✍ కరెంట్ అఫైర్స్ 19 నవంబరు 2019 Tuesday ✍
ఇతర రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల వార్తలు
‘అగ్రవాన్’గా మారనున్న ఆగ్రా :
i. ఆగ్రా పేరును ‘అగ్రవాన్’గా మార్చాలని ఉత్తర్ప్రదేశ్లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం భావిస్తోంది. ఈ నగర పుట్టుపూర్వోత్తరాలపై పరిశోధన చేయాలని బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయాన్ని కోరింది.
ii. ఆ మేరకు చరిత్ర శాఖ అధిపతి ఆనంద్ దీనిపై పరిశోధన చేశారు. మహాభారతం కాలంలో ఈ ప్రాంతానికి అగ్ర వాన్ (అగ్ర భాగంలోని బాణం) అన్న పేరు ఉండేది.
iii. ఆగ్రా గెజిటీర్లో కూడా ఈ ప్రస్తావన ఉంది. అంగీర ముని ఈ ప్రాంతంలో తపస్సు చేయడంతో ఆయన పేరుతో ఈ నగరాన్ని అంగీర అని పిలిచేవారన్న కథనం కూడా ఉంది.
సైన్స్ అండ్ టెక్నాలజీ
మంచులేని ఆర్కిటిక్. 2044 నుంచి ఏటా కొంతకాలం ఐస్ అదృశ్యం. వాతావరణ మార్పులే కారణం :
i. మానవ చర్యలతో తలెత్తుతున్న వాతావరణ మార్పుల వల్ల ఆర్కిటిక్ మహాసాగరంలో ఏటా కొంతకాలం పాటు మంచు జాడే కనపడదని అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనం హెచ్చరించింది.
ii. 2044 నుంచి 2067 మధ్యకాలంలో ఏటా సెప్టెంబర్లో మంచు జాడలేని పరిస్థితి తలెత్తుతుందని పేర్కొన్నారు. దీనివల్ల ఆర్థికంగా, పర్యావరణపరంగా నష్టాలు పెరుగుతాయని చెప్పారు.
Appointments
జస్టిస్ బోబ్డే ప్రమాణ స్వీకారం. రాష్ట్రపతిభవన్లో నిరాడంబరంగా కార్యక్రమం :
i. భారత 47వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ శరద్ అరవింద్ బోబ్డే(63) బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రపతి భవన్లోని దర్బార్ హాల్లో నిరాడంబరంగా నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు.
ii. జస్టిస్ బోబ్డే ఆంగ్లంలో ప్రమాణం చేశారు. ఆయన 17 నెలలపాటు చీఫ్జస్టిస్ పదవిలో కొనసాగుతారు. 2021 ఏప్రిల్ 23న పదవీ విరమణ పొందుతారు.
కొలీజియం సభ్యురాలిగా జస్టిస్ బానుమతి :
i. సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఆర్.బానుమతికి సుప్రీంకోర్టు కొలీజియంలో స్థానం లభించింది. ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రంజన్ గొగొయి పదవీ విరమణ చేయడంతో అందుకు అనుగుణంగా మార్పులు చేయాల్సి వచ్చింది.
ii. కొలీజియంలో అయిదుగురు అత్యంత సీనియర్ న్యాయమూర్తులకు సభ్యత్వం ఉంటుంది.
iii. ప్రస్తుత సీజేఐ జస్టిస్ ఎస్.ఎ.బోబ్డే, జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ అరుణ్ మిశ్ర, జస్టిస్ ఆర్.ఎఫ్.నారిమన్, జస్టిస్ ఆర్.బానుమతిలు సభ్యులుగా ఉంటారు.
iv. కొలీజియం సభ్యత్వం పొందిన రెండో మహిళా న్యాయమూర్తి ఆమే కావడం గమనార్హం.
