✍ కరెంట్ అఫైర్స్ 14 నవంబరు 2019 Thursday ✍
జాతీయ వార్తలు
ప్రధాన న్యాయమూర్తి కార్యాలయమూ ఆర్టీఐ పరిధిలోకే. సంపూర్ణ పారదర్శకత వాంఛనీయం కాదు. దిల్లీ హైకోర్టు తీర్పునకు సమర్థింపు : సుప్రీంకోర్టు
i. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) కార్యాలయం ప్రజా అధికార సంస్థ (పబ్లిక్ అథారిటీ) అని, దానికి సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) వర్తిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ii. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ మేరకు కీలక తీర్పు వెలువరించింది. సీజేఐకీ ఆర్టీఐ వర్తిస్తుందంటూ 2010లో దిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది.
iii. ఆర్టీఐని నిఘాకు ఒక సాధనంగా వాడుకోరాదని హెచ్చరించింది. పారదర్శకత విషయంలో న్యాయవ్యవస్థ స్వతంత్రతను దృష్టిలో పెట్టుకోవాలని చెప్పింది.
iv. న్యాయమూర్తుల నియామకానికి కొలీజియం సిఫార్సు చేసిన పేర్లను వెల్లడిస్తామని, కారణాలను మాత్రం కాదని తేల్చి చెప్పింది. గోప్యత హక్కు అనేది ముఖ్యమైన కోణమని, సీజేఐ కార్యాలయం నుంచి సమాచారాన్ని ఇచ్చే నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు గోప్యత హక్కు- పారదర్శకత మధ్య సమతుల్యం పాటించాలని ధర్మాసనం నొక్కి చెప్పింది.
v. సీజేఐ కార్యాలయం ఆర్టీఐ చట్ట పరిధిలోకి వస్తుందని దిల్లీ హైకోర్టు 2010 జనవరి 10న సమర్థించింది. న్యాయవ్యవస్థ స్వతంత్రత అంటే న్యాయమూర్తుల విశేషాధికారం కాదని, అది వారి కర్తవ్యమని ఆ తీర్పు పేర్కొంది.
మహిళ హక్కులు.. శబరిమల వివాదం. నేడు సుప్రీం తీర్పు :
వివాదం ఎందుకు?
i. మహిళల హక్కులకు, భక్తుల విశ్వాసాలకు, కోర్టు తీర్పులకు, ప్రభుత్వ నిర్ణయాలకు నడుమ శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై కొనసాగుతున్న వివాదం ఏళ్లుగా నలుగుతోంది. ఆలయంలోకి 10-50 ఏళ్ల మధ్య వయసు బాలికలు, మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని ఎత్తేస్తూ.. అన్ని వయసుల వారికి ప్రవేశాన్ని అనుమతిస్తూ గత ఏడాది సెప్టెంబరు 28న సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు- కొందరికి మోదాన్ని, మరికొందరికి ఖేదాన్ని మిగిల్చింది.
ii. ఆలయంలోకి 10-50 మధ్య వయసు మహిళలు ప్రవేశించకుండా 1991లో కేరళ హైకోర్టు నిషేధం విధించింది.
మణికంఠుడి ఆలయం.. ఎందుకంత ప్రసిద్ధి?
iii. కేరళలోని పతనంథిట్ట జిల్లాలో.. పశ్చిమ కనుమల్లోని శబరిమల శిఖరంపై ప్రసిద్ధ అయ్యప్ప స్వామి ఆలయం కొలువై ఉంది. సముద్ర మట్టానికి 3 వేల అడుగుల ఎత్తులో, పెరియార్ పులుల అభయారణ్యంలో 18 గుట్టల మధ్య ఆలయాన్ని నిర్మించారు. అయ్యప్ప అంటే ‘వృద్ధి’ అని అర్థం.
iv. ఈ గుడిని నవంబరు-డిసెంబరులో మండల పూజలకు, జనవరి 14న మకర సంక్రాంతికి, ఏప్రిల్ 14న విషువ పండుగకు, మలయాళ నెలల్లోని ప్రతి మొదటి అయిదు రోజుల సమయంలో భక్తులకు పూజలు చేసుకోవడానికి తెరుస్తారు.
