Wednesday, 13 February 2019

ఫిబ్రవరి 11 నుంచి పోలీసు ఉద్యోగాలకు ఫిజికల్ ఈవెంట్లు

తెలంగాణలో కానిస్టేబుల్, ఎస్‌ఐ పోస్టుల భర్తీకి సంబంధించి ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఫిబ్రవరి 11 నుంచి ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (పీఎంటీ), ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్ (పీఈటీ)లను నిర్వహించనున్నారు. పూర్వపు జిల్లాల ప్రాతిపదికనే ఫిజికల్ ఈవెంట్ల కోసం కేంద్రాలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా అభ్యర్థులకు పీఈటీ పరీక్షల కోసం హైదరాబాద్‌లో మూడు కేంద్రాలను; మిగతా జిల్లాల అభ్యర్థులకు వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్గొండ, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్‌ జిల్లాకేంద్రాల్లో ఫిజికల్ ఈవెంట్ల కోసం ఏర్పాటు చేస్తున్నారు. 

ఎస్‌ఐ, ఏఎస్‌ఐ, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షల్లో అర్హత సాధించిన 3,77,770 మంది అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఫిట్‌నెస్ టెస్ట్‌లో ప్రతి అభ్యర్థి ఛాతీ, ఎత్తు, బరువును నమోదుచేస్తారు. అనంతరం హైజంప్, లాంగ్ జంప్, 100 మీ, 800 మీటర్ల పరుగులకు సంబంధించి పరీక్ష నిర్వహిస్తారు. 
పోస్టులుఅర్హత పొందిన అభ్యర్థులు
ఎస్‌ఐ (సివిల్)1,10,635
ఎస్‌ఐ (ఐటీ)4,684
ఏఎస్‌ఐ3,276
కానిస్టేబుల్ (సివిల్)2,28,865
కానిస్టేబుల్ (ఐటీ)14,981
కానిస్టేబుల్ (డ్రైవర్స్)13,458
కానిస్టేబుల్ (మెకానిక్స్)1,871
మొత్తం అభ్యర్థులు3,77,770

అభ్యర్థులకు సూచనలు.. 
ఫిజికల్ ఈవెంట్లకు హాజరయ్యే అభ్యర్థులకు ముఖ్య సూచనలు... 
✦ అభ్యర్థి సంతకంతో కూడిన పార్ట్-2 ఆన్‌లైన్ దరఖాస్తుతోపాటు ఫిజికల్ ఈవెంట్ అడ్మిట్ కార్డు వెంట తీసుకురావాలి.
స్వయంగా ధ్రువీకరించకున్న, కమ్యూనిటీ సర్టిఫికెట్ కాపీలను కచ్చితంగా వెంటతీసుకురావాలి. 
✦ ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కాపీ తీసుకురావాల్సి ఉంటుంది. 
✦ ఎస్టీ అభ్యర్థులు ఏజెన్సీ ఏరియా సర్టిఫికెట్ తప్పనిసరిగా తీసుకురావాలి. 
✦ అభ్యర్థులు తమకు కేటాయించిన గ్రౌండ్‌లో ఉదయం 4 నుంచి 5 గంటల లోపు ఖచ్చితంగా హాజరుకావాల్సి ఉంటుంది. ఆలస్యమైన వారికి అనుమతి ఉండదు. 
✦ అభ్యర్థులు తమకు కేటాయించిన తేదీల్లో మాత్రమే దేహదారుఢ్య పరీక్షలకు హాజరు కావాలి. 

No comments:

WRITING A RESEARCH REPORT

 రీసెర్చ్ రిపోర్ట్ రాయడం పరిశోధన నివేదిక అనేది సాంప్రదాయిక నిర్మాణం లేదా ఆకృతిని అనుసరించి కఠినంగా ఆకృతీకరించిన పత్రంలో పరిశోధన మరియు దాని ఫ...