శ్రీలంక అధ్యక్షుడిగా గోటబాయ ప్రమాణం :
i. శ్రీలంక ఏడో అధ్యక్షుడిగా గోటబాయ రాజపక్స ప్రమాణ స్వీకారం చేశారు. సంప్రదాయాన్ని పక్కనపెట్టి రాజధాని కొలంబోలో కాకుండా, ఇక్కడికి 200 కిలోమీటర్ల దూరంలోని అనురాధపురలో ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు.
ii. అక్కడ ప్రాచీన బౌద్ధ ఆలయమైన రువన్వెలి సేయలో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.
అవార్డులు
శ్రీదేవి, రేఖలకు ANR జాతీయ పురస్కారాలు :
i. ఏఎన్నార్ జాతీయ పురస్కారాల ప్రదాన కార్యక్రమం హైదరాబాద్లో జరిగింది. చిరంజీవి చేతుల మీదుగా 2018 సంవత్సరానికిగానూ శ్రీదేవి తరఫున బోనీకపూర్, 2019 సంవత్సరానికిగానూ రేఖ పురస్కారాలు అందుకున్నారు.
ii. ఈ అవార్డును అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ స్థాపించింది మరియు భారతీయ సినిమాపై శాశ్వత ప్రభావాన్ని చూపిన వారిని సత్కరిస్తుంది.
ముఖ్యమైన రోజులు
National Integration Day (జాతీయ సమైక్యత దినం) – November 19
i. జాతీయ సమైక్య దినోత్సవం 19 నవంబర్ 2013 న భారతదేశం అంతటా జరుపుకుంటారు. ఇది భారత మొదటి మహిళా ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ జన్మదినంగా జరుపుకుంటారు.
ii. భారతదేశం అంతటా ప్రజలలో ప్రేమ మరియు ఐక్యతను పెంపొందించడానికి జాతీయ సమైక్య దినోత్సవాన్ని జరుపుకుంటారు.
iii. ఇంటర్ స్టేట్ యూత్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రాం (ISYEP), నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్ (NIC), నేషనల్ యూత్ ఫెస్టివల్, నేషనల్ యూత్ అవార్డు మరియు అనేక రకాల కార్యక్రమాలు మరియు కార్యకలాపాలను నిర్వహించడం ద్వారా భారతదేశంలో ప్రతి సంవత్సరం జాతీయ ఇంటిగ్రేషన్ డే జరుపుకుంటారు.
International Men's Day (అంతర్జాతీయ పురుషుల దినోత్సవం) – November 19
i. Theme 2019 : “Making a Difference for Men and Boy’s”
ii. ప్రపంచానికి, సమాజాలకు మరియు వారి కుటుంబాలకు పురుషులు తీసుకువచ్చే సానుకూల వ్యత్యాసాన్ని ఎత్తిచూపడానికి అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇది పురుషుల శ్రేయస్సు మరియు ప్రపంచ స్థాయిలో పురుషులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి అవగాహన పెంచుతుంది.
iii. అంతర్జాతీయ పురుషుల దినోత్సవం 2019 యొక్క థీమ్ “మేకింగ్ ఎ మెన్ ఎ డిఫరెన్స్ ఫర్ మెన్ అండ్ బాయ్స్”. ఇది పురుషులు మరియు అబ్బాయిలకు విలువ ఇవ్వవలసిన అవసరాన్ని మరియు ప్రపంచవ్యాప్తంగా పురుషుల మరియు అబ్బాయిల ఆరోగ్యం మరియు శ్రేయస్సులో ఆచరణాత్మక మెరుగుదలలు చేసే వ్యక్తులకు సహాయం చేయడంపై దృష్టి పెడుతుంది.
iv. అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని డాక్టర్ జెరోమ్ టీలుక్సింగ్ 1999 లో స్థాపించారు. అతను వెస్టిండీస్ విశ్వవిద్యాలయంలో చరిత్ర లెక్చరర్. 1960 నుండి ప్రజలు అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి సమానమైన అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని జరుపుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
World Toilet Day (ప్రపంచ మరుగుదొడ్డి దినోత్సవం) – November 19
i. Theme 2019 : Leaving No One Behind
ii. ప్రతి సంవత్సరం నవంబర్ 19 న ప్రపంచ మరుగుదొడ్డి దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రపంచ పారిశుద్ధ్య సంక్షోభాన్ని పరిష్కరించడానికి మరియు 2030 నాటికి అందరికీ పారిశుద్ధ్యానికి హామీ ఇచ్చే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 6 (SDG 6) ను సాధించడంలో సహాయపడే చర్యల గురించి ఇదంతా ఉంది.