దేవస్థానం చరిత్ర :
v. పురాణాల ప్రకారం.. హరిహరుల(మోహిని, శివుడు)కు జన్మించిన శిశువును వారు పంపానది ఒడ్డున వదిలేసి వెళ్లారు. సంతానం లేని పందళం రాజు రాజశేఖర అడవిలోకి వేటకు వెళ్లినపుడు ఆ శిశువు కనిపించాడు. అతన్ని రాజు తన రాజమందిరానికి తెచ్చి పెంచుకున్నారు. మణికంఠన్ అని నామకరణం చేశారు.
vi. ఆలయ నిర్మాణం పూర్తయిన తర్వాత పరశురాముడు అయ్యప్పస్వామి విగ్రహాన్ని చెక్కి మకర సంక్రాంతి రోజు ప్రతిష్ఠించారని ప్రతీతి. దట్టమైన పుంగావనం అడవిలో 12వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించారు.
vii. శబరిమల ఆలయానికి వచ్చే భక్తులు తదేక దీక్షతో గుట్టలను అధిరోహించాల్సి ఉంటుంది. వారు స్వామిని చేరుకోవడానికి ముందు 41(మండలం) రోజుల పాటు దీక్షలో ఉంటారు. నలుపు లేదా నీలం రంగు దుస్తులు ధరిస్తారు.
viii. మొదటిసారి దీక్ష తీసుకున్నవారిని కన్ని స్వాములని, రెండోసారి తీసుకుంటే కత్తి స్వాములని, మూడోసారికి గంట స్వాములని, నాలుగో సారికి గద స్వాములని పిలుస్తారు. మూడుసార్లు దీక్ష పూర్తిచేసిన వారు గురుస్వామి కావడానికి అర్హులు.
నాడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది?
ix. విచారించిన సుప్రీంకోర్టు- 2018, సెప్టెంబరు 28న తీర్పు ఇచ్చింది. స్త్రీ పురుషులని వివక్ష చూపడం రాజ్యాంగంలోని 25, 26 అధికరణలకు విరుద్ధమని పేర్కొంటూ నిషేధాన్ని ఎత్తేసింది. మహిళల ప్రవేశానికి అనుమతించింది.
x. ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంలో అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్మిశ్రాతోపాటు జస్టిస్ ఆర్.ఎఫ్.నారిమన్, జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ ఎ.ఎం.ఖాన్విల్కర్లు అనుకూలంగా తీర్పిచ్చారు.
xi. ఏకైక మహిళా న్యాయమూర్తి జస్టిస్ ఇందూ మల్హోత్రా మాత్రం వ్యతిరేకించారు.
డిసెంబరు ఒకటి నుంచి జాతీయ రహదారుల్లో ఎలక్ట్రానిక్ వసూళ్లు. ఫాస్టాగ్ ఉంటే పాత ఛార్జీలే :
i. డిసెంబరు ఒకటో తేదీ నుంచి దేశవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్(ఈటీసీ)విధానంలో టోల్ఛార్జీలు వసూలు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
ii. ఇప్పటికే ఆ విధానం ఉన్నా ఐచ్ఛికంగా ఉంది. టోల్ప్లాజాల వద్ద సమయం వృథాకాకుండా ఉండేందుకు ఇక నుంచి తప్పని సరి చేసింది.
iii. టోల్ఫ్లాజాలకు చెల్లించాల్సిన సొమ్ము ముందస్తుగా భద్రం చేసుకునేందుకు ఫాస్టాగ్ పేరుతో ప్రభుత్వం ఎలక్ట్రానిక్ స్టిక్కరును రూపొందించింది.
iv. ఫాస్టాగ్ను జాతీయ బ్యాంకులు, ఐసీఐసీఐ, యాక్సిస్, హెచ్డీఎఫ్సీ వంటి బ్యాంకులు విక్రయిస్తున్నాయి. ఆన్లైన్ సంస్థలైన అమెజాన్, పేటీఎంలలో కూడా ట్యాగులను విక్రయించేందుకు వీలుగా జాతీయ రహదారుల సంస్థ ఒప్పందం చేసుకుంది. ఫాస్టాగ్ ధర వాహనాన్ని బట్టి ఉంటుంది.
v. ఫాస్టాగ్ తీసుకోవాలంటే పైన పేర్కొన్న బ్యాంకుల్లో వాహన ఆర్సీ, గుర్తింపు కార్డు(ఆధార్, పాన్, ఓటరు) జిరాక్సు కాపీలు రెండు సెట్లు... ఒక పాస్పోర్ట్సైజు ఫొటో.. తగిన రుసుం చెల్లించాలి.
vi. ఫాస్టాగ్ లేని పక్షంలో టోల్ఛార్జీ రెండింతలు కానుంది. ఈటీసీ విధానంలో రాయితీ అమలు అవుతుంది. 24 గంటల్లో ఆ వాహనదారుడు వెనక్కు వచ్చిన పక్షంలో ఆ రాయితీ యథావిధిగా ఫాస్టాగ్ ఖాతాలో జమ అవుతుంది.
