✍ కరెంట్ అఫైర్స్ 25 నవంబరు 2019 Monday ✍
జాతీయ వార్తలు
ప్రధాని నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమ ప్రసంగం :
అమ్మభాషను విస్మరిస్తే అభివృద్ధి అసాధ్యం.. ఇది అంతర్జాతీయ స్థానిక భాషల సంవత్సరం :
i.
మాతృభాషను నిర్లక్ష్యం చేస్తే అభివృద్ధి అసాధ్యమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశ ప్రజలనుద్దేశించి ఆదివారం ఆయన ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ప్రసంగించారు.
ii.
ఐక్యరాజ్య సమితి (ఐరాస) కూడా మాతృభాషల ప్రాధాన్యాన్ని గుర్తించిందని, అందుకే 2019ని ‘అంతర్జాతీయ స్థానిక భాషల సంవత్సరం’గా ప్రకటించిందని చెప్పారు. అంతరించే దశలో ఉన్న భాషలను కాపాడడమే దీని ఉద్దేశమని తెలిపారు.
iii.
‘భారత మాతకు 30 కోట్ల ముఖాలు.. కానీ ఒకటే శరీరం. 18 భాషలు మాట్లాడుతుంది..కానీ ఒకేలా ఆలోచిస్తుంది’ అంటూ నాడు ప్రముఖ తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి రాసిన కవితను ఉటంకించారు.
iv.
ఉత్తరాఖండ్లోని దారుచులా ప్రాంతంలో రంగ్ జాతి ప్రజలు లిపిలేని తమ భాష ‘రంగ్లో’ను కాపాడుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలను ఉదహరించారు. ఆ భాష మాట్లాడే వారు పదివేల మంది వరకు ఉంటారని చెప్పారు. వారంతా వాట్సప్ గ్రూపులు ఏర్పాటు చేసుకొని భాషను అభివృద్ధి చేసుకుంటున్నారని తెలిపారు. వాట్సపే వారికి తరగతిగదిగా మారింది.
v.
ఎవరైనా అభివృద్ధి చెందాలంటే తొలుత వారి భాష అభివృద్ధి చెందాల్సి ఉందంటూ 150 ఏళ్ల క్రితం ఆధునిక హిందీ పితామహుడు భారతేందు హరిశ్చంద్ర చేసిన సూచనను కూడా గుర్తుచేశారు.
విశాఖ స్కూబా డైవర్లకు ప్రశంస :
vi.
ప్లాస్టిక్ వ్యర్థాల నిర్మూలనకు విశాఖపట్నానికి చెందిన స్కూబా డైవర్లు విశేషమైన కృషి చేస్తున్నారని ప్రధాని మోదీ ప్రశంసించారు.
vii.
ప్రతి రోజూ సముద్రంలో వంద మీటర్ల లోపలికి వెళ్లి పాస్టిక్ వ్యర్థాలను సేకరిస్తున్నారు. 13 రోజుల్లోనే 4,000 కేజీల చెత్తను వెలికి తీశారు.
viii.
వారికి స్థానిక మత్స్యకారులు అన్ని విధాలుగా సహకరిస్తున్నారు. ఓ చిన్న ప్రయత్నం ఇప్పుడు పెద్ద ఉద్యమంగానే రూపుదిద్దుకోనుంది అని చెప్పారు. దీన్ని ఆదర్శంగా తీసుకొని ప్లాస్టిక్ రహిత భారత్ కోసం అందరూ ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు.
పుష్కరాలు నదుల ప్రాధాన్యాన్ని తెలియజేస్తాయి :
ix.
బ్రహ్మపుత్ర పుష్కరాలకు తగిన ప్రచారం లభించలేదంటూ ఫిర్యాదు అందిందని తెలిపారు. పుష్కరాలు నదుల ప్రాధాన్యాన్ని తెలియజేస్తాయని చెప్పారు.
x.
వచ్చే ఏడాది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకల్లో తుంగభద్ర పుష్కరాలు జరుగుతాయని వివరించారు.
రాజ్యాంగ రచనకు మూడేళ్ల అవిరళ కృషి. 70 వసంతాల రాజ్యాంగం :
i.
కాలం 3 సంవత్సరాలు, మథనం 165 రోజులు, తయారైన అధికరణలు 395, రూపొందిన షెడ్యూళ్లు 12, ఆమోదం పొందింది 1949 నవంబరు 26, అమల్లోకి వచ్చింది 1950 జనవరి 26.. గణాంకాల్లో చూస్తే ఇదీ భారత రాజ్యాంగ స్వరూపం.
ii.
