Saturday, 9 February 2019

బిలియనీర్ల శుభోదయం ఎలా ఉంటుందో తెలుసా ?

జాక్‌ డోర్సె: ట్విటర్‌ వ్యవస్థాపకుడు జాక్‌ డోర్సె తెల్లవారుజామున 5 గంటలకే నిద్రలేస్తారు. ఒక అర్ధగంట ప్రాణాయామం ఆయన ఉదయపు దినచర్యలో భాగం. ఆ తర్వాత 20 నిమిషాలు వ్యాయామం చేస్తారు. అనంతరం కాఫీ తాగీ రోజువారీ పనులను మొదలు పెడతారు.

వారెన్‌ బఫెట్‌: అపర కుబేరుడు వారెన్‌ బఫెట్‌ బాగా నిద్రపోవడానికి ఇష్టపడతారు. నిత్యం కచ్చితంగా 8గంటలు నిద్ర ఉండేలా చూసుకొంటారు. ఉదయం 6.45కు కచ్చితంగా నిద్రలేస్తారు. అనంతరం వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌, యూఎస్‌ఏ టుడే వంటి పత్రికలను చదువుతారు.
బిల్‌ గేట్స్‌: ఉదయం నిద్రలేచిన వెంటనే ట్రెడ్‌మిల్‌పై పరుగుతో గేట్స్‌ దినచర్య మొదలవుతుంది. అదే సమయంలో ఆయన విద్యకు సంబంధించిన డీవీడీలను చూస్తారు. దాదాపు గంట సేపు ఆయన ఈ వ్యాయామాలు చేస్తారని న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక వెల్లడించింది. తాను కోకా పఫ్ సెరెల్స్‌ తింటానని గేట్స్‌ చెబుతారు. కానీ ఆయన భార్య మిలిండా మాత్రం గేట్స్‌ అల్పహారం తీసుకోరని అంటారు.
జుకర్‌బర్గ్‌: ఫేస్‌బుక్‌ వ్యవస్థాపకుడు మార్క్‌ జుకర్‌ బర్గ్‌ నిద్ర లేచిన వెంటనే బెడ్‌పైనే ఉండి ఫోన్‌ను చెక్‌ చేసుకొంటారు. అనంతరం ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లలో విశేషాలను చూస్తారు. దుస్తుల ఎంపిక వంటి చిన్న విషయాల కోసం ఆలోచనను వృథా చేసుకోనని మార్క్‌ చెబుతారు. అందుకే ఆయన ఎప్పుడు సర్వసాధారణమైన జీన్స్‌, టీషర్ట్‌ల్లో కన్పిస్తారు.

No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...