తెలంగాణ వార్తలు
వేణు సంకోజుకు కాళోజీ పురస్కారం :
i. సాహితీసేవకుడు.. వేణు సంకోజుకు ప్రతిష్టాత్మకమైన కాళోజీ–2019 సాహితీ పురస్కారం వరించింది. ఆయన హన్మకొండలోని వాగ్దేవి కళాశాలలో నిర్వహించే కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
ii. జిల్లా కేంద్రానికి చెందిన వేణు సంకోజు 5 దశాబ్దాలుగా అనేక కవితలు, రచనలతో సాహితీ సేవలు కొనసాగిస్తున్నారు. ఆయన రాజనీతి శాస్త్రంలో ఎంఏ, ఎంఫిల్, పీజీడీసీఈ, జనర్నలిజంలో పీజీడీ సాధించారు.
iii. 1972 నుంచి కవితలు, కథలు, వ్యాసాలు, గ్రంథ రచనలు సాగిస్తున్నారు. 1984లో నల్లగొండలో జయమిత్ర సాంస్కృతిక సాహిత్య వేదిక స్థాపించి వ్యవస్థాపక రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు.
సదస్సులు
ఎస్సీఓ 2020 ప్రభుత్వ పెద్దల 19 వ కౌన్సిల్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది
• షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ 2020 యొక్క 19 వ ప్రభుత్వ పెద్దల మండలిని భారతదేశం నిర్వహిస్తుంది.
In 2017 లో సమూహంలో ప్రవేశించిన తరువాత న్యూ Delhi ిల్లీ నిర్వహించిన 8 మంది సభ్యుల సమూహం యొక్క అటువంటి ఉన్నత స్థాయి సమావేశం.
O SCO అనేది చైనా నేతృత్వంలోని ఎనిమిది మంది సభ్యుల ఆర్థిక మరియు భద్రతా కూటమి, దీనిలో 2017 లో భారతదేశం మరియు పాకిస్తాన్లను పూర్తి సభ్యులుగా చేర్చారు.
• దీని వ్యవస్థాపక సభ్యులలో చైనా, రష్యా, కజాఖ్స్తాన్, కిర్గిజ్స్తాన్, తజికిస్తాన్ మరియు ఉజ్బెకిస్తాన్ ఉన్నాయి.
November 2019 నవంబర్‌లో తాష్కెంట్‌లో ప్రభుత్వ పెద్దల సదస్సు జరిగింది.
Ash తాష్కెంట్ సమ్మిట్‌లో 2020 ప్రభుత్వ అధిపతుల సమావేశాలను నిర్వహించడానికి భారత్ చొరవ తీసుకుంటుందని ప్రతిపాదించారు.
నియామకాల
ప్రవీంద్ జుగ్నాత్ మారిషస్ పీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు
• మారిషస్ ప్రస్తుత ప్రధాని ప్రవీంద్ జుగ్నాత్ ఎన్నికల తరువాత ఐదేళ్ల కాలానికి ప్రమాణ స్వీకారం చేశారు, దీనిలో పార్లమెంటుపై తన సంకీర్ణం తన పట్టును పటిష్టం చేసుకుంది.
Ug జుగ్నౌత్ తన తండ్రి నుండి 2017 లో ఓటు వేయకుండా బాధ్యతలు స్వీకరించారు మరియు నవంబర్ 7 ఎన్నికలలో అతని కేంద్ర-కుడి మొరిసియన్ అలయన్స్ యొక్క నిర్ణయాత్మక విజయం అతని చట్టబద్ధతను బలపరిచింది.
68 1968 లో బ్రిటన్ నుండి స్వాతంత్ర్యం పొందినప్పటి నుండి, మారిషస్ ఆఫ్రికాలో అత్యంత స్థిరమైన ప్రజాస్వామ్య దేశాలలో ఒకటిగా మారింది.
