✍ కరెంట్ అఫైర్స్ 29 నవంబరు 2019 Friday ✍
ఇతర రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల వార్తలు
ADB approves 2nd tranche of USD 150 mn for West Bengal :i. రాష్ట్రంలో మూలధన పెట్టుబడులు, మౌలిక సదుపాయాలను పెంచడానికి పశ్చిమ బెంగాల్‌కు 150 మిలియన్ డాలర్ల (సుమారు 1,065 కోట్ల రూపాయలు) రుణాన్ని ఆసియా అభివృద్ధి బ్యాంకు ఆమోదం తెలిపింది.
ii. ప్రభుత్వ రంగ సంస్థల ఆర్థిక ఆరోగ్యాన్ని పునరుద్ధరించడానికి పశ్చిమ బెంగాల్‌లో సమగ్ర ఆర్థిక సంస్కరణలను కొనసాగించడానికి 300 మిలియన్ డాలర్ల (సుమారు రూ .1,130 కోట్లు) రుణాన్ని ADB బోర్డు ఆమోదించింది. రెండు విభాగాలలో మధ్యస్థ వ్యయ చట్రాలను ప్రవేశపెట్టడం మరియు ఇంటిగ్రేటెడ్ టాక్స్ మానిటరింగ్ సిస్టమ్ అమలు చేయడం ఆమోదించింది.
అంతర్జాతీయ వార్తలు
పాక్ సైన్యాధిపతి పదవీ కాలం పొడిగింపు :
i. పాకిస్థాన్ సైన్యాధిపతి జనరల్ కమర్ జావేద్ బజ్వా పదవీ కాలాన్ని మరో ఆరు నెలల పాటు పెంచుతూ పాకిస్థాన్ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ii. అయితే పదవీ కాలం పొడిగింపు, పునర్నియామకంపై పార్లమెంటు చట్టం చేయాల్సి ఉందంటూ షరతు విధించింది. దీన్ని అమలు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ప్రధాని ఇమ్రాన్ఖాన్కు జనరల్ బజ్వా అత్యంత సన్నిహితుడు కావడం విశేషం.
హాంకాంగ్ ఉద్యమకారులకు మద్దతుగా అమెరికా చట్టం :
i. హాంకాంగ్లో ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్న ఉద్యమకారులకు మద్దతుగా రూపొందిన ఒక బిల్లుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. దీనిపై చైనా తీవ్రంగా మండిపడింది.
ii. హాంకాంగ్కు ప్రస్తుతం ప్రత్యేక ‘అమెరికా వాణిజ్య పరిశీలన’ హోదా ఉంది. ఇది ఈ ప్రాంత ఆర్థిక వ్యవస్థకు ఉపయోగపడుతోంది. ఈ హోదాను కాపాడుకోవాలంటే హాంకాంగ్కు సరిపడిన స్థాయిలో స్వయంప్రతిపత్తి ఉందని అమెరికా విదేశాంగ శాఖ ఏటా ధ్రువీకరించాల్సి ఉంటుందని తాజా చట్టం స్పష్టంచేస్తోంది.
iii. హాంకాంగ్లో మానవ హక్కుల ఉల్లంఘనకు కారకులైన చైనా, హాంకాంగ్ అధికారులపై ఆంక్షలకూ ఇది వీలు కల్పిస్తుంది.
సైన్స్ అండ్ టెక్నాలజీ
పీఎస్ఎల్వీ-సి48 ప్రయోగం డిసెంబర్ 11న :
i. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి వచ్చే నెల 11న పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్-సి48ను ప్రయోగించనున్నారు.
ii. పీఎస్ఎల్వీ-సి48 ద్వారా రీశాట్-2బీఆర్1తోపాటు విదేశాలకు చెందిన ఉపగ్రహాలను నిర్ణీతకక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు.
Defence News
Bipin Rawat to be first Chief of Defence Staff :
i. General Bipin Rawat to be first Chief of Defence Staff. He will end his tenure as the Army Chief in December 2019.
ii. He will take over as the first Chief of Defence Staff – a four-star position being created as part of a defence management overhaul. He will get a term of 2 years as the CDS.
iii. He took over as the 27th Chief of Army Staff on 31 December 2016 after General Dalbir Singh retired.
India & Japan holds Mine Countermeasure Exercise (MINEX) 2019 :
i. A maiden bilateral exercise between the Indian Navy and the Japanese Maritime Self Defence Force (JMSDF) have conducted Mine Countermeasure Exercise (MINEX) 2019 at Kochi, Kerala.
ii. Officials of the Indian Navy and from the warships Bungo and Takashima of JMSDF’s Minesweeper (a naval ship that is deployed in removing naval mines) Division 3, commanded by Captain Seiji Ikubu took part in the exercise.