ఒక్కో అధికరణం రూపొందడానికి ఎంత భావ సంఘర్షణ జరిగిందో చెప్పేందుకు 11 మహా సంపుటాలే సాక్ష్యాలు.
iii.
మొదటి రాజ్యాంగ పరిషత్ సమావేశం 1946 డిసెంబరు 9న జరిగింది. రాజ్యాంగ పరిషత్లో 82 శాతం సభ్యులు కాంగ్రెస్కు చెందిన వారే. వీళ్లందరి ఆలోచనలు, దృక్పథాలు ఒక తీరులో ఉండేవి కావు. వీళ్లందరినీ సమన్వయపరుచుకుంటూ ప్రపంచంలో అతి పెద్దదయిన లిఖిత రాజ్యాంగాన్ని రూపొందించడం మామూలు విషయం కాదు.
iv.
రాజ్యాంగ ముసాయిదా రచనా కమిటీ సారథ్యాన్ని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్కు అప్పగించడమే అందుకు నిదర్శనం.
మహామహుల కృషి :
v.
300 మంది వరకు రాజ్యాంగ పరిషత్లో ఉన్నప్పటికీ కీలక పాత్ర వహించింది 20 మంది మాత్రమే. కాంగ్రెస్ వైపు నుంచి జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభ్భాయ్ పటేల్, బాబూ రాజేంద్రప్రసాద్ ముఖ్యభూమిక పోషించారు.
vi.
కెం.ఎం.మున్షీ, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ల పాత్ర కూడా గణనీయమైందే. రాజ్యాంగ పరిషత్కు న్యాయ సలహాదారుగా వ్యవహరించిన బి.ఎన్.రావు, చీఫ్ డ్రాఫ్ట్స్మన్గా వ్యవహరించిన ఎస్.ఎన్.ముఖర్జీలదీ అద్వితీయ పాత్రే.
vii.
బ్రిటిష్ పాలకులు రూపొందించిన 1935 భారత ప్రభుత్వ చట్టంలోని చాలా విషయాలను భారత రాజ్యాంగంలో పొందుపరిచారు. ఆధునిక ప్రజాస్వామ్య దేశాల అనుభవాల నుంచి చాలా విషయాలు తీసుకున్నారు.
viii.
1928 ఒలింపిక్స్లో భారత హాకీ జట్టుకు సారథ్యం వహించి బంగారు పతకాన్ని సాధించటంలో కీలకపాత్ర పోషించిన జైపాల్సింగ్ తన అద్భుత వాదనాపటిమతో దేశంలో గిరిజనుల దుస్థితిని సభ్యుల దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం చర్పోపచర్చలు జరిగి గిరిజనులకు కూడా రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించారు.
ix.
ప్రాథమిక హక్కుల విషయంలో దాదాపు ఏకాభిప్రాయం వ్యక్తమైంది. రాజ్యాంగ లక్ష్యాలను సూచించే తీర్మానాన్ని 1946 డిసెంబరు 13న నెహ్రూ రాజ్యాంగ పరిషత్లో ప్రవేశపెట్టారు. అధికారభాషగా హిందీని గుర్తిస్తూ.. 15 ఏళ్లపాటు ఇంగ్లీష్ని కొనసాగించాలని నిర్ణయించారు.
x.
భూసంస్కరణలకు, హిందూ కోడ్ బిల్లుకు అప్పట్లో రాష్ట్రపతి నుంచే అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. తాను మంత్రివర్గ సలహాకు బద్ధుడనై ఎందుకుండాలని రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్ ప్రశ్నించారు.
xi.
అత్యవసర పరిస్థితి కాలంలో పలు రాజ్యాంగ మౌలిక నియమాలను నీరుగార్చటానికి 42వ రాజ్యాంగ సవరణను తీసుకువచ్చారు. తర్వాత వచ్చిన జనతా ప్రభుత్వం ఆ మార్పులను నిరోధిస్తూ రాజ్యాంగ సవరణను తీసుకుని రావటంతో పరిస్థితి కుదుటపడింది.
xii.
కేశవానందభారతి కేసులో రాజ్యాంగ మౌలిక నిర్మాణానికి ఇచ్చిన నిర్వచనం కార్యనిర్వాహకవర్గం బాధ్యతాయుతంగా వ్యవహరించడానికి ఎంతో తోడ్పడింది. 1990ల్లో లౌకిక వాదం ఒక విలువగా చాలా ఒడిదుడుకులకు లోనైనా తట్టుకుంది. మహా ఉద్గ్రంథంగా వేనోళ్ల కొనియాడే భారత రాజ్యాంగం సరిగ్గా 70 ఏళ్ల క్రితం.. 1949 నవంబరు 26న ఆమోదం పొందింది.
xiii.
