంలో చాలామంది దీపావళి అంటే ఒక్కరోజు జరుపుకునే పండగ అనుకుంటారు.
ii. నిజానికిది ఐదురోజులు జరుపుకొనే ఉత్సవం. ధన త్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి అమావాస్య, బలి పాడ్యమి, భగిని హస్త భోజనం (భాయిదూజ్)గా జరుపుకుంటారు.
iii. దీపావళి మర్నాడు బలిపాడ్యమి. చతుర్దశి నాడు విష్ణుమూర్తి పాతాళానికి అణిచేసిన బలిచక్రవర్తి మళ్లీ భూమ్మీదకి తిరిగివచ్చిన రోజు ఇదేనని చెబుతారు. బలికి పూజలు చేస్తారు. మహారాష్ట్ర వాసులు ఈ రోజును ‘నవ దివస్’గా భావిస్తారు. గుజరాతీయులకు ఇది ఉగాది. నందగోపాలుడు గోవర్ధన గిరినెత్తి రేపల్లె వాసులను కాపాడిన రోజూ ఇదే.

ముఖ్యమైన రోజులు
Health Ministry to observe Vigilance Awareness Week from 28th October-2nd November :

i. 2019 Theme : “Integrity- a way of life” (సమగ్రత- జీవన విధానం)
ii. కేంద్ర విజిలెన్స్ కమిషన్ ఆదేశాల మేరకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ 2019 అక్టోబర్ 28 నుంచి నవంబర్ 2 వరకు విజిలెన్స్ అవగాహన వారోత్సవాన్ని పాటిస్తుంది.
iii. ప్రజా జీవితంలో సంభావ్యతను ప్రోత్సహించడానికి మరియు అవినీతి రహిత సమాజాన్ని సాధించడానికి ఇది గమనించబడుతుంది.
International Animation Day – October 28

i. ASIFA (Association Internationale du Film d’Animation) created the International Animation Day (IAD) in 2002, honoring the birth of animation, recognized as the first public performance of projected moving images: Emile Reynaud’s Theatre Optique in Paris, on the 28th October 1892.
ii. ASIFA coordinates and helps promote IAD celebrations all over the world, putting the art of animation in the limelight in a global worldwide celebration of animation.
iii. Animation includes an impressive range of approaches, techniques and goals. Created by drawing, painting, animating puppets and objects, using clay, sand, paper and computer, working with multiple narratives and non-narratives, reflecting a diversity of themes and performances, presented on a variety of platforms.
సిస్టర్ నివేదిత జననం : అక్టోబర్ 28, 1867

i. సిస్టర్ నివేదిత (అక్టోబర్ 28, 1867 - అక్టోబర్ 13, 1911) వివేకానందుడి బోధనలకు ప్రభావితమై హిందూమతాన్ని స్వీకరించిన మొదటి విదేశీ మహిళ.
ii. మహిళలకు సరైన విద్యావకాశాలు కల్పించి విద్యావంతులను చేసినపుడే దేశం అభివృద్ధి చెందుతుందని ఉద్ఘాటించిన సిస్టర్ నివేదిత మహిళావిద్యాభివృద్ధికోసం ఎంతో కృషి చేశారు. ఐర్లాండులో 1867 అక్టోబర్ 28న జన్మించింది.
iii. 1895లో భారత మహిళా ఔన్నత్యంపై స్వామి వివేకానంద లండన్లో చేసిన ప్రసంగాలు మార్గరెట్ జీవితాన్ని మార్చాయి. భారతీయ స్త్రీ గొప్పదనం గురించి విన్న ఆమె వివేకానందను కలిసి 1898 జనవరి 28న భారత్ చేరింది.
iv. నివేదిత అంటే భగవంతునికి సమర్పణ చేయబడినది అని అర్థం. వివేకానంద బోధన గురించి, తనపై వాటి ప్రభావం గురించి తాను రాసిన 'ది మాస్టర్ యాజ్ ఐ సా హిమ్' పుస్తకంలో వివరించారు.
v. 1899 సంవత్సరం మార్చిలో కలకత్తావాసులకు ప్లేగ్ వ్యాధి సోకినప్పుడు తన శిష్యులతో కలిసి వైద్యసేవలు అందించారు. భారత మహిళల ఔన్నత్యం గురించి, ఆచారవ్యవహారాల గురించి న్యూయార్క్ , షికాగో మొదలైన నగరాల్లో ఆమె ప్రసంగించారు.
vi. భారత స్వాతంత్య్ర పోరాటంలోనూ ఆమె చురుకైన పాత్రపోషించారు. భారతీయతను పూర్తిగా ఆకలింపు చేసుకున్న ఆమె మహిళావిద్య కోసం ఎంతగానో పాటుపడ్డారు.
vii. విదేశీయురాలు అయినప్పటికీ భారతీ యతను పుణికిపుచ్చుకుని స్వామివివేకానందతో అనేక దేశాలు పర్యటించి ప్రసంగించిన ఆమె 1911 అక్టోబర్ 13న డార్జిలింగ్ లో మరణించారు.



No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...