Wednesday, 13 February 2019

ఏపీలో డిప్యూటీ సర్వేయర్ పోస్టులు

అభ్యర్థులు దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజుగా రూ.250, పరీక్ష ఫీజుగా రూ.80 చెల్లించి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 20 నుంచి మార్చి 13 వరకు దరకఖాస్తు చేసుకోవచ్చు.

ఏపీ సర్వే & ల్యాండ్ రికార్డ్స్ సబార్డినేట్ సర్వీస్‌లో డిప్యూటీ సర్వేయర్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (ఏపీపీఎస్సీ) ఫిబ్రవరి 12న నోటిఫికేషన్ విడుదల చేసింది. పదోతరగతి అర్హతతో పాటు సంబంధిత విభాగంలో ఒకేషనల్ సర్టిఫికేట్ కోర్సు చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థుల వయసు 18-42 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్థులు దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజుగా రూ.250, పరీక్ష ఫీజుగా రూ.80 చెల్లించి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 20 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. అభ్యర్థులు మార్చి 12లోగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మార్చి 13 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. 


రెండంచెల రాతపరీక్ష (స్క్రీనింగ్, మెయిన్) ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు. స్క్రీనింగ్ పరీక్ష తేదీ వెల్లడించలేదు.. అయితే మే 22న మెయిన్ పరీక్షను నిర్వహించనున్నట్లు కమిషన్ ప్రకటించింది. మెయిన్ పరీక్షను ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తుండగా.. స్క్రీనింగ్ పరీక్షను ఆఫ్‌లైన్ ద్వారా నిర్వహించనున్నారు. ఒకవేళ స్క్రీనింగ్ పరీక్ష రాసే అభ్యర్థుల సంఖ్య 25వేలలోపు ఉంటే.. వారికి కూడా ఆన్‌‌లైన్ విధానంలోనే పరీక్ష నిర్వహించనున్నారు. 

పోస్టుల వివరాలు:

* డిప్యూటీ సర్వేయర్: 29 పోస్టులు

అర్హత‌: పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హతతోపాటు.. నేష‌న‌ల్ కౌన్సిల్ ఆఫ్ ఒకేష‌న‌ల్ ట్రైనింగ్ స‌ర్టిఫికెట్ ఇన్ డ్రాట్స్‌మ్యాన్(సివిల్‌) లేదా ఇంట‌ర్ ఒకేష‌న‌ల్‌(క‌న్‌స్ట్రక్షన్) ఉత్తీర్ణులై ఉండాలి. 
వయసు: 01.07.2019 నాటికి 18 నుంచి 42 సంవత్సరాల మ‌ధ్య ఉండాలి. 02.07.1977 - 01.07.2001 మధ్య జన్మించి ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. 

దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజుగా రూ.250, పరీక్ష ఫీజుగా రూ.80 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, తెల్ల రేషన్కార్డుదారులకు, నిబంధనల ప్రకారం ఉన్న నిరుద్యోగులకు పరీక్ష ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. దరఖాస్తు ఫీజు మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. ఆన్‌లైన్ ద్వారానే ఫీజు చెల్లించాలి. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. 

ఎంపిక‌ విధానం: స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్ ఎగ్జామినేషన్ ద్వారా. 

స్కేల్‌పే: రూ.22,460- రూ.66,330. 

ముఖ్యమైన తేదీలు..

✦ 
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 20.02.2019. 

✦ ఫీజు చెల్లించడానికి చివరితేది: 12.03.2019. 

✦ దరఖాస్తుల సమర్పణకు చివరితేది: 13.03.2019. 

✦ స్క్రీనింగ్ పరీక్ష తేది: ప్రకటించాల్సి ఉంది. 

✦ మెయిన్ పరీక్ష తేది: 22.05.2019. 

నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి
వెబ్‌సైట్ 

No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...