బి.ఆర్.అంబేడ్కర్ : “రాజ్యాంగం ఎంత మంచిదైనా దాన్ని అమలు చేసేవారు మంచివారు కానట్లయితే అది చెడ్డ ఫలితాల్ని ఇస్తుంది. ఎంత చెడు రాజ్యాంగమైనా దాన్ని అమలు చేసేవాళ్లు మంచివాళ్లయితే అది మంచి ఫలితాలను ఇస్తుంది”.
xiv.
డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ : “భారత రాజ్యాంగం దేశ ప్రజల ఐక్యతకు ప్రతీక. కోట్ల మంది భారతీయుల సంక్షేమానికి ఇది పూచీగా నిలుస్తుంది. శ్రేయోరాజ్యం, సమ సమాజ స్థాపనకు దోహదపడుతుంది”.
xv.
జవహర్లాల్ నెహ్రూ : “సకల సమస్యల్నీ రాజ్యాంగమే పరిష్కరిస్తుందనుకోవడం తప్పు. మేధోశక్తి, కఠోర శ్రమతో సమస్యల్ని పరిష్కరించుకోవచ్చు. రాజ్యాంగ ప్రవేశిక భారతానికి ఒక నిశ్చితమైన తీర్మానం, హామీ”.
ప్రజాస్వామ్య విభూషణం. దేశానికి రాజ్యాంగమే మూలస్తంభం :
i.
రాజ్యాంగ 17వ ప్రకరణ అనాదిగా కొనసాగుతున్న అంటరానితనమనే సాంఘిక దురాచారాన్ని నిషేధించింది. ఇలాంటి హామీలన్నీ ఒక ఎత్తయితే.. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేయడం మరో కీలకాంశం.
ii.
సమాఖ్య వ్యవస్థకు నాంది పలికిన అమెరికా రాజ్యాంగం భారత రాజ్యాంగాన్ని ప్రభావితం చేసినప్పటికీ.. మన రాజ్యాంగ నిర్మాతలు అర్ధ సమాఖ్య వ్యవస్థ వైపు మొగ్గుచూపారు.
iii.
రాజ్యాంగ నిర్మాతలు పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్నే ఎంపిక చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు, వర్గాలకు పాలన బాధ్యతల్లో సముచిత స్థానాన్ని కల్పిస్తూ.. అధ్యక్ష తరహా వ్యవస్థలో తలెత్తే అధికార కేంద్రీకరణను ఇది నివారిస్తుంది.
iv.
రెండో ప్రపంచ యుద్ధానంతరం స్వాతంత్య్రాన్ని పొందిన అనేక దేశాలు ప్రజాస్వామ్యం నుంచి నిరంకుశం వైపు మళ్లాయి. యుగొస్లావియా, సోవియట్ యూనియన్, సూడాన్ లాంటి దేశాలు విచ్ఛిన్నమయ్యాయి. భారతదేశం మాత్రం నేటికీ ప్రజాస్వామ్య దేశంగా కొనసాగుతూ తన ప్రాదేశిక సమగ్రతను పరిరక్షించుకుంటోందంటే అది మన రాజ్యాంగంలో పొందుపరిచిన అదుపులు, అన్వయాల(చెక్స్ అండ్ బ్యాలెన్సెస్) ఫలితమే.
దేశ గతిని మార్చిన ముఖ్య సవరణలు :
i.
మారుతున్న పరిస్థితులు, ఎదురవుతున్న సవాళ్లు, పెరుగుతున్న అవసరాల నేపథ్యంలో.. రాజ్యాంగ మౌలిక సూత్రాలకు భంగం కలగకుండా వివిధ లక్ష్యాలతో రాజ్యాంగాన్ని ఇప్పటివరకు 103 సార్లు సవరించారు.
ii.
తొలి సవరణ (1951) : భూ సంస్కరణలు, ఇతర చట్టాలకు న్యాయ సమీక్ష నుంచి రక్షణ కల్పించారు. మాట్లాడే హక్కుకు 3 పరిమితులను విధించారు.
iii.
ఏడో సవరణ (1956) : దేశాన్ని భాషా ప్రాతిపదికన 14 రాష్ట్రాలు, 6 కేంద్ర పాలిత ప్రాంతాలుగా పునర్విభజించారు. భాషల పరిరక్షణకు ప్రాథమిక పాఠశాలల్లో మాతృభాషలోనే బోధించేలా 350ఏ ప్రకరణ జోడించారు.
iv.
