Saturday, 9 February 2019

లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో ‘ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌’


  • దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో 40 నదులను పునరుజ్జీవింపజేసినందుకుగాను ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ సంస్థకు లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌-2019లో చోటు దక్కింది. 
  • కరవు ప్రాంతాల్లో చేపట్టిన ప్రత్యేక కార్యక్రమాల కారణంగా 5 వేలకు పైగా గ్రామాల్లోని 49.9 లక్షల ప్రజలకు నీటి వసతి కలిగింది. 
  • 2013 జనవరిలో ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ స్వచ్ఛంద సంస్థ నాలుగు రాష్ట్రాల్లోని (కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిశా) నదీ పరివాహక ప్రాంతాల్లో 40కి పైగా నదులు, వాగులను, 9 నదీ పరివాహక ప్రాంతాల్లోని 26 సరస్సులను పునరుజ్జీవింప చేసే కార్యక్రమం చేపట్టింది.
  •  మొదటగా భూ భౌతిక శాస్త్రవేత్తలు, పర్యావరణ వేత్తలు ఆయా ప్రాంతాల్లో రిమోట్‌ సెన్సింగ్‌ సాంకేతికతను ఉపయోగించి విస్తృతంగా పరిశోధనలు చేశారు.
  •  వాటి ఆధారంగా ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ కార్యకర్తలు సుమారు 5వేల మంది గ్రామస్థులతో చేయి కలిపి బావులను పునరుద్ధరించడం, పూడిక తీయడం, కాలుష్య కారకాలను ఏరివేయడం, నదీ తీరాలను పరిశుభ్రపర్చడం, తీరాల వెంబడి చెట్లను నాటడం, వాతావరణ స్థితిగతులను బట్టి పంట మార్పిడి విధానంలో రైతులకు చైతన్యం కల్పించడం వంటి కార్యక్రమాలు చేపట్టారని లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ ప్రస్తావించింది.

No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...