Sunday, 24 November 2019

23rd november 2019 current affairs

✍  కరెంట్ అఫైర్స్ 23 నవంబరు 2019 Saturday ✍

జాతీయ వార్తలు
ఫాస్టాగ్.. తెలుసుకుంటే సులభమిక ప్రయాణం :

i. ఫాస్టాగ్ను ఇప్పటికే ప్రయోగాత్మకంగా 2014 నుంచి వివిధ జాతీయ రహదారుల మీద అమలు చేస్తున్నారు. ఈ ఏడాది మార్చి నుంచి దేశవ్యాప్తంగా అన్ని టోల్ప్లాజాల్లో కొన్నిలైన్లలో తప్పనిసరి చేశారు.
ii. ఈ డిసెంబరు 1 నుంచి ఒక్క లైన్ మినహా మిగిలినవన్నీ ఫాస్టాగ్కే కేటాయిస్తారు. అంటే... నగదు చెల్లించే వాహనదారులకు ఒక్క లైనే మిగులుతుంది.
iii. టోల్ప్లాజాల వద్ద వాహనం ఆగకుండా వెళ్లిపోయేందుకు వీలుగా ఉపయోగపడే చిన్న సాంకేతిక సాధనమే ఈ ఫాస్టాగ్. నగదు రహిత, డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం దీన్ని అమలు చేస్తోంది.
iv. చిన్న ఎలక్ట్రానిక్ చిప్ రూపంలో ఉండే ఈ ఫాస్టాగ్ను వాహనం ముందుండే అద్దం లోపలివైపు అతికిస్తారు. మన వాహనం టోల్ప్లాజా లైన్లోకి రావడంతోనే అక్కడ అమర్చిన ఎలక్ట్రానిక్ పరికరం వాహన ఫాస్టాగ్ ఐడీ, రిజిస్ట్రేషన్ నంబరు, మన పేరును గుర్తించి, ఖాతా నుంచి టోల్ రుసుంను ఆన్లైన్లోనే తీసుకుంటుంది. ఇదంతా 10సెకండ్లలోనే జరిగిపోతుంది.
v. ఫాస్టాగ్ తీసుకున్న తర్వాత, ఆండ్రాయిడ్ ఫోనులో ‘మై ఫాస్టాగ్ యాప్’ను వేసుకుని, అందులో బ్యాంకు ఖాతా, వాహన నంబర్లను నమోదు చేసుకొని లింకు చేసుకోవచ్చు.
vi. ఎన్హెచ్ఏఐకి చెందిన ‘సుఖద్ యాత్ర’ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే అందులో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లానుకుంటున్నామో పేర్కొంటే... ఆ మార్గంలో ఎన్ని టోల్ప్లాజాలు ఉన్నాయి, ఎంత రుసుం తదితర వివరాల సమాచారం తెలుస్తుంది.
రైల్వేను ప్రైవేటీకరించడం లేదు : పీయూష్ గోయల్

i. భారతీయ రైల్వేను ప్రైవేటీకరించడం లేదని కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయెల్ తెలిపారు.
ii. ప్రయాణికులకు నాణ్యమైన సేవలు అందించడానికి కొన్ని రైళ్లలో వాణిజ్య, ఆన్బోర్డ్ సేవలను మాత్రమే ప్రైవేటుకి అప్పగిస్తున్నామని పేర్కొన్నారు.
Jitendra Singh to inaugurate ‘Destination North East’ Festival :

i. కేంద్ర రాష్ట్ర మంత్రి (ఇండిపెండెంట్ ఛార్జ్) ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ (DoNER) డాక్టర్ జితేంద్ర సింగ్ 2019 నవంబర్ 23న ఉత్తరప్రదేశ్ వారణాసిలో జరిగే ‘నార్త్ ఈస్ట్ గమ్యం (Destination North East)’ ఉత్సవాన్ని ప్రారంభిస్తారు.
ii. మొత్తం 8 నార్త్ ఈస్ట్ రాష్ట్రాలు వారి హస్తకళలు, చేనేత, సేంద్రీయ ఉత్పత్తులు మరియు సాంస్కృతిక బృందాలతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి.
iii. పండుగ సందర్భంగా, సందర్శకులు తమ మగ్గాలు మరియు చేతిపనులపై పనిచేసే ఈశాన్య రాష్ట్రాల కళాకారులు మరియు కళాకారుల ప్రత్యక్ష అనుభవాలను కలిగి ఉంటారు, పగటిపూట బహిరంగ వేదికలో వారి పాటలు మరియు నృత్యాలను ప్రదర్శిస్తారు. సందర్శకులు కూడా పాల్గొనే స్వదేశీ ఆటలు కూడా ప్రదర్శించబడతాయి.
ఇతర రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల వార్తలు
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫడణవీస్ :

i. మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడణవీస్ ప్రమాణస్వీకారం చేశారు. ఉపముఖ్యమంత్రిగా ఎన్సీపీకి చెందిన అజిత్ పవార్ ప్రమాణం చేశారు.
ii. వీరితో గవర్నర్ భగత్సింగ్ కోశ్యారీ శనివారం (Nov 23) ఉదయం ప్రమాణం చేయించారు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ భాజపా-ఎన్సీపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.
iii. రాత్రికి రాత్రే పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. దీంతో మిత్రపక్షం శివసేనకు భాజపా భారీ షాక్ ఇచ్చినట్లయింది.
iv. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గత నెల 24న వెలువడ్డాయి. ప్రభుత్వ ఏర్పాటుకు పార్టీలేవీ ముందుకు రాలేదంటూ గవర్నర్ చేసిన సిఫార్సు మేరకు ఆ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ఈ నెల 12 నుంచి రాష్ట్రపతి పాలన విధించింది.
Assam government releases the new Land Policy 2019 after 30 years :

i. రెవెన్యూ, విపత్తు నిర్వహణ విభాగం తయారుచేసిన కొత్త ల్యాండ్ పాలసీ 2019 ను అస్సాం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ విడుదల చేశారు.
ii. ల్యాండ్ పాలసీని అక్టోబర్ 21న కేబినెట్ ఆమోదించింది మరియు దీనిని 30 సంవత్సరాల తరువాత రెవెన్యూ మరియు విపత్తు నిర్వహణ విభాగం తయారు చేసింది. ఇది చివరిసారిగా 1989 లో తయారు చేయబడింది.
iii. స్వదేశీ ప్రజల ఆసక్తిని కాపాడటానికి ల్యాండ్ పాలసీని సిద్ధం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రాధాన్యత ఇస్తోంది మరియు ఈ విధానం భూమి కేటాయింపులు మరియు స్థావరాలకి సంబంధించిన సమస్యలను తొలగిస్తుంది.
గుజరాత్లో ఇనుప యుగపు ఆనవాళ్లు. కనుగొన్న ఐఐటీ-ఖరగ్పుర్ పరిశోధకులు :

i. గుజరాత్లో దాదాపు మూడువేల ఏళ్లనాటి ఇనుపయుగపు ఆనవాళ్లను ఐఐటీ-ఖరగ్పుర్ పరిశోధకులు గుర్తించారు. ప్రస్తుతం కచ్ప్రాంతంలో ఉన్న ఉప్పునేలలకు సమీపంలోని కరీంషాహి, విగకోట్ ప్రాంతాల్లో ఇనుపయుగం పరిఢవిల్లినట్లు వారు పేర్కొన్నారు.
ii. థార్ఎడారి సమీపంలో పాక్ సరిహద్దు సమీప ప్రాంతంలో సుమారు 3000-2500 ఏళ్ల క్రితం జనావాసాలున్నట్లు సాక్ష్యాలు లభించాయన్నారు.
iii. రుతుపవనాల క్షీణత, తీవ్రమైన కరవుతో అమూల్యమైన సింధూనాగరికత అంతరించిపోయిన తర్వాత ఇనుప యుగం మొదలైంది. గుజరాత్లో సంభవించిన ఈ పరిణామాన్ని పురాతత్వశాస్త్రవేత్తలు ‘చీకటియుగం’గా అభివర్ణించిన విషయం గమనార్హం.
 అంతర్జాతీయ వార్తలు
వివాదాస్పద చైనా-పాకిస్థాన్ ఆర్థిక నడవా (సీపెక్)పై అమెరికా తీవ్ర స్థాయిలో నిప్పులు :