iii. ప్రపంచ మరుగుదొడ్డి దినోత్సవం 2019 ప్రజలు పారిశుధ్యం లేకుండా వెనుకబడి ఉండటంపై దృష్టిని ఆకర్షిస్తోంది.
ఝాన్సీ లక్ష్మీబాయి జననం : 19 నవంబర్ 1828
i. ఝాన్సీ లక్ష్మీబాయి (19 నవంబర్ 1828 - 18 జూన్ 1858) అసలు పేర మణికర్ణిక. ఆమె 1828వ సంవత్సరము నవంబరు నెల19 న మహారాష్ట్ర కు చెందిన సతారలో ఒక కర్హాడీ బ్రాహ్మణుల వంశంలో వారణాసిలో జన్మించింది.
ii. పేరు మణికర్ణిక కాగా ఆమె ను ముద్దుగా మను అని పిలుచుకునేవారు. ఆమె తల్లి రాణి నాలుగేళ్ళ ప్రాయంలో ఉండగానే కన్ను మూసింది. దాంతో ఆమెను పెంచాల్సిన బాధ్యత తండ్రి మీద పడింది.
iii. ఇలాంటి క్లిష్ట సమయంలో బాజీరావు పీష్వా మోరోఝాన్సీ లక్ష్మీబాయి ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి రాణి. 1857లో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించింది. భారతదేశంలోని బ్రిటిష్ పరిపాలనలో ఝాన్సీ కి రాణి గ ప్రసిద్ధికెక్కినది.
iv. 1857 లో భారత దేశ తిరుగుబాటుదార్లలోముఖ్యమైన వాళ్ళలో ఈమె ఒకరు. మరియు భారతదేశంలోని బ్రిటిష్ పరిపాలన ను అడ్డు వాళ్లకి ఈమె గుర్తుగా నిలిచారు. ఆమె 1858 జూన్ 17 లో గ్వాలియర్ లో యుద్ధ సమయములో మరణించింది
ఇందిరా గాంధీ 102వ జయంతి : నవంబర్ 19, 1917
i. ఇందిరా ప్రియదర్శిని గాంధీ (నవంబర్ 19, 1917 – అక్టోబర్ 31, 1984) భారతదేశపు మొట్టమొదటి మరియు ఏకైక మహిళా ప్రధానమంత్రి. ఆమె 1966 నుండి 1977 వరకు వరుసగా 3 పర్యాయాలు మరియు 1980లో 4వ పర్యాయం ప్రధానమంత్రిగా పనిచేసింది.
ii. ఆమె భారత తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ ఏకైక కుమార్తె. జవహర్ లాల్ నెహ్రుకి మొదటి సారి ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు ప్రధానమంత్రికి సెకట్రరీగా జీతం లేకుండా పనిచేసింది. 1964 సంవత్సరములో తండ్రి మరణం తరువాత రాజ్యసభకు ఎన్నిక అయింది. లాల్ బహదుర్ శాస్త్రి మంత్రి మండలిలో ప్రసారశాఖ మంత్రిగా పనిచేసింది.
iii. ఇందిరా ప్రియదర్శిని 1917, నవంబర్ 19 తేదీన జవహర్ లాల్ నెహ్రూ, కమలా నెహ్రూ ల ఏకైక సంతానంగా అలహాబాదులోని ఆనంద్ భవన్ లో జన్మించింది. ఆమ మోతీలాల్ నెహ్రూకు మనుమరాలు.
iv. స్వాతంత్ర్యం సంపాదించడంకోసం లండనులో స్థాపించబడిన ఇండియాలీగ్ లో 1930 లో చేరింది. కాంగ్రెస్ కార్యకర్తలు ఆమెను 1959 ఫిబ్రవరి 2 న భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎన్నుకున్నారు.