24వ సవరణ (1971) : రాజ్యాంగంలోని ఏ భాగాన్నైనా సవరించే అధికారం లోక్సభకు కట్టబెట్టారు. ఏదైనా రాజ్యాంగ సవరణను పార్లమెంటు ఉభయసభలు అంగీకరించి, రాష్ట్రపతికి నివేదిస్తే ఆయన తప్పనిసరిగా ఆమోదించాలన్నారు.
v.
42వ సవరణ (1976) : సామ్యవాద, లౌకిక, సమగ్రత అనే మూడు పదాలను ప్రవేశికకు అదనంగా జోడించారు.పౌరులకు ప్రాథమిక విధులను నిర్దేశించారు. న్యాయ సమీక్ష, రిట్ పిటిషన్ల విచారణలో సుప్రీం, హైకోర్టుల పరిధి తగ్గించి, రాజ్యాంగ సవరణలను న్యాయసమీక్ష పరిధి నుంచి తొలగించారు. జాతీయ న్యాయ సేవల సంస్థను ఏర్పాటుచేశారు.
vi.
44వ సవరణ (1978) : అత్యయిక పరిస్థితి ప్రకటించే నిబంధనలో ‘అంతర్గత సమస్యలు’ అనే పదం స్థానంలో ‘సైనిక తిరుగుబాటు’ అనే పదాన్ని చేర్చారు. కేంద్ర మంత్రివర్గం రాతపూర్వక సలహా ఇస్తేనే రాష్ట్రపతి అత్యయిక పరిస్థితిని విధించాలి. ప్రాథమిక హక్కుల జాబితా నుంచి ఆస్తిహక్కు తొలగింపు.
vii.
61వ సవరణ (1988) : రాజీవ్గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు 1988లో రాజ్యాంగానికి 61వ సవరణ చేశారు. అప్పటివరకు 21 ఏళ్లుగా ఉన్న ఓటు హక్కు వయసును ఏకంగా మూడేళ్లు తగ్గిస్తూ 18 ఏళ్లకు కుదించారు. నాటి నుంచే నవ యువత సైతం ఓటేస్తోంది.
viii.
73, 74 సవరణలు (1992) : గ్రామ పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థలకు రాజ్యాంగబద్ధ హోదా కల్పించారు. ‘మున్సిపాలిటీలు’ అనే కొత్త భాగాన్ని చేర్చారు. అన్ని స్థానిక సంస్థలకు ప్రత్యక్ష ఎన్నికలకు ఆదేశం.
ix.
86వ సవరణ (2002) : కొత్తగా విద్యాహక్కును చేర్చారు. 6 నుంచి 14 ఏళ్ల వయసులోని బాలబాలికలు అందరికీ ఉచిత, నిర్బంధ విద్య అందించాలని నిర్దేశించారు.
x.
101వ సవరణ (2016) : దేశంలో వస్తు, సేవల పన్ను(జీఎస్టీ)ని అమలులోకి తెస్తూ కొత్తగా 269ఏ, 279ఏ ప్రకరణల ఏర్పాటు.
xi.
102వ సవరణ (2018) : వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్ ఏర్పాటు. బీసీల జాబితాలో మార్పులు, చేర్పులపై అధ్యయనం చేసే బాధ్యత అప్పగింత.
xii.
103వ సవరణ (2019) : విద్య, ఉద్యోగాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10% రిజర్వేషన్ల కల్పన.
నిర్దేశపు అడుగులివీ.. రాజ్యాంగ పరిషత్ ఆవిర్భావం :
i.
భారత్లోని రాష్ట్రాల శాసనసభలకు తొలుత ఎన్నికలు నిర్వహించి.. తర్వాత రాజ్యాంగ పరిషత్ సభ్యులను ఎన్నుకుంటామంటూ 1945 సెప్టెంబరు 19న ఆకాశవాణి (ఆల్ ఇండియా రేడియో)లో నాటి గవర్నర్ జనరల్ లార్డ్ వేవెల్ ప్రకటనతో రాజ్యాంగ పరిషత్ ఏర్పాటుకు అంకురార్పణ జరిగింది. 1946 డిసెంబరు 6న రాజ్యాంగ పరిషత్ ఆవిర్భావం జరిగింది.
ii.
రాజ్యాంగ పరిషత్ శాశ్వత అధ్యక్షుడిగా డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్, ఉపాధ్యక్షులుగా హెచ్సీ ముఖర్జీ, కృష్ణమాచారి, న్యాయ సలహాదారుగా బి.ఎన్.రావు ఎన్నికయ్యారు.
iii.