i. ఇది పాక్ ఆర్థిక వ్యవస్థను దారుణంగా దెబ్బతీస్తుందని, సార్వభౌమాధికారాన్ని కబళిస్తుందని అమెరికా హెచ్చరించింది.  ప్రాజెక్టుపై చైనాకు ‘కఠిన ప్రశ్నలు’ సంధించాలని పాకిస్థాన్కు సూచించింది.
ii. ఆసియా, ఆఫ్రికా, చైనా, ఐరోపా మధ్య సంధానత, సహకారం కోసం ఓబీఓఆర్ ప్రాజెక్టును చైనా చేపట్టింది. ఇందులో భాగంగా ‘సీపెక్’ను తెరపైకి తెచ్చింది.
iii. చైనాలోని షిన్జియాంగ్ యుగుర్ స్వయంప్రతిపత్తి ప్రాంతాన్ని పాకిస్థాన్లోని వ్యూహాత్మక గ్వాదర్ రేవుతో అనుసంధానించడం దీని ఉద్దేశం. ఈ నడవాలో వందల కోట్ల డాలర్లతో రోడ్లు, రైల్వేలు, ఇంధన ప్రాజెక్టులను చైనా నిర్మిస్తుంది.
Defence News
The NIA will host the first-ever counter-terrorism (CT) exercise :

i. The National Investigation Agency (NIA) will host the first-ever counter-terrorism (CT) exercise for the Quad countries in New Delhi.
ii. The Quad countries include the United States (US), India, Australia, and Japan.
iii. According to the NIA, the exercise is to assess and validate CT response mechanisms in the light of emerging terrorist threats.
iv. It also aims to provide opportunities to share the best practices and to explore areas for enhanced cooperation amongst participating countries.
సదస్సులు
Global Bio-India Summit – Delhi

i. మూడు రోజుల గ్లోబల్ బయో ఇండియా సమ్మిట్ 2019 న్యూఢిల్లీ లో ప్రారంభమైంది. భారతదేశంలో తొలిసారిగా జరగబోయే అతిపెద్ద బయోటెక్నాలజీ వాటాదారుల సమ్మేళనాలలో ఇది ఒకటి.
ii. ఇది అకాడెమియా, ఇన్నోవేటర్లు, పరిశోధకులు, స్టార్టప్‌లు, మీడియం మరియు పెద్ద కంపెనీలను ఒకే వేదికపైకి తెస్తుంది. మెగా ఈవెంట్‌లో సుమారు 25 దేశాల నుండి, భారతదేశంలోని 15 కి పైగా రాష్ట్రాల నుండి మూడు వేలకు పైగా ప్రతినిధులు పాల్గొంటారు.
Persons in news
భారత నౌకా దళంలో తొలి మహిళా పైలట్గా శివాంగి :

i. భారత నౌకా దళంలో తొలి మహిళా పైలట్గా చరిత్ర సృష్టించింది బిహార్కు చెందిన సబ్ లెఫ్టినెంట్ శివాంగి.
ii. శివాంగి బిహార్లోని చిన్నపట్టణం ముజఫర్పుర్లో పుట్టి పెరిగింది. సిక్కిం, మణిపాల్ సాంకేతిక విశ్వవిద్యాలయంలో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసింది.
iii. మహిళలను పైలట్ పోస్టులకు ఎంపిక చేయడం నౌకాదళంలో ఇదే మొదటిసారి. సదరన్ నేవల్ అకాడమీలో శివాంగి ఎంతో కఠినమైన శిక్షణను పూర్తి చేసింది.
Reports/Ranks/Records
చెమట చుక్కలు చిందించట్లేదు. వ్యాయామానికి దూరంగా పిల్లలు. రోజుకు గంటపాటు శ్రమించేవారు 20% కంటే తక్కువే : ప్రపంచ ఆరోగ్య సంస్థ  అధ్యయనంలో వెల్లడి
 