v. ఆమె 1966 జనవరి 24న మొదటిసారిగా ప్రధానమంత్రి బాధ్యతలను స్వీకరించి దేశ మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించింది. నేటివరకు కూడా మరో మహిళ ఆ స్థానాన్నిచేపట్టలేదు.
vi. ప్రధాన మంత్రి పదవికి జరిగిన పోటీలో ఇందిరా గాంధీ మొరార్జీ దేశాయ్ ను అప్పటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కుమారస్వామి కామరాజ్ మద్దతుతో సిండికేట్ సహాయంతో 355-169 ఓట్లతో ఓడించి దేశ 3వ ప్రధాన మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టింది.
vii. సిక్కుల కోరిక మేరకు వారికి హర్యానా రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఏర్పాటుకు ఒప్పుకోని కొంతమంది తిరుగుబాటు చెయ్యగా దానిని ఆమె అణచివేసింది.
viii. మొరార్జీ దేశాయ్ ను సంతృప్తి పర్చడానికి ఉప ప్రధానమంత్రి మరియు కీలకమైన ఆర్థిక మంత్రి పదవులను ప్రసాదించింది. అంతర్గత పోరాటాల ఫలితంగా 1967 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ దాదాపు 60 స్థానాలను కోల్పోవాల్సివచ్చింది.
ix. రాజభరణాల రద్దు, 1966లో రూపాయి మూల్య న్యూనీకరణ, 1969లో బ్యాంకుల జాతీయీకరణ లాంటి నిర్ణయాలతోపాటు దేశంలో పంటల ఉత్పత్తిని పెంచడానికి హరిత విప్లవం, పేదరిక నిర్మూలన కై గరీబీ హటావో నినాదం, 20 సూత్రాల పథకము లాంటి ప్రజాకర్షక పథకాలు చేపట్టింది.
x. 1971లో అమేథీ లోక్ సభ నియోజకవర్గంలో రాజ్ నారాయణ్ పై గెల్చిన ఇందిర ఎన్నిక చెల్లదని ఇందిరాగాంధీ విజయాన్ని సవాలు చేస్తూ రాజ్నారాయణ్ దాఖలు చేసిన పిటీషన్పై ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదని, తరువాత 6 సంవత్సరాల వరకు ఇందిరాగాంధీ ఎన్నికల కార్యక్రమాల్లో పాల్గొనరాదని అలహాబాదు హైకోర్టు 1975లో తీర్పు ఇచ్చింది. దీనిపై ఇందిరాగాంధీ స్టే ఆర్డర్ తెచ్చుకున్నది.
xi. దేశంలో శాంతి భద్రతలు, శాంతిని స్థాపించడం కోసం తాను ఎంతటి కఠినమైన చర్యకైనా సిద్ధమని నిరూపిస్తూ ఇందిర దేశామంతటా ఎమర్జెన్సీ ప్రకటించేందుకు రంగం సిద్ధం చేసింది. అప్పటి అధ్యక్షుడు ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ రాజ్యాంగంలోని 352 వ ఆర్టికల్ ప్రకారం 1975 జూన్ 25న ఎమర్జన్సీ ప్రకటించింది. అదే రోజు ర్యాలీ నిర్వహించాలని ప్రతిపక్ష నాయకుల వ్యూహం.
xii. అత్యవసర పరిస్థితి పరిణామం 1977 ఎన్నికలలో ఓటమి రూపంలో బయటపడింది. ఇందిరా గాంధీ సొంత నియోజకవర్గమైన రాయ్ బరేలీలో కూడా జనతా పార్టీకి చెందిన రాజ్ నారాయణ్ చేతిలో ఓడిపోయింది.
xiii. ఆమె స్వయంగా ఆంధ్ర ప్రదేశ్ లోని మెదక్ లోక్సభ నియోజకవర్గం నుంచి మంచి ఆధిక్యతతో గెలుపొందింది.