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన అనంతరం 1947 ఆగస్టు 29న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అధ్యక్షతన ఆరుగురు సభ్యులతో రాజ్యాంగ రచనా కమిటీ ఏర్పాటైంది.
iv.
1929 డిసెంబరు 31 : నెహ్రూ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.
v.
1930 జనవరి 26 : ‘సంపూర్ణ స్వరాజ్యం’ ప్రకటనను బహిరంగంగా విడుదల చేశారు. ఆ రోజు నుంచి జనవరి 26వ తేదీని భారత స్వాతంత్య్ర దినోత్సవంగా స్వాతంత్రోద్యమకారులు పాటిస్తూ వచ్చారు.
vi.
1946 డిసెంబరు 9 : జేబీ కృపలానీ ఆధ్వర్యంలో పార్లమెంటులోని రాజ్యాంగ (సెంట్రల్) హాల్లో రాజ్యాంగ పరిషత్ తొలి సమావేశం జరిగింది. పరిషత్ తాత్కాలిక అధ్యక్షుడిగా సచిదానంద సిన్హా ఎన్నికయ్యారు. తమకు ప్రత్యేక దేశం, ప్రత్యేక రాజ్యాంగ పరిషత్ కావాలని డిమాండ్ చేస్తూ ముస్లింలీగ్ ఈ సమావేశాన్ని బహిష్కరించింది.
vii.
1947, ఆగస్టు 29 : భారత రాజ్యాంగ రచనకు ఎన్నికైన రాజ్యాంగ పరిషత్ వివిధ అంశాల పరిశీలనకు 22 కమిటీలను, 7ఉప కమిటీలను ఏర్పాటుచేసింది. వీటిలో అత్యంత ముఖ్యమైన ముసాయిదా(డ్రాఫ్టింగ్) కమిటీని 1947, ఆగస్టు 29న డా.బి.ఆర్.అంబేడ్కర్ అధ్యక్షుడిగా, ఆరుగురు సభ్యులతో ఏర్పాటు చేశారు.
viii.
1948 ఫిబ్రవరి 21 : ముసాయిదా రాజ్యాంగాన్ని 395 నిబంధనలతో, 8 అనుబంధాలతో ప్రచురించి రాష్ట్ర శాసనసభలకు, పత్రికలకు ఇచ్చారు. ముసాయిదా రాజ్యాంగంపై ప్రజలు తమ అభిప్రాయాలు పంపేందుకు 8 నెలల సమయం కేటాయించారు. 1948 నవంబరు 4న పరిషత్తు సమావేశమై చర్చను ప్రారంభించింది.
ix.
1949 నవంబరు 26 : 2వేల సవరణల అనంతరం ప్రజాభి ప్రాయాలకు పట్టం కడుతూ రూపొందించిన ముసాయిదా రాజ్యాంగానికి రాజ్యాంగ సభ ఆమోదం తెలిపింది.
x.
1947 జనవరి 22 : రాజ్యాంగ మౌలిక నియమాలను విశదీకరిస్తూ రూపొందించిన ‘లక్ష్యాలు-ఆశయాలు’ తీర్మానాన్ని జవహర్లాల్ నెహ్రూ ప్రవేశపెట్టారు. 1947 జనవరి 22న ఈ తీర్మానానికి ఏకగ్రీవ ఆమోదం లభించింది.
xi.
1950 జనవరి 24 : రాజ్యాంగ సభ చివరి సమావేశం నిర్వహించి రాజ్యాంగానికి పూర్తిస్థాయిలో ఆమోదం తెలిపారు. ఏక పౌరసత్వం, రాష్ట్రపతి, స్పీకరు, ఉపస్పీకరు పదవులు, ప్రొవిజినల్ పార్లమెంటు తక్షణం అమల్లోకి వచ్చాయి.
xii.
1950 జనవరి 26 : భారతదేశ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన పర్వదినం.
xiii.
1947లో బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశానికి స్వాతంత్య్రం ఇచ్చినప్పుడు కూడా.. జనవరి 26వ తేదీనాడే ఇవ్వాలని మన సమరయోధులు కోరినప్పటికీ.. నాటి గవర్నర్ జనరల్ మౌంట్బాటన్ మాత్రం ఆగస్టు 15వ తేదీవైపు మొగ్గుచూపారు. 1930 నాటి సంపూర్ణ స్వరాజ్య ప్రకటన జనవరి 26వ తేదీన జరిగింది కాబట్టి.. అదే తేదీన (1950లో) రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చారు.
xiv.