మొహమ్మద్ ఇమ్రాన్ భారతదేశానికి బంగ్లాదేశ్ హైకమిషనర్గా నియమితులయ్యారు:
Bangladesh భారతదేశానికి బంగ్లాదేశ్ కొత్త హైకమిషనర్‌గా మహ్మద్ ఇమ్రాన్ నియమితులయ్యారు.
Currently ప్రస్తుతం అతను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో బంగ్లాదేశ్ రాయబారి. అతను సయ్యద్ ముజాజెం అలీ తరువాత విజయం సాధించాడు.
Bangladesh బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ ప్రకటన చేసింది.
Persons in news:
టైమ్ జాబితాలో ద్యుతి :
i. టైమ్ మ్యాగజైన్ ప్రకటించిన 100 నెక్స్ట్ జాబితాలో భారత స్ప్రింటర్ ద్యుతి చంద్కు చోటు దక్కింది. ఇది ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాకు కొనసాగింపు కావడం విశేషం.
ii. క్రీడలు, వినోదం, వ్యాపారం, రాజకీయం, వైద్యం, శాస్త్ర తదితర రంగాల్లో వేగంగా ఎదుగుతున్న వ్యక్తులకు ఇందులో చోటు దక్కింది. ప్రస్తుతం దేశంలో అత్యంత వేగవంతమైన మహిళ ద్యుతినే.
ముఖ్యమైన రోజులు
నవంబర్ 14 - ప్రపంచ డయాబెటిస్ డే
i. 2019 థీమ్: ‘కుటుంబం మరియు మధుమేహం’
ii. డయాబెటిస్ వ్యాధి ప్రభావం, దాని నివారణ మరియు డయాబెటిస్ విద్య గురించి అవగాహన పెంచడానికి నవంబర్ 14 న ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని జరుపుకుంటారు.
14 నవంబర్ - పిల్లల దినోత్సవం
i. బాలల దినోత్సవాన్ని నవంబర్ 14 న భారతదేశంలో జరుపుకుంటారు మరియు దీనిని బాల్ దివాస్ అని కూడా పిలుస్తారు. ఈ రోజు పిల్లల హక్కులు, సంరక్షణ మరియు విద్య గురించి ప్రజలలో అవగాహన పెంచుతుంది. పిల్లలు దేశ భవిష్యత్తు.
ii. ఈ రోజు భారత మొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుంటుంది.
జవహర్ లాల్ నెహ్రూ 130వ జయంతి – 14 నవంబర్ 1889
i. జవహర్ లాల్ నెహ్రూ (నవంబర్ 14, 1889 – మే 27, 1964) భారత దేశ తొలి ప్రధాని, భారత స్వాతంత్ర్యపోరాటములో ప్రముఖ నాయకుడు. పండిత్‌జీగా ప్రాచుర్యము పొందిన ఈయన రచయిత, పండితుడు మరియు చరిత్రకారుడు. భారత రాజకీయలలో శక్తివంతమైన నెహ్రూ-గాంధీ కుటుంబానికి ఈయనే మూలపురుషుడు.
ii. జవహర్‌లాల్ నెహ్రూ బ్రిటీష్ ఇండియాలోని యునైటెడ్ ప్రావిన్సులోని అలహాబాదు (ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో భాగం) నగరంలో 1889 నవంబరు 14న కాశ్మీరీ పండిట్ కుటుంబంలో జన్మించాడు. అతని తండ్రి మోతీలాల్ నెహ్రూ సంపన్నుడైన బారిస్టర్, తర్వాతి కాలంలో జాతీయోద్యమంలో పాల్గొని రెండు మార్లు భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షునిగా పనిచేశాడు.
iii. కాంగ్రెస్‌లో ఉంటూనే స్వాతంత్ర్యం కోసం ఒత్తిడి తీసుకువచ్చే పక్షంగా ఇండిపెండెన్స్ ఫర్ ఇండియా లీగ్ నెలకొల్పాడు. చివరకు 1929 ప్రారంభానికి కాంగ్రెస్ సంపూర్ణ స్వాతంత్ర్యాన్ని లక్ష్యంగా ఆమోదించడంతో అప్పటికి క్రియారహితంగా ఉన్న లీగ్ అస్తిత్వానికి కూడా కారణం కోల్పోయింది.