xiv. ఇందిరాగాంధీ అక్టోబరు 31 1984 న్యూఢిల్లీ లోని సఫ్దార్జంగ్ రోడ్డు లోని తన నివాసంలో హత్య గావించబడ్డారు. ఆమె తమ అంగరక్షకులయిన సత్వంత్సింగ్ మరియు బియాత్సింగ్ లచే హత్య గావింపబడ్డారు. ఈ హత్య అమృత్సర్ లోని స్వర్ణ దేవాలయంలో భారత సైన్యం జూన్ 1984 న జరిపిన ఆపరేషన్ బ్లూస్టార్కు ప్రతీకారంగా జరిగింది.
xv. 1971లో భారత ప్రభుత్వపు అత్యున్నత అవార్డు భారత రత్నను స్వీకరించి ఈ పురస్కారాన్ని పొందిన మొట్టమొదటి మహిళగా స్థానం సంపాదించింది.
ఇందిరా గాంధీ జీవితంలో ప్రధాన ఘట్టాలు :
1938 : భారత జాతీయ కాంగ్రేసులో ప్రవేశం
1955 : అఖిలభారత కాంగ్రెసుకి అధ్యక్షరాలుగా ఎన్నికైనది.
1966-01-24 : భారతప్రధానిగా ఎన్నికై అతిచిన్నవయసులో తొలి మహిళా ప్రధానిగా బాధ్యతలు చేపట్టింది.
1966 : రాజ్యసభ ద్వారా ప్రధానమంత్రి పదవి చేపటిన వ్యక్తులలో ఇందిరా గాంధీ మొట్టమొదటిది.
1966-1977 1980-1984 : జవహర్ లాల్ నెహ్రూ తర్వాత అత్యధిక కాలం పాటు ప్రధానమంత్రి పదవి చేపట్టి రెండో స్థానంలో నిల్చింది.
1967-03-13 : కాంగ్రెసుపార్టీ నాయకురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికై, ప్రధానిగా 2వసారి ప్రమాణస్వీకారం చేసింది. తన పాలనలో గోల్డ్ కంట్రోల్ ను ఎత్తివేసింది.
1969 : ఇందిరా కాంగ్రెస్ పార్టీ స్థాపన
1971 : 19 బ్యాంకులను జాతీయం చేసింది.
1971-03-18 : ఎన్నికల్లో గెలిపొంది, 3వసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసింది.
1971 : పాకిస్తాన్తో యుద్ధం జరగగా, ఓడించింది.
1971 : తూర్పు పాకిస్తాన్ను పాకిస్తాన్ నుండి విడదీసి బంగ్లాదేశ్ ను ఏర్పాటు చేసింది.
1971 : భారతరత్న పురస్కారాన్ని పొందిన మొట్టమొదటి మహిళ ఇందిరా గాంధీ.
1973 మే :సముద్రంలోని తైలనిక్షేపాలను వెలికితీసే సాగర్ సామ్రాట్ ని ఏర్పాటుచేసింది.
- ఈమె హయంలో రాజస్థానలోని ఫోఖ్రాన్ వద్ద భూగర్బ అణుపేలుడు ప్రయోగం జరిపింది.
1975-04-19 : తొలిసారిగా కృత్రిమ ఉపగ్రహమైన ఆర్యభట్ట ప్రయోగం ఈమె హయంలో జరిగింది.
- సిక్కులను భారతదేశంలో అంతర్భాగం చేసింది. రాజభరణాల రద్దు చేసింది.
1975-06-25 : దేశంలో అత్యవసరపరిస్థితి విధించింది.
1977 : ఎన్నికలలో ఓడిపోయిన మొట్టమొదట భారత ప్రధానమంత్రి ఇందిరా గాంధీ.
1980 : కొద్ది కాలం విరామం తర్వాత మళ్ళీ భారత ప్రధానమంత్రి పదవి చేపట్టిన వారిలో మొట్టమొదటి వ్యక్తి.
- ఈమె హయంలో ఆలీనోద్యమం కొత్తరూపు సంతరించుకుంది.
1983లో కామన్వెల్త్ ప్రధానుల సభను నిర్వహించింది.