ఈ ప్రక్రియ మొత్తానికి అప్పట్లో రూ.64 లక్షల ఖర్చయింది. రాజ్యాంగ అసలు ప్రతిని ఆంగ్లంలో ప్రేమ్బెహారీ నారాయణ్ రైజదా అందమైన దస్తూరీలో ఇటాలిక్ ఫాంట్లో రాశారు. ఎలాంటి పారితోషికం తీసుకోలేదు. అందుకు బదులుగా ప్రతి పేజీలో తన పేరు, మొదటి పేజీలో తనతోపాటు తన తాత పేరు రాసుకోవడానికి అనుమతి కోరారు.
xv.
రాజ్యాంగం తొలి ప్రతిని డెహ్రాడూన్లో ప్రచురించగా... ఫొటోలను సర్వే ఆఫ్ ఇండియా సమకూర్చింది. రాజ్యాంగ పరిషత్ సభ్యుల్లో జాతిపిత మహాత్మాగాంధీ లేరు.
xvi.
భారత రాజ్యాంగ పరిషత్ చిహ్నం ఏనుగు (ఐరావతం). దీనినే తర్వాత మన దేశ వారసత్వ జంతువుగా గుర్తించారు.
xvii.
రాజ్యాంగం హిందీ, ఆంగ్లం మూల ప్రతులను పార్లమెంటు గ్రంథాలయంలో హీలియంతో నింపిన పెట్టెల్లో భద్రపరిచారు. హీలియం వాయువు ఇతర పదార్థాలతో రసాయన చర్యలకు గురవదు.
xviii.
‘‘ప్రాథమిక హక్కులతో సహా రాజ్యాంగంలోని ఏ అంశాన్నైనా సవరించే అధికారం పార్లమెంటుకు ఉంది. కానీ రాజ్యాంగ ‘మౌలిక స్వరూపాన్ని’ మార్చే అధికారం లేదు’’ - 1973లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇది.
బీఎన్ రావు అవిరళ కృషి. రాజ్యాంగ పరిషత్కు న్యాయ సలహాదారు :
i.
భారత రాజ్యాంగ పరిషత్కు న్యాయ సలహాదారుగా బెనగళ్ నర్సింగరావు అందించిన సేవలు అనన్య సామాన్యం. బీఎన్ రావుగా సుప్రసిద్ధుడైన ఆయన భారత తొలితరం ఐసీఎస్ అధికారి.
ii.
బ్రిటిష్ పాలనలో 1935లో వచ్చిన భారత ప్రభుత్వ చట్టం రూపకల్పనలో కీలకపాత్ర పోషించారు. విజయవంతంగా నడుస్తున్న ప్రస్తుత సమాఖ్య వ్యవస్థను ఆయన అప్పుడే ప్రవేశపెట్టారు.
iii.
1946లో భారత రాజ్యాంగ పరిషత్కు న్యాయ సలహాదారు హోదాలో బీఎన్ రావు అందరినీ ఒప్పించగలిగారు. 1948 ఫిబ్రవరిలో రాజ్యాంగ తొలి ముసాయిదా ప్రతిని తయారుచేశారు.
ఏ దేశం నుంచి ఏం సంగ్రహించాం ?
తెలంగాణ వార్తలు
ప్రపంచ ఔషధరంగంలో అతిపెద్ద సమీకృత పార్క్ ‘ఔషధనగరి’ :
i.
రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలో ఏర్పాటు చేస్తున్న ఔషధనగరి ప్రపంచ ఔషధరంగంలో అతిపెద్ద సమీకృత పార్క్. మొత్తం 19,333 ఎకరాలలో ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధమయింది.
ii.
కేంద్రం పర్యావరణ అనుమతులు ఇచ్చింది. దీని ద్వారా రూ.64,000 కోట్ల పెట్టుబడులు; ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 5.60 లక్షల మందికి ఉద్యోగాలను అంచనా వేసింది. జాతీయ ప్రాధాన్యం కలిగిన ప్రాజెక్టుగా దీనిని గుర్తించి కేంద్ర ప్రభుత్వం నిమ్జ్ హోదా ఇచ్చింది.
కాకతీయ మెగా జౌళి పార్కు @ వరంగల్ గ్రామీణ జిల్లా :
i.
వరంగల్ గ్రామీణ జిల్లాలో 2,100 ఎకరాల్లో కాకతీయ మెగా జౌళి పార్కు ఏర్పాటవుతోంది. 2017 అక్టోబరు 22న కేసీఆర్ శంకుస్థాపన చేశారు.
ii.
రూ.10 వేల కోట్ల పెట్టుబడులు, లక్ష మందికి ఉపాధిని దీని ద్వారా అంచనా వేశారు. కేంద్ర ప్రభుత్వం దీనిని జాతీయ జౌళిపార్కుల పథకం కింద గుర్తించాలని ప్రభుత్వం కోరుతోంది.
