Sunday, 24 February 2019

ఈఎస్‌ఐ సభ్యులకు బంపర్ ఆఫర్

 ఆరునెలల పాటు వరుసగా చందా చెల్లించిన ‘ఉద్యోగ రాజ్యబీమా సంస్థ’(ఈఎస్‌ఐసీ) సభ్యులకు సూపర్ స్పెషాలిటీ వైద్య చికిత్సలు పొందే అర్హత లభిస్తుంది.
సదరు వైద్యసేవలు పొందేందుకు నిర్దేశించిన చందా చెల్లింపు కనిష్ట పరిమితిని ప్రస్తుతం ఉన్న రెండేళ్ల నుంచి ఆరునెలలకు సడలిస్తూ ఈఎస్‌ఐసీ బోర్డు నిర్ణయం తీసుకుంది. కేంద్రమంత్రి సంతోష్ గాంగ్వర్ అధ్యక్షతన జరిగిన ఈ  సమావేశం లో  ఈఎస్‌ఐ బీమాదారుపై ఆధారపడిన తల్లి, తండ్రి, కుమారుడు, కుమార్తె తదితరులు ఈ సేవలను పొందేందుకు నిర్దేశించిన వ్యక్తిగత ఆదాయ గరిష్ఠ పరిమితిని కూడా పెంచింది. ప్రస్తుతం నెలకు రూ.5 వేలుగా ఉన్న వారి గరిష్ఠ ఆదాయ పరిమితిని రూ.9 వేలకు సడలిస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈఎస్‌ఐతో అనుసంధానమై రాష్ట్రాల ఆధ్వర్యంలో నడిచే ఆసుపత్రుల్లో తీసుకునే చికిత్సలకయ్యే ఖర్చంతా ఈఎస్‌ఐ భరిస్తుంది. ఈ తరహా వైద్యఖర్చులను ఎనిమిదింట ఏడువంతుల మొత్తాన్ని మాత్రమే భరిస్తుండగా ఎనిమిదింట ఒకవంతును ఆయా రాష్ట్రాలు భరిస్తున్నాయి.

క్విక్ రివ్యూ :
ఏమిటి : ఈఎస్‌ఐసీ సభ్యులకు సూపర్ స్పెషాలిటీ వైద్య చికిత్సలు పొందే అర్హత
ఎవరు : కేంద్రమంత్రి సంతోష్ గాంగ్వర్
ఎందుకు : ఈఎస్‌ఐసీ సభ్యులకు సూపర్ స్పెషాలిటీ వైద్య చికిత్సల కోసం.

No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...