- సిక్కుల పవిత్రదేవాలయం స్వర్ణమందిరాన్ని నివాసం చేసుకొని మారణకాండ సాగించిన ఉగ్రవాది బిందైన్ వాలా. బిందైన్ వాలాపై దాడికోసం స్వర్ణదేవాలయంలోకి సైన్యాన్ని పంపించి, ఆ దాడిలో అతడితోపాటు అతడి అనుచరులు మరణించారు. ఈ దాడియే ఆపరేషన్ బ్లూస్టార్ గా ప్రసిద్ధిగాంచింది.
- ఈమె ఆర్థిక కార్యక్రమంపై 20సూత్రాలని కూడా అమలపరిచింది.
1983 : అలీన దేశాల సదస్సును ఢిల్లీలో నిర్వహించింది.
1984 : ఆపరేషన్ బ్లూ స్టార్ చర్యకు ఆదేశం
1984-10-31 : ఉదయం 9గంటల16నిమిషాలకి ఈమెను ఈమె అంగరక్షకులే కాల్చగా, స్వంతయింటిలోనే మరణించెను. హత్యకు గురైన మొట్టమొదటి భారత ప్రధానమంత్రి కూడా ఇందిరా గాంధీ.
- ఈమె సమాధి నిర్మించిన ప్రదేశానికి శక్తిస్థల్ అని పేరుపెట్టారు. ది ఇయర్స్ ఆఫ్ ఛాలెంజ్ 1966-1969, ది ఇయర్స్ ఆఫ్ ఎన్డీవర్ 1969-1972, ఇండియా 1975 మొదలగు పుస్తకాలు రచించెను.
- అంతరిక్షంలో ఉన్న వ్యోమగామితో మాట్లాడిన మొట్టమొదటి భారత ప్రధానమంత్రి ఇందిరా గాంధీ
క్రీడలు
సిట్సిపాస్దే టైటిల్. ఏటీపీ ఫైనల్స్ :
i. యువ టెన్నిస్ ఆటగాడు స్టెఫనోస్ సిట్సిపాస్ (గ్రీస్) అదరగొట్టాడు. నాదల్, ఫెదరర్, జకోవిచ్ లాంటి దిగ్గజాలను తోసిరాజంటూ ఏటీపీ ఫైనల్స్ టోర్నీ టైటిల్ను చేజిక్కించుకున్నాడు.
ii. ఫైనల్లో 21 ఏళ్ల సిట్సిపాస్ 6-7 (6-8), 6-2, 7-6 (7-4)తో డోమినిక్ థీమ్ (ఆస్ట్రియా)పై పోరాడి గెలిచాడు. ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీలో తొలిసారి తుదిపోరుకు చేరిన సిట్సిపాస్.. వరుసగా రెండోసారి ఫైనల్లో అడుగుపెట్టిన థీమ్ మధ్య టైటిల్ పోరు హోరాహోరీగా సాగింది.
iii. తొలిసారి ఈ టైటిల్ గెలిచిన అతడు.. 2001 తర్వాత అత్యంత పిన్న వయసులో ఏటీపీ ఫైనల్స్ విజేతగా నిలిచిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
బ్రెజిల్ గ్రాండ్ప్రి విజేత వెర్స్టాపెన్ :
i. రెడ్ బుల్ డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ బ్రెజిల్ గ్రాండ్ప్రి ఫార్ములా వన్ ఛాంపియన్గా నిలిచాడు. ప్రపంచ ఛాంపియన్ లూయిస్ హమిల్టన్ వెనక్కి నెట్టి వెర్స్టాపెన్... ట్రోఫీని సొంతం చేసుకున్నాడు.
ii. ఈ సీజన్లో అతనికిది మూడో టైటిల్. గాస్లె (ఫ్రాన్స్) రెండో స్థానంలో నిలవగా, సైంజ్ జూనియర్ మూడో స్థానం సాధించాడు. హమిల్టన్ ఏడో స్థానంతో సరిపెట్టుకున్నాడు.

No comments:
Post a Comment