Sunday, 10 February 2019

ఒకే రోజు 4 లక్షల గృహప్రవేశాలు

నెల్లూరు జిల్లాలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. నూతనంగా నిర్మించిన జిల్లా పోలీసు కార్యాలయాన్ని ప్రారంభించారు. గృహాలను ప్రారంభించిన తర్వాత ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. ప్రతి పేదవాడి ముఖంలో ఆనందం చూడాలన్నదే తన తపన అని.. ప్రతి పేదవాడికి సొంతిల్లు ఉండాలనేది కోరిక అని అన్నారు. అద్భుతంగా గేటెడ్‌ కమ్యూనిటీ తరహాలో గృహాలను నిర్మించామని ఒకే రోజు రాష్ట్రంలో నాలుగు లక్షల మందికి సొంతింటిని అందించిన ఘనత తెదేపా ప్రభుత్వానిదని పేర్కొన్నారు. ఇది గిన్నిస్‌ పుస్తకంలో ఎక్కించే అంశమన్నారు. 

No comments:

bio mechanics in sports

భౌతిక విద్యలో బయోమెకానిక్స్ అనేది మానవ కదలికను నియంత్రించే యాంత్రిక సూత్రాల అధ్యయనం మరియు శారీరక కార్యకలాపాల సమయంలో శరీరం శక్తులతో ఎలా సంకర్...