ఇతర రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల వార్తలు
సాంగ్లీ రాజవంశీయుల స్విస్ ఖాతాలపై దర్యాప్తు. వివరాలివ్వాలని స్విట్జర్లాండ్ను కోరిన భారత ప్రభుత్వం :
i.
మహారాష్ట్రలోని సాంగ్లీ రాజవంశీయుల స్విస్ బ్యాంకు ఖాతాలపై భారత ప్రభుత్వం దర్యాప్తు జరపనుంది. సాంగ్లీ రాజవంశానికి చెందిన విజయ్సింగ్ మాధవరావు పట్వర్ధన్, ఆయన భార్య రోహిణిలపై విచారణ జరగనుంది.
ii.
వారికి సంబంధించిన ఖాతాల సమాచారం ఇవ్వాలని భారత ప్రభుత్వం స్విట్జర్లాండ్ను కోరింది.
సదస్సులు
India to host SCO forum of Young Scientists and Innovators 2020 :
i.
India will host the Shanghai Cooperation Organisation (SCO) Forum of Young Scientists and Innovators in 2020.
ii.
The 5th Meeting of Shanghai Cooperation Organisation (SCO) Member States Heads of Ministries and Departments of Science and Technology and Permanent Working Group on S&T Cooperation concluded in Moscow, Russia.
iii.
Eight SCO member states’ heads of delegation signed the Protocol of the 5th Meeting of Ministries and Departments of Science and Technology at the end of the three-day meeting.
iv.
The meeting agreed with India & proposal to host the SCO Forum of Young Scientists and Innovators in 2020.
Reports/Ranks/Records
Latest survey by NSO debunks Swachh Bharat ODF claims :
i.
The latest National Statistical Office (NSO) survey on sanitation debunked the claims of an open defecation-free or ODF India made by the Centre’s flagship Swachh Bharat scheme, although it did record great progress in toilet access and use in rural areas.
ii.
The results, released on Saturday, showed that about 71% of rural households had access to toilets at a time when the Centre was claiming 95% had access.
iii.
On October 2, 2019, Prime Minister Narendra Modi declared that the whole country was ODF with complete access to toilets.
iv.
The survey was carried out between July and December 2018, with a reference date of October 1. Large States which had been declared ODF — that is, 100% access to toilets and 100% usage — even before the survey began included Andhra Pradesh, Gujarat, Maharashtra and Rajasthan.
v.
According to the NSO, almost 42% of the rural households in Jharkhand had no access to a toilet at that time. In Tamil Nadu, the gap was 37%, followed by 34% in Rajasthan.
vi.
In Gujarat, which was one of the earliest States declared ODF, back in October 2017, almost a quarter of all rural households had no toilet access, the NSO data showed.
Manipur, J&K top UAPA cases list :
i.
More than 35% of the cases registered under the stringent Unlawful Activities (Prevention) Act (UAPA) were recorded in Manipur, show the National Crime Records Data (NCRB) provided by the Home Ministry in the Rajya Sabha.
ii.
Under the UAPA, the investigating agency can file a chargesheet in maximum 180 days after the arrests and the duration can be extended further after intimating the court. The anti-terror Act has death penalty and life imprisonment as maximum punishment.
iii.
The NCRB is yet to publish the crime report for 2018. The data reveal that though U.P. has recorded only 12% of the cases, it topped the States in the number of arrests made.
Art and Culture
Ocean Dance Festival 2019 starts in Cox Bazar :
i.
The Ocean Dance Festival 2019 kicked off in Cox Bazar of Bangladesh. Ocean Dance Festival is the largest international dance festival of Bangladesh in which more than 200 dancers, choreographers and scholars from 15 countries are participating.
ii.
The theme of this year’s festival is ‘Bridging the distance’ or Durotter Shetubandhan. The dances performed at the event will show the idea of bridging cultural and economic distances.
iii.
The festival is being organised by the Nrityajog which is the Bangladesh wing of World Dance Alliance (WDA). The festival aims to expand cultural tourism in Bangladesh. It also features seminars and discussion apart from the dance performances by the artists.
Sangai Festival 2019 begins in Manipur :
i.
Every year the State of Manipur celebrates the “Manipur Sangai Festival” from 21st to 30th November. The ‘Festival’ is named after the State animal, Sangai, the brow-antlered deer found only in Manipur.
ii.
It started in the year 2010 and has grown over the years into a big platform for Manipur to showcase its rich tradition and culture to the world.
iii.
The festival is organized by the State Tourism Department and biggest festival held annually to promote tourism. The formal inaugural function of the festival was held at Hapta Kangjeibung at Imphal.
iv.
