- ఎనభై ఏళ్లకు దగ్గరలో ఉన్నా తన పరుగు ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న ఈ బామ్మ పేరు భానుమతి కాంజీ పటేల్. ఈమె వయసు 79 సంవత్సరాలు.
- గుజరాత్ రాష్ట్రం ఇప్పటికీ ఈమె పలు రికార్డులను సొంతం చేసుకున్నారు.
- నాలుగు రోజులుగా గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ప్రాంగణంలో జరుగుతున్న మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొని మూడు బంగారు పతకాలను సొంతం చేసుకున్నారు.
- 5 వేల మీటర్ల పరుగు పందెంలో తొలిస్థానంలో నిలిచి స్వర్ణం దక్కించుకోగా రెండు రోజుల క్రితం నిర్వహించిన మరో రెండు విభాగాల్లోనూ పసిడి చేజిక్కించుకున్నారు. ఈ విజయాలతో త్వరలో జరిగే అంతర్జాతీయ పోటీలకు అర్హత సాధించారు . 2014 నుంచి క్రమం తప్పకుండా జాతీయ మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొంటున్న ఈ బామ్మ కు హ్యాట్సాఫ్ చెప్పొచ్చు
ఈనాడు న్యూస్ పేపర్ నుండి
No comments:
Post a Comment