i. ఆట పాటలతో హుషారుగా ఉండాల్సిన కిశోరప్రాయం స్తబ్ధుగా తయారవుతోంది! సెల్ఫోన్కు దగ్గరవుతూ మైదానానికి దూరమవుతోంది. ఏకంగా 146 దేశాల్లో ఇదే పరిస్థితి. ప్రపంచవ్యాప్తంగా 11-17 ఏళ్ల మధ్య వయసు పిల్లల్లో 80 శాతం కంటే ఎక్కువమంది రోజుకు కనీసం గంటసేపు కూడా వ్యాయామం చేయట్లేదు. ఫలితంగా వారి శారీరక ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలు పెరుగుతున్నాయి.
ii. మేధో వికాసంపైనా ప్రతికూల ప్రభావం పడుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) పరిశోధకులు జరిపిన అధ్యయనం ఆందోళనకర విషయాలను బయటపెట్టింది. 2016 నాటికి ప్రపంచవ్యాప్తంగా 146 దేశాల్లో ఉన్న పరిస్థితులను కళ్లకు కట్టింది.
iii. మనదేశంలో 72% మంది బాలురు రోజులో కనీసం గంట కూడా శారీరక శ్రమ చేయట్లేదు. ప్రపంచ సగటు(78%)తో పోలిస్తే ఇది కాస్త మెరుగే.

iv. కిశోరప్రాయులు ప్రతిరోజు గంట పాటు వ్యాయామం చేయాలన్నది డబ్ల్యూహెచ్వో సిఫార్సు.
అవార్డులు
స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీన్ అవార్డులు 2019 :

i. న్యూఢిల్లీలోని ప్రవాసి భారతీయ కేంద్రంలో ప్రపంచ మరుగుదొడ్డి దినోత్సవం సందర్భంగా కేంద్ర రసాయన, ఎరువుల మంత్రిత్వ శాఖ మంత్రి వివిధ వర్గాలలోని అగ్రశ్రేణి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు మరియు జిల్లాలకు స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీన్ 2019 అవార్డులను ప్రదానం చేశారు.
ii. అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం : తమిళనాడు
iii. అగ్రస్థానంలో ఉన్న జిల్లా : పెద్దపల్లి (తెలంగాణ)
iv. గరిష్ట పౌరుల భాగస్వామ్యంతో రాష్ట్రం : ఉత్తర ప్రదేశ్.
తెలంగాణకు ఇండియాటుడే సుపరిపాలన పురస్కారం :

i. ఇండియాటుడే తెలంగాణకు సుపరిపాలన పురస్కారాన్ని ప్రకటించింది. దిల్లీలో స్టేట్ ఆఫ్ స్టేట్స్ కాన్క్లేవ్-2019 పేరిట నిర్వహించిన కార్యక్రమంలో పలు విభాగాల్లో రాష్ట్రాలకు అవార్డులు ప్రదానం చేశారు.
ii. కేంద్ర పర్యావరణ, అటవీ శాఖల మంత్రి ప్రకాష్ జావడేకర్ చేతుల మీదుగా తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు అవార్డును అందుకున్నారు.
సినిమా వార్తలు
తాన్హాజీ జీవిత కథతో ‘తాన్హాజీ : ది అన్సంగ్ వారియర్’ :

i. మరాఠా యోధుడు తాన్హాజీ జీవిత కథతో తెరకెక్కుతోన్న చిత్రం ‘తాన్హాజీ:ది అన్సంగ్ వారియర్’. ఛత్రపతి శివాజీ దగ్గర సుబేదార్గా  పనిచేసిన తాన్హాజీ కథ ఇది.
ii. తాన్హాజీ పాత్రలో అజయ్దేవ్గణ్ నటించారు. 1670లో తాన్హాజీ మొఘల్ సామ్రాజ్యంపై జరిపిన యుద్ధం నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. ఔరంగజేబు సామ్రాజ్యంలో పనిచేసే కీలకమైన వ్యక్తి ఉదయ్ భాన్ పాత్రలో సైఫ్ అలీఖాన్ నటించారు.
iii. తాన్హాజీ భార్య సావిత్రీబాయి పాత్రలో కాజోల్ నటించింది. ఓం రౌత్ తెరకెక్కించిన ఈ సినిమా జనవరి 10న విడుదల కానుంది.
మరణాలు
కమ్యూనిస్టు యోధుడు గుర్రం యాదగిరిరెడ్డి కన్నుమూత :

i. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, మాజీ ఎమ్మెల్యే గుర్రం యాదగిరిరెడ్డి (88) హైదరాబాద్లో మరణించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా గుండాల మండలం సుద్దాల గ్రామంలో 1931లో జన్మించిన యాదగిరిరెడ్డి చిన్నప్పటి నుంచే సాయుధ పోరాటం వైపు ఆకర్షితులయ్యారు.
ii. ప్రముఖ కవి సుద్దాల హనుమంతుతో కలిసి పనిచేసిన ఆయన.. రామన్నపేట నియోజకవర్గం నుంచి 1985, 1989, 1994లో వరుసగా మూడుసార్లు సీపీఐ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1999లో ఎమ్మెల్యే పదవీకాలం ముగిశాక పూర్తిగా రాజకీయాలకు దూరమయ్యారు.
iii. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఉప్పునూతల పురుషోత్తంరెడ్డిపై ఆయన చివరి రెండుసార్లు విజయం సాధించారు. మూడోసారి 1994లో పోటీ చేసేటప్పుడు ఆర్థిక ఇబ్బందులు రావడంతో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా శాసనసభ్యులకు ఇచ్చిన ఇంటి స్థలాన్ని అమ్మేసి ఎన్నికల్లో పోటీచేశారు.
ఉస్మానియా మాజీ వీసీ రామకిష్టయ్య కన్నుమూత :

i. ఉస్మానియా విశ్వవిద్యాలయం మాజీ వీసీ, APPSC మాజీ ఛైర్మన్ ప్రొఫెసర్ వి.రామకిష్టయ్య(87) హైదరాబాద్ విజ్ఞానపురి కాలనీలోని స్వగృహంలో కన్నుమూశారు.
ii. నల్లగొండ జిల్లా మునుగోడుకు చెందిన ఆయన.. 1996-99 మధ్య ఓయూ వీసీగా వ్యవహరించారు. 1986-1992 వరకు APPSC ఛైర్మన్గా ఉన్నారు. ముగ్గురు ముఖ్యమంత్రుల పాలనలో ఛైర్మన్గా సమర్థంగా బాధ్యతలు నిర్వహించి వారి మన్ననలను పొందారు.
ముఖ్యమైన రోజులు
World Chronic Obstructive Pulmonary Disease(COPD) Day (ప్రపంచ ముదిరిన ఊపిరితిత్తుల వ్యాధి దినం) - Third Wednesday of November (In 2019, November 20)

i. Theme 2019 : All Together to End COPD
ii. The WHO (World Health Organization) and Global Initiative for Chronic Obstructive Lung Disease (GOLD) organize World COPD (Chronic Obstructive Pulmonary Disease) Day on the third Wednesday of November every year.
iii. It was first launched in 1997 by WHO, GOLD and other institutes in the US.
iv. COPD is Chronic Obstructive Pulmonary Disease. It causes severe breathlessness and predisposes to exacerbations.
క్రీడలు
మను ఖాతాలో మరో పసిడి :

i. ప్రపంచకప్ షూటింగ్ ఫైనల్స్ టోర్నీని భారత్ ఘనంగా ముగించింది.
ii. మిక్స్డ్ ఎయిర్ పిస్టల్ విభాగంలో ప్రపంచ నంబర్వన్ చెర్నోసోవ్ (రష్యా)తో జోడీ కట్టిన మను.. ఫైనల్లో 17-13తో సౌరభ్ చౌదరి-అనా కొరాకకి (రష్యా)పై గెలిచింది.
iii. వ్యక్తిగత విభాగాల్లోనూ స్వర్ణాలు గెలిచిన మను, దివ్యాంశ్ ప్రెసిడెంట్స్ ట్రోఫీలను కూడా సొంతం చేసుకున్నారు.

>>>>>>>>>>>>>>>>  End of the day  <<<<<<<<<<<<<<<<

No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...