ఆర్థిక అంశాలు
రూ.10 లక్షల కోట్లకు రిలయన్స్ మార్కెట్ విలువ. తొలి భారతీయ కంపెనీగా రికార్డు :
i. రూ.10,000 కోట్ల త్రైమాసిక లాభాన్ని ఆర్జించిన భారతీయ తొలి ప్రైవేట్ కంపెనీగా రిలయన్స్ నిలిచింది. షేరు మార్కెట్ విలువ రూ.10,00,000 కోట్లకు చేరింది. ఆ వ్యక్తే ముకేశ్ అంబానీ.. ఆ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్.
ii. కంపెనీ మార్కెట్ విలువ రూ.10 లక్షల కోట్ల మైలురాయిని చేరింది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ కంపెనీ ఆర్ఐఎల్ కావడం గమనార్హం.
iii. 2020-21లో రుణ రహిత కంపెనీగా మారేందుకు సౌదీ ఆరామ్కోతో కుదుర్చుకున్న భారీ ఒప్పందం చేసుకుంది.
సదస్సులు
47th All India Police Science Congress begins in Lucknow :
i. 47వ ఆల్ ఇండియా పోలీస్ సైన్స్ కాంగ్రెస్ (AIPASC) లక్నోలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్, రిటైర్డ్ ఐపిఎస్ అధికారి కిరణ్ బేడి ప్రారంభించారు.
ii. ఉత్తర ప్రదేశ్ పోలీసులు హోం మంత్రిత్వ శాఖ, బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సహకారంతో లక్నోలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
iii. ఈ కార్యక్రమం యొక్క 6 సెషన్లలో, పోలీసు అధికారులు, విద్యావేత్తలు, పరిశోధకులు, న్యాయ మరియు శాస్త్రీయ నిపుణులు తమ పత్రాలను సమర్పించనున్నారు.
సినిమా వార్తలు
‘ఇఫి 2019’ విజేతలు :
i. గోవాలో తొమ్మిది రోజుల పాటు అట్టహాసంగా జరిగిన ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫి) స్వర్ణోత్సవాలు ముగిశాయి.
ii. ఉత్తమ చిత్రం (గోల్డెన్ పీకాక్ అవార్డ్) : పార్టికల్స్ (ఫ్రెంచ్)
iii. ఉత్తమ నటుడు (సిల్వర్ పీకాక్ అవార్డ్) : సివ్జార్జ్ (మరిఘెల్లా - పోర్చుగీస్)
iv. ఉత్తమ నటి (సిల్వర్ పీకాక్ అవార్డ్) : ఉషాజాదవ్ (మాయ్ ఘాట్ - మరాఠీ)
v. ఉత్తమ దర్శకుడు : లిజో జోస్ పెల్లిస్సెరీ (జల్లికట్టు - మలయాళం)
vi. స్పెషల్ జ్యూరీ అవార్డ్ : బెలూన్ (చైనీస్)
vii. స్పెషల్ మెన్షన్ : హెల్లరో (గుజరాతీ)
viii. ఐసీఎఫ్టీ-యునెస్కో గాంధీ అవార్డ్ : రువాండా దర్శకుడు రికార్డో సాల్వెట్టి
ముఖ్యమైన రోజులు
29 November - International Day of Solidarity with Palestinian People (పాలస్తీనా ప్రజలతో అంతర్జాతీయ సంఘీభావ దినం)
i. పాలస్తీనా ప్రజలతో అంతర్జాతీయ సాలిడారిటీ దినం UN- వ్యవస్థీకృత ఆచారం. న్యూయార్క్లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో, అలాగే జెనీవా , వియన్నా మరియు నైరోబిలోని ఐక్యరాజ్యసమితి కార్యాలయాలలో కార్యక్రమాలు జరుగుతాయి.
ii. దీనిని 2003, డిసెంబర్ 1 న గమనించారు. పాలస్తీనా ప్రజల అసమర్థ హక్కుల వ్యాయామంపై కమిటీతో సంప్రదించి, ఐక్యరాజ్యసమితి సచివాలయం యొక్క పాలస్తీనా హక్కుల కోసం డివిజన్ ప్రత్యేక స్మారక కార్యక్రమాలను నిర్వహిస్తుంది.
