రైల్వే బోర్డు ఛైర్మన్‌గా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్(జీఎం) వినోద్‌కుమార్ యాదవ్ నియమితులయ్యారు.
- కేంద్ర ప్రభుత్వ ఎక్స్ అఫీషియో ముఖ్య కార్యదర్శిగా, ఐఆర్‌ఎస్‌ఈఈ ఛైర్మన్‌గా కూడా కొనసాగుతారు. వినోద్‌కుమార్ యాదవ్ నియామకాన్ని కేంద్ర మంత్రివర్గ నియామకా కమిటీ 2018 డిసెంబర్ 31న ఆమోదించింది.
- ప్రస్తుత బోర్డు ఛైర్మన్ అశ్వనీ లోహానీ పదవీకాలం తరువాత ఆయన స్థానంలో వినోద్‌కుమార్ బాధ్యతలు స్వీకరిస్తారు.
- దక్షిణ మధ్య రైల్వే జోన్‌కు రెగ్యులర్ జనరల్ మేనేజర్‌గా పనిచేస్తూ అత్యున్నత రైల్వే బోర్డు ఛైర్మన్‌గా ఎంపికైన తొలి అధికారి వినోద్‌కుమార్ యాదవ్. రైల్వే మంత్రిత్వశాఖలో కీలక నిర్ణయాన్నీ ఈ బోర్డే తీసుకుంటుంది.
No comments:
Post a Comment