Wednesday, 13 February 2019

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 913 స్పెష‌లిస్ట్ ఆఫీస‌ర్ పోస్టులు


బ్యాంక్ ఆఫ్ బ‌రోడా వివిధ విభాగాల్లో స్పెష‌లిస్ట్ ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. అభ్యర్థులు రూ.600 దరఖాస్తు ఫీజుగా చెల్లించి.. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.100 చెల్లిస్తే సరిపోతుంది. అభ్యర్థులకు ఆన్‌లైన్ రాతపరీక్ష, ఇంట‌ర్వ్యూ నిర్వహించి ఉద్యోగాలకు తుది ఎంపిక చేస్తారు. డిసెంబరు 26 వరకు దరఖాస్తు చేసుకోవడానికి, దరఖాస్తులు ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అభ్యర్థులు దరఖాస్తు ప్రింట్ తీసుకోవడానికి జనవరి 10 వరకు అవకాశం ఉంది. 
* స్పెష‌లిస్ట్ ఆఫీస‌ర్స్: 913 పోస్టులు
విభాగాల వారీగా ఖాళీలు.. 
విభాగంఖాళీలు
లీగ‌ల్60
వెల్త్ మేనేజ్‌మెంట్ స‌ర్వీసెస్ (సేల్)850
వెల్త్ మేనేజ్‌మెంట్ స‌ర్వీసెస్ (ఆప‌రేష‌న్స్)03
మొత్తం ఖాళీలు913

అర్హతలు.. 
విభాగంఅర్హత
లీగ‌ల్బ్యాచిల‌ర్స్ డిగ్రీ (లా) ఉత్తీర్ణ‌త‌తోపాటు ప‌ని అనుభ‌వం ఉండాలి.
వెల్త్ మేనేజ్‌మెంట్ స‌ర్వీసెస్ (సేల్స్)డిగ్రీతోపాటు రెండేళ్ల పీజీ డిగ్రీ/ డిప్లొమా (మార్కెటింగ్/ సేల్స్‌/ రిటైల్ ) ఉత్తీర్ణ‌త‌తోపాటు ప‌ని అనుభ‌వం ఉండాలి.
వెల్త్ మేనేజ్‌మెంట్ స‌ర్వీసెస్ (ఆప‌రేష‌న్స్)రెండేళ్ల‌ పీజీ డిగ్రీ/ డిప్లొమా (మార్కెటింగ్/ సేల్స్‌/ రిటైల్/ ఫైనాన్స్) ఉత్తీర్ణ‌త‌తోపాటు ప‌ని అనుభ‌వం ఉండాలి.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. 

దరఖాస్తు ఫీజు: జ‌న‌ర‌ల్, ఓబీసీ అభ్యర్థులు రూ.600. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.100 చెల్లించాలి. 

ఎంపిక‌ విధానం: ఆన్‌లైన్ రాతపరీక్ష, ఇంట‌ర్వ్యూ ఆధారంగా. అభ్య‌ర్థుల సంఖ్య ఆధారంగా ప‌రీక్ష విధానాన్ని మారే అవ‌కాశం ఉంది. అలాంటి సందర్భాల్లో డిస్క్రిప్టివ్‌/ సైకోమెట్రిక్ టెస్ట్‌/ గ్రూప్ డిస్క‌ష‌న్ నిర్వ‌హించనున్నారు. 

పరీక్ష విధానం: మొత్తం 200 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. ప‌రీక్ష‌లో మొత్తం 200 ప్ర‌శ్న‌లు ఉంటాయి. పరీక్షలో దీనిలో రీజ‌నింగ్‌ 50 ప్ర‌శ్న‌లు -50 మార్కులు; ఇంగ్లిష్ లాంగ్వేజీ 50 ప్ర‌శ్న‌ల‌ు - 25 మార్కులు; క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌ 50 ప్ర‌శ్న‌లు - 50 మార్కులు; ప్రొఫెష‌న‌ల్ నాలెడ్జ్ 50 ప్ర‌శ్న‌లు - 75 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. ప‌రీక్ష స‌మ‌యం 2 గంట‌లు. ప‌రీక్ష‌లో నెగెటివ్ మార్కులు కూడా ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు. 

తెలుగు రాష్ట్రాల్లో ప‌రీక్ష‌ కేంద్రాలు: హైద‌రాబాద్, విశాఖ‌ప‌ట్నం. 

ముఖ్యమైన తేదీలు..
సందర్భంతేది
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం05.12.2018.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివ‌రితేది26.12.2018.
దరఖాస్తుల సవరణకు చివరితేది26.12.2018.
దరఖాస్తు ప్రింట్ తీసుకోవడానికి చివరితేది10.01.2019.
ఫీజు చెల్లింపు ప్రక్రియ05.12.2018 - 26.12.2018

నోటిఫికేషన్ 

ఆన్‌లైన్ అప్లికేషన్ 

వెబ్‌సైట్ 

No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...