iv. మోతీలాల్ నెహ్రూ తయారుచేసిన నెహ్రూ రిపోర్టును 1928లో జరిగిన కలకత్తా కాంగ్రెస్ సమావేశాల్లో ప్రవేశపెట్టారు. 1929 మార్చిలో పలువురు ట్రేడ్ యూనియన్ నాయకులను, కొందరు అమాయకులను కమ్యూనిస్టులు అన్న పేరిట అరెస్టు చేసి, పెట్టిన మీరట్ కుట్ర కేసు విషయంలో వారికి సహాయంగా వాదించడానికి, ఆ కేసు నడిపించేందుకు నిధులు వసూలు చేయడానికి పనిచేశాడు.
v. జవహర్‌లాల్ నెహ్రూ భారత స్వాతంత్ర్య ప్రకటన చిత్తుప్రతిని తానే తయారుచేశాడు. దీనిని లాహోర్ కాంగ్రెస్ ఆమోదించింది.
vi. 1929 డిసెంబరు 31 అర్థరాత్రి నాడు జవహర్‌లాల్ లాహోర్ నగరంలో రావి నది ఒడ్డున 3 లక్షల మంది చూస్తూండగా మువ్వన్నెల జెండా ఎగురవేశాడు.
vii. లాహోర్ కాంగ్రెస్‌లో 1930 జనవరి ఆఖరి ఆదివారం (జనవరి 26) పూర్ణ స్వాతంత్ర్య ఆకాంక్షను వ్యక్తం చేస్తూ స్వాతంత్ర్య దినాన్ని జరుపుకోవాలన్న నిర్ణయం తీసుకున్నారు. జవహర్‌లాల్ 1936లో ఐరోపాలో ఉండగానే గాంధీ నిర్ణయం ఆమోదిస్తూ కాంగ్రెస్ పార్టీ జవహర్‌ని పార్టీ అధ్యక్షునిగా ఎన్నుకుంది.
viii. జవహర్‌లాల్ తన కుమార్తె ఇందిరకు రాసిన ఉత్తరాల్లో ప్రపంచ చరిత్రను వ్రాస్తూ పోయాడు. ఒక ప్రణాళికను అనుసరించి వ్రాసిన ఆ ఉత్తరాలే క్రమేపీ "గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ" గ్రంథంగా తయారయ్యాయి. డిస్కవరీ ఆఫ్ ఇండియా పుస్తకాన్ని నెహ్రూ 1941లో జైలు జీవితంలో ప్రారంభించి, తిరిగి అహమ్మద్ నగర్ జైలులో ఉన్నప్పుడు 1943 ప్రాంతంలో పున: ప్రారంభించి పూర్తిచేశాడు.
ix. భారత ఆర్ధిక రంగానికి అనువుగా సవరించిన రాజ్య ప్రణాళిక మరియు నియంత్రణ విధానానికి నెహ్రూ అధ్యక్షుడిగా ఉన్నారు. నెహ్రూ, భారత ప్రణాళికా సంఘంన్ని నెలకొల్పి, 1951 లో మొదటి పంచ-వర్ష ప్రణాళికను రచించి, అందులో పారిశ్రామిక మరియు వ్యవసాయ రంగాలలో ప్రభుత్వ పెట్టుబడులను పొందుపరిచారు.
x. 1955లో, నెహ్రూకు భారతదేశపు అత్యున్నత పౌర గౌరవం అయిన భారత్ రత్న లభించింది. రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ సాధారణ రాజ్యాంగ పద్దతి వలె ప్రధాని సలహా తీసుకోకుండా ఆయనకు గౌరవం ఇచ్చారు
క్రీడలు
డిసెంబర్ 1 నుంచి కబడ్డీ ప్రపంచకప్ :
i. కబడ్డీ మహా సంగ్రామానికి ముహూర్తం ఖరారైంది. భారత్ ఆతిథ్యమిస్తున్న 2019 కబడ్డీ ప్రపంచకప్ వచ్చే నెల 1న ఆరంభం కానుంది.
ii. లుథియానాలోని గురు నానక్ స్టేడియంలో ఆరంభ వేడుక.. ఫిరోజ్పుర్లోని భగత్ సింగ్ మైదానంలో ముగింపు కార్యక్రమం జరగనుంది.

No comments:
Post a Comment