During the festival, cultural programmes, traditional games, folk dance and classical music will be performed by different communities of the State as well as from other States.
మరణాలు
Former Madhya Pradesh CM Kailash Joshi dead :
i.
Bharatiya Janata Party leader and former Madhya Pradesh Chief Minister Kailash Joshi died after prolonged illness.
ii.
Mr. Joshi served as the first Janata Party Chief Minister of the State from 1977 to 1978. He represented the Bhopal Lok Sabha constituency from 2004 to 2014.
ముఖ్యమైన రోజులు
NCC celebrates its 71st Raising Day : 24 November
i.
The National Cadet Corps (NCC), the world’s largest uniformed youth organization, is celebrating its 71st Raising Day on 24 November.
ii.
The NCC Raising Day was also celebrated all over the country with the cadets participating in marches, cultural activities and social development programs.
iii.
NCC continues its relentless efforts towards moulding the youth into responsible citizens of the country.
iv.
Director-General of NCC : Lt Gen Rajeev Chopra.
v.
Founder : Government of the United Kingdom.
vi.
Founded : 16 April 1948.
vii.
Headquarters location : New Delhi.
ప్రపంచ స్త్రీ హింసా నిరోధక దినోత్సవం (International Day for the Elimination of Violence against Women) : నవంబర్ 25
i.
Theme 2019 : “Orange the World: Generation Equality Stands Against Rape”
ii.
స్త్రీల భద్రత, స్వేచ్ఛ, సమానత్వం, ఆత్మగౌరవ పరిరక్షణే లక్ష్యంగా ఏటా నవంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా స్త్రీలపై హింసా నిరోధక దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించింది. ఈ రోజు 1993 లో UN జనరల్ అసెంబ్లీ చేత స్థాపించబడింది.
iii.
గృహహింస చట్టం-2005 వివాహ బంధంలో ఉండి హింసకు గురవుతున్న మహిళలకు వర్తిస్తుంది. అధిక కట్నం, పుట్టింటి ఆస్తిలో భాగం, విలాసాలకు డబ్బు తీసుకురావాలని అడగడం, వివాహేతర సంబంధాలతో చిత్రవధకు గురిచేయడం వంటివి నేరాలుగా పరిగణిస్తారు.
iv.
నేర సంబంధిత న్యాయసవరణ చట్టం -2013. ఆమ్లదాడులు, లైంగిక వేధింపులు, అత్యాచారం వంటివన్నీ నేరాలుగా పరిగణిస్తారు.
v.
పనిచేసే చోట లైంగిక వేధింపుల నిరోధక చట్టం, సెక్స్వర్కర్ల చట్టం, స్త్రీల అసభ్య చిత్ర నిషేధ చట్టం- 1986, మానవ అక్రమ రవాణా నియంత్రణ చట్టం... వంటివెన్నో మహిళలకు అండగా ఉన్నాయి.
క్రీడలు
కార్ల్సన్దే ర్యాపిడ్ :
i.
టాస్స్టీల్ ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ చెస్ టోర్నమెంట్ ర్యాపిడ్ విభాగంలో మాగ్నస్ కార్ల్సన్ విజేతగా నిలిచాడు. ఆనంద్, హరికృష్ణ, డింగ్ లిరెన్ తలో ఎనిమిది పాయింట్లతో ఉమ్మడిగా ఆరో స్థానంలో నిలిచారు. ఏడో రౌండ్లో కార్ల్సన్ చేతిలో ఓడిన ఆనంద్.. విదిత్, హరికృష్ణతో గేమ్లను డ్రాగా ముగించాడు.
Marathon man Kipchoge, hurdle heroine Muhammad win Athlete of the Year :
i.
Eliud Kipchoge, the first man to run a marathon in less than two hours, and 400 metres hurdles world champion Dalilah Muhammad won the World Athlete of the Year awards.
ii.
Kipchoge, claimed governing body World Athletics’ year-ending prize in Monaco after making history last month when he ran the marathon distance of 42.195 kilometres (26.219 miles) in 1hr 59min 40.2sec.
iii.
American Muhammad won her award after a magnificent year that saw her set a world record of 52.20 seconds at the US Trials in Iowa in July breaking a record that had stood since 2003.
Rafael Nadal wins Davis Cup title 2019 :
i.
Rafael Nadal has clinched 6th Davis Cup title for Spain after beating Denis Shapovalov of Canada in front of a jubilant home crowd in Madrid.
ii.
Nadal defeated Shapovalov 6-3, 7-6 (9-7) to clinch Spain’s 2-0 win against Canada.