JRD టాటా 26వ వర్ధంతి : నవంబర్ 29, 1993
i. జె.ఆర్.డి.టాటా (జూలై 29, 1904 - నవంబర్ 29, 1993) భారతదేశపు ప్రముఖ పారిశ్రామికవేత్త మరియు తొలి విమాన చోదకుడు. ఈయనకు 1992లో భారతరత్న పురస్కారం ఇవ్వబడింది.
ii. ప్యారిస్ లో జన్మించిన ఈయనను "జెహ్" లేక "జేఆర్డీ"గా సంబోధిస్తారు. ఈయన తల్లి ఫ్రాన్సు దేశస్థురాలు కావడంతో, ఈయన ఫ్రెంచి భాషను మొదటి భాషగా నేర్చుకున్నాడు. 1929లో ఈయన భారతదేశములోనే మొట్టమొదటి పైలట్ లైసెన్సు పొందాడు.
iii. 1932 లో ఈయన భారతదేశపు తొలి వాణిజ్య విమానసేవలను టాటా ఎయిర్ లైన్స్ పేరుతో ప్రవేశపెట్టాడు. 1946లో అది "ఎయిర్ ఇండియా"గా రూపాంతరం చెందింది. తర్వాతికాలంలో ఆయన భారతదేశపు పౌరవిమానయాన పితామహుడుగా ప్రశంసింపబడ్డాడు.
iv. 34 ఏళ్ళ వయసులో ఆయన టాటా వ్యాపారసంస్థలకు పెట్టుబడిదారీ సంస్థ అయిన టాటా సన్స్ సంస్థకు చైర్మనుగా బాధ్యతలు చేపట్టి 1991 వరకు ఆ పదవిలో కొనసాగాడు.
v. 1954 లో ఫ్రెంచ్ ప్రభుత్వం అయనకు అవార్డు నిచ్చింది. జెఆర్డి టాటా తన 89వ ఏట 1993 లో స్విట్జర్లండ్లోని జెనీవాలో మరణించాడు. ఆయనను పారిస్లోని పెర్ షైజ్ శ్మశానవాటికలో ఖననం చేశారు.
vi. ఇండియన్ పార్లమెంట్, అసాధారణంగా ఏ ప్రభుత్వ రాజకీయపదవీ అనుభవించని సామాన్య పౌరుడైన ఆయనకు నివాళిగా సభను వాయిదా వేసింది. మహారాష్ట్ర మూడు రోజు సంతాపదినాలుగా ప్రకటించింది.
క్రీడలు
ఉప్పల్లో అజ్జూ స్టాండ్ :
i. టీమ్ఇండియా మాజీ కెప్టెన్, హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) అధ్యక్షుడు మహ్మద్ అజహరుద్దీన్కు గౌరవం దక్కింది.
ii. ఉప్పల్ స్టేడియంలో స్టాండ్కు అజహర్ పేరు పెట్టాలని హెచ్సీఏ ఎపెక్స్ కౌన్సిల్ నిర్ణయించింది.
Bajrang finally gets his Khel Ratna. Sports Minister Rijiju awards National honours to four :
i. Bajrang Punia, who missed out on receiving the Rajiv Gandhi Khel Ratna earlier this year due to his preparations for the World Championships, was handed over the same by Sports Minister Kiren Rijiju.
ii. The Asian and Commonwealth champion won bronze at the competition in Nur-Sultan, Kazakhstan, in September to secure an Olympic spot in the 65kg category.
iii. Punia, who was honoured with Padma Shri this year, had caused a stir after being ignored for the Khel Ratna last year but was the unanimous choice this time around.
iv. Also receiving their respective Arjuna Awards on the occasion were National record-holders quartermiler Muhammad Anas and shotputter Tejinderpal Singh Toor while Toor’s coach Mohinder Singh Dhillon was conferred the Dronacharya Award.
>>>>>>>>>>>>>>>> End of the day <<<<<<<<<<<<<<<<
RIP to the yesterday’s rape and murder victims of Dr. Priyanka reddy at Shadnagar & Manasa at Hanmakonda..
తిట్టాల్సింది పోలీసులను, చట్టాలను, పాలించే నాయకులను కాదు !!
తుంచివేయాల్సింది మానవుని రూపంలో ఉన్న మొగాడి క్రూరమైన ఉన్మాదపు లైంగిక వాంఛలు, చుట్టూ ఆవరించిపోతున్న విష సంస్కృతి..
క్యాండిల్ వాక్, ర్యాలీలు, నష్టపరిహరం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం సమస్యకి పరిష్కారం కావు !!
నా అనుకునే సొంత మనిషికి ఏదో ఒకరోజు అనుకొని సంఘటన జరిగితే తప్ప వ్యక్తిగతంగా ఒక సాధారణ మనిషిలో అసలైన చైతన్యం, కసి, ఆలోచన పుట్టవు..
ఎవ్వరూ మారనంత కాలం ఇది నిత్యం చూసే ఒక సాధారణ హెడ్ లైన్ లాగానే ఉంటుంది....!!
ఆడపిల్ల పుట్టినా భారంగా, బయటకు ఒంటరిగా పంపాలన్నా, వివాహం చేయాలన్నా భారంగా భావిస్తున్న ఈ వింత లోకంలో ఇంకా నిజమైన స్వాతంత్ర్యం వచ్చేది ఎప్పుడు ? ఆడది లేకుంటే అసలు సృష్టికి మూలముంటుందా ?
No